Sri Vasavi Kanyaka Parameswari Devi 6
శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము
Sri Vasavi Kanyaka Parameswari Devi 6
శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము |
శెట్టిరాజుల ఉద్యానవనమునకు మహారాజు రాక:-
ఆ విధంగా దక్షిణదేశంలోకి ప్రవేశించగనే సైన్య సమేతముగా
దండయాత్ర చేయుచున్న విష్ణువర్ధనునకు ఒకనాటి సాయం సమయమున సువర్ణమయ ప్రాకారములతో
స్వాగతములు పలుకుచున్న ఉద్యానవనమెకటి గనపడెను. బహుమాసములనుండి ప్రయాణించి
అలసియున్న సైన్యమంతయూ డేరాలు, గుడారాలు పరచుకొని అందరూ విశ్రమించిరి. పశ్చిమగౌతమీ తీరమున అలరారు చున్న
మామిడి, అరటి, నారింజ, మద్ది, బొగడ, రావి, శ్రీ గంధము మెదలైన వృక్షములు, సన్నజాజి, సంపెగ, మందార, మెగలి, విరజాజి, తులసి, మల్లె మెదలగు
గుభాళింపులతో నున్న చెట్లతోను నానావిధములైన లతలతోను విరాజిల్లుచున్నదియైన సదా
ఫలించి పుష్పించునదియూ, ఎంతటి కఠిన చిత్తుడై ననూ వనమున
ప్రవేశించగనే శాంతముగా మరల్పదగినట్టిదియునూ దేవతలు విహరించు నందన వనముకన్నా
ధీటుగాను మానవులకు వర్ణింప వీలుకాని వనమున ప్రవేశించిన మహారాజుకు నిద్రావస్థ కలుగక
’ఆహా! ఈ వనమెంత మనోహరముగన్నున్నది! బహురాజ్యములు, బహు
ప్రదేశములు తిరిగిన నన్ను మనోబంధితము చేసిన ఈ పూలవనమెవరిదో?!’
అని మనస్సున తలంచెను. ఆ ఉద్యానవనము ఆర్యవైశ్యులదని, మహాశ్రేష్ట్రుల
నివాసమునకై దేవతలకే గృహాలు నిర్మించడంలో దిట్టయగు మయబ్రహ్మ నిర్మిత నగరేశ్వర
పట్టణాధీనములోని వనము అని విష్ణువర్ధనరాజునకు గోచరించలేదు. కొన్ని అపశకునములు
కలిగిననూ రాజు లెక్కచేయక మైమరచి వనమును తిలకించుచుండెను. సమయమును కూడా మరచి
సంచరిస్తున్న రాజునకు బ్రహ్మీ ముహూర్తమున వనమున బహు అంతస్తులు కలిగిన ఒక సౌధము
జనబడెను.
ఆ సౌధము నక్షత్రముల దాకుచూ దిక్కులను కలుపుచూ వెలుగులతో
నిండి నిమిడీకృతమై భూతల స్వర్గముగనున్న ఇందులో నివాసయెగ్య అదృష్టవంతులెవరో? సందర్శించవలెననే తలంపున రాజు సౌధములోకి
ప్రవేశించెను. కొంత సేపటికి 714 గోత్ర ఆర్యవైశ్యుల బాలబాలికలు సకలవిద్యలు
నేర్చుకొను విద్యాలయమని తెలుసుకొనెను. తొలి అంతస్తులోని బాలురు భాస్కరాచార్యుని
ద్వారా చతుర్వేదములు అభ్యసించుచుండిరి. రెండవ అంతస్తులో షడంగములను, షట్ శాస్త్రములను, యువతీ యువకులు అన్యోన్యముగా
వాసమాడు కొనుచుండిరి. బిడ్డలు వాదశాస్త్రములో ప్రావీణ్యత పొందుట విష్ణువర్ధనుడు
గాంచుచుండెను. మూడవ అంతస్తున వీణావేణుగానములు, నృతయము,
సంగీతము, కవిత్వము మెదలైన సాహిత్య కళలను
అభ్యసిస్తున్న ఆర్యవైశ్య కన్యకామణులను రాజు తిలకించెను. ఆ విధముగా నాలుగవ అంతస్తున
అష్టాదశ పురాణములు, మిగతా అంతస్తులలో విలువిద్యలు, ముష్టియుద్దములతోపాటు అష్టాదశాస్త్ర, శస్త్రములు,
ఉపనిషత్ లు నేర్చుకొనుచున్న ఆర్యవైశ్య యువజనులందరిని మహారాజు
గాంచెను. ఆజానుబాహుడై భీమసేనుని బోలియున్న సార్వభౌముడు ఈ విద్యాలయములో
తిరుగాచుండుట చూసిన విద్యార్థులు "ఓ మహారాజా! మీరు పరరాజులుగా
గన్పించుచున్నారు. మీరేరాజ్యమువారు?" అని అడుగగా
విష్ణువర్ధనుడు "నేను పవిత్ర చంద్రవంశాధీశుడను. మా నగరము తూర్పుగౌతమీ
తీరములోని రాజమహేంద్రి. విష్ణువర్ధనుడైన నన్ను ’కలియుగ భీమసేనుడు’ అని ప్రజలు
మక్కువతో పిలుచుచుందురు. సరే ఈ మేడలోని విద్యనొనరించు మీదే కులము? మీదే స్థలము?" అని ఎదురుప్రశ్న వేసెను.
ఆర్యవైశ్య బిడ్డలు "మమ్ములను కులమున గోమతి వారందురు. మా స్థలమే ఆ కనబడుచున్న
అష్టదశ నగరములు. మా ఆర్యవైశ్యులు పూర్వం తపస్సు చేసి ధన్యులై త్రిలోకములు
సంచరించగా ఆది పరాశక్తి, విశ్వకర్మమయుని ద్వారా నవరత్నములతో,
నవనిధులతో అష్టాదశ నగరములను నిర్మించి ఇచ్చెను. ఆర్యవైశ్యులందరికిని
కుబేరుడు, నారదమహర్షి, కృషి గోరక్ష్య
వాణిజ్యములు జీవనోపాద్దిగా ఉండుటకై నెంచి ఇతరులక సాధ్యములగు ఈ వృత్తులయందలి
రహస్యములు నేర్పెను. క్రయవిక్రయములందు సమర్థతను సకల ధర్మములతో కూడిన వ్యాపార
రహస్యములను కూడ నేర్పెను. ధన, కనక, వస్తు,
వాహనములతోనున్న ఆ ఆర్యవైశ్యులవైపు పరరాజులు కన్నెత్తి చూడకుండా
ఉండుటకు మా భాస్కర గురువులు మాకు సకల వేదములు, ఉపనిషత్తులతోను
మరియు అస్త్రవిద్యలు సదా అభ్యాసము చేయుచుండిరి" అని ఆర్యవైశ్య వృత్తాంతమును,
వీరి వృతులను, వీరి గొప్పతన్నాన్ని అంతయూ
రాజుతో చెప్పిరి.
ఆశ్చర్యచకితుడైన రాజు "ఎక్కడైనా బ్రాహ్మణులు వేదార్హత
కలిగి వైశ్యులకు రాజ్యార్హత, వేదార్హత ఎలా లభించెను?" అని అడిగెను. ఆ
ప్రశ్నకు ఆర్యవైశ్య యువజనులు ఓ చంద్రవంశాధీశా! అష్టాదశ 18 నగర్ములోను పరి
పాలించుచూ, బాల నగరులమైన మేము అమ్ములుబూని వీరత్వమున
అత్యద్భుత శక్తితో ధైర్యము కలిగియుండి, ధనస్సుచేపట్టితిమి.
కాని మేము గుణమునకు బ్రాహ్మణులము. కులమునకు ఆర్యవైశ్యులము. మేము ’కులబ్రాహ్మణులం
కాదు - గుణ బ్రాహ్మణులం’ రాజా! నాలిక యున్నవారెల్లరూ సర్వశాస్త్రములను
అభ్యసించుటకు అర్హత యున్నదని పూర్వం విశిష్టాద్వైత సిద్దాంతమును దశదిశలా విజృంభణ
చేసిన శ్రీ రామానుజస్వామివారు బోధించియుండిరి కదా! మీకు తెలియని ధర్మములేమున్నవి?"
అని వచించిరి. ఇంకనూ కొంతమంది యువజనులు "రాజా! కులమే
ప్రాధాన్యమైతే బ్రహ్మ మనమడు బ్రహ్మణుడైన రావణబ్రహ్మ- లంకా నగరాన్ని కోటి యాభైలక్షల
సంవత్సరములు పరిపాలించి క్షత్రియవృతి గావించెను గాదా! ఇంకనూ బ్రాహ్మణ వంశస్థుడై
గాధిమహర్షి కుమారుడైన విశ్వమిత్ర మహర్షి త్రిశంకు స్వర్గాన్ని సృష్టించుటకొరకు బహు
రాక్షసులను వధించి క్షత్రియ వృత్తి చేపట్టెను కదా! క్షత్రియులైన రేణుకా - జమదగ్ని
కుమారుడైన పరశురాముడు తండ్రి అనుమతితో పురోహిరుడుగా ఉండి బ్రాహ్మణవృతి
నెరవేర్చనుగాదా! ఈ విషయాన్ని ప్రామాణికం చేస్తూ గీతాచార్యుడు భగవద్గీతలో ’వారివారి
గుణములకు తగినట్లుగా కర్మలు ఏర్పరచాను’ (4-13)
అని బోధించెను. కనుక ఇక్కడ కుల ప్రాధాన్యత కాదు, గుణ
ప్రాధాన్యత ముఖ్యం మహారాజా!" అని వచించిరి.
ఆశ్చర్యపడిన విష్ణువర్ధనుడు "ఓహో! అలాగైన మీ
దేశాధ్యక్షుడెవరు? మీ కులదైవం ఎవరు? అని ప్రశ్నింప అప్పుడు యువజనులు "రాజా! ఆర్యవైశ్యసంఘ సేవకంకితమైన మా
అష్టాదశ నగరాధ్యక్షుడు కుసుమాశ్రేష్ఠిగారు, మయబ్రహ్మ
ప్రతిష్టితమైన శ్రీ నగరేశ్వరస్వామి మా కులధైవము" అని చెప్పెను. సంతుష్టుడైన
చంద్రవంశాధీశుడు "ఆర్యవైశ్యుల నిమితమై మయబ్రహ్మ నిర్మించిన నవరత్నముల సంపదతో
అలరారుచున్న మీ 18 నగరములను నేత్రానందముగా ఒక పర్యాయము తిలకించెదను. మీ నగరములను
రహదారు లెన్నిగలవు?" అని కోరెను. పరరాజు అనుమానాస్పదమైన
ప్రశ్నలను నిన్న వేగులు రహస్యముగా నగరస్వాములు, వద్దకు
వెళ్ళి "తూర్పు గోదావరీ తీర రాజమహేంద్రిని పరిపాలన గావించుచున్న
విష్ణువర్దనుడను రాజు మీ నగరములకు ’రహదారులెన్నికలవు’ అని ప్రశ్నించినాడు. హాని
తలపెట్టుటకేమైనా వచ్చినాడేమె?" అని విషయము చేరవేయగా
నగరస్వాములు,
గ్రామపెద్దలు
కుసుమశ్రేష్టితో "మన పట్టణ హద్దులోని ఉద్యానవనమున నిన్నటిరాత్రి విడిదిచేసిన
పరరాజు మనబిడ్డలను అనేక ప్రశ్నలు వేసి, నవనిధులతో అలరారుచున్న పదునెనిమిది నగరముల విషయములు గ్రహించి దర్శించెదని
కోరెను.
మన నగరముల వింతలు, హ్ప్యలు గాంచెదమని వచ్చి కోరినవారిని ’రావద్దు’ అని తిరిగి పంపించుట మన
సంస్కారము కాదు. అవసరమైన ఎడల ఖడ్గములు, ఖటార్లు మెదలైన ఆయుధములతో
మన సర్వసైన్యమును రహస్యముగా యుద్దమునకు సిద్దపరచి, తదుపరి
విష్ణువర్దనుని అతని పరివారమును మన నగరములలోకి ఆహ్వానించెదము. ఒకవేళ కృతఘ్నడై
యుద్దరంగమునకు సిద్దపడిన తక్షణమే మనమందరమూ సులభ రీతిలో ఆతనిని యుద్దములో
హతమార్చెదము" అని చర్చించెను. కుసుమశ్రేష్ఠి సమ్మితించి వల్లభశ్రేష్టిఉఅను
సేనామంత్రిని అశ్వములతో గూడిన రథమునిచ్చి పంపెను. అతనినిగాంచిన విష్ణువర్దనుడు తన
పరివారముతో వచ్చి పెనుగొండ పురములోని నగరేశ్వర దేవాలౌఅమున విడిదిచేసెను. అష్టాదశ
నగరములు తిలకించుటకు చంద్రవంశీకుడు వస్తున్నారని కనుగొనిన పట్టణవాసులు మెగలి,
సంపెంగ పుష్పములతోను, తోరణములతోను, వారివారి పట్టణములలోని గృహములను, వీధులను అలంకరించగా
రాజు దినముకొక పట్టణముగా 18 నగరములను 18
దినములు తిలకించి ఆనందపర్వశుడై మరల పెనుగొండ పట్టణములోని తన విడిదియగు నగరేశ్వర
దేవస్థనమునకు వచ్చిచేరెను. అంతఃపురముననున్న యువరాణి వాసవి వద్దకు నగరేశ్వర
దేవస్థానమునకు వచ్చిచేరెను. అంతఃపురముననున్న యువరాణి వాసవి వద్దకు నగరేశ్వరుడు
ఎరుక స్త్రీ సోది వేషములో వచ్చెను. పరిచారికులు వెళ్ళి ఆమెకు సాదరంగా
ఆహ్వానించిరి. అప్పుడు వాసవితో మారువేషములో నున్న నగరేశ్వరుడు "వాసవీ!
దేవాలయమున ఉన్న విష్ణువర్ధన రాజు వద్దకు నీవు వచ్చి స్వయంభూః నగరేశ్వరునకు
మంగళహారతులివ్వుము. రాజు మానవుడు - నీవు దేవతవు. కనుక దేవుడైన నగరేశ్వరునకే
హారతులివ్వు. శుభం కలుగును" అని చెప్పి వెళ్ళిపోయెను. అప్పటికాల ఆచార
ప్రకారము అష్టాదశ నగరములను తిలకించివెళ్ళు గొప్పవారికి, పవిత్రాత్మ
స్వరూపులగు కన్యారత్నములతో కర్పూర మంగళహారతులిచ్చు సంప్రదాయము కలదు. ఆ వంశాచార
ప్రకారము అష్టదశ నగరములను తిలగించివెళ్ళు గొప్పవారికి, పవిత్రాత్మ
స్వరూపులగు కన్యారత్నములతో కర్పూర మంగళహారతులిచ్చు సంప్రదాయము కలదు. ఆ వంశాచార
ప్రకారము అష్టాదశ నగర కన్యకామణుల సంఘాధ్యక్షురాలు యగు కన్యకాంబకు తెలియపరచగా ఆమె
వందలాది కన్యలందరినీ పెనుగొండకు చెలికత్తెలతో రప్పించెను. పరిమళ సుగంధ ద్రవ్యములు,
ఫలపుష్ప తాంబూలములు పూజాబుట్టలలో నింపుకొని మంగళహారతులు
అర్పించుటకుగానెంచి కన్యలందరూ శ్రీ నగరేశ్వరునకు పుష్పాలంకరణ చేయుచుండిరి. వాసవి
కన్య మంగళహారతి వెలిగించి నిర్మల భక్తితో, కిన్నెర గాత్రముతో
హారతిపాట పాడుచుండెను.
విష్ణువర్ధన రాజు, వాసవిని చూచుట
విష్ణువర్ధన రాజు,
వాసవిని మెహించుట:-
నవమెహనాంగి, నిండు యవ్వనముతోనున్న వాసవి పాడుచున్న
భక్తిపాటను కర్ణానందముగా విన్న విష్ణువర్ధనుడు ఆమెను
నఖశిఖ పర్యంతం, ఆపాదమస్తకం
తిలకించెను. సమస్త్ భూషణములతోను, సోమవారా భరణములతోను,
పాపిటబొట్టు, సూర్య, చంద్ర
హారములతోను, దేదీప్యమానమైన వడ్డాణముతోను మెరయుచూ, రంభ, మేనక, ఊర్వశి మెదలగు
అప్పరాంగనలను పోలియుండి యవ్వనమంతరించి కౌమార రూపముతో అలరారుచున్న వాసవి శరీరమును
గాంచి ఒక్కక్షణం రాజు మైమరచెను.
తన జీవితంలో ఇంతవరకు ఇటువంటి సౌందర్యరాశిని చూసియుండని
రారాజుకు పైత్యనాడి ప్రబలి నేత్రములు తిరిగి మూర్చపోయెను. ఈ హడావిడీలో వచ్చిన
భక్తాదులందరూ వారివారి స్థానములను వెడలిరి. రాజవైద్యులు రాజునకు ప్రధమ చికిత్సచేసి
తెలివి తెచ్చిరి. తెల్లవారింది. తేరుకున్న మహారాజు వేగులను పిలిపించెను. వారితో
"రాత్రి నగరేశ్వరునకు మంగళహారతు లిచ్చుచున్న వందలాది కన్యలలో చుక్కలో
చంద్రునివలె ఒకే ఒక్క సుందరాంగి ఉన్నది. ఆమెను గాంచగనే నాకు స్పృహ తెలియలేదు. నాకు
నిద్రహారాలు జతపడుటలేదు. ఆ మెహనాంగి ఏ కులకన్య? ఆమె తల్లిదండ్రులెవరు? వనస్ఫుటయగు ఆ కన్య నా నేత్రములలోనే కదలాడుచున్నది" అని తన మనోభావమును
తెలియపరచెను. వెంటనే వారందరూ "మహారాజా! ఆ కన్యకామణి ఎవరో కాదు. ఈ నగరేశ్వర
పట్టణముననే నివసించు చున్నది. ఆమె తల్లిదండ్రులు 18 నగరములకు రాజు - రాణి.
వారిపేర్లు కుసుమాంబ - కుసుమశ్రేష్ఠి ఉఅని పల్కుదురు. ఈ దంపతులకు కళ్యాణమైన చాలా కాలం
వరకు సంతానం లేక ’పుత్రకామేష్టి’ అను యాగము చేసిరి. యజ్ఞేశ్వరీ యజ్ఞేశ్వరుడు
ప్రత్యక్షమై రెండు ఫలములివ్వగా అవి భక్షించిన మహారాణికి నీవు కాంచిన కన్యతో పాటు
మరో పురుష శిశువు కూడా ఉద్భవించెను. ఈమె పేరు వాసవికన్య. ఆమె సోదరుని పేరు
విరూపాక్షుడు.
అష్టాదశ నగరముల ఆర్యవైశ్యసంఘ అధ్యక్షుడు
కుసుమశ్రేష్ఠి(వైశ్యరాజు)
అష్టాదశ నగరముల ఆర్యవైశ్య మహిళ సంగ అధ్యక్షురాలు
కుసుమాంబాదేవి(మహారాణి)
అష్టాదశ నగరముల ఆర్యవైశ్య యువజనసంఘం అధ్యక్షుడు
విరూపాక్షుడు (యువరాజు)
అష్టాదశ నగరముల ఆర్యవైశ్య కన్యకల సంఘాధ్యక్షురాలు వాసవీకన్య
(యువరాణి)
వీరి కుటుంబములోని వారు నలుగు సంఘములకు అంకితమై సంఘములను
పరిపాలన గావించుచుండిరి. అంతేకాక ధానధర్మములు చేయుటలో వీరికి సాటి మరొకరు లేరు.
పరోపకార బుద్దిలో మహాపేరుగాంచెను. ఇతరుల సేవ ఈశ్వరుని సేవగా, పరుల సేవ పరమాత్మ సేవగా తలంచు ఈ కుటుంబమును
నగరేశ్వరుడు ఆయురారోగ్యములతో చూచుచున్నాడు" అని చెప్పిరి. తక్షణం మహామంత్రిని
పిలిచిన భూపాలుడు "ఓ సువీరుడా! ఈ పట్టణములోని ఆర్యవైశ్య సంఘాధ్యక్షుడు
కుసుమరాజాగారు ఉండెనట. వారి కుమార్తెను రాత్రి నేను మెహించితిని. అటువంటి సుందరమగు
కన్యను చేపట్టని పురుషుడు పురుషుడే కాదు. నేను ఆమెను చూచుటతోనే నా మనస్సులో లేదు.
ఈ షష్టి పూర్తి చేసుకున్న చివరి రోజులలో ఆఖరు కళ్యాణము ఈమెనే చేసుకొన వలెనని గట్టి
కోర్కె ఏర్పడెను. మంత్రులైదుమంది బయలుదేరి వెళ్ళి నేను వలచిన కన్యారత్నమునిచ్చి
నాకు వివాహము చేయవలెనని ఆమె తండ్రియగు కుసుమశ్రేష్టితో నా మాటగా తెలియపర్చి వివాహా
రాయబారమును కుదుర్చుకు రావలెను.
సఫలీకృతులై వచ్చిన మీకు అనేక బహుమతులిచ్చెదను. శీఘ్రముగా
బయలు దేరుడు" అని పంపచూసెను. మంత్రులైదుగురు మహరాజు చెంతకు వేంచేసి "ఓం
చంద్రవంశాధీశా! నీవు పవిత్రమైన పాండవ వంశములో జన్మించి మంచి పేరు
సంపాదించుకున్నావు. షష్టిపూర్తి అయిన పిమ్మట ఈ చెడ్డబుద్ది పుట్టుట విచారకరము.
నీకు పెక్కుమంది భార్యలు మరియు సంతానము బాహుళ్యాముగా కలరు కదా! మనమలు కూడా
అనంతముగనుండిరి. గదాయుద్దములో "కలియుగ భీమసేనుడు" అను బిరుదును పొంది ఈ
ప్రపంచంలో నిన్ను ఓడించు వాడెవ్వడూ లేడనిపించుకున్నావు. నీ సూర్య - చంద్ర
వంశరాజులు నిన్ను ఓడించు వాడెవ్వడూ లేడనిపించుకున్నావు. నీ సూర్య - చంద్ర
వంశరాజులు నిన్ను ఆక్షేపణ చేయు పనులు నీవు చేయరాదు గాదా! నీవు చేయు పాపములో మాకు
కూడా భాగముండును. నిజంగా నీకు మరో పెళ్ళి కావలెననిన రాజమహేంద్రలో వందలాదిమంది
క్షత్రియ కన్యలున్నారు. పేరుప్రఖ్యాతులు గడించిన నీవు ఈ ఆర్యవైశ్య కన్యను గోరితే
నరకము కలుగును రాజా! నీకిది భావ్యము కాదు!" అని ధర్మములు చెప్పిరి.
"కామాతురాణాం నభయం నలజ్ఞా..." అన్నట్లు కామాంధుడైన రారాజుకు మంత్రులు
చెప్పనారంబించిన ధర్మములు రుచింపలేదు
శ్రీ వాసవీ మాత హయాంలో ఉన్న అష్టాదశ సంఘములు
శ్రీ ఆర్యవైశ్య సంఘం
శ్రీ ఆర్యవైశ్య మహిళా సంఘం
శ్రీ ఆర్యవైశ్య యువజన సంఘం
శ్రీ ఆర్యవైశ్య కన్యకామణుల సంఘం
శ్రీ ఆర్యవైశ్య బాల నగర సంఘం
శ్రీ ఆర్యవైశ్య ప్రార్థనా సంఘం
శ్రీ ఆర్యవైశ్య గణపతి చవితి సంఘం
శ్రీ ఆర్యవైశ్య శ్రీరామనవమి సంఘం
శ్రీ ఆర్యవైశ్య చలివేంద్ర సంఘం
శ్రీ ఆర్యవైశ్య నగరేశ్వర దేవాలయ సంఘం
శ్రీ ఆర్యవైశ్య దేవీ శరన్నవరాత్రుల సంఘం
శ్రీ ఆర్యవైశ్య ధనుర్మాసోత్సవ సంఘం
శ్రీ ఆర్యవైశ్య కార్తీక వన సంఘం
శ్రీ ఆర్యవైశ్య మహా శివరాత్రోత్సవ సంఘం
శ్రీ ఆర్యవైశ్య
సేవా సంఘం
శ్రీ ఆర్యవైశ్య వృద్దజన సంఘం
శ్రీ ఆర్యవైశ్య గౌర (బాల, బాలికల) సంఘం
శ్రీ ఆర్యవైశ్య నగర సంకీర్తన సంఘం
రాజు రాయబారము పంపుట:-
మంత్రుల మాటలకు మహాకోపోద్రీకుడైన విష్ణువర్ధనుడు "ఓరీ! మంత్రులారా! నా వద్ద జీతభత్యముతో బ్రతుకుతున్న మీకు ఇంత కండకావరమా! అగ్రహారములు నిర్మించి, ఉపాధి కల్పించిన నాకే నీతులు బోధించునంత స్థాయి వచ్చినదా? ఇంత గర్వమా? ఆర్యవైశ్యులు అడిగింది "లేదు" అనువారు కాదని వారి బిడ్డలే చెప్పిరి. మర్యాదగా నే కోరుకున్న వాసవి కన్యతో వివాహ రాయబారం మాట్లాడివస్తే మంచిది. లేని పక్షమున మీరే చెప్పారుగదా, నేను ఖడ్గ, గదా యుద్దాలలో ఆరితేరినవాడినని, మీ మంత్రులైదు మందిని నాఖడ్గముతో ఖండఖండములుగా చేసెదను. నన్ను ప్రశ్నించువారు జగమునందెవ్వరును లేరు" అని క్రోధావేశమున ఖడ్గముబూనెను. మంత్రులందరూ ’దుర్మార్గుడగు రాజు చేతిలో మరణము పొందుటకంటే , సన్మార్గులైన ఆర్యవైశ్యుల ద్వారా కయ్యమే మంచిది’ అని ఆలోచించి గ్రామములోకి అశ్వవాహనారూఢులై వెళ్ళిరి. వీరు వెళ్ళుసరికి కుసుమశ్రేష్టిగారు అంతఃపురములోని పూజామందిరంలో శివకేశవుల పూజానంతరం మంత్రపుష్పములతో పాల్గొనియుండిరి. సరాసరి అంతఃపురములోకి వెళ్ళిన మంత్రులు కూడా మంత్రపుష్పములో పాల్గొనిరి. అనంతరం బయటకు వచ్చిన తదుపరి కుసుమశ్రేష్ఠి గారితో "మా మహరాజు విష్ణువర్ధనుడు నీ కుమార్తెయగు వాసవి కన్యను రాత్రి దేవాలయమందు చూచు మెహించెను. మేము ఎన్నియె ధర్మములు చెప్పిచూసితిమి. కామాంధత్వంతో ఉన్న రాజు మా మాట పెడచెవిన పెట్టెను. దయతో మీకుమార్తెను మా మహారాజుకిచ్చి చేయుట మంచిది" అని చెప్పిరి.
కుసుమశ్రేష్ఠి 714 గోత్ర వైశ్యులను సమావేశపరచుట:-
సుఖదుఃఖములు సమముగా భావించు కుసుమరాజాగారు ఎటువంటి కలతచెందక
"మీ మహారాజుతో స్వయముగా మేము వచ్చి మాట్లాడెదము" అని మంత్రులతో చెప్పగా
మంత్రులు వెళ్ళి ఈ విషయం భూపాలునితో చెప్పిరి. నిన్నటివరకు నీతిమంతుడుగా కనిపించిన
రాజు, కామమునకు దాసుడై, కామమును జయించలేదని గ్రహించిన కుసుమశ్రేష్టి ముందుగా కొంతమంది ఆర్యవైశ్య
బిడ్దలను మహరాజువద్దకు పంపించెను. అంతఃపురమునకు వెళ్ళిన కుసుమరాజు ధర్మపత్నితో
రాజు విషయం గురించి చర్చించెను. పదప కుసుమశ్రేష్ఠి తన భార్యతో కూడి పుత్రికను చూసి
"ఈ చిన్నదానిని నగరేశునకిచ్చెదను" అని చెప్పెను. తదనంతరం గ్రామపెద్దలను,
గురుతుల్యులను, ఆర్యవైశ్య నగర పెద్దలను కచేరి
మందపమునకు రావించి సభ ఏర్పాటు గావించెను. అధ్యక్షత వహించిన కుసుమార్యుడు "ఓ
ఆర్యవైశ్యసోదరులారా! తూర్పు గౌతమీ
తీరమునందున్న రాజమహేంద్రవరమును పరిపాలనము చేయుచున్న విష్ణువర్ధనుడను మహారాజు దండయాత్రగా
ఉత్తరాదినుంచి దక్షిణదేశమునకువెళుతూ మన నగరేశ్వర దేవాలయమున విడీదిచేఇ అష్టాదశ
నగరమ్ములను తిలకించిన విషయం మనకందరికీ విదితమే. నిన్నటిరోజు మనం రారాజునకు
సన్మానము చేయు సందర్భమున నగరేశ్వరునకు మంగళహారతులిచ్చుచున్న నా కమార్తెయగు కౌమార
రూపములో నున్న నవమెహనాంగి వాసవికన్యను
గాంచి రాజు మెహించుట. వాసవి నా కుమార్తెయెనా ధర్మం ఆర్యవైశ్య కులముపైనున్నది కదా!
కనుక మీరందరూ ’వాసవికి కళ్యాణం చేయుదమనిన’ నేను తమ మాటనంగీకరించెదను. ’అతను
ఎంత మహారాజైనా క్షత్రియుడుకదా! ఆర్యవైశ్య
కన్యనిచ్చి వివాహం చేయుట ధర్మము కానేరదు’ అని చెప్పినా నాకు సమ్మతమే. మీ మీ
అభిప్రాయము తెలుపుడు" అని పల్కెను. 714 గోత్ర ఆర్యవైశ్యులలోని ఒకరు
"దయాపరుడు, విద్వాంసుడు సకల యుద్దములు చేయుటలో
సాటిలేని చంద్రవంశాధీశుడు విష్ణువర్ధన మహారాజు క్షత్రియుడైనా చక్రవర్తి కదా! అతను
మన కన్యను కోరుట మన అదృష్టము. ’చక్రవర్తి మా అల్లుడు’ యని మనము ఎక్కడ పల్కినా
అక్కడ మనకు గౌరవము తధ్యము. గౌరవముగా వివాహ రాయబారమును పంపించి వియ్యము కొరకు
వచ్చిన దేవేంద్రుని సమానమగు రారాజును చేజార్చుకొనుట తెలివిహీనమనుటలో సందేహము
లేదు" అని తెలుపగా ఈ అభిప్రాయముతో ఏకీభవించెదమని ఎక్కవమంది తెలిపిరి.
వెంటనే భరద్వాజస గోత్రీకుడగు నారసింహశ్రేష్టి లేచి
"కుల ధర్మములు, కులాచారములు మంటకలకుడదు,
అధర్మ అభిప్రాయములు చెప్పినవారు నరకమున పడుదురు. కృషి, గోరక్ష్య వాణిజ్యములు జీవనోపాధిగా ఉండి, యజ్ఞ
యాగాదులు. దానధర్మాలతో, పరోపకార స్వభావముగా, అష్టైశ్వర్యములతో తులతూగుతున్న మనమెక్కడ? దండయాత్రగా
వెళుతూ పరస్థలమైన పెనుగొండ చేరి కామక్రోధములతో పవిత్రమైన మన కన్యను మెహించిన
అధర్మపరుడగు విష్ణువర్ధనుడెక్కడ? వాసవిని మహరాజునకిచ్చి
చేయుట ధర్మవిరుద్దము. భరింపరాని నీచమైన ఆలోచనలు అమలుపరిచిన యెడల ఆర్యవైశ్యసంఘ
ఉనికిని దిగజార్చుటే అవితుంది" అని విన్నవించగా 102 గోత్ర ఆర్యవైశ్యులు
నరసింహశ్రేష్టి చెప్పిన వాక్యములు సత్యమేనని పలికిరి. కుసుమరాజా వారు గురు
భాస్కరాచార్యులను సలహా కోరెను. భాస్కరుడు "మీ ఆర్యవైశ్యలందరూ వాదోపవాదములు
లేకుండా ఏకపక్షముగా ఐకమత్యముగా నాచరించవలెను. మహరాజు వాసవిని కోరుట అధర్మమే కదా!
ముందు వాసవితో ఈ విషయము చెప్పి ఆ మనోద్దేశ్యము తెలుసుకొనుట మంచిది. మీరు మహరాజు
వద్దకు పంపించిన ఆర్యవైశ్య బిడ్దలు సామాన్యులు కాదు. వారు రాజునెట్లయినా తన
పట్టణమునకు పంపించి వత్తురు" అని బోధించెను.
యువజనులను గ్రామం వెలుపలనున్న రాజు వద్దకు పంపుట:-
నగరేశ్వర దేవస్ఠనములో విడిదిచేసియున్న విష్ణువర్ధనుడు
ఆర్యవైశ్యల బిడ్డల రాకను గమనించి అందరకూ ఉచితాసనములపై అధిష్టింపజేసి గౌరవించెను.
మహరాజు "ఓ ఆర్యవైశ్య యువకులారా! కాబోవు బావమరదులారా! నేను మీ వాసవిని చూసి
వివాహమాడదలంచితినని మీకు తెలుసు. నేను సమస్త రాజ్యములలోని రాజులందరినీ ఓడించిన
వాడను. సామంతరాజులకు నేనంటే భయము, నవరత్నములు, గోమేధిక పుష్యరాగములు, మరకత మాణిక్యములు, కోట్లకొలదిగా సువర్ణ రూపాయలు,
ముత్య, పగడ రాశులు అధికముగా కలిగియున్నాను.
ఇంక నా రాజమహేంద్రిలో కేవలం బంగారమే యాబది ఆరు భోషాణములనిండా నిండియున్నది. ఏడు
వారముల ఆభరణములూ కలవు. ఇవికాక నా భార్యలు నా కళ్యాణములో కట్నములుగా అనంతమైన ధనము
’బాలపోలెము’గా ఇచ్చియున్నారు. వాసవిని మీరు నాకిచ్చి పెళ్ళిచేసిన యెడల ఆ ధనమతటికీ
ఆమెయే యజమాను రాలగును. నా రాజమహేంద్రవరానికి ’మహారాణి’ ని చేసి వాసవికి నా
భార్యలందరితో పాదసేవ గావించెదను. ఈ విషయము మీ మహరాజగు కుసుమశ్రేష్టిగారితో
చెప్పండి" అనెను. అంతయూ ఆలకించిన తదుపరి....
ఆర్యవైశ్య బిడ్డలు : "ఓ మహారాజా! మేము ఆర్యవైశ్యులము
గదా!"
మహారాజు : "అవును"
ఆర్యవైశ్య బిడ్డలు :
"నీవు క్షత్రియుడవుగదా!
మహారాజు : "అవును"
ఆర్యవైశ్య బిడ్డలు "మరి పూర్వకాలంలో
కులాంతర వివాహములు ఎక్కడైననూ జరిగియుండలేదుగదా! కనుక నీవు పెండ్లాడుట్ ధర్మము
కానేరదు. ఈ పెళ్ళి నీవు తక్షణము మరచిపోయి నీ రాజ్యమునకు చేరుము" అని చెప్పగనే
రాజు కోపోద్రిక్తుడై "ఓరీ యువకులారా! మీరు సావధానముగా నాకు పెళ్ళిచేసిన మీకు
క్షేమము కలుగును, లేని పక్షమున నా సైన్యముతో మీ
అష్టాదశ పట్టణముల పై దండెత్తి వచ్చి ఖడ్గయుద్దముతో మీ ఆర్యవైశ్యులందరినీ హతమార్చి,
రక్తపాతం చేసి నేను కోరుకున్న వాసవికన్యను బలవంతంగా నా పట్టణమునకు
తీసుకువెళ్ళి అక్కడ స్వేచ్చగా వివాహమాడెదను. నాతో యుద్దము చేసి జయించిన వారింతవరకు
ఎవరునూ లేరు" అని ఊగ్రుడై పలికెను.
రాజు బుద్ది కలుషితమైనదని కనుగొని కామాంధకారములో నున్నాడని
గ్రహించిన, నేర్పుకలిగిన యువకులు
’ఎప్పటికయ్యది ప్రస్తుత...’ అన్నట్లు "ఓ బావగారూ! తమకు ’తప్పక పెళ్ళిచేసెదము’
ఈ మాట సత్యము" అని పలికిరి. ఈ మాటను విన్న రాజు పెండ్లయినదన్నంత భ్రమలో
మహదానందముగా నుండెను. ఆర్యవైశ్యబిడ్డలు ’తప్పక పెండ్లిచేసెదము’ అన్నారుగాని ’మా
వాసవి కన్యతో పెండ్లి చేసెదము’ అని అసత్యము వచించలేదు. వెంటనే మహారాజు "ఓ
బావమరుదులారా! ఇప్పుడు నాకు సంతోషముగ నున్నది. అయితే ఒక్క కోరికా! రాబోవు అల్లుడను
కనుక మీ గృహమున ఒకపూట భోజనమునకు వచ్చెదను" అని అడగెను. అన్నదానము చేయుటలో
అగ్రగణ్యులైన ఆర్యవైశ్యులు గనుక వారు"బావా! ఈ రోజు ఏకాదశి తిథిగనుక మా
ఆర్యవైష్యులెవరూ అన్నము ముట్టరు. పైగా సంధ్యాసమయమైనది. కాన మరుదినము ద్వాదశిరోజు.
మావారు నీకు ఆతిధ్య విషయమునకై ఇక్కడకు వచ్చి నిన్ను గౌరవముగా మా గృహమునకు
భోజనమునకై తీసుకువచ్చెదరు. త్వరపడక నీవిచ్చటనే ఉండుము" అని చెప్పి సరాసరి
గురుకులమునకు వెళ్ళి గురు భాస్కరాచార్యునితో జరిగిన విషయములతోబాటు, ఆతిధ్యాహ్వానము చేసితిమని యువకులు చెప్పిరి.
అంత భాస్కరాచార్యుడు "ఓ యువకులారా! మయబ్రహ్మ సృష్టించి
నిసగిన నవనిధులతోగూడి వజ్రవైఢూర్యములతో అలరారుచూ అనంతములగు ధనముతో తులతూగుచున్న
అష్టాదశ నగరములోకి కామాంధుడైన రాజును ప్రవేశపెట్టుటమనకు క్షేమము కాదు. అష్టాదశ
నగరములలోకి కామాంధుడైన రాజును ప్రవేశపెట్టుట మనకు క్షేమము కాదు. అష్టాదశ నగరములు
దర్శించి వెళ్ళెదనన్న రాజు, అధ్యక్షుల వారి కుమార్తెనే మెహించి క్షమించరాని నేరము చేసి యుండెను. ఈ
పరిస్థితులలో మన గృహమునకే వచ్చిన పరరాజు ధనసంపదలను అన్నియునుగాంచి
అత్యాశాపరుడగుటతో పాటు, ఇంకనూ ఆర్యవైశ్య మహిళలను ఎవరినైనా
మెహించవచ్చు. కాముకుడైనవాడికి వావివరుసలతో నిమిత్తము లేదు. కనుక కామాంధుడైన
విష్ణువర్ధనుని మన గృహమునకు తెచ్చుట క్షేమము కాదు" అని బోధించుచుండగా సర్వ
సైన్యముతో కుసుమశ్రేష్టి, గురుకులమునకు విచ్చేసి జరిగిన
విషయములను గ్రహించి తదుపరి దినమున మరొక అష్టదిగ్గజముల్లాంటి మేటి గోత్రజులైన ఆర్య
వైశ్య యువకులతో "కామాంధుడైన రాజుతో మాటలనేర్పుజూసి, తెలివితో
సంచరించి, మన నగరమునుండి తరలించి రండి. రాజును
అతిధ్యమునకెట్టి స్థితిలోను రప్పించవలదు. నగరేశ్వరునిపై భారమునుంచి ప్రవర్తించండి.
మీకు ఆ నగరేశ్వరుడే రక్ష, బయలుదేరండి" అని చెప్పి
నగరేశ్వర దేవాలయమునకు ఈ యువజనులను పంపెను.
ఈ యువకులను మహరాజు చూడగనే "ఓ బావమరదులారా! నిన్నటి దినమున మీవారు నన్ను భోజనమునకు రమ్మని చెప్పియుండిరి. అకాలము రాకముందే బయలుదేరెదము" అని క్షుద్బాధ తట్టుకొనలేక రాజు త్వరపెట్టెను. ఆర్యవైశ్యయువకులలో నరసింహశ్రేష్ఠి, నరేంద్ర గుప్తయను వారు రాజుతో "బావగారూ! కొంచం శాంతించండి! మీ సంబంధం గొప్పది. మీలాంటివారు ఆర్య వైశ్యులకు అల్లుడవ్వటం గూడా మా అదృష్టమే! అయితే మా కులాచారములు కొన్ని ఎరుగక మావారు నిన్ను భోజనమునకు రమ్మన్నారు. కానీ మా ఆర్యవైశ్య కులమున వంశాచారముగా వచ్చు ఆచారమెకటి కలదు. అయితే అది నీ వద్ద ఎలా చెప్పాలో తెలియటం లేదు మహారాజా!" అనెను. వెంటనే రాజు "చెప్పండి బావమర్దులారా! నా వద్ద దాపరికమెందుకు? కాబోవు బంధువులు మీరు. ఆచారాన్ని మన్నించుట నా విధి. భయపడక చెప్పండి" అనెను. బిడ్డలు " ఓ రాజా! మా వైశ్య కులమున తరతరాల నుండి ’గతికితే అతకదు’ అనే ఆచారం కలదు. దాని వివరమేనగా కాబోవు అల్లుడు, కన్యాదాతగారి గృహంలో వివాహమునకు పూర్వము ఎటువంటి ఆహార పానీయములైననూ స్వీకరించరాదు. ఒకవేళ స్వీకరించిన ఇక ఆ పెళ్ళి విషయాన్ని నీవు మర్చిపోవాలి. ఏది కావాలో తేల్చుకొనుము" అని చెప్పగా విష్ణువర్ధనుడు సందిగ్థంలో "ఏది చెప్పవలెనా?’ అని ఆలోచించుకొని "ఆర్యవైశ్యులారా! నాకు అనేక వివాహములయినవి కానీ ఏ బావమరదులూ ఇటూవంటి నియములు జెప్పలేదు. మీరు మాత్రమే జెప్పుచున్నారు" అనేను. యువజనులు "మహారాజా! నీవింతకు ముందు చాలా పెళ్ళిళ్ళు చేసుకొని యుండవచ్చును కాని ఇది ఆర్యవైశ్యులతో వ్యవహారం. కనుక నీకు భోజన, వివాహాలలో ఏది గావాలో జెప్పుము" అని త్వరపెట్టిరి. రాజు మనస్సు ’భోజనం కావాలందామా! ఇటువంటి అపురూప సౌందర్యవతి చేజారును. వివాహమే కోరుకుందామా ఆకలికి తట్టుకొనలేకపోవుచుండెను’ అని తబ్బిబ్బులు పడులతున్నది. చివరకు పట్టువిడువక కళ్యాణమే కావాలని తేల్చి చెప్పెను.
వివాహమే కావాలని చెప్పిన విష్ణువర్దునుడు ఇలా చెప్పెను.
"నేను ఆహారము స్వీకరించను, మీ ఆచార ప్రకారం వివాహమే చేయండి. నేను సతీసమేతంగా రాజమహేంద్రికి
చేరెదను" అనగా ఆర్యవైశ్యబిడ్డలు "ఓ చంద్రవంశాధీశా! మేము పెద్దలతో మరియు
పురోహితులతో నీ వివాహ విషయం సంప్రదించి ముహూర్తం అడూగగా వారు విష్ణువర్థనుడు ’వి’
అనియూ, వాసవి ’వా’ అనే రెండు పదాలకు ప్రారంబమున ’వ’ కారము
వచ్చియున్నది కనుక ఇరువురూ వృషభరాశిలోనున్నారనీ, ఇలా రాశులు
ఒకటి అయితే ఇది పవిత్ర మార్గశిరమాసం గనుక వధూవరులకు ఈ మాసమున లగ్నములు లేవనిరి.
తదుపరి పుష్యమాసము తప్పించి మాఘమాసమందు అష్టమి మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు
ముహూర్తమున్నదని చెప్పిరి. కనుక పురోహితుల ఆనతి ప్రకారం నీకు తప్పకుండా ’పెళ్ళి’
చేస్తాము. నీవిపుడు బయల్దేరి రాజమండ్రి వెళ్ళుము. మాఘ శుద్ద అష్టమి రోజు
రాగలవు" అని నమ్మించెను. పెళ్ళిచేస్తారనే ఆశతో మహారాజు తన సైన్యము, చతురంగ బలము, మహామంత్రులతో బయల్దేరి రాజమహేంద్రికి
చేరెను. యువజనులు వచ్చి కుసుమశ్రేష్టితో జరిగిన వృత్తాంత మంతయూ జెప్పిరి.
Sri Vasavi Kanyaka Parameswari Devi 5
0 Comments