Songs 1 - పాటలు
Songs 1 - పాటలు |
కీర్తన 1
ఓంకార రూపిణి....
ఓంకార రూపిణి.... క్లీంకార వాసిని
జగదేక మెహిని ప్రకృతి స్వరూపిణీ ||2||
శర్వార్థదేహిని సకలార్థ వాహినీ
భక్తాహదాహిణీ... దహరాబ్జ్య గేహిణీ ||2||ఓంకార||
మృగరాజ వాహన నటరాజా నంగన
అర్థేందు భూషణ అఖిలార్తి శోషణ ||2||
కాశికా కామాక్షి... మాధురి మీనాక్షి ||2||
మము బ్రోవవె తల్లీ... అనురాగ శ్రీవల్లి ||ఓంకార||
కీర్తన 2
అమ్మవారు కూర్చుంటే _ కుందనపు బొమ్మలాగే వుంటుంది
ఆ బొమ్మ చూస్తుంటే _ బంగారు బొమ్మలాగే వుంటుంది
1.
అందాలు చిగురించు మందహసము
ఆమెము అగుపించు చంద్రబింబము
చంద్రుని దిక్కరించు నొసట తిలకము
ఆ తిలకమే కనులకు ఇహపరసుఖము ||అమ్మవారు||
2.
ఇంటింట వెలసింది మన చిట్టితల్లి
మన కంటి పాపాయి మన కల్పవల్లి
మన వెంట వస్తుంది మాధవుని చెల్లి
అడిగింది ఇస్తుంది మన చిట్టితల్లి ||అమ్మవారు||
3.
ఏటేటా పండుగలు ఉత్సవాలు
దండిగాను ధూప దీప నైవేద్యాలు
పండుగకు చేస్తారు గొప్ప విందులు
విందారగిస్తుంది మన చిట్టి తల్లి ||అమ్మవారు||
కీర్తన 3
నడచిరావమ్మా అమ్మ మహలక్ష్మి నడచిరావమ్మ
వేయి హంసల పాన్పుపై నడచిరావమ్మ
1. పాల సముద్రములోన పుట్టీన తల్లి
క్షిరా సముద్రములోన పుట్టిన తల్లి
శేషయ్య పాన్పుమిద పవళించే వేళకాదు తల్లి
భక్తుల హృదయాలలీన పవళించే వేళకాదు తల్లి "నడచి"
2. అమ్మ మహలక్ష్మి దేవి రావమ్మ
నీవు నడిచిన ఈ యింటిలోన
నిత్య కళ్యాణమమ్మా పచ్చ తోరణాలమ్మా
వేయి హంసల పాన్పుపైన "నడచి"
3. అమ్మ తల్లి నడిచిన ఈ యింటిలోన సిరి
సంపదలు లోటే లేదమ్మ
పసుపు కుంకుమలు అమ్మ తల్లికమ్మ
నిండారు వేడుకలు మాయమ్మకమ్మ "నడచి"
4. నిత్యా పూజ అమ్మ శివ పూజలమ్మ
శివజ్యోతి వెలుగు కాంతీ అల్లదిగో మాయమ్మ కాంతీ
ఘల్లు ఘల్లు మంటూ ఆగజ్జెల రవళీ
ఆ వడ్డాణపు చిరుగజ్జెల రవళీ మా అమ్మదమ్మా "నడచి"
5. ఆనుదుటి ఎరుపు కుంకుమ మాతల్లిదమ్మా
జగదీశ్వరి నీవని నమ్మితినమ్మా పరమేశ్వరి నీవమ్మా
పాహిమాం పాహిమాం పాహిమాం పాహిమా
అని పలుకును మాయమ్మా నడచిరావమ్మా
ఘల్లు ఘల్లు మంటూ ఆ గజ్జెల రవళీ మా అమ్మదమ్మ "నడచి"
కీర్తన 4
విశ్వమంతా నీవు వినవమ్మ దుర్గా
భక్త చింతామణి బెజవాడ దుర్గ
దుష్ట శిక్షామణి ధరణి సన్మార్గ
ఇష్ట దేవత నీవు ఇలవేల్పు దుర్గ
1. బ్రహ్మ పట్టపురాణి భారతిని అందురూ
వైకుంఠ పురమందు మహలక్ష్మివి అందురూ
కైలాసగిరిలో శ్రీ గౌరివమ్మ
పాలింపరావమ్మా కరుణా కటాక్షీ "విశ్వ"
2. కంచి కామాక్షమ్మ కాపాడవమ్మ
మధుర మినాక్షమ్మ మాట్లడవమ్మా
కరుణించరావమ్మ కనక దుర్గమ్మా
ధరణిలో శ్రీ గౌరి బ్రమరాంబవమ్మా "విశ్వ"
3. కాళిదాసుడు మున్ను నీ కరుణ చేతా
కలము చేత బూనీ కావ్యములు వ్రాసే
రామలింగుడు నిన్ను దర్శించినంతా
వికల కవిగా తాను ఇలను రాణించే “విశ్వ”
4. పసుపు కుంకుమ నుదుట పదిలమై యుండు
చేసిన పూజలు దాసులైవుండు
వాసికెక్కిన వ్యాఘ్ర వాహనము నందు
నిన్ను కొలచిన నాడు హృదయమందుడు "విశ్వ"
కీర్తన 5
అమ్మ అమ్మ రావమ్మ _ లలితాదేవి నీవమ్మ
లలితాదేవి నీవమ్మ _ మమ్మెల్లరను దయతో చూడమ్మ " అమ్మ "
వీడక మనసున వేడేదమమ్మ _ వేగమే కదలి రావమ్మ " అమ్మ "
చల్లని తల్లిని మాయమ్మ _ కన్నుల చూడగ రావమ్మ " అమ్మ "
ఈశుని చెంతను కైలాసంలో _ ఈశ్వరివై విహరిస్తావో
వాసవి కన్యకవైనావో _ భక్తుల కోరిక తీర్చవో " అమ్మ "
కాశీ పురము చేరి మహేశుని _ మానవ జ్యోతివైనావో
గంగాతీర విహరములో హయిగ పరవశమైనావో " అమ్మ "
కీర్తన 6
శ్రీ చక్ర సింహసినీ _ శ్రీ చక్ర సింహసినీ
పరిపాలించు శ్రీ రాజరాజేశ్వరీ " శ్రీ చక్ర "
వేద సారములు నీవే శ్రీ ఓంకార నాదములు నీవె
సాదు జనావని సాధన సంపద నీవే " శ్రీ చక్ర "
పసుపు కుంకుమ గాజులు, పూలు
నిరతము మాకు అందించవే
నిత్య నిరంజని సత్య సనాతని
నీ కరుణ మాపై చిలికించవే " శ్రీ చక్ర "
నీ నుదురుపై వెలయు సింధూరమై
నీ పాద కమలాల పారాణివై సాధించు వరమీయవే " శ్రీ చక్ర "
సహస్రలోచని సరసవినోదిని
శురచిర దరహసిని _ సర్వ శుభంకరీ
శత్రుభయంకరి _ శిష్టవ శంకరీ గౌరి " శ్రీ చక్ర "
నీహరములోని లోమాలనై
నీ పూజపూలలో విరజాజినై
ఒకసారినే కలసిపోనా
ఒకసారినే లీనమౌనా " శ్రీ చక్ర "
కీర్తన 7
అమ్మా అమ్మా రావమ్మా, కన్నుల పండుగ చేయమ్మా
తొమ్మిది రోజుల పండుగది తోయగ చేసి రావమ్మ
|| అమ్మా ||
నీ పండుగనే చేసేము నిన్నే మదిలో తలచెదము
మమ్ముల బ్రోవగ రావమ్మా మహలక్ష్మి దయగనగ రావమ్మా|| అమ్మా ||
కుంకుమ పూజలు చేసెదమమ్మా
భువనము విడచి రావమ్మా
అనసూయ దయగనగరావమ్మా
హరతి గైకొనరావమ్మా || అమ్మా ||
రాక్షస బాధలు పడలేక దేవతలందరు మెరలిడిగ
మహిషాసురుని కూల్చితివమ్మా, మానవకోటిని దాల్చితివమ్మా || అమ్మా ||
నవమినాడు కాళివిగా
అష్టమినాడు దుర్గవిగా
నమినాడు నళినాక్షిగా
దశమినాడు జయమెందితివి || అమ్మా ||
కీర్తన 8
లలితాదేవికి శ్రీ మతులు
ఇవ్వరే మంగళహరతులు
ఐదు ప్రాణములు ఐదవతనమే
పసుపు కుంకుమ పడతికి సిరులు ||లలితా||
సిగలో పువ్వులు నగలంట కళ్ళకాటుకే కళంట
చేతికి గాజులు విలవంట, నొదుట కుంకుమ బ్రతుకంట
నొసట కుంకుమా విలువంట ||లలితా||
పతినెడబాయని సతులంట, పచ్చని తల్లులే పార్వతులు ||పతి||
పతి సన్నిదిలో కన్ను మూసినా
ఆరని కుంకుమ హరతులు ||లలితా||
ఇల్లు వున్నదే గృహలక్ష్మి తల్లి అయినది సంతానలక్ష్మి
మగని నీడలో మహలక్ష్మి సంసారానికి సౌభాగ్యలక్ష్మి ||లలితా||
కీర్తన 9
లలితాదేవి పూజలను వైభవముగ చేయగ రారండి
వసుదను చేరిన వారులకు
భాగ్యము కలుగును తుదివరకు
పసుపు కుంకుమల ఫల పుష్పముల
భక్తిని మదిలో మరువకుమా ||లలితా||
లలితాదేవి దరిశనము జేసిన
నిత్యము జయకరము
దొషములను పోచేసిన రాసులకు
జూపించునుగా సత్సరము ||లలితా||
ప్రతి శుక్రవారమందిరము
మందిరమున పరమేశ్వరిని
పరిపరి విధముల ప్రార్థన
జేసిన ఫలితములను జేకూర్చునుగా ||లలితా||
కీర్తన 10
స్వాగతమా స్వాగతమా వాసవాంబికా
సుస్వాగతమూ కులదేవత కన్యకాంబికా (2)
ముజ్జగములనేలు తల్లి వాసవాంబికా
మమ్మేలగా రావమ్మా కన్యకాంబికా
స్వాగతమమ్మా సుస్వాగతమమ్మా
చరణం:1
ఆర్య వైశ్యకుల దేవీ స్వాగతమమ్మా
మహాలక్ష్మీ మహాకాళీవేగమెరామ్మా(ఆర్యవైశ్య)
సరస్వతీ మాతవమ్మ
వాసవాంబికా
పూజింతుము రావమ్మ కన్యకాంబికా
వాసవాంబికా తల్లి కన్యకాంబికా
స్వాగతమమ్మా సుస్వాగతమమ్మా
చరణం:2
బాజాభజంత్రీలతో స్వాగతమమ్మా
బంగారు తేరుమీదుగా ఊరేగి రావమ్మా
భక్తితోడ భజన చేతుము వాసవాంబికా
వాసవాంబికా తల్లి కన్యకాంబికా
స్వాగతమమ్మా సుస్వాగతమమ్మా
చరణం:3
కోలు కోలన్న తో స్వాగతమమ్మా
ఘల్లు ఘల్లు గజ్జెలతో వేంచెయమ్మ(కోలూ)
జయ జయ జయ జయ జయ జయ వాసవాంబికా
జయమునొసగవే తల్లీ కన్యకాంబికా
వాసవాంబికా తల్లి కన్యకాంబికా
స్వాగతమమ్మా సుస్వాగతమమ్మా
చరణం:4
మంగళాంగి మెహనాంగి స్వాగతమమ్మా
హారతిచ్చి వేడెదమువేగమే రామ్మా(మంగళాంగి)
ముగ్ద మనోహరీ దేవి వాసవాంబికా
మణిద్వీప వాసినివే కన్యకాంబికా
వాసవాంబికా తల్లి కన్యకాంబికా
స్వాగతమమ్మా సుస్వాగతమమ్మా||2||
0 Comments