Sri Vasavi Kanyaka Parameswari Devi 3 

 శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము

Sri Vasavi Kanyaka Parameswari Devi 3 - శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము

Sri Vasavi Kanyaka Parameswari Devi 3 

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము


ధర్మనందన(సమాధిగుప్త) చరిత్ర

పూర్వం ఉత్తర భారతదేశంలోని పవిత్ర నర్మదా నదీ తీరంలో ప్రతిష్ఠానం అనే ఊరు ఉండేది. అక్కడ ధర్మగుప్తుడు (చూడమణి) అనే వైశ్యుడు నివసించేవాడు. కాలప్రభావములో ఇతనికి యవ్వన ప్రాయమం రాగా బందుగణము అంతయూ సంప్రదించి మహా పతివత్రా శిరోమణియగు  దుర్గమాంబ యను కన్యారత్నముతో వివాహము జరిపించిరి. పూణ్యదంపతుల వివాహమై చాలా కాలము గడిచిన సంతానము కలగలేదు. మహర్షి గణమతయూపుత్రకామేష్టియాగము చేయుడని బోధించెను. దంపతులు నిద్రాహారములు మాని మండలము రోజులు సంతాన నిమిత్తార్థమైపుత్రకామేష్టియాగమును నిర్విహించినారు.వీరి కఠోరదీక్షకు ఆనందిచిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వీరికి మగబిడ్డను ప్రాసాదించేను.

శిశువునామకరణంకార్యాక్రమమునకు విచ్చేసిన ప్రభాత మహర్షిని ఆర్యవైశ్య దంపతులు గౌరవించగా, బిడ్డను తీసుకొనిన మహర్షి, శిశువు భవిష్యత్తును దివ్యదృష్టితో గాంచగా, ధర్మమునకు ప్రతిరూపంగా ఉన్నందునధర్మనందనుడుఅను నామకరణము చేసెను. శిశువు ఆరవ సంవత్సరమున అక్షరాభ్యాసమునకు గురుకుల ప్రవేశం చేసెను. ప్రభాతమహర్షి ధర్మనందనునికి చతుర్వేదములను-ఉపనిషతులను రజోచితములై యుద్ద విద్యలను సశాస్త్రీయముగా బోధించెను. ధర్మనందునుడు అని విద్యలను ఏకసంధాగ్రాహిగా గ్రహించెను. ఇంకనూ పరవిద్యయగు శాస్త్రములో ప్రవేశించి పూరకము, రేచకము, శూన్యకము అను యెగ రహస్యములను గ్రహించియెగ సమాధిస్థితిని పొందుచున్న ధర్మనందనుని, ప్రజలందరూసమాధిగుప్తయను పవిత్రమైన బిరుదునొసంగిరి

            నాటి సాంప్రదాయం ప్రకారం ధర్మనందనుడు నిత్యం గురువు గారి పూజ కోసం పువ్వులు, హోమానికి సమిథలు, దర్భలు, ఆహారానికై పళ్ళు, కందమూలాలు మెదలైనవి అడవి నించి తెచ్చి ఇచ్చి గురువు సేవ చేస్తూండేవాడు. ఉభయ సంధ్యలలో అగ్నిహోత్ర కార్యానికి గురువుకు సహాయం చేస్తూండేవాడు.

            గురుకులములో ఉన్నప్పుడు ఒకరోజు యజ్ఞ సమిధలు సేకరించుటకై అరణ్యమునకు వెళ్ళిన ధర్మనందుడు ఒక మహర్షి ఆర్తనాదములు వినిపించెను. వెళ్ళి చూడగా ఒక రాక్షసుడు, ఆంగీరసుడను మహర్షిని, దేవికి బలిచ్చుటకై పగ్గములతో బంధించి లాక్కుపోవడం కనిపించింది.

"ఇతన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావుఅని ధర్మనందనుడు కిరాతకుదికి అడ్డు వెళ్ళి అడిగాడు

"ఇతని పేరు అంగీరసుడు. వింధ్య పర్వతాల్లోని కాళికా దేవికి, సంవత్సరానికి సారి మగవాడ్ని బలి ఇవ్వడం మా కుల ధర్మం. అందుకని ఇతన్ని తీసుకెళ్తున్నాను. కాబట్టి నువ్వు కల్పించుకోకు." కిరాతకుడు చెప్పాడు.

" బ్రాహ్మణుడ్ని విడిచిపెట్టు. నువ్వు కోరిన ధనాన్ని ఇస్తాను. " ధర్మనందనుడు ఆశ చూపాడు.

"నాకు ధనం అవసరం లేదు" కిరాతకుడు నిరాకరించాడు.

"అలా అయితే, ఇతన్ని విడచిపెట్టి, బదులుగా బలికి నన్ను తీసుకెళ్ళు." ధర్మనందనుడు కోరాడు.

"నీకు ప్రాణాల మీద తీపి లేదా?" కిరాతకుడు ఆశ్చర్యంగ అడిగాడు

"నీకు ప్రాణాల మీద కన్నా ధర్మం మీద ప్రీతి ఎక్కువ."

కిరాతకుడు అంగీరసుడ్నీ వదిలి పెట్టి ధర్మనందనుడ్నీ తన వెంట బలి కోసం తీసుకెళ్లసాగాడు. అంత రాక్షసుడు బాలుని పగ్గములతో బంధించి క్రూరముగా హింసించుచూ ఈడ్చుకొనొ పోవుచుండ, సమాధిగుప్త శరీర శరీర మమ్టయూ రక్తసిక్తములై అస్థకులు కనిపించసాగెను. విధముగా వెళ్ళుచున్న కీరాతకునకు గుర్రముల శబ్దము వినిపించెను.

ఒక మహారాజెవరో వచ్చుచున్నాడని తలంచి, స్పృహ తప్పిన బాలుని ఒక గుహలో దాచిపెట్టి దానికి అడ్డుగా పాషాణమును (పెద్ద రాయి) ఉంచి వృక్షము పైన ఎక్కి దాగుకొనెను. గుహలో ధర్మనందనుడు అష్టాక్షర మహా మంత్రాని ధ్యానించసాగాడు.

            అచ్చటకు మగధదేశాధిపతియైన రుక్మాంగదుడు అను మహారాజు అడవి అంతా తిరిగి వేటాడాక అలసట తీరడానికి కొలనులో స్నానం చేసి, భోజనం చేసి తన సైన్యపరివారముతో వచ్చి మధ్యాహ్న సమయమున రాక్షసుడు దాగుకొనిన వృక్షముక్రింద విశ్రమించెను. ఆయనకి పైన చెట్టు మీద దాక్కున్న కిరాతకుడు కాలు ఆకులు చాటు నించి కనిపించింది. అతన్ని అదిలించగా కిందకి దిగాడు. కిరాతకులు కులధర్మంగా నరబలి ఇవ్వడం గురించి మగధ రాజుకు తెలుసు. దాంతో వెంటనే సైన్య్కుడ్ని పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు"వీడు ఆడవిలో చెట్టు మీద ఎందుకు దాక్కున్నాడో? ఇతని వల్ల ఎందరో బాటసారులు మరణించారో? కాబట్టి వీడిని చంపండి."

కిరారకుడు వారి మీద తిరగబడి ఆత్మరక్షణగా బాణాలని, శూలాలని, కత్తులని,గండ్రగొడ్డళ్ళని, ’ముసుండిఅనే ఆయుధాన్ని ప్రయెగించాడు. చివరికి మగధ రాజు విడిచిన బాణం గుండెలో తగిలి కిరాతకుడు మరణించాడు. కిరాతకుడు గుహలో దాచిన ధర్మనందనుడి గురించి తెలియని మగధ రాజు తిరిగి సైన్యంతో తన పట్టణానికి వెళ్ళిపోయాడు

గురుకులమున శిష్యుని కొరకు ప్రభాత ముని సమాధిగుప్త తల్లితండ్రులు దుర్గమాంబ, ధర్మగుప్తులు కుమారునికొరకు ఆశ్రమమునకు వచ్చి వెదకిరి. విషయము గ్రహించినవారై "పరమాత్మ నొసగిన ధర్మనందుడు లేని జీవితము ఎందులకు?" అని వైరాగ్యముతో ఆత్మార్పణ చేయబూనగా సప్తమహర్షులు ప్రత్యక్షమయ్యిరి. వారు వృతాంతమంతయూ దివ్యదృష్టితో గాంచి దంపతులతో "నీ బాలుడు క్షేమముగానున్నాడు, దుఃఖించవలదు" అని బోధించి వారి ప్రాయెపవేశమును విరమింపజేసిరి.

ధర్మనందనునకు ఆదిశేషుడిచ్చిన రెండు వరములు

కొద్ది కాలానికి కస్యప ప్రజాపతి ద్వితీయ భార్య కద్రువకు జన్మించి, పరమేశ్వర మేనుపై ఉన్న వాసుకి యను సర్పము తన అన్నగారైన ఆదిశేషుని దర్శించు నిమిత్తార్థముమై శివుని ఆజ్ఞతో కైలాసము నుండి బయలు దేరి భూలోకము మీదుగా పాతాళమునకు వెళ్ళుచుండెను. తన గుహకి అడ్డుగ ఉన్న పాషాణమును తన శక్తితో ఛేదించెను. బిలములో ఘోరతపస్సు చేయుచున్న ధర్మనందునుని శరీరము నుండి "యెగాగ్ని" ప్రజ్వరిల్లుట చూసి బాలుడి కఠిన దీక్షకు వాసుకి పరమాశ్చర్యమును చెందెను.

"నువ్వు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?" అతని దగ్గరకి వెళ్ళి ప్రశ్నించాడు.

ధర్మనందనుడు వాసుకికి నమస్కరించి తన వివరాలన్నీ తెలియచేసాడు.

ఆ తరువాత వాసుకి జరిగిన వృతాంతమంతయూ అన్నగారైన ఆదిశేషునికి చెప్పెను.

నిష్టాగరిష్టుడైన ధర్మనందనుని- వాసుకి ద్వారా నాగలోకమునకు తీసుకెళ్ళాడు. ధర్మనందనుడు ఆదిశేషునికి భక్తితో నమస్కరించెను. ఆనందముతో ఆదిశేషుడు

"ఆర్యవైశ్య బాలుని త్యాగబుద్దికి, వేదాన్ని అభ్యసించే నీ ఆసక్తికి సంతోషించాను. ఏదైన ఒక వరం కోరుకోమనెను." వెంటనే బాలుడు "ఆదిశక్తిని ప్రార్థించి ప్రసన్నం చేసుకున్నప్పుడు దేవిని నేత్రానందముగా తిలకించుటకు దివ్యశక్తి కలిగిన జ్ఞాననేత్రములు ప్రసాదించుము. స్వామీ!" అని వేదుకొనెను. బాలుని స్వార్థరహితమైన కోరికను ఆనందపడిన ఆదిశేషుడు "తధాస్తు!" అనెను. సమాధిగుప్త వెంటనే పరాశక్తి గురించి మరల తపస్సు ప్రారంభించెను. ఇతని భక్తికి మెచ్చి పరాశక్తి ప్రత్యక్షమాయెను.. అప్పుడ ఆ బాలుడు ఆదిశేషుడొసంగిన దివ్యజ్ఞాన నేత్రములతో తల్లిని గాంచి సాష్టాంగ ప్రణామములాచరించి స్తోత్రించెను. కరుణామూర్తియగు పరమేశ్వరి "సమాధిగుప్తా! నీ కఠిన తప్పస్సుకు మెచ్చితిని! ఏ వరము కావలెనో కోరుకొనుము" అని చిరుదరహాసముతో పలికెను. ధర్మనందనుడు "అమ్మా! జగజ్జననీ! లోకమాతా! నీవు నా కుమారైగా జన్మించాలి. నిన్ను నా కరములతో లాలించి పెంచవలెనని వాంఛగానున్నది" అని ప్రార్థించెను. ఆదిపరాశక్తి "తధాస్తు!" అని వరమివ్వగా "ఎప్పుడు జన్మించెదవు మాతా!" అని బాలుడు అడుగగా "ఇది ధర్మం నాలుగు పాదములు నడచుచున్న కృతయుగము. భవిష్యత్తులో అధర్మం పెరిగి, కలి ప్రభవంతో కామాంధులు, దుర్మార్గులు ప్రబలినప్పుడు కలియుగంలో గోదావరీ నదీతీరములోని నగరేశ్వరపురము (పెనుగొండ) పరిపాలన చేయుచున్న కుసుమశ్రేష్టికి కుమార్తె ’వాసవి’ అనుపేరున జన్మించి కామాంధ నాశనమెనర్చెదను. ఆ కుసుమశ్రేష్టి వేరెవరో కాదు. ధర్మనందనుడవైన నీవే! ఈ అవతారం చాలించిన అనంతరం మెక్శమున సర్వసుఖములు అనుభవించెదవు. ఆ విధముగా కాలానంతరం నీవు బలదేవశ్రేష్టికి కుమారుడుగా కుసుమశ్రేష్ఠి అను పేర జన్మించినప్పుడు నేను నీ కుమారైగా జన్మించెదను" అని వరప్రభావ చరిత్రను బోధించెను. మహదానందము చెందిన సమాధిగుప్తను ఆశీర్వదించి మాత అదృశ్యమాయెను. ఆదిశక్తిని కుమారైగా పొందిన వరప్రభావ విషయాన్ని ఆదిశేషుడు తనదివ్యదృష్టితో తెలుసుకొనినవాడై, మరల వాసుకిని ఆ బిలమునకు పంపించి ధర్మనందనిని పాతాళ లోకమునకు రప్పించుకొని "భక్తవరేణ్యా! ఆర్యవైశ్య శ్రేష్ఠా! పరోపకార స్వభావా! నిస్వార్థపరుడవైన నీ అద్బుతమైన చరిత్ర కొనియాడదగినది. నీ సేవాతత్త్వమును నేను తెలుసుకొనగలిగితిని!

నీ భక్తికి మెచ్చితిని! కనుక రెండవ వరమును ఇచ్చెదను. ఏ వరము కావలెనో కోరుకొనుము?" అని ఆదిశేషుడు పలికెను. "స్థితి కారకుడైన శ్రీ మహావిష్ణువు ఆదిశేష పాన్పుపై పవ్వళించి యుండగా ఆ వైకుంఠములో సర్వదేవతల సన్నిధిలో ’ఆర్యవైశ్యుల భూలోక ప్రవేశము’ అను చరిత్ర మీరు తెలుపగా వినవలెనని నాకు మక్కువగా ఉన్నది" అని వరమడిగెను. సంతోషించిన ఆదిశేషుడు - ధర్మనందనుని వైకుంఠమునకు తీసుకొనివెళ్ళెను. అచ్చట లక్ష్మీ-శ్రీదేవీ-భూదేవీ సమేత మహావిష్ణువును గాంచిన ధర్మనందనుడు భక్తితో నమస్కరించగా దేవతలు ఆశీర్వదించిరి. వెంటనే ఆదిశేషుడు చెప్పసాగెను.

"శ్రీ మహావిష్ణుమూర్తి ప్రప్రధమున కృతయుగమున విశ్వరూపమును ధరించెను. పంచభూతములు, నదీనదంబులు,, నక్షత్రములు, గోళాలు, సూర్య చంద్రులు, జలచరాదులతో భూచరాచర ప్రపంచమంతయూ నిండియున్న ఆ విశ్వరూపమును దేవతళందరూ గాంచి నమస్కరించిరి. శ్రీ విష్ణువు లలాటము నుండి బ్రాహ్మణోత్తములు, బాహువుల నుండి సూర్య-చంద్ర వంశ క్షత్రియులున్నూ, ఊరువులు (తొడలు) నుండి ఆర్యవైశ్యులున్నూ, పాదములనుండి శూద్రులున్నూ జన్మించిరి. ఊరువుల నుండు ప్రభవించిన ఆర్యవైశ్యులకు ’ఆదిసంభుతులు’ అను నమము కలదు.

దక్ష యజ్ఞము

భువిలో దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని చేయ సంకల్పించి శివుని తప్ప దేవతలందరినీ ఆయజ్ఞానికి ఆహ్వానించారు. "లయకర్తయగు" "శివుడు" లేని యజ్ఞమును, శివానుగ్రహం లేని హవిస్సును దేవతలూ స్వీకరించరు. ఇది ఇట్లుడగా శివుని భార్య సతీదేవి తండ్రి పిలవక పోయినను యజ్ఞాన్ని చూడవలెనను మక్కువతో దక్షుని యజ్ఞ వాకిట్కు వచ్చి తండ్రిచే అవమానింప బడి యెగాగ్నిని కల్పించుకొని ఆత్మాహుతి కావించినది. వార్త విన్న ఈశ్వరుడు ప్రళయకాల రుద్రుడై వీరభద్రుడ్ని సృష్టించి పంపాడు. వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ద్వంశం చేశాడు. శివుడు సతీ వియెగాన్ని సహించ లేనివాడై పరిభ్రమిస్తు హిమాలయ పర్వతానికి చేరి అక్కడ యెగనిష్ఠుడయినాడు.

 కాలం గడవ సాగినది. భువిలో జంబరాసురుని తారాకాసురుడు అను రాక్షసుడు ఉద్భవించి ఘోరతపస్సు కావించి బ్రహ్మ వర ప్రసాదితుడై విజృంభించాడు. వైధిక ధర్మకార్యాలను ద్వంసం చేశాడు. వాని ధాటికి దేవతలు పలాయనులైనారు. భువిలో బ్రాహ్మణులు గాయత్రీ భక్త వరుడైన గౌరమ మహర్షి అశ్రమములో ఆశ్రయం పొందారు. రాజులు అడవులలో కొండలలో దాక్కొన్నారు. వైశ్యలు గోభిళమనే గుహలో తల దాచుకొన్నారు. అదృష్ట రాక్షుసుని సంహరించే ఉపాయానికై దేవతలు ఋషులు బ్రహ్మను ఆశ్రయించగా తారాకాసురుని శివకుమరుడు మాత్రమే చంపగలడు అని బ్రహ్మ తెలియజేశాడు. శివుడు సతీ వియెగంతో విరక్తుడైవున్నాడు. ఈశ్వరునికి పరిణయం గావించి పుత్రుణి పొందేలా చేసేందికై దేవతలు పరాశక్తిని ఆశ్రయించారు. పరాశక్తి హిమవంతునికి తన అంశారూపంతో పార్వతిగా జన్మించి పరిణయ వయసురాలు అయినది.

విష్ణుమూర్తి, అగ్రస్త్యమహర్షి, నారమునీంద్రుడు, శుక యెగీంద్రుడు, హయగ్రీవుడు మున్నగువారు శివునకు పార్వతీదేవితో వివాహా రాయబారమునకై కైలాసమునకు వెళ్ళి పార్వతీదేవితో వివాహ రాయబారమునకై కైలాసమునకు వెళ్ళి పార్వతీదేవి గుణగణాలను శివునితో వర్ణించి చెప్పిరి. సుగుణాలరాశి ఉత్తమకన్య పార్వతిదేవి అని విష్ణువు పల్కగా అంతట పరమేశ్వరుడు తానున్నూ ఇటువంటి కన్యక కొరకై ఎదురుచూచుచుంటినని, పార్వతిని చూసు పరీక్షించాలనే తలంపుతో కూతూహలమున వృద్ద బ్రాహ్మణుని రూపమున హిమవత్సర్వత సానువుల యందున్న ఉద్యానవనమున చెలులతో విహరించు చున్న పార్వతి వద్దకు వెళ్ళి శివదూషణ చేసేను. శివదూషణ భరించలేని పార్వతీదేవి తనచెలులతో వృద్ద బ్రాహ్మణుని కట్టివేసి పరాభవించినది. తక్షణము పరమేశ్వరుడు తన నిజ స్వరూపమును దాల్చగా పార్వతీదేవి ఆశ్చర్యానందము పొంది శివునకు పాదాభివందనము చేసి, పూజించి క్షమించమని ప్రార్థించెను.

            జరిగిన వృత్తాంతమంతయూ బ్రహ్మా- విష్ణువులు తెలుసుకొనినవారై సప్త మహర్షులను రావించి, వధూవర పారిచయ కార్యక్రమము పూర్తియినదనీ తెలిపి పార్వతీశ్వర కళ్యాణమునకు ముహూర్తము శెల్విప్పుడని కోరిరి. అంత అగస్త్య మహర్షి కన్యాదాత గారైన హిమవంతుని పిలిపించి, సూర్యుడు మకరరాశియందు సంచరించుచున్నప్పుడు వచ్చు మాఘమాస బహుళపక్ష చతుర్ధశి ( మహాశివరాత్రి) రోజున పార్వతీపరమేశ్వరుల వివాహ లగ్నపత్రిక లిఖించెను. పార్వతి కళ్యాణ మహోత్సవము గురించి 14  లోకములకు శుభలేఖలు వెళ్ళినవి. యక్ష, గరుడ,గంధర్వ, కింపురుష, మానవ, సకలలోక వాసులతో కలసి బ్రహ్మాది దేవతలు అఖిల మహర్షి గణము, నవగ్రహ, అష్టదిక్పాలకులు మెదలైనవారు ఒకరేమిటి? ముప్పదిమూడు కోట్ల దేవతలు సమక్షమున, పరబ్రహ్మ మంత్రాంగముతో, పార్వతి పరమేశ్వరుల కళ్యాణము అంగరంగ వైభవముగా జరిగింది. నూతన దంపతులు ’అరుంధతి’ ని గాంచిరి. ఆ సమయమున ఆనందముతో నందీశ్వరుడు నృత్యము చేసెను. ఆ నాత్యమునకు వీణాపాణి - వేణువును ఊదగా, నారదుడు తన హస్తముననున్న ’మహతి’ వీణను మీటెను. నందీశ్వరుని నాత్యమునకు పరవశుడైన పరమేశ్వరుడు నండీశ్వరుని దీవించెను.

అంత నందీశ్వరుడు పార్వతీదేవిని తప్పించి, పరమేశ్వరునకు మాత్రమే మూడు సార్లు ప్రదక్షిణము చేసెను. శివగనములు, ప్రమధ గణములు, డుండీశ్వర, చండీశ్వరరాది భక్తగణములందరూ పకపక నవ్విరి. మహా కోపోద్రిక్తురాలైన జగదంబ పార్వతీదేవి "ఓరీ నందీశ్వరా౧ నీవు భూలోకమున మానవునిగా జన్మించెదవు గాక!" యని శాపమివ్వగా, మహాతపస్వియగు నందీశ్వరుడు వెంటనే "తల్లీ! నీవు కూడా నాతోపాటు భూలోకమున జన్మించెదవుగాక!" అని ప్రతిశాపమిచ్చెను. వీరిరువురూ వాసవీ - విరూపాక్షులుగా జన్మించెదరు

శివకళ్యాణానంతరం పరమేశ్వరుడు నారద మునీంద్రునితో "నారదమహర్షీ! నా కళ్యాణ సందర్భముగా కైలాసమునకు అరల, విరల, మహాతల మెదలైన 14  లోకముల నుమ్డి భక్తులందరూ వచ్చినారని తలంచితిని. కాని భూలోకము నుండి ఒక్క మానవుడు కూడా రాలేదేమిటి? "యని అడుగగనే నారదుడు "ఓ బోళాశంకరా! సమస్త లోకములను గర్భమున దాల్చిన తమకు ఈ విషయము తెలియుకుండునా! అయిననూ వివరించుటకు ప్రయత్నం చేసెదను. మీరడిగిన విషయమే ఇంతకుముందు శ్రీ మన్నారాయణుడు కూడా నన్ను అడిగెను. నేను భూలోకమునకు వెళ్ళి విచారించగా, నాకు తెలిసిన విషయం అచ్చట క్రయ-విక్రయాదులు నిర్వహించువారు లేక, సస్యశ్యామలమైన పంటలు పండక, భూమంతయూ క్షామపీడతమై ఉన్నది. యజ్ఞయాగాదులు లేవు. దానధర్మములు లేవు. పరోపకారము మచ్చుకైననూ లేక ప్రజలందరూ దుఃఖ పూరితులై ఉండిరి. దరిద్ర దేవత అక్కడ కరాళనృత్యము చేయుచున్నది. అలా ఉండగా ఇంక వివరించెను.

పరమేశ్వరుడు "ఓహో! అలాగైన భూలోకము సుభిక్షముగా ఉండుటకు ప్రపంచం అభివృద్దియగుటకు తరుణోపాయము కూడా నీవే చెప్పగలవు!" అని అడగగానే, నారదుడు "భూలోకమున సరస్వతీ పుత్రులుగా సత్ బ్రాహ్మణోత్తములు జన్మించి, సరస్వతీ కటాక్షముతో ఇతరులకు అసంభవములైన వేదవేదాంగములను అభ్యసించి సుఖముగ ఉండిరి. సూర్యచంద్ర వంశీయులు క్షత్రియులందరూ వీరపుత్రులుగా జన్మించి పరుల నిర్వహించుటకు  వీలులేని సర్వరంజన ప్రజాపాలనతో రాజ్యాధికారము చేపట్టిరి. 714 గోత్ర ఆర్యవైశ్యులందరూ ’లక్ష్మీపుత్రులు- కుబేర సంపన్నులు’ అని బిరుదులు పొంది కోట్లకు పడగలెత్తి, యజ్ఞ-యాగాదులూ, దాన-ధర్మాలను చేయూచూ, క్రయవిక్రయములను నిర్వర్తించుచూ, ధర్మ లాభములను గడించి తదుపరి మహాఘోర తప్పస్సు ద్వారా దేవతలను మెప్పించి, కైలాస వైకుంఠములలో జేరి శివ- కేశవుల సేవ చేయుచుండిరి.

 ఏ క్షణము ఆర్యవైశ్యులు భూలోకమునకు విడచి వచ్చిరో అప్పటినుండి వ్యాపారములేక ప్రజలందరూ ఇబ్బందిపడుచుండిరి" అని సవిస్తారముగా తెల్పెను. వెంటనే పరమేశ్వరుడు పరబ్రహ్మను, విష్ణుమూర్తిని పిలిపించి "714 గోత్ర ఆర్యవైశ్యులనందరిని వ్యాపార నిమిత్తార్థమై భూలోకమునకు పంపండి. వీరిలో సుప్రసిద్ద గోత్రమాన్యులైన 102 వారిని మాత్రము అగ్నిప్రవేశ రూపేణా మరల వెంటనే మెక్షమునకు తీసుకొనివచ్చు బాధ్యత పార్వతీదేవిది. పరాశక్తి రూపముతో భూలోకమున, ఆర్యవైశ్య గృహమున ’శ్రీవాసవీ’ యను నామముతో జన్మించి అగ్నిముఖముగా కైలాసమునకు యధాప్రకారముగా ప్రవేశించును. వాసవీ దైవాంశ యని తెలుసుకొని ధైర్యముగా అగ్నిప్రవేశము  చేయు 102  గోత్ర సుప్రసిద్దులు మాత్రమే మెక్షమునకు వచ్చెదరు. ఇది నా ఆజ్ఞ!" స్ని శివుడు పార్వతీదేవికి కూడా బాధ్యత అప్పగించెను. శివుని ఆజ్ఞ ప్రకారముగా పార్వతీదేవి ’కలియుగమున వాసవీదేవిగా జన్మించెదన’ని  పలికి శివునికి నమస్కరించెను.

శివపార్వతుల వల్ల కార్తికేయుడు జన్మించేను. కార్తికేయుడు క్రౌంచ పర్వతంలో దాగుకొన్న తారకాసురుణ్ణి - తన ఏకశూలంతో హతమార్చగా ఆ అసురుని ఆత్మ కైలాసము చేరినది. దేవతలూ, మానవులూ మహాదానందముతో ఉండిరి". ఈ విధముగా ఆదిశేషుడు ధర్మనందనునికి బోధించసాగెను. అంత ధర్మనందనుడు "మహాత్మా! 714  గోత్ర ఆర్యవైశ్యులు కైలాసమునుండి భూలోకమునకు వెళ్ళిన చరిత్ర తెలపండి" అని కోరెను. మరల ఆదిశేషుడు ఈ విధముగా చెప్పుచున్నాడు.

పూర్వము 714 గోత్రఆర్యవైశ్యులందరూ అయెనిజులుగా అగ్నిలో జన్మించి నందున మనస్సున వైరాగ్య భావము ప్రాప్తించి అందరూ బయలుదేరి నైమిశారణ్యమున గల శాలంకాయన మహర్షి వద్దకు వెళ్ళిరి. ఆ ఆశ్రమంలో వచ్చిన వారందరితో కుశల ప్రశ్నలు జరిగిన తదుపరి మహర్షి "ఓ అర్యవైశ్యోత్తములారా! యజ్ఞయాగాదులు చేయుచూ పరోపకార బుద్దితో ఉన్న మీరు మా ఆశ్రమునకేల వచ్చితిరి?" అని ప్రశ్నించి, ఆర్యవైశ్యులందరూముక్తకంఠముతో "మహాబుభావా! మా సోదరులందరము ఎటువంటి కృత్యములు చేసి ఇలా మానవ జన్మ ధరించినాము? ఈ మానవులు పాప ఫలితాన్ని ఆశించరు! పాప కార్యములను ప్రయత్న పూర్వకంగానే చేయుదురు. పుణ్యకార్యాలు ఆచరించరు. కాని పుణ్యఫలితాన్ని మాత్రం ఆశించెదర్. దైవాంశతో అయెనిజులుగా జన్మించిన మేము మానవులతో సంచరించలేక పోవుచుంటిమి. పుణ్య కార్యాలకు శ్రేష్ఠమైన  జన్మలు, పాపకార్యాలకు నీచ జన్మలు ప్రాప్తించుచూనే ఉండును కదా! మరి ఈ జన్మలకు అంతమెప్పుడు? దుర్బర సంసార సముద్ర కూపము నుండి మాకు విముక్తి కావలెను. దారుణమైన అజ్ఞానాంధకారములోనున్న మమ్ములను పరమ విజ్ఞాన తేజోవంతముగా చేసి ’జన్మరాహిత్యము’  నకు మార్గము చూపండి. మెక్షానికి వెళ్ళునట్లు సెలవివ్వండ్! మీ వాక్కుతో మా జన్మలు సార్థకములగునట్లు చేయండి స్వామీ!" అని వేడుకొనెను.

శాలంకాయన మహర్షి "ఓ ఆర్యవైశ్య శ్రేష్టులారా! త్రికరణశుద్ది, గర్వరహితము, సత్వగుణ సంపన్నతలతో ఐహిక వాంచలెంచక పరమాత్మ గురించి తపస్సు ప్రారంభించండి. మీకు తప్పక మెక్షప్రవేశము జరుగును!" యని బోధించి 714  గోత్రఆర్యవైశ్యుల నాలుకల అడుగు భాగమున బీజాక్షరములు లిఖించి వైష్ణవు లందరికీ " అష్టాక్షరీ" మంత్రమైన "ఓం నమెనారాయణాయ" అనీ , శైవులందరికీ ’పంచాక్షరీ’ మంత్రమైన "నమః శివాయ" యనీ ఉపదేశించెను. వీరందరూ వెంటనే మెక్షము కొరకు చిత్త శుద్దితో తపస్సు చేయు నిమిత్తార్థమై భీకరారణ్యములకు బయలుదేరి వెళ్ళిరి. కందమూలములను భుజించుచూ కొందరు, జల పానము చేయూచూ మరికొందరు, నిరాహార దీక్షతో  మరికొందరు, మిగిలిన వారు వాయువునే ఆహారంగా స్వీకరించుచూ శివకేశవుల ప్రసన్నముకై వేల సంవత్సరములు కఠినమైన తపస్సు చేసిరి. వీరి తపస్సు నుండి బహిర్ముఖమైన ’యెగాగ్ని’ ప్రజ్వరిల్లి, ప్రపంచమును దహించి వేయసాగెను. అహాఋషీశ్వరులు ప్రళయము సంభవించిన దనుకొనిరి. వారు ఈ విషాన్ని వైకుంఠమునకు  వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో చెప్పగా! ఆర్యవైశ్యుల తపస్సు పరిపూర్ణమైనందున శివ-కేశ్వలిరువురూ ఒకే ఆకారమున ఆర్యవైశ్యుల ఎదుట ప్రత్యక్షమయ్యిరి.

మహదానందముతో ఆర్యవైశ్యఋషులందరూ స్తోత్రములు జేసిరి. శివ కేశవులు వీరి భక్తికి మెచ్చి "మీకు ఏమి వరము కావెలెను" అని అడిగిరి. అంత ఋషులు "అస్థిరమైన సంసారము వలదు. మాకు పరమాత్మ సన్నిధానము గావలెను. జన్మరాహిత్యము కొరకే ఘోరతపస్సు జేసితిమి మహానుభావులారా!" అని కోరికను తెలిపిరి. సంతసించిన శివకేశవులు "ఓ ఆర్యవైశ్య ఋషులారా! మీకు మెక్షమిచ్చు శక్తి వున్ననూ, సృష్టి కారకుడైన పరబ్రహ్మ లిఖితమైన మానవగతులను తప్పించుటకు ఎవరికీ అధికారము లేదు. గాన మిమ్ములనందరినీ సత్యలోక ప్రవేశం చేసెదము" అని పలికి, శివ విమానములు విష్ణు విమానములలో 714 గోత్ర ఆర్యవైశ్య ఋషులందరినీ సత్యలోక ప్రవేశం చేసెదము" అని పలికి, శివ విమానములు విష్ణు విమానములలో 714  గోత్ర ఆర్యవైశ్య ఋషులందరినీ సత్యలోక ప్రవేశం చేయించగా వారు దేవమాన ప్రకారము సత్యలోకములోని వాణీ బ్రహ్మల వద్ద విజ్ఞాన రహస్యమును నేర్చుకొని జ్ఞానవంతులైరి. 612 గోత్రీకులకు సత్యలోకార్హతకు తపస్సు తగ్గినందున 102 గోత్ర ఋషులు మాత్రమే బ్రహ్మను గాంచిరి. 612 గోత్రీకులు మరల తపస్సు ప్రారంభించి అర్హత పొందినవారై 102 గోత్రీకులలో ఏకమైరి. అంత బ్రహ్మ సమస్త దేవగణము ఆహ్వానించగా వారందరూ విచ్చేసిరి.

            బ్రహ్మలోకమునకు వేంచేసిన వారిలో, శివకేశవులు, సూర్యచంద్రులు, పంచభూతములు,పత్నీ సమేత అష్టదిక్పాలురు, సప్తమాతృకలు, అష్టదుర్గలు, అష్టవసువులు ఒకప్రక్క ఆసీనమవగా, మరోప్రక్క అర్బుదసంఖ్యలో మహర్షులు, ఏకాదశ రుద్రులు,ద్వాదశాదిత్యులు, బ్రహ్మ పుత్రులయిన, నారద, మయ, సనత్కుమారులున్నూ, బ్రహ్మతో సమానులగు నవబ్రహ్మలు, నవగ్రహములు, సమస్త ప్రజాపతులు, చరుర్దశ మనువులు విచ్చేసిరి. వేరొకప్రక్క చాతుర్వర్ణములైన మానవులు కూడా విచ్చేసిరి. ఆ దేవతల సమక్షమున బ్రహ్మదేవుడు అధ్యక్షత వహించి చాతుర్వర్ణముల వారినుద్దేశించి "ఓ బిడ్డలారా! కొన్ని వేల సంవత్సరముల నుండి కఠోర తపస్సుజేసి పరిపూర్ణత చెందిన ఆర్యవైశ్య ఋషులను శివకేశవులు మా లోకమునకు తీసుకు వచ్చిరి. బహుదేవతల సమక్షములో చాతుర్వర్ణముల వారైన మీరందరి గోత్రములు గణములూ తెలిపిన యెడల, మీలో గోత్ర గణాలను తపస్సు ద్వారా అభివృద్ది జేసుకొనిన వారికి అగ్రతాంబూలమిచ్చి గౌరవించి ఆ వర్ణస్థుల మెక్ష నివాసులుగా జేయుబడుదురు. కనుక మీ గోత్రములు తెల్పుము అనేను. 84లక్షల జీవరాసులలోని చాతుర్వర్ణముల వారిని సృష్టించిన పరబ్రహ్మకు వారి గోత్రములు తెలియకనా?! ఆయా వర్ణస్థుల గోత్రములు సమస్త దేవతలకు, ఋషులకు తెలియజేయుటకై అలా ప్రస్నించెను. అష్టాదశ గణములతో నూట తొమ్మిది గోత్రములు బ్రాహ్మణులుకు ఉన్నాయణి దూర్వాసుడు తెలుపగా, ఒక్క గణముతో ఏడు గోత్రములు, సూర్య-చంద్ర వంశస్థులైన క్షత్రియులకు ఉన్నాయని ధనంజయ మహారాజు తెలియపరచెను.  త్రైవర్ణికులైన ఆర్యవైశ్యులకు ఏడువందల పదునాలుగు గణములతో ,ఏడువందల పదునాలగు గోత్రములు గలవని, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు ధర్మనందనుడు భోధించెను. శూద్రులకు ఒక గణముతో ఐదు గోత్రములు ప్రసిద్దములైయున్నవని దండి యను భక్తుడు తెల్పెను.

గోత్రగణములను తపస్సు ద్వారా అభివృద్ది పరచిన ఆర్యవైశ్యులకు దేవతా సమక్షమున, పరబ్రహ్మ అగ్రతాంబూలము నొసంగెను. ఆర్యవైశ్యాధ్యక్షుడగు ధర్మనందునునకు సన్మానము కూడా జేసిరి. ఆ విధముగా కరతాళ ధ్వనులతో దేవతలందరూ ఆమెదము తెలుబరిచిరి.

            అంతలో ఒక చిత్రము జరిగెను. ’దేవతా సమక్షమున, మిగతా మూడు వర్ణముల వారికీ అభించని, అగ్రతాంబూల సన్మానాదులను, పరబ్రహ్మ మాకు మాత్రమే ఇచ్చెను’ అని ఆరువందల పదిరెండు గోత్రీకులు వరగర్వముతో పకపక నవ్విరి. దేవతా సభలో కన్నుమిన్నుగానక గర్వముతో ఉన్న వైశ్యులను, చూచు బ్రాహ్మణ శ్రేష్టుడు, దూర్వాస మహాముని మహాకోపోద్రిక్తుడై "ఓరీ వైశ్యులారా! ఈ సత్యలోకమున మీకు గౌరవము లభించినదని గర్వమదోన్మత్తులై, గర్వాంధకారమున ఆజ్ఞానులై, మమ్ములను పరిహసించుచుంటిరి గాన, ఆర్యవైశ్యులు అందరూ భూలోకమున వెళ్ళదరు గాక" అని మహాశాపము ఇచ్చెను.

                సప్తమహర్షులు దూర్వాసుని శాంతింపజేసిరి. ఈ విషయం 102 గోత్ర ఆర్యవైశ్యఋషులు తెలుసుకొన వారై ’వరగర్విరులైనది మనము కాదు. శాంతముగా ఉన్న మనకీ శాపమేల?’ యనే ఆలోచనతో, శాపనివృత్తికై కైలాసపతియగు పరమేశ్వరుని వేడుకొనిర్. పరమేశ్వరుడు "ఓ భక్తవరేణ్యులరా! వరములు - శాపములు వృధాకావు. ’మీ శరీరమును లోకోపకారానికి ఉపయెగించాలి’ అని శాస్త్రములు ఘోషిస్తున్నాయి. పంచభూతాలు స్వార్థం లేకుండా ప్రజోపకారం జేస్తున్నవి. కనుక మీరు గూడా ఉపకార బుద్దితో భూలోక ప్రవేశము నకు సిద్దముగా ఉండవలెను. ధన ధాన్య సేకరణతో జనులను సంతుష్టి బరచండి. ఫూర్వము నా కళ్యాణమున మిమ్ములను భూలోక ప్రవేశజేయు విషయమై  నారదుడు జెప్పెను. క్రయవిక్రయాదులు లేక భూలోకమంతయూ దుర్బిక్షముతాండ విస్తున్నది. మీరు వెళ్ళి వ్యాపారము ప్రారంభించండి. శాంతస్వభావులు, 102 గోత్రీకులైన మీరు మాత్రమే అగ్ని ప్రవేశము జేసి తదుపరి మెక్ష ప్రవేశమయ్యెదరు. తథాస్తు! అని అనేను.

            అచ్చటకు వేంచేసిన కుబేరుడు 102 గోత్ర ఆర్యవైశ్య ఋషులను జూసి, "సత్యలోక నివాసియగు పరబ్రహ్మకు మీ శాపనివృత్తి జేయుడని తెలుపండి" అని తెలిపెను. కుబేరాజ్ఞానుసారము సత్యలోకమునకు వెళ్ళి సరస్వతీనాధుని శాపనివృత్తి చేయమని ప్రార్థించిన ఆర్యవైశ్యులతో పరబ్రహ్మ " ఆర్యవైశ్యులారా! దేవతల కన్నా గొప్పవారు మహాఋషీశ్వరులు. అటువంటి ఋషీశ్వరులలో గొప్పవాడు దూర్వాసుడు. కనుక ఈ శాపవిముక్తి కొరకు, సకలలోక రక్షకుడూ, స్థితి కారకుడూ, సర్వాధ్యక్షుడూ అయిన శ్రీ మహావిష్ణుమూర్తిని వైకుంఠమున వెళ్ళి విన్నవించిన ఎడల శాపనివృత్తి జేయవచ్చును" అని బోధించెను.

            బ్రహ్మా ఆజ్ఞానుసారము ఆర్య వైశ్య ఋషులు వైకుంఠ ప్రవేశము జేసి శ్రీ మహావిష్ణువుతో "లక్ష్మీనాధా! ఆర్తత్రాణ పరాయణా! గరుడవాహనా! అపరాధ హీనులమైన మమ్ములను భూమికి వెళ్ళవలెనని దూర్వాసుడు శాపమిచ్చెను. ఈ ఊర్ద్వలోకములను విడిచి భూలోకమున వెళ్ళలేము? శాపవిముక్తికి జేయు ప్రార్థన!" అని ప్రార్థించిరి. విష్ణుమూర్తి " ఓ ఆర్యవైశ్యులారా! ఇంతకు పూర్వము దూర్వాస మహర్షి నాకున్నూ శాపమిచ్చెను. ఆశాప ప్రకారమే నేను మత్స్య, కూర్మ, వరహ, నరసింహ,వామన,ప్రుశురామ, శ్రీరాము, బలరాము, కృష్ణ, బుద్ద మెదలైన దశావతారములు ధరించితిని. ఈశ్వరుడన్నట్లు శాపాలు, వరాలు లోకసంక్షేమానికే జరుగును. దశవతారములో నేను కొన్నివేల మంది రాక్షసులను అంతమెందించితిని. ఆవిధమిగా మానవులందరూ సుఖముగా ఉండిరి. ఈ చరిత్ర జరుగుటకు కారణ ఆ దూర్వాస మహాముని శాపకారణమే కదా! కనుక అతడించిన శాపము వృధాకాదు. అంతియే గాక ఆ శాపవిముక్తి జేయు అధికారముగాన్, సక్తిగానీ, ఎవరికి లేదు. మెక్షాపేక్షతో మీరు ఇక్కడే నివసించిన ఎడల ప్రపంచము ఏవిధముగా వర్దుల్లును? వ్యవసాయం, గోరక్ష్యం, వాణిజ్యము మీరుకాక ఎవరు చేయుదురు? ప్రపంచానికి మీరు చేయబోవు సేవ వృధాకాదు. ప్రతిక్షణములో మీవెన్నంటి, మిమ్మలను రక్షించుచూనే ఉండెదను. ధర్మమే మిమ్మలను కాపాడును. భూలోకమునకు ప్రయాణించండి. శుభం!" యని బోధించెను.

ఈ విషయములన్నియీ మరల శూలపాణి మిత్రుడు, అర్యవైశ్యుడగు కుబేరునితో ఆర్యవైశ్య ఋషులు తెలుపగా! కుబేరుడు వెంటనే " ఓ బిడ్డలారా! నిరాశ చెందకుడు! ఈ త్రిమూర్తులు కూడా శాపవిముక్తి చేయు అధికారం లేదని చెప్పెను. మీకు ఇప్పుడు ఆదిపరాశక్తియే శరణ్యము సమతలోకములను, భూచరాచర ప్రపంచమును, సర్వదేవతలను, 84 లక్షల జీవరాసులను, పిండాండము నుండి బ్రహ్మాండము వరకూ సృష్టించి గర్భమున దాల్చిన అమ్మలగన్నయమ్మ ఆదిపరాశక్తి. ఆమె బోధించిన రీతిలో దేవతలు, త్రిమూర్తులు తమతమ భాద్యతలు, నెరవేర్చెదరు. ఓంకార స్వరూపమైన అమ్మకు మీ వృత్తాంతమంతయూ తెలియ పరచండి. ఆమె చల్లని వాకులతో మీ అబీష్టము తప్ప నెరవేర్చగలదు. శుభం!" అని తెలియబరచెను. ఆర్యవైశ్య ఋషులందరూ సర్వలోకపాలిని యగు ఆదిశక్తిని త్రికరణశుద్ది స్తోత్రించి ప్రసన్నం చేసుకొనిరి.

714 గోత్ర ఆర్యవైశ్యులు పరాశక్తిని గూర్చి స్తుతించినదండకము

పరాశక్తికి దేవతలందరూ ప్రణమిల్లిరి. సాష్టాంగ నమస్కారము చేసిన ఆర్యవైశ్యుల భక్తికి మెచ్చిన అంబ "ఓ బిడ్డలారా! మీ మనోవాంచ తెలుపుము" అని జెప్పెను. మహదానంద భరితులైన ఆర్యవైశ్య ఋషిగణము జరిగిన వృత్తాంతమంతయూ దెలిపెను. "ఓ తల్లీ! భూచరాచర ప్రపంచమును సృష్టించిన నిన్నూ, త్రిమూర్తులనూ, దర్శించిన ఈ నేత్రములతో మానవ జన్మ ధరించి మానవులను చూచుటెట్లు? త్రిలోకములూ సంచరించిన పాదములతో భూలోకమున తిరగటమా?! మెక్షము లభ్యమగు అమృతమును పానముగ్రోలిన ఈ శరీరము భూలోకమునకు వెళ్ళి ఆహారము తినుటయా?! అటువంటి నీచనయిన మానవ జన్మలో మేము ప్రవేశించము" అని విన్నవించిరి. 

భక్తులకు, ధర్మనందునకు జగజ్జనని " ఓ బిడ్డలారా! దుఃఖము చెందచద్దు!మీ బాధలను నేను  గ్రహించితిని. భూలోకమున నేను లేనని మీ సందేహమైతే పరాశక్తినైన నేను పార్వతీ అంశతో మీ ఆర్యవైశ్యకులమున మీ కుమార్తెగా జన్మించెదను.’వాసా’ వారింట, ’వాసవశ్రేష్టి’కి ’వాసుదేవు’ని సోదరియైన  నేను ’వాసవీ’ దేవిగా జన్మించి, మీలో ప్రసిద్ద గోత్రము లైన 102 గోత్ర ఆర్యవైశ్య దంపతులను నాతో పాటు ఎటువంటి శరీర బాధలేకుండా అగ్ని ప్రవేశము జేయించి , మరల మెక్షానికి తీసుకొని వచ్చు బాధ్యత నేనే వహించెదను. నా పలుకులను విస్మరించవలదు. నను నమ్మిన నా భక్తులైన మీతో ఏకముగా సంచరించి ప్రతిక్షణము మిమ్ములను రక్షించెదను. అష్టై శ్వర్యముతో భూలోకమున వర్ధిల్లగలరు. త్వరితముగా బయ్లు దేరుడు" అని వరమిచ్చెను. ’ఏ వర్ణమువారికి లభించని పరాశ్క్తిని కుమార్తెగా స్వీకరించు వరము’ ఆర్యవైశ్య ఋషులకు లభించని పరాశక్తిని కుమార్తెగా స్వీకరించు వరము ’ ఆర్యవైశ్య ఋషులకు లభించని గదా! యని ఆర్యవైశ్య ఋషులు పరమానందమాధవముగా భూలోక ప్రవేశం చేయుటకు సమ్మతించిరి. వీరి కృతజ్ఞతకు మెచ్చిన అమ్మవారు 714 గోత్రకులందరికఇ వ్యాపార సాధనముకై వ్యాపార వస్తు సామాగ్రిని ఆమె తప్పశక్తి ప్రభావముతో సృష్టించి ఇచ్చెను.

ఆర్యవైశ్య ఋషులతో "బిడ్దలారా! ఈ వ్యాపార సాధనములతో , వాణిజ్యము ప్రారంభించండి! గోవుల కొరకు గోశాలలను నిర్మించి, గోవు ద్వార లభ్యమైన పాలు, పెరుగు, వెన్న, మీగడ, నెయ్యి మెదలైన వన్నీ సేకరించి మేధస్సు పెంపొందించుకొని సంచరించండి. నాగలితో భూమిని దున్ని బంగారంలాంటి వ్యాపారము జేయండి. అలా ఆచరించిన వారికి అనంతమైన లాభములను నేను చేకూర్చగలను" అని బోదించి గరుడ వాహనుడైన, లక్ష్మీనాధుని ఆదిశక్తి పిలిచెను. వేంచేసిన శ్రీ విష్ణువు "అమ్మా నమస్కారము" అని భక్తితో ప్రణమిల్లెను. ఆదిశక్తి వెంటనే "ఓ స్థితికారకా! నా భక్తులైన 714  గోత్ర ఆర్యవైశ్య ఋషులందరూ నన్ను ధ్యానించి కుమార్తెగా జన్మించు వరమును ఇచ్చిన్నాను. ఈరందరినీ భూలోకమున పవిత్ర పశ్చిమ గోదావరీ నదీ తీరమునకు తీసుకొని వెళ్ళి, అక్కడ విడచి వచ్చు బాధ్యత నీపై ఉన్నది. ఆ ఆజ్ఞను శిరసా వహించెదవు గాక!" అని ఆదేశించెను. దేవితో శ్రీధరుడు "మహాప్రసాదము! ఈ పవిత్ర కార్యమును నేను చేయుటకు అవకాశము వచ్చినందుకు ధన్యుడనైతిని" యని బాధ్యత స్వీకరించెను. అంత ఆదిపరాశక్తి భక్తులందరినీ ఆశీర్వదించి అదృశ్యమాయెను.

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము 2