Sri Vasavi Kanyaka Parameswari Devi 7
శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము
Sri Vasavi Kanyaka Parameswari Devi 7
శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము |
714 గోత్ర ఆర్యవైశ్య మహాసభ:
విష్ణువర్ధనరాజు పెనుగొండ విడిచిన మరునాడు అష్టదశ నగర
ఆర్యవైశ్యులందరూ పెనుగొండ మహాసభకు విచ్చేయాలని అధ్యక్షుడు కుసుమగుప్త కబురు
పంపెను. కొందరికి ప్రత్యేక లేఖలను గూడా పంపెను. ఈ వార్త తెలిసిన 102 ప్రవరాదులలో
(1) ఏకార్షేయ 77, (2) ద్వార్షేయ 17, (3) త్ర్యార్షేయ 6, (4) చతురార్షేయ (5) పంచార్షేయ
(6) సప్తార్షేయ, (7)
దశార్షేయులు ప్రసిద్దములు. వీటి అన్నిటితో కలిసి 714 గోత్రాలకు చెందినవారు.
లక్షలాది జనసందోహము పెనుగొండ రాజదర్బారుకు విచ్చేసిరి. మహామంత్రి సమేతంగా అధ్యక్షత
వహించిన కుసుమగుప్త, సమస్యను ఆర్యవైశ్యులందరికీ ఈ విధముగా
వివరించెను. "సభలోనున్న ఆర్యవైశ్యసోదరులారా! రాజమహేంద్రిని పరిపాలన చేయు
విష్ణువర్ధన మహారాజు నా కుతురగు వాసవిని జూసి మెహించెను. శంభుని చిత్తమును
మెహింపజేసిన ఆమెను పెళ్ళాడెదనని వర్తమానముగూడా పంపెను. యువజనులు రాజుకు
గడువుపెట్టి మాఘమాసంలో పెళ్ళిచేస్తామని వాగ్దానము చేసిరి. అతడు గడువు తీరగనే
వివాహమునకై తప్పక వచ్చును. రాజునకు వాసవినిచ్చి పెళ్లి చేసెదమా? చేయవద్దా? అనే విషయం ఆమెదం గురించి మిమ్ములనందరినీ
రావించడమైనది. మీ మీ అంగీకారములు తెలుప వెలెను" అని చెప్పెను.
అంగీకార, అనంగీకారములు:-
కుసుమగుప్త పెద్దబావగారు, ఆచంటగ్రామ నివాసియగు పరిమిగుప్త లేచి
సభనుద్దేశించి "18 నగరాల ఆర్యవైశ్యులందరూ ఇచ్చే తీర్పు కుల ధర్మము ననుసరించి
వుండాలి. స్వార్థరహితమైన మీ అంగీకారమే కుసుమరాజా గారి తొలి అడుగు. మీమీ అమెదములను ఆచరణలో వుంచుటయే మాధ్యేయం" అని చెప్పెను. సభయందు కొంతసేపు చర్చ జరిగినది. మధుశ్రేష్టి అనే ఆర్యవైశ్యోత్తముడు సభయందు కొంతసేపు చర్చ జరిగినది. మధుశ్రేష్టి అనే ఆర్యవైశ్యోత్తముడు సభయందు కొంతసేపు చర్చ జరిగినది. మధుశ్రేష్టి అనే ఆర్యవైశ్యోత్తముడు సభయందు లేచెను. "విష్ణువర్దనుడు చంద్ర వంశాధీశుడు. అంతియేకాక చక్రవర్తిగూడా. అంతటి ధీరోదాత్తుడు ఆర్యవైశ్యులకు అల్లుడుగుచున్నాడంటే మనక దృష్టమే కదా! మనం ఏ రాజ్యం సంచరించినా ఆయా సామంతరాజులు మన ఆధీనములో వుందురు. ఈ వివాహం చేయుట అన్ని విధాలా మంచిది" అని చెప్పెను.
తదుపరి కామేశ్వరగుప్త అను యువజనుడు లేచి "శ్రీ
వాసవీకన్యక దేవదేవుడైన నగరేశ్వరుని అర్దాంగి కదా! మహారాజు కామంతో, కండకావరంతో, దురహంకారముతో
మన ఆడపడుచును కోరెను. ఇదై ధర్మవిరుద్దము కదా! న్యాయసమ్మతము కాదు. నిజంగా రాజుకు
వివహమే ముఖ్యమైతే రాజమండ్రిలో రాచకన్యలు వేలమంది కలరు. రాజుతో చెలిమి చేసి ధనము,
గౌరవము సంపాదించుట కన్నా చావటము మేలు. మహారాజుతో సంబంధము ఎంత
గౌరప్రదమైననూ దానిని తృణప్రాయముగా ఎంచవలెనేకాని రాజుకు భయపడి బంధుత్వమాసించుటకు
మేము సమ్మతించము" అని చెప్పెను. సభయందు వాదోపవాదములు ప్రారంబమైనవి. ఆ సభకు
గురుభాస్కరాచార్యులు విచ్చేసెను. భాస్కరాచార్యుడు "ఓ ఆర్యవైశ్యోత్తములారా!
మహాసభలో వాదోపవాదములు చేయుట మంచిది కాదు. ఆర్యవైశ్యులు మెత్తం ఒకే
మార్గముననుసరించవలె నంతేకాని వక్రమార్గము తగదు. జీవనోపాధిగా కృషి, గోరక్ష్య, వాణిజ్యాలు, దైవకార్యములుగా
యజ్ఞయాగాదులు, దానధర్మాలు, పరోపకారం
చేయు ఆర్యవైశ్యులు ఈ విధంగా వాదము చేయుట సంస్కారం కాదు. జీవితం అశాశ్వతమైనది జాగరూకతతో సంచరించాలి. పెద్దలు జెప్పిన మీ
కులధర్మాలను మంతగలపకండి" అని చెప్పెను. మరికొందరు వాసవిని రాజుకిచ్చి
వివాహముచేసినా, చేయకపోయినా మాకభ్యంతరం లేదని నిడివిరి.
భాస్కరాచార్యుని ఉపన్యాసం వినిన ఉగ్రులైన కొందరు వైశ్యులు " కుసుమరాజా! ముందు
యువరాణి వాసవిని ఈ సభకు పిలిపించండి. ఒకవేళ ఆమె మనస్సున పెళ్ళి ఉద్దేశ్యం ఉన్నదేమె?
మనం ఇంత వాదోపవాదాలు చేసినా చివరకు వాసవి వివాహమునకు ఒప్పుకుంటే మనం
కాల యాపనచేసినట్లే కదా! అందుకు వాసవిని రప్పించండి" అని పలికిరి. ఆలోచించిన
విరూపాక్షుడు వాసవి చెలికత్తెలను పిలిపించి అంతఃపురంలోని పూజామందిరము నకు వారినిపంపెను.
వాసవీదేవి వినూత్న విధానమును స్థాపించుట:-
వాసవీదేవి నగరేశ్వరునిపై భక్తితో ధ్యానము చేయుచున్నది.
చెలికత్తెలు బంగారు పల్లకిని తీసుకువెళ్ళిరి. వాసవిని ధ్యానము నుండి మేల్కొలిపి
"అమ్మా! యువరాణీ! నీ తండ్రిగారు, అన్నయ్య, భాస్కర గురువు, మహామంత్రి,
714 గోత్ర ప్రముఖులు మన ఆస్థానంలో నీరాక కొరకు
ఎదురుచూచుచున్నారు" అని చెప్పెను. స్వామికి మంగళహారతి ఇచ్చి వాసవి
కళ్లనద్దుకొని పల్లకీ ఎక్కెను. వాసవాంబ రాక కొరకు ఆర్యవైశ్యులు ప్రార్థనలు
చేయుచుండిరి. అధ్యక్ష స్థానము నధిరోహించిన వాసవి ఎంతో ప్రశాంతముతో రహస్యములు
బోధించుట ప్రారంభించెను. " ఓ సోదరులారా! పరాశక్తిరూపిణి అయిన నేను
నిమిత్తమాత్రమున మానవ జన్మ ధరించితిని. కుసుమశ్రేష్ఠి పూర్వజన్మలో సమాధిగుప్త.
అతనికిచ్చిన వరప్రభావమున అతనికి కుమార్తెగా ఉద్భవించాను. విష్ణువర్ధ్న రాజుకున్నూ,
నాకునూ యుగయుగముల నుండి శత్రుత్వం కొనసాగుచున్నది. కామాంధత్వంతో
నన్నుచూసి కామించాడు. ’కామాంధుడిని" నాశనం చేయటం కాదు ముఖ్యం అతనిలోని
’కామాన్ని’ నాశనం చేయాలి.
యుద్దమే తధ్యమైతే రాజుని చంపుట క్షణంకూడ ఎక్కువే నాకు. నేను
నగరేశునర్ధాంగిని. ఈ కలియుగాన నేనుద్భవించిన కారణం ’హింసారహిత వినూత్నరణ విధానము’
స్థాపించుట కొరకే! ఈ అహింస అనే ఆయుధం ద్వారా ఎంతమంది కామాంధులనైననూ జయించవచ్చును.
’కత్తి’తో సాధించనది ’కరుణ’తో సాధించాలి. ’కక్ష’ తో సాధించలేనిది ’క్షమాబిక్ష’తో
సాధించాలి. ఆవేశపడి ప్రయెజనం లేదు. మహారాజుకు శాపమిచ్చి నేనగ్ని ప్రవేశం
చేయుచున్నాను" అని వాసవీదేవి చెప్పెను. కొండరు వెంటనే "నీవు పరాశక్టి
రూపమని చెప్పుచున్నావు మాకు నిదర్శనమేమిటి?"
అని ప్రశ్నించిరి.
రెండవ విశ్వరూప ప్రదర్శన:-
ఆ
సమయమున ఆకాశము
నుండి దిక్కులు పిక్కటిల్లేలా ’ధనధనా’
యను శబ్దము
వచ్చినది. శ్రీ
వాసవీదేవి మహాదేదీప్యమానంగా, కోటి సూర్యల
కాంతితో వెలుగుచుండెను.
ఆమె
శరీరం క్షణక్షణమునకూ పెరగసాగెను.
రెండువేల కరములు,
వెయ్యి శిరములతో,
అమ్మవారు 1000 ముఖములు, రెండువేల నేత్రములు, రెండువేల పారములు,
కోటానుకోట్ల ఆయుధాలతో విశ్వరూపము ప్రదర్శించెను. ఆకాశం శిరస్సుగా
మారిపోయెను. సూర్యచంద్రులు ఆమెకు నేత్రాలు,దిక్కులే చెవులు,
చతుర్వేదాలు ఆమెకు వాక్యాలు, ఉపనిషత్ లు ఆమె
అడుగులు, వాయువే ప్రాణం, ప్రపంచము
మెత్తం ఆమె వాక్యాలు, ఉపనిషత్లు ఆమె అడుగులు, వాయువే ప్రాణం, ప్రపంచము మెత్తం ఆమె హృదయం, భూమి ఆ శక్తికి నడుము, కోటానుకోట్ల నక్షత్రాలన్నీ
ఆమె వక్షస్థలం, మహర్లోక జనోలోక, తపోలోకాలు
దేవికి కంఠము, ఇంద్రాది దేవతలు - బాహువులు, రాత్రి, పగలు- ఆమె కనురెప్పలు, బ్రహ్మలోకం- కనుబొమ్మలు, శబ్దం - స్తోత్రాలు,
మాయ-నవ్వు, స్నేహం - దంతాలు, స్వర్గం - చూపులు, సముద్రాలు - గర్భం, పర్వతాలు - అస్థుకలు, నదులు - నాడులు, వృక్షాలు - కేశములు, బాల్య,యౌవ్వన,
కౌమార, వార్దక్యాలు- గతులు, మేఘాలు-అలికిడి, సంధ్యలు - వస్త్రాలు, చంద్రుడు - మనస్సు, దివ్యమైన ఆభరణములతో, గంధర్వ,యక్ష, గరుడ, కింపురుష, రాక్షస, దేవగణములన్నియూ
"జైవాసవీ" "జైజై ఆదిశక్తీ" అనుచుండ పరమేశ్వరుడు ఆ శక్తిని
అర్థాంగములో చేర్చుకొనెను. వాసవీ నగరేశ్వరులు తేజోవంతమున కనులు మిరుమిట్లు
గొలుపుచుండెను. భక్తాదులు దండాకాలు, పాటలు, జేజేలు, స్తోత్రాలు పఠించుచుండగా కుసుమశ్రేష్ఠి
కుసుమాంబ దంపతులు ఆనందబాష్పములతో ఈ ఆదిపరాశక్తి తమ కుమార్తె అయినందుకు సంతసించిరి.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకికి, నారికేళ, ఫల, పుష్ప కర్పూర నీరాంజనాలిచ్చినంతనే వాసవీమాత
శాంతించి కుమార్తెలా కన్పించెను.
రెండవరోజు మహాసభ:-
మరునాటి దినముని వాసవీదేవిని ఆర్యవైశ్యసోదరులు ఇలా అదిగిరి. "అమ్మా! ఓ
వాసవీ! విష్ణువర్ధనరాజును చతురంగ బలముతో, సైన్యముతో బయల్దేరి వెళ్ళి అతనిని సంహరించెదము! అనుజ్ఞ ఇవ్వుము!"
అనేను. వెంటనే వాసవాంబ "అలా రాజును సంహరించుట ’అహింసా’ మార్గానికే అవరోధము.
కలియుగ ప్రజలకు నా జీవిత సందేశమే ’అహింస’. అగ్నిప్రవేశానికి 3 కారణములు గలవు.
కృతయుగంలో నేను దాక్షాయణిగా వున్నప్పుడు దక్షయజ్ఞంలో అగ్ని ప్రవేశమైనాను.
త్రేతాయుగంలో వేదవతిగానున్నప్పుడు అగ్నిప్రవేశమైనాను. ద్వాపరయుగాన ద్రౌపదిని,
అగ్నిలోనే జన్మించి, మహాప్రస్థానంలో అగ్నిలో
లీనమైనాను.
అదేవిధంగా ఈ కలియుగంలో కూడా
అగ్నిప్రవేశమయ్యెదను. నేను పంచకన్యా స్వరూపిణిని, 714 గోత్ర ఆర్యవైశ్యులు, గోత్రానికి ఒక
వృద్ద దంపతులు మాత్రమే నాతో అగ్నిప్రవేశం చేయవలెను. నాతో ఎవరైతే అగ్నిప్రవేశం
చేస్తారో వారికి మెక్షము లభించును. బాలలు - బాలికలూ అగ్నిప్రవేశానికి అర్హత లేదు.
బాలలు సజీవులుగా వుంటే ఆర్యవైశ్య సంఘం అభివృద్ది అవుతుంది. అగ్నిప్రవేశం చేయు
దంపతులు వైష్ణవులకు వైకుంఠప్రాప్తి, శైవులకు కైలాసప్రాప్తి,
భాస్కరాచార్య అదేశంతో ఉపవాసం ఉండి వీరకంకణము ధరించాలు. శరీరం
అశాశ్వతమైనది, ఆత్మ నిత్యమైనది. ’పుట్టుట ఎందుకనగా! చచ్చుట
కొరకే! చచ్చుట ఎందులకు? పుట్టుట కొరకే!’ ప్రాణమున్నా
లేకున్నా కీర్తి ఆచంద్రార్కం ఉంటుంది" అని రహస్యములు జెప్పెను. వాసవీదేవి
భాస్కరాచార్యునితో ’అగ్నిప్రవేశ ముహూర్తం’ నిర్ణయించుమనెను. గురువుగారు ’మాఘశుద్ద
విదియ’ భానువారం అగ్నిప్రవేశమునకు మంచిరోజు అని తెలియపరచెను.
వెంటనే ఆ సభలో వదోపవాదాలు
మరల ప్రారంభమైనవి. అప్పటివరకూ శాంతముగనుండెను కుసుమశ్రేష్ఠి. వెంటనే "ఓ
ఆర్యవైశ్యశ్రేష్ఠులారా! మనలో మనం వాదములాడుకొనుట సమంజసము కాదు. జీవతము శాశ్వతమని
భావించు వారున్నూ మరియు వాసవీశక్తితో అగ్నిప్రవేశ ఆత్మార్పణ చేసెదమనేవారు మీమీ
ఆమెదము తెలుపండి" అని చెప్పగా 612 గోత్రికులు "అగ్నిప్రవేశము చేయుము
అనియూ మరియూ కుసుమశ్రేష్ఠి - వాసవిని రాజునకిచ్చి వివాహము చేస్తే పోయే దానికి
ఇంతమందిని అగ్నిప్రవేశానికి పిలుచుట తెలివిహీనమైన పని. మీరు ఆమెతో ఒక్కసారి కాది
పదిసార్లు గుండంలో దూకండి. మాకు మా భార్యాబిడ్డలు స్థరము, మా గృహములు, వ్యాపారాలు స్థరము"
అని తెలిపిరి. 102 గోత్రీకులు "శ్రీ
వాసవీ కన్యను దేవతగా నెరింగిన వారము మేము. తుచ్చమైన, నీచమైన,
ఈ శరీరము శాశ్వతం కాదు. బ్రతికివుండి రాజు చేతిలో చచ్చుటకన్న వాసవీ
మాతతో అగ్నిప్రవేశమే మిన్న. మేమందరము ఆత్మార్పణ ద్వారా మెక్షమునకు చేరెదము"
అని చెప్పి భాస్కరాచార్యుని ద్వారా వీరకంకణములు ధరింపజేసుకొనిరి.
మిగతా 612 గోత్రీకులు మహాకోపోద్రేకముతో వాసవీకన్యను, కుసుమదంపతులను, భాస్కర గురువును
తూలనాడిరి. ఇంకనూ అగ్నిప్రవేశమైనవారు తప్ప మిగిలిన వారినందరినీ పెనుగొండలోనే
ఉండవలెనని తీర్మానము కూడ చేసిరి. అపుడు వాసవికన్య భవిశ్యత్ విషయములను
దివ్యదృష్టితో గాంచినదై 612 గోత్రవైశ్యులతో "ఓ సోదరులారా! నాతో అగ్నిప్రవేశము
చేయండి. లేదా పెనుగొండ మెదలయిన 18 నగర్ములను విడచిపెట్టి మీరు వెళ్ళుట మంచిది.
లేదా మీ ప్రాణాలకే ప్రమాదం" అని చెప్పెను.
వెంటనే నాగశ్రేష్టి అను
వైశ్యుడు లేచి "ఇదేమి ధర్మమె చెప్పుతల్లీ!" అని అనెను. వాసవాంబ
"మాఘశుద్ద విదియనాడు 102 గోత్ర దంపతులతీ నేను అగ్నిప్రవేశమైన తదుపరి , మనమిచ్చిన గడువు ప్రకారం మాఖశుద్ద అష్టమిరోజున రాజు తప్పక
పెనుగొండకు బయల్దేరివచ్చును. బ్రతికివున్న మీరందరినీ మా గురించి అడుగుతాడు.
అప్పుడు మీరు మేమందరమూ విదియ రోజునే అగ్నిప్రవేశం చేశారు అని చెప్పెదరు కదా!
ఎనలేని కోపంతో రాజు "ఓరీ వైశ్యులారా! నన్ను మాఘ అష్టమిరోజున పెళ్ళికి రమ్మని
చెప్పి విదియ రోజునే అగ్నిప్రవేశం చేస్తారా! నేకోరుకున్న వాసవి ఆత్మహితి
చేసుకుంటున్నప్పుడు మీరెందుకు అడ్డుపడలేదు? అని ఆవేశంతో
ఖద్గముతీసి మిమ్ములనందరినీ శిరచ్చేదన చేయును. అలా రాజు చేతిలో మరణించి నరకం
పొందుటకంటే నాతో అగ్నిప్రవేశం చేసి మెక్షము చేరండి. ఎటువంటి పరిస్థితులలోనైనా
దుర్మార్గుని చేతిలో సన్మార్గుడు మరణిస్తే నరకమునకెళ్ళును. అలాగే సన్మార్గుని
చేతిలో దుర్మార్గుడు మరణిసే మెక్షము చెందును. కనుక నాతో అగ్నిప్రవేశానికి వచ్చుట
ఉత్తమ మార్గము. లేదా అష్టాదశ నగరములను విదిచిపెట్టుట శ్రేయస్కరం" అని
బోదించెను. వెడలిపోవుటకు ఆలోచించిన ఆర్నూట పన్నెండు గోత్రవైశ్యోత్తములు మెసినంత
ధనాని, నవనిధులను, రత్నాలు, వజ్రాలు మెదలయిన సంపదనంతయూ మూటలు కట్టుకొని ప్రయాణమైరి. నగరేశ్వర దేవాలయం
నుండి వెళ్ళదలంచిన వారి పూర్వజన్మ వశంబున నేత్రములు కనబడక అంధులైరి.
మిట్ట-పల్లములు తెలియక ఒకరిని ఒకరు గుద్దుకొని క్రిందపడిరి. శిరములు పగిలి రక్త
ప్రవహములయ్యెను. వారితో కొందరు వృద్దులు దైవభక్తి పరాయణులుండిరి. ఒక భక్తుడు
ఆర్తితో "ఓ నగరేశ్వరా! ఆర్తత్రాణ పరాయణా! ఏమిటీ ఈవైపరీత్యము! మమ్ములను
కరుణించుము!" అని మ్రెక్కుకొనును. అంతలో విచిత్రముగా అతనికి మాత్రమే ఒక
నేత్రము కనిపించెను. అతను మిగతా వారినందరినీ దేవస్థానము నుండి బయటకు తీసికెళ్ళెను.
అందరికీ కొంచంగా దృష్టి కనబడసాగెను. బ్రతుకుజీవుడా... అంటూ ఆర్నూట పన్నెండు
గోత్రీకులు భారతద్శములోని అన్ని దిక్కులకు వలసవెళ్ళి వ్యాపారములు ప్రారంభీంచిరి.
అష్టకష్టములతో అష్టదిక్కులకు వెళ్ళిరి. 200
గోత్రాలవారు దక్షణ దిక్కులను వెళ్ళిరి. 186 గోత్రాలవారు పశ్చిమదిక్కుకు
వెళ్ళిరి. 134 గోత్రీకులు ఉత్తర దిక్కునకెళ్లిరి. 80 గోత్రాలవారు
తూర్పుదిక్కుకువెళ్ళిరి. 12 గోత్రీకులు
అని దిక్కులకూ వెళ్లిరి. మెత్తం 612
గోత్రములువారు.
దక్షణదిశ:- తిరువనంతపురం, మద్రాసు,
కన్యాకుమారు, కేరళ మెదలగునవి
పశ్చిమదిశ:- బొంబాయి, మహారాష్ట్ర,
గుజరాత్, కర్ణాటక మెదలగునవి.
ఉత్తరదిశ:- డీల్లీ, వారణాశి, గయ,రాజస్తాన్, ఉత్తరప్రదేశ్,
మధ్యప్రదేశ్ మెదలగునవి.
తూర్పు దిక్కు:- తూర్పుగోదావరి, విశాఖపట్నం,
శ్రీకాకుళం జిల్లాలు
జయపూర్, భువనేశ్వర్, ఒరిస్సా,
పూరి, బరంపురం, గంజాం
మెదలగునవి.
ప్రస్తుతం 612 గోత్రీకులనగా?
మురుగు కోమట్లు, మరుగు కోమట్లు, మళయాళ కోమట్లు, సింహ్రాద్రి కోమట్లు, రాజవైశ్యులు, నేతికోమట్లు, భేరీ కోమట్లు, బేరీ
కోమట్లు, దూరిపోయిన
కోమట్లు, అలిగీ కోమట్లు, అడియా కోమట్లు,
అళియా కోమట్లు, బెదురు కోమట్లు, నూనె కోమట్లు, శెట్టి కోమట్లు, గౌరీ కోమట్లు, గౌర కోమట్లు, గవర
కోమట్లు, గైర కోమట్లు, గంగ కోమట్లు,
గంగధారణ కోమట్లు, మునిశేఖరులు కోమట్లు,
తూర్పు కోమట్లు, రంగా కోమట్లు, రంగ వైశ్యులు, మాతా కోమట్లు, , లంకా కోమట్లు, గుజరాతీ వైశ్యులు, నూలు కోమట్లు, నామధారులు, రామధారులు, లింగధారణ
వైష్య్లు , టేకు కోమట్లు, , కళింగ
కోమట్లు, , వళియా కోమట్లు, గ్రమ్మట
కోమట్లు, , గానుగ కోమట్లు, మరాటీ
కోమట్లు, , మరాఠీ కోమట్లు, మరాట
కోమట్లు, , తెలక కోమట్లు, ప్రత్తి
కోమట్లు, పత్తి కోమట్లు, దూది కోమట్లు, మెదలయినవారు.(7 తరములు పూర్తియిన
తదుపరి 102 గోత్రీకులతో స్నేహము చేయుదురని కొన్ని గ్రంధములందున్నది)
102 గోత్రీకుల మహాసభ:-
ఆర్నూట పన్నెండు గోత్రీకులు వలసవెళ్ళిన మరుసటిరోజున మరల
మహాసభ జరిగినది. శాంతస్వభావులు, భక్తిపరాయణులయిన 102 గోత్రీకులు వందలాది మంది ఆ సభకు హాజరయ్యారు. ముందుగా
పరిమిగుప్త అధ్యక్షతోపన్యాసం చెప్పనారంభించెను. "ఓ సోదరులారా! వాసవీమాతను
ఆదిశక్తిగా తెలుసుకొనిన మననుండు పిరికి వారందరూ పలాయనము చిత్తగించిరి. ఆర్యవైశ్యుల
ధైర్య సాహసాలు అన్ని యుగాలలో ఇతరుల కంటే గొప్పగా ఉన్నవి. అటువంటి పరిస్థితులలో
మనవారు ఇరువర్గాలుగా మారుట మన ఆర్యవైశ్యజాతికే మాయని మచ్చ. గడువురోజుకు రాజు
వచ్చును గనుక రాబోవు మాఘశుద్ద విదియ నాటికి అగ్ని ప్రవేశానికి వీరకంకణములు
గట్టించుకొన్న వారందరూ సిద్దముగా నుండవలెను" అని హెచ్చరించెను. ఆ సమయమున శ్రీ
వాసవీమాతను అందరూ భక్తితో ప్రార్థించిరి. వెంటనే కుసుమశ్రేష్ఠి "ఓ సోదరులారా!
విష్ణువర్ధనరాజు రాజమండ్రికి చేరిన రోజునుండి రోజుకు ఇద్దరు, ముగ్గురు వేగులను(గూఢచారులు) మన వద్దకు పంపి, ఇక్కడి
రహస్యములను, మన విషయాలను తెలుసుకుంటున్నాడు. అదే విధముగా మన
సినికులలోని కొందరు ధైర్యవంతులు రాజువద్దకు వెళ్ళి అతని ’పెళ్ళి’ విషయాన్ని
మరల్పడానికి ప్రయత్నిస్తున్నారు. కామాంధుడు, ధీరోదాత్తుడు,
సకల యుద్ద విశారదుడైన మహారాజును ఇదైవరకు మన యువజనులు వారి
వాక్చాతుర్యంతో, ఎంతో నైపుణ్యంగా అతనిని తన నగరానికి పంపించి
మంచిపని చేశారు. ఇపుడు మరల ఆ సాహసవంతులైన బిడ్దలనే రాజువద్దకు పంపించెదము. మన
అగ్నిప్రవేశ విషయాలను రాజుకు తెలియరాదు కనుక మన వారు స్వయంగా వెళ్ళి కాలయాపన
చేయించవలెను" అని చెప్పగా 12 గోత్రాలకు చెందిన యువజనులు అశ్వవాహనారూఢులై
"ఓ అధ్యక్షా! గురుభాస్కరాచార్యా! పెద్దలారా! మహారాజును మాయమాటలతో పంపించివేసిన
మాకు, మాఘశుద్ద విదియా వరకూ కాలయాపనచేసి రాజును పెనుగొండకు
రప్పించకుండా ఉంచు బాద్యత మాది. సోదరి వాసవికి ఈ విధముగా సహాయము చేయుట వలన మాకునూ
గర్వముగా వున్నది. వెళ్ళి వెచ్చెదము" అని బయల్దేరి రాజమహేంద్రికి చేరిరి.
రాజమహేంద్రవరములో ఆర్యవైశ్య యువజనులు:-
విష్ణువర్ధనుని కోట దేదీప్యమానముగ నున్నది. రాజుసభలో కవులు
విద్వాంసులు, పౌరాణికులు, కథకులు, పాఠకులు, గాయకులు,
హ్యాస్యకార్లు, చలోక్తులు, కవిత్వములు, గట్టుచున్నారు. విష్ణువర్ధనుడు
రావణబ్రహ్మవలె నవరత్న వజ్రమయ సింహాసన్ముపై ఆసీనుదైయుండెను. రాజు వద్ద మాత్రము
పీష్వా అమాత్యుడు, మంత్రి, సచివులు,
సామంతులు, సేనాపతి, పండితులు,
న్యాయాధీశ్య్లు కలరు. వారందరూ రాజమహేంద్రి పౌరుల గురించి, భవిష్యత్ ప్రణాళిక గురించి చంద్రవంశాధీశునితో చర్చించుచున్నారు. ఎప్పుడైతే
ఆర్యవైశ్య యువజన సంఘము వారిని మహరాజుగాంచెనో వీరందరికీ ఉచిత సింహాసనములు ఏర్పాటు
చేసి గౌరవించి, ఉభయకుశలములనడిగెను. అంతయూ పూర్తి అయినాక
రాజుతో యువజనులు నుండి సదాశివగుప్తలేచి ఈ విధముగా రాజును ఆశుకవిత్వముతో పొగిడి
ఆశ్చర్యపరచెను.
"రాజమహేంద్ర
పట్టణ రాజ్య భూమండల నిఖిల దేశావతంస ఆంద్ర జనపద సంపదాదిష్ఠానుభూత శ్రీమాన్ రాజరాజ
నరేంద్ర జనకమహారాజ |సకల రాజ్య పరిపాలనా కళానిధి
ప్రముఖ దేదీప్యమాన నిజరాజాధిరాజ దివ్యసింహాసనారూఢ శ్రీ పార్వతీ పరమేశ్వర
కృపాకటాక్షాధీశ్వర ప్రౌఢప్రతాప మంత్రి మహామంత్రి సైన్యాధిక్యపారావార దాసదాసీ
జనాధార గండభేరుండ ధరణీమనోహర సకలప్రజానాయక సమస్త భేరీమృదంగాది వాద్యరావ కళాకాంతాధిక
రూప లావణ్య వారాంగనానృత్యమనో ఇష్టభావ ప్రసిద్ధ శ్రీ రాజరాజమ్హారాజ బ్రహ్మాండ తేజా
బహుపరాక్! బహుపరాక్!! బహుపరాక్!!! అని వివరించి కూర్చుండెను.
వెంతనే అతని వెనుకనున్న శ్రీ ధరశ్రేష్ఠి లేచి "శ్రీ బావబావ మహాబావ బ్రహ్మాండతేజా బహుపరాక్! బహుపరాక్!! బహుపరాక్!!!" అని ఆ పదమును పూరణ చేసెను. అచ్చటున్న కవులు. విద్వాంసులు ఆశ్చర్యము చెందిరి. విష్ణు వర్ధనుడు వెంటనే "అద్బుతం! అమెఘం! నా బావమరుదులు అన్ని కళలలోనూ ప్రవేశించి ప్రావీన్యం పొందారు. శహభాష్! అటువంటివారు నాకు బంధువు లవుతున్నారంటే నాదృష్టమే!" అని బాలురను మెచ్చుకొనెను. అక్కడున్న కవులకు, గాయకులైన వారందరికీ ఆర్యవైశ్యుల కవిత్వం కంటగింపుగా మారి అసూయ ప్రారంభమైనది
మహరాజుకు నీతిబోధలు:-
రాజు ఉబ్బితబ్బిబ్బులై ఆనందముగా వున్నప్పుడు తెలివిగా యువజనులు నీతులు జెప్పనారంభించిరి. విశ్వేశ్వరగుప్తయను మేటిగోత్రజుడు లేచి రాజుతో "ఓ బావగారూ! సకలరాజ్యములకు అధీనుడవై సకల ధర్మములు తెలిసినవాడవై నీకు మేము నూతనంగా చెప్పేదేమున్నది. పరకామినులను స్వప్నంలోనైసరే సోదరిగా తలచవలెనని మీ గురువు ధౌమ్య మహర్షి చెప్పలేదా? నీవు పాండవ వంశజుడవనీ , గొప్పవ్యక్తివనీ మేము తెలుసుకున్నాము. ఇంతపేరు ప్రఖ్యాతులున్న వంశ జనితమైన నీకు క్షత్రియ ధర్మమును పాటించాలని తెలియదా? నిజమైన రాజు సర్వజీవులపట్ల సాబుభూతిని జూపాలి. హృదయము నందు మాలిన్యము దరిచేరనీయరాదు. న్యాయమార్గమున నడచి భవిష్యత్ రాజులకు ఆదర్శంగా నిలవాలి నీవు. దేశసేవ, భాషాసేవ, శివ సేవ చేసినట్లైన నిజమైన రాజువని నీవు ఖ్యాతినొందుదువు" అని బోధించెను. ’బావగారూ’ అని ప్రారంభించి క్షత్రియధర్మాలు చెప్పేసరికి మహారాజుకు ఎక్కడలేని ఉగ్రావేశం జనించినది. అట్లుండగా రామచంద్రశ్రేష్ఠియను యువకుడు లేచి "ఓ బావగారూ! ఒక ప్రశ్న వేస్తాను. సమాధానం చెప్పగలవా?"అనెను.
రాజు "మీరెన్ని ధర్మాలైనా చెప్పండి. ఎన్ని ప్రశ్నలైనా ఆడగండి ఆఖరుకు పెళ్ళి మాత్రము మరువవద్దు" అని కుతూహలంగా చెప్పెను.
రామచంద్రశ్రేష్టి "మేము ఆర్యవైశ్యులము కదా!" అనెను.
రాజు "ఆవును" అని చెప్పెను.
రామచంద్రశ్రేష్టి " మీరు క్షత్రియులుకదా!" అని అడిగెను
వెంటనే మహారాజు "ఆవును" అని సమాధానం ఇచ్చెను
రామచంద్రశ్రేష్టి "ఏ కాలములోనైననూ, ఆర్యవైశ్యులకు, క్షత్రియులకు వివాహములు జరిగినవా? ఇలా వర్ణ సాంకర్యం చేయుట అధర్మమని మీ పూర్వీకులు మీకు చెప్పలేదా! కనుక మా ఆర్యవైశ్యకాంతను మరచుట మంచిది" అని చెప్పెను. కోపోద్రిక్తుడైన భూపాలుడు "ఓరీ బాలకులారా! నేను మీ వాసవిని మెహించినపుడు నాతో మీరు మూఢమిలు వచ్చినవి, ముహూర్తములు లేవని చెప్పి, తరువాత పెండ్లియాడుమనిరి. ఇంతలో మీరువచ్చి "మేము ఆర్యవైశ్యులం మీరు క్షత్రియులు’ అని వక్రబోధలు చేయుచుంటిరేమి? మీరు సావధానంగా మాఘశుద్ద అష్టమికి పెళ్ళిచేశారా! సరే! లేదా నా సైన్యపరివారసమేతంతో దండెత్తి వచ్చి 18 నగరములు చుట్టుముట్టి ఆర్యవైశ్యులనందరినీ రక్తపాతం చేసి నేను కోరుకున్న వాసవిని బలవంతంగా రాజమహేంద్రికి తెచ్చి రాక్షస వివాహం చేసుకొనెదను. మా క్షతియులకు సామ, దాన, బేధ, దండోపాయములను ప్రయెగించుట పరిపాటి. ఇప్పటివరకూ మిమ్ములను సామముగానే అడుగు చుంటిని" అని హెచ్చరించెను. ఉగ్రావేశుడైన రాజును యువజనులు శాంతపరచుతకు "నీకు తప్పక ’పెళ్ళి’ చేస్తాము" అని చెప్పిరి. కొందరు బిడ్డలు మరికొంతసేపాగి "బావా! రాజరాజా! మేము వెళ్ళివెచ్చెదము. మాఘశుద్ద అష్టమిరోజున నీవు పెళ్ళికి సిద్దముగా ఉండాలి సుమా!" అని పెనుగొండకు బయలుదేరిరి. కొందరు యువజనులు రాజువద్దనే ఉండిరి. విష్ణువర్ధన రాజు కుసుమశ్రేష్టిని, భాస్కరాచార్యుని, విరూపాక్షుని మెదలైన వారందరిని అడిగినట్లు తెలుపమని చెప్పెను.
పెనుగొండకు చేరిన యువజనులు కుసుమశెట్టిగారితో "రాజుకు నీతులు, ధర్మములు ఏమియూ రుచించుటలేదు. పెళ్ళి పెళ్ళి’ అని కలవరిస్తున్నాడు. అతనికి కామక్రోధాదులు, అహంకారములు ఏదియునూ తక్కువ లేవు. మాఘశుద్ద అష్టమికి తప్పక పెళ్ళికి వస్తానని మరల మరీమరీ హెచ్చరించినాడు. ’బావా’ అంటున్నప్పుడు చెలిమితోను ’మేము ఆర్యవైశ్యులము- మీరు క్షత్రియులు గదా!’ అన్నప్పుడు ఉగ్రావేశములు మిన్నుమిట్టుచుండెను. ఇక మనలను ఆ నగరేశ్వరుడే రక్షించాలి. మేము రాజుతో ’పెళ్ళి’ తప్పక చేస్తామని అన్నాము కాని ’వాసవీదేవినిచ్చి పెళ్ళిచేస్తామని’ పొరపాటున కూడా చెప్పలేదు. ఆడినమాట తప్పని ఆర్యవైశ్యులము కదా! అందుకని అలా చెప్పవలసి వచ్చింది" అని జరిగిన వృత్తాంతమంతయూ చెప్పెను. అప్పుడు కుసుమశ్రేష్టి ఒక కట్టడి చేసెను. "మీ సహాయము మరువరానిది. మీరు మేధావులైన యువజనులు. ఈ విషయమందు మిమ్ములను గౌరవించవలసిందే" అని సంఘమున ఒక ఆజ్ఞ జారీచేసెను."ఇకనుండు మూ యువకులు-బాలలైన మీరందరూ ’బాలనగరులు’ అనియూ, అమ్మవారి సేవకంకితమైన బాలికలను ’గౌరబాలికలు’ అనియూ పిలువబడుదురు. ప్రతి పర్వదినమందు, భగవత్కార్యమునందు, ఉత్సవములయందు, వివాహాది శుభకార్యములందు, మీకు ప్రధమ తాంబూలమిచ్చి మిమ్ములను గౌరవించవలెను. అప్పటినుండి బాల - బాలికలకు ’బాలభోగము’ చేయుచూ గౌరవమిచ్చుచుండిరి.
103 అగ్నిగుండములు
త్రవ్వుమని వాసవి అదేశం:-
పూజా మందిరంలో తదేకంగా నగరేశ్వరుణ్ణి ధ్యానించుచున్న వాసవి
కన్యక చెంతకు తండ్రి కుసుమశ్రేష్ఠి వేంచేసెను. పూజాదికాలు పూర్తిచేసినది వాసవి.
దుఃఖించుచున్న తండ్రితో కన్యకాంబ "నాన్నా! ఎందుకు ఈవిధంగా విలపించుట? కారణమేమిటో చెప్పుము!" అని అడిగెను.
వెంటనే "అమ్మా వాసవీ! పుత్రకామేష్టి చేసి నిన్ను వరప్రసాద కుమార్తెగా పొందిన
మాకు మరల దుఃఖమే మిగిలిందికదా!" అని విలపించుచుండెను. అప్పుడు వాసవీకన్య
"ఓ తండ్రీ! ఆది శక్తియగు నేను నిమిత్తమాత్రముగా ఈ జన్మ ధరించితిని. నీవు
కృతయుగమున ఆదిపరాశక్తియైన నా దర్శనము కొరకై ఘోర తపస్సు చేయగా ఏ వరము కావాలో కోరుకొనుము
అని చెప్పగా నీవు " అమ్మా! నీవు నాకు కుమార్తెగా జన్మించాలి తల్లీ! నా తండ్రి
వంశమువారు 24 గోత్రజులు, తల్లివంశమువారు 20 గోత్రీకులు,
మాతులు వంశమువారు 12
గోత్రీకులు, నా మేనత్త వంశమువారు 10 గోత్రీకులు, సోదరి
వంశమువారు 16 గోత్రీకులు, నా పుత్రిక వంశమువారు 11 గోత్రీకులు,
నా పిన తల్లి వంశమువారు 8 గోత్రీకులు నాతో కలిపి 102 గోత్రజులకు
అగ్నిప్రవేశ ఆత్మార్పణ ద్వారా కైలాస ప్రవేశము చేయించుము" అని అడుగగా నేను
’తథాస్తు’ అని వరమిచ్చాను. ఆ వరప్రభావమే ఇప్పుడు నీ కుమార్తెగా జన్మించాను.
అశాశ్వతమైన ఈ దేహముగురించి దుఃఖించుట అజ్ఞానము. తక్షణ కర్తవ్యము ఆలోచించుము"
అని బోధించగనే కుసుమగుప్త అంగీకరించెను. ఆ సమయమున అచ్చటకు గురు భాస్కరాచార్యులను
కూడా వాసవాంబ రావించెను.
అగ్నిగుండములు త్రవ్విన విధము:-
వెంటనే వాసవీకన్య "పెనుగొండలోని నగరేశ్వరస్వామి దేవాలయము వద్ద 102
గోత్రీకులకు, 102 గుండములున్నూ, నాకు
ఒకటి ప్రత్యేక గుండము మెత్తము 103 గుండములు శూద్రాదులతో త్రవ్వించండి. ఒక్కొక్క
గుండము విస్తీర్ణము-18 గజముల లోతు, 18 గజముల వెడల్పు,
18 గజములకైవారం (చదరం) ఉండవలెను. ఇటువంటి కొలతలతో 103 గుండములు
సిద్దము కావలెను. ఈ అష్టాదశ (18) సంఖ్య అనాదిగా హిందువులకు పవిత్రమైనది.
మధ్యభాగమున 1. ప్రధానకుండము, చక్రాకారమున కుండములు, వర్తులా కారమున 13, నాలుగు దిక్కులా 64 కుండములు,
ఒకవైపు 9 కుండములు, వేరొక పార్శ్యమునందు 8
కుండములు, ఇరువైపులా 2 కుండములు ఏర్పాటు చేయుము. శైవులు,
వైష్ణవులు, శాక్తేయులు అనుమూడు మతముల
ఆర్యవైశ్యులు వారివారి గుండములయందు ప్రవేశించెదరు. మహారాజు పంపుచున్న భటుల నుండి
జాగ్రత్త వహించండి. వేగుల గురించి అశ్రద్ద పనికిరాదు. ఈ 103 గుండముఅన్నియూ సిద్దము చేయుట మాఘశుద్ద
విదియలోపే పూర్తికావలెను" అని చెప్పెను. కుసుమరాజు 18 పట్టణములలోని శూద్రాదులందరినీ భటులద్వారా
రావించెను. వేలాదిమంది శూద్రాదులు మరియు వారిలోని కొన్ని తెగలవారు పెనుగొండ
ఆస్థానమునకు విచ్చేసిరి. వారితో కుసుమశ్రేష్టి "ఓ మహాజనులారా! ఇప్పటినుండి
రెండు మాసముల వ్యవధిలో వాసవీదేవి సెలవిచ్చిన ఆనతి ప్రకారం 18 గజముల లోతు, 18 గజముల వెడల్పు, 18 గజముల కైవారం విస్తీర్ణం
కలిగిన 103 గుండములు నగరేశ్వరస్వామి దేవాలయము వద్ద త్రవ్వవలెను. ఈ విధంగా మీ
కుటుంబ సభ్యులతో సహా గుండములు త్రవ్వి మాకు సహాయం చేసిననందుకుగాను మా రాజ్యంలో
వజ్రవైఢూర్యములు, నవరత్నములుగాని, సువర్ణముగాని,
ధనముగాని, మయబ్రహ్మ నొసగిన నవనిధులుగాని
ఏమైనాసరే కోరుకోవచ్చును" అని చెప్పగా ఆ శూద్ర జనములో పెద్దవారు కొందరు లేచి
"ఆర్యవైశ్యరాజా! మీరిచ్చిన గడువు లోపల మీకు 103 గుండములు సిద్దము చేసెదము.
ప్రతిఫలముగా మీరు మాకు ఇచ్చునవి నవరత్నాలు. సువర్ణధనము, నవనిధులు
మాత్రమే! అయితే అని పూర్తియిన తదుపరి మరల మేము మరొకరిని ’దేహి’ అని అడగవలసిందే
కదా! అలాగాక మాకు శాశ్వత జీవనోపాధిగా వృత్తులు కావలెను. ఇంతవరకు ఎటువంటి
జీవనవృత్తులు మాకులేవు. అవి మీరు నొసంగవలెను" అని వేడుకొనిరి. అప్పుడు కుసుమ
రాజు ఆలోచన చేసి కుసుమాంబ, వాసవీశక్తి, గురు భాస్కరాచార్యులు, గ్రామ పెద్దలు, నగరస్వాములు మెదలైన వారందరినీ రప్పించెను. అప్పటివరకు ఆర్య వైశ్యులకు
అనాదిగా వృత్తులుగానున్న కృషి, గోరక్ష్య, వాణిజ్యాలలో జీవనోపాధిగా వాణిజ్యాన్ని (వ్యాపారం) మాత్రమే నిలుపుకొని
మిగతా కృషి (వ్యవసాయం), గోరక్ష్యం (గోవులు) ఈ రెండు
వృత్తులను ఆచంద్రార్కము శూద్రులకే ఉండేటట్లుగా శూద్రులకు ఇచ్చివేసెను (ఆధారము
:కృషి గోరక్ష్య వాణిజ్యం, వైశ్యం కర్మ స్వావజం..
భగవద్గీతలోని 18 అ|| 44 శ్లో||).
అప్పటి వరకూ ఆర్యవైశ్యులకున్నటువంటి లక్షల ఎకరాల భూమి (మెట్ట, కుంట, మాగాణి, బంజర
మెదమైనవి) మరియు వేలకొలది గోవులను అన్నింటినీ (వ్యాపారము మినహాయించి) శూద్రాదులకు
దానము చేసెను. కుసుమ దంపతులు జలమును విడుచుచూ పంచభూతాలు, సూర్యచంద్రాదుల
సాక్షిగా, దానము చేసెను. ఆనందముతో శూద్ర జనులందరూ కుటుంబ
సమేతంగా పెనుగొండ నగరేశ్వర దేవాలయము వద్ద 103 గుండములను రెండు మాసములు వ్యవధిలో
త్రవ్వుటకుపక్రమించిరి. కుసుమరాజు ఆజ్ఞప్రకారం భటవర్గము భారతదేశ మంతయూ వెళ్ళి
అగ్నిగుండములకు కావలసిన నవవిధములైన సమిధలు సేకరించిరి. వారు అనేక రథములు, ఏనుగులు, గుర్రములపై బయలుదేరి భద్రాచలం అడువులు,
శబరిమలై అడువులు, కర్నూలు అడవులు, శ్రీశైలం అడువులు మెదలైన భీకరారణ్యములకు వెళ్ళి 103 గుండములకు సరిపడు
సమిధలు తీసుకువచ్చిరి. ఆ సమిధలలో వట, రావి, జువ్వి, ఉత్తరేణి, మెదుగ,తులసి, గంధము, జిల్లేడు,
చండ్ర, వేప, మేడి,
జమ్మి, గరికి సమిధలు ఉన్నవి. శూద్రాదులు 103
గుండములు త్రవ్వి భాస్కరాచార్యునకు ఒప్పజెప్పిరి. శిష్యగణముతో గురువు
గుండములన్నియూ శాస్త్రప్రకారముగా సంప్రోక్షణ - శుద్దిచేసెను. వెంటనే వాసవీదేవీ
భాస్కరాచార్యునితో "ఓ గురువర్యా! అగ్నిప్రవేశమునకు మూడు రోజులు ముందుగనే
శాస్త్రోక్తముగా అగ్నిసూక్తముతో 103 గుండములు వెలిగింపజేయాలి. అలాగాక అగ్నిప్రవేశ
క్షణమున ధ్వజస్తంభముల వెలెనున్న ఆ సమిధలను వెలిగింప జేస్తే అవి ప్రజ్వరిల్లవు. కనుక
మూడు రోజుల ముందుగనే ప్రజ్వరిల్లింప జేసిన యెడల ఆ సమిధలు మాఘశుద్ద విదియకు ఎర్రగా
మండుచుండును" అని చెప్పగా భాస్కరాచార్యుడు అగ్నిసూక్త పఠనముతో మంచి
సుముహూర్తమున మూడు రోజులు ముందుగానే గుండములన్నియూ వెలిగింపజేసేను. అప్పుడా
అగ్నిగుండములందగ్ని అకాశమునకంటుచుండెను.
వివాహమునకై విష్ణువర్థనుని పెనుగొండ ప్రయాణము:
విష్ణువర్ధన మహారాజు వాసవీదేవి శరీర సౌందర్యమును గాంచిన క్షణము నుండి మనస్సు నిలకడ లేదు, నిద్రాహారాలు మానివేసెను. ఏ కృత్యమునందైనా వాసవియే కనుపించసాగెను, కలవరించసాగెను. ఒక మంచి సుముహూర్తమున ముందుగా పెనుగొండకు వరుని తరుపున మాంగల్యాలు, నల్లపూసలు, మేట్టెలు, పిల్లెళ్ళు, మధుపర్కాలు, తలంబ్రాల బియ్యం మెదలైన పెళ్ళి సామాగ్రిని తన పురోహితులతో రథం మీద మహరాజు పంపెను. ఒకరోజు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచిన రాజు గోదావరి నదీతీరానికి వెళ్ళి స్నానము చేయుచూ సూర్యభగవానునకు అర్ఘ్యమిచ్చెను.
తదుపరి సూర్యునకు ప్రీతిపాత్రమైన ’ఆదిత్య హృదయము" ను
కూడా భక్తితో పఠించెను. అంతః పురమునకు వచ్చిఅ శరీరమునకుఅ గంధ, భూషణములతో అలంకరించుకొనెను. తన పరివారమంతయూ
విష్ణువర్ధనుని పెండ్లికొడుగా సిద్దము చేసెను. మహామంత్రితోనూ, సేనామంత్రితోనూ మహారాజు "మనం త్వరగా పెళ్ళికి బయలుదేరవలెను. మా
మామగారిచ్చిన మాఘశుద్ద అష్టమి రోజుకు మనం పెనుగొండకు చేరవెలెను. మనకు గలిగిన
సైన్యము, చతురంగ బలము లన్నియూ సేనను కూడా సిద్దము చేయుడు.
ఆర్యవైశ్యులు ఒకవేళ పెళ్ళి చేయుము అని చెప్పిన యెడల వారినందరిని మనకు గల సైన్యంతో
హతమార్చి వాసవిని తీసుకువచ్చి ఎక్కడ వివాహం చేసుకొనెదను. సామాన్యంహా మా అత్తమామలు
నాకొరకు ఎదురుచూచుచుందురు. ఆర్యవైశ్యులు మాట తప్పనివారని నేను ఎరుగుదును" అని
చెప్పి సైన్యమును సిద్దము చేయించెను. అన్ని రాజ్యముల రాజులకు ’విష్ణువర్ధన వివాహ
శుభలేఖలు’ పంపబడినవి. రాజమహేంద్ర నగరమంతయూ మాసం రోజుల ముందుగానే చాటింపు
వేయబడినది. రాజ్య ప్రజలందరూ కోలాహలముగా ఉత్సాహముతో నుండిరి. ఆవిధముగా పండుగ
వాతావరణము నెలకొన్నది. చంద్రవంశ భూపాలుడైన రాజు తన రాజ్యములోని ప్రజలందరికీ -
స్త్రీలకు పట్టుచీరలను, పురుషులకు నూతన ధోవతులను ఇచ్చి తన
వివాహమునకు పెనుగొండజేర రావలయునని ఆహ్వానము పంపెను. విష్ణువర్ధన రాజ్యములోని
4 వేల మంది సైన్యానికి అదనపుఅ జీతాన్ని
ఏర్పాటుచేయించెను. పురజనులందరకూ వచ్చినవారికి వచ్చినట్లుగా అన్నసంతర్పణ జరిపెను.
రాజమండ్రి పౌరులందరూ హర్తాళ్ (బంద్) పాటించవలెనని ఆజ్ఞ కూడా జారీ చేసెను.
క్షణక్షణమునకు మహరాజుకు వాసవీ రూపమే కనబడుచుండెను. ఒక్కొక్క సారి మహరాజు మనసులో
’అసలు వాసవిని చూసిన తక్షణమే రాజమహేంద్రికి తెచ్చి వివాహము చేసుకొనిన అద్బుతంగా
ఉండునని రెండు మాసములు అనవసరంగా కాలయాపన జరిగిందని తలంచి బాధపడుచుండ సాగెను.
రాజమహేంద్రికి వెళ్ళిన యువజనులు పెనుగొండకు వచ్చిరి. అక్కడి
విషయాలను పెద్దలకు తెలియపరచెను. రాజమండ్రి నుంచి యువజనులు వెళ్ళిన తరువాత మహారాజు
మహామంత్రి ద్వారా గజవాహనమును తెప్పించెను. సైన్యము, రథములు, గుర్రములు,
ఏనుగుల పరివారముతో చంద్రవంసాధీశుడు బయలుదేరెను. పట్టణ వాసులందరూ
విష్ణువర్ధనుని సాగనంపవలెననే తలంపుతో ఆస్థానమునకు వచ్చిరి. విష్ణువర్థనుడు
గజమునధిరోహించగా మహామంత్రి, సేనామంత్రి, ముఖ్యమంత్రి మెదలైన వారు రాజును అనుసరించి. అలా ప్రజలందరూ బయలుదేరి వెళ్ళి
రాజమహేంద్రవర పొలిమేరలవద్దకు వచ్చిన క్షణమున హఠాత్తుగా పెద్ద సుడుగాలి వచ్చెను.
రాజును మెస్తున్న గజం ఒక్కసారిగా క్రింద పడిపోయెను. పైనుండి పడిన మహరాజు వెళ్ళి
దొర్లికుంటూ మట్టిలో పడెను.
మహామంత్రులు వచ్చి భూపాలుని పైకి లేవదీసి "మహారాజా!
అపశకునం! మనం తిరిగి రాజమహేంద్రికి చేరెదము. ఇలా వాతావరణం అనుకూలం లేని సమయమున
పెళ్ళికి వెళ్ళుట శ్రేయస్కరం కాదు. సైన్యాన్ని వెనుకకు మరల్చెదము" అనెను.
ఉగ్రావేశముతో మహరాజు "ఓరీ మంతులారా! ఈ ఏనుగును సిద్దము చేసినవారెవ్వరు? త్వరగా పంచకళ్యాణి అశ్వరాజమును
తెప్పించుడు. వెనికకు వెళ్ళు ఆలోచనను విరమించండి" అని చెప్పెను. మహామంత్రి
అశ్వరాజమును సిద్దము చేసెను. ఈ విషయము తెలుసుకొనిన దాసీ జనము అంతః పురమునకు
బయలుదేరివెళ్ళి విష్ణువర్ధునుని భార్యలతో "అమ్మల్లారా! మీ భర్తగారు
పెనుగొండకు పెళ్ళికై వెడలుచున్నాడు" అని తెలిపిరి. విష్ణువర్ధనుని భార్యలు
మండోదరి వలె పతివ్రతా శిరోమణులు, వారిలో ఢిల్లీసుల్తాను
పెద్దకుమార్తె చంద్రకళాదేవి,కొంకణ దేశపురాజు కూతురు కౌముదీ,
నేపాలదేశరాజు కూతురు రత్నముఖీదేవి, బాంగ్లాదేశ్
రాజు కనిష్టకుమార్తె మంజువాణీ దేవి, కాశ్మీరదేశ రాజు శశివర్మ
కుమార్తె సుశీలాదేవి, సింధుదేశ రాజు కుమార్తె భానుమతీదేవి
మెదలైనవారు చాలామంది కలరు. వీరు అస్త్రశస్త్రాలు, యుద్దాలలో
ఆరితేరినవారు. విష్ణువర్ధనుడు వందలాది సూర్య-చంద్రరాజ వంశీయుల కన్యలను, క్రిస్టియన్, బ్రాహ్మణ, ముసల్
మాన్ వంశీయులనే కాక మెదలైన వారినందరినీ స్వయంవరములలో గెలుచుకొని శాస్త్రసమ్మతముగా
కళ్యాణము చేసుకొని వచ్చి రాజమహేంద్రికి చేరవేసెను.
వారిలో మంజువాణీదేవి "అక్కల్లారా! నిజంగా ఆర్యవైశ్యులు
వాళ్ళ కూతురుతో పెళ్ళిచేసేవారయితే అప్పుడే చేసి ఉందురు. రెండు మాసాలు గడువు పెట్టి
మరల రమ్మన్నారనిన ఇదేదో కుతంత్రముగానున్నది. పైగామన నాధుడు బయలుదేరగనే ఏనుగుపై
నుండి జారిపడెనని కూడా దాసీలు చెప్పిరి. ఇది ప్రయాణమునకు అశుభము కదా! మనం నాధుని
పంపి అశ్రద్ద చేసిన యెడల మనమందరం పసుపు కుంకుమలకు దూరమవ్వాలి. ఎలాగైనాసరే రాజును
నిలుపుదలచేసి పెనుగొండకు పెళ్ళికి పంపరాదు" అని చెప్పెను. సవతులందరూ కూడ
బలుక్కొని అంతః పురము నుండి క్రిందకు దిగి రాజవీధులలో పరుగులు పెట్టిరి. నగరములోని
ప్రజలందరకూ ఏమి జరిగెనో అర్థముకాక చూచుటకు వచ్చు చుండిరి. మహారాణులందరూ పంచకళ్యాణీ
గుర్రము నధిరోహించుచున్న విష్ణువర్ధునుని చుట్టూ చేరిరి. పెనుగొండకు వెళ్ళవద్దని
బ్రతిమాలి చెప్పిరి. దుఃఖించిరి. కొందరు భార్యలు ప్రేమతో చెప్పిచూచిరి. మరికొందరు
హేళన చేసిరి. ఇంకా అసహ్యించుకొనిరి. పెద్ద భార్య "నాధా! ఇంతమంది భార్య్లము
ఉండగా మరొక పెళ్ళి చేసుకొనుట నీకు ధర్మము కానేరదు. పెనుగొండకు వెళ్లవద్దు"
అని చెప్పెను. మరో భార్య "ఓ నాధా! నీవు కనుక వెనుతిరగపోతే ప్రాణత్యాగము
చేసుకొనెదను" నీ గురించి తెలిసి చంద్రవంశ మహారాజని గౌరవముతో, నమ్మకముతో నన్నిచ్చి వివాహము చేసిరి.
ఇప్పుడు నీవెళ్ళితే తప్పక నిన్ను ఆర్యవైశ్యులు హతమార్చెదరు. మేమందరము
వైధవ్యముననుభవించవలసి వస్తుంది. ఈ పెండ్లి విరమించుకో" అని బ్రతిమలాడెను.
మహారాజు పట్టువీడలేదు. పెనుగొండ దిక్కుకు బయలు దేరుతూ "ఓసీ భార్యలారా!
మహారాణులైన మీరు అంతఃపురములో ఉండాల్సింది ఘోషాకూడా మరచి వీధులపైకి వచ్చుటకు
సిద్దులేదూ! మీరు నా మనస్సు మార్చుటకు ప్రయత్నిస్తున్నారేమె? నేను పెనుగొండ ప్రయాణాన్ని విరమించేది లేదు. నా పెళ్ళి విషయాన్ని గురించి మాట్లాడుటకు మీకు
హక్కులేదు. నా ఇష్టమెచ్చిన రాజ్యంలో, నా ఇష్టమగు కాంతను
ప్రేమిస్తాను, మెహిస్తాను. నన్ను మీరు ఆపలేరు" అని
బయలుదేరుచుండెను. సైనయ్ము మెత్తము రాజు వెంబడి బయలుదేరెను. మల్లికాంబయను భార్య
వచ్చి మిగతా వనితలతో ఉగ్రముతో "అక్కలారా! మన భర్తకు కనికరము లేదు. అతను జాలి,
దౌఅ పూర్తిగా వదిలివేసెను. మనం సైన్యము కన్నా ముందుగానే పెనుగొందకు
వెళ్ళి ఆర్యవైశ్యులను ప్రాధేయపడి ’మా భర్తబ్రహ్మచారి కాదు, స్త్రీలోలుడు,
మీ కుమార్తెనీయవద్దు’ అని చెప్పెదము" అనెను. వెంటనే
మహారాణులందరూ బయలుదేరి పాదయాత్రగా పెనుగొండకు వెళ్ళు చుండిరి. దాసీజనం వేలాదిమంది,
మహారాణులను అనుసరించిరి. కొందరు సేనానంత్రులు కూడా మహారాణులకు
రక్షణగా ఉండెను. గూఢచారులు మహారాణులకు పెనుగొండ మార్గము చూపించసాగిరి. రాణులందరిని
గోదావరీ నది దాటవేయుటకు గూఢచారులతోపేటు సేనామంత్రులు, గ్రామస్తులు
మెదలైనవారు పడవలు సిద్దము చెసి నది దాటించి సహాయబడిరి.
రాజమహేంద్రి నగర పౌరులలో కొంతమంది పెద్దవారు. రాజు
సన్నిహితులు సచివులు, బందువులు
రాజు వద్దకు వెళ్ళి "ఓ చంద్రవంశాధీశా! స్త్రీలయెడ వాదులాడకు. దుఃఖించుచున్న
స్త్రీలు నీకు అడ్డుపడుట నీకు అపశకునం. నీవు వాసవిని మరచి, పెళ్ళికి
ప్రయాణం విరమించుట శ్రేయస్కరం" అని నచ్చజెప్పిరి. రాజు కామాంధత్వముతో
సన్నిహితులను గాంచి "ఓ సచివులారా! కోమట్లు వాసవి నిచ్చి పెళ్ళి చేయనియెడల
వారినందరిని యుద్దములో ఓడించెదను. నన్ను బలము లేనివాడననుకోవద్దు. పెనుగొండ
ప్రయాణానికి మీరు అడ్డుపడవద్దు" అని వెళ్ళుచుండెను. వారందరూ రాజుకు
వినాశకాలమెచ్చిందని మిన్నకుండి మనసులో అసహ్యించుకొనిరి.
రాజుకు అష్టకష్టాలు ప్రారంభము:-
పెనుగొండకు వెళ్ళుచున్న రాజును నిలుపుటకు ఎవ్వరితరము కాకపోయెను.
సాయంత్రంవేళ పెనుగాలు ప్రారంభమయ్యి వాతావరణం బీభత్సముగానుండెను. పొలిమేర దయ్యం
రాజునుబట్టెను. గుర్రం పై నుండి క్ర్ందకు పడి గాయములవ్వగా రాజు భయముతో
వణకుచుండెను. కన్నులందు నీరుగారసాగెను. తత్తరపడెను. అతనికి ఒక భూతం
పడద్రోసినట్లుండెను. అతను వజ్రకిరీటమును దూరముగా పారవేసెను. రత్నమణిమయ హారములనుఅ
తీసివేసి వస్త్రములను చించుకొనెను. భటవర్గమంతయూ రాజు చేష్టలకు పకపకనవ్విరి.
హాస్యముతో నవ్వనివారులేరు. చంద్రవంశాదీశుడు సైన్యముతో వాహనములపై వచ్చిన మార్గముననే
కొంట సేపటికి పాదయాత్రతో అప్తులు, మంత్రులు, బాంధవులు, రాజు
భార్యలు గుంపులుగుంపులుగా వచ్చి రాజు చేయుచున్న చిత్రవిచిత్ర చేష్టలకు
ఆశ్చర్యపడిరి. కొందరు ఆనందపడిరి. భార్యలందరూ దుఃఖముతో భర్తను లేవదీసి పరిచర్యలు
చేసెను. రాజవైద్యులతో ఆకుపసరు తెప్పించి తగిలిన గాయములకు కట్లు కట్టించిరి. ఆ
సమయమున గూడఛారులు ఆ ప్రాంత చుట్టుప్రక్కలకు వెళ్ళి అది ఏ ప్రాంతమె తెలుసుకొనిరి.
వారు ఆస్థానమంత్రితో "ఈ ప్రాంతము గణాపతులు, బ్రహ్మణులు,
సిద్దాంతులుండు ప్రదేశము" అని చెప్పిరి. ఆ రాత్రివేళ కొందరు
బ్రాహ్మణులు వచ్చి రాజును పరిశీలించి అతనికి దయ్యము పట్టిందని చెప్పి మంత్రములు,
తంత్రములు ప్రయెగించి మహరాజునుండి దయ్యమును పారద్రోలిరి.
పిచ్చివేషాలు మాయమై రాజు మాట్లాడెను. భర్తను మామూలు మనిషిని చేసినందుకు రాణులు,
అచ్చట సిద్దాంతులకుగాను ప్రత్యేకముగా ఒక గ్రామమును బహూకరించి ఆ
నగరానికి "సిద్దాంతుల నగరం" అని పేరు పెట్టిరి. అదియే ఇప్పుడు
సిద్దాంతము - అగ్రహారము అని పేరు.
విష్ణువర్ధనుడు "పెనుగొండకు సేనను కదిలించండి"
అని సేనామంత్రితో చెప్పెను. మరల అందరూ బయలుదేరి కొంతదూరము వెళ్ళిరి. ఆ రాతివేళ
పెద్ద శబ్దముతో విష్ణువర్ధనరాజుకు అతి దగ్గరలో పిడుగుపడెను. రాజు భయపడెను. అప్పుడు
ఆకాశమున ’తళుక్ తళిక్’ ని మెరుపు మెరిసెను. అందుకు ఆ నగరానికి "తణుకు"
అని పేరు వెచ్చెను. మరో గ్రామమున భూపాలుని వడలు (శరీరము) వణకినది. కనుక
"వడాలి" అను పేరు వచ్చెను.
పెనుగాలి, వాన ప్రారంభమాయెను. సేన
వెళ్ళుచుండగా నీటివాన రక్తవానగా మారెను. విష్ణువర్దునుని చుట్టూ కుక్కలు, నక్కలు తిరుగుచుండెను. మహామంత్రి, సేనామంత్రి "ఓ
మహారాజా! ఇటువంటి పెళ్ళి మేమెక్కడా చూడలేదు" అని అపహాస్యమాడిరి. కొంత సేపటికి
కొంచెం ప్రకృతు శాంతించింది. ఆ రాత్రికి అందరూ అక్కడే విశ్రమించిరి.
తెల్లవారింది మహరాజు సేనామంత్రితో "ఆర్యవైశ్యులు నన్ను మాఘశుద్ద అష్టమికి పెళ్ళికి రమ్మన్నారు. మనం త్వరగా బయలుదేరాలు" అని త్వరపెట్టెను. ఆరోజు వారు బాహుదూరం ప్రయాణించిరి. సూర్యుని ప్రతాపం తీవ్రంగా ఉన్నది. సైన్యములోని కొందరు భటులు ఎండవేడికి అలసటచెంది వెనుకబడిరి. రాజుకు కూడా శరీరశ్రమ అధికమైనట్లున్నది. సేనామంత్రి మెదలైనవారు "మహరాజా! ఎండవేడి మూర్చవచ్చేటట్లు తీవ్రముగానున్నది. కొంతసేపు విశ్రమించి మరల బయలుదేరుట మంచిది" అని ఎక్కడవారక్కడ మార్గములోని చెట్లక్రింద విశ్రమించిరి. భూపాలునకు మాత్రం కాలయాపన చేయుచున్నట్లున్నది. అతను తోచక మార్జాలపారవారం చేయుచూ ఆకాశము వంక చూసెను. దేదీప్యమానముగా వెలుగుచున్న సూర్యభగవానుడు కనబడెను. విష్ణువర్ధనుడు "ఓరీ సూర్యుడా! నిదానంగా వెళుతూ ఇక్కడే సంచరిస్తున్నావెందుకు? సమయం గడవడం లేదు. నీవెళ్ళిపోతే నాకొక రోజు కలిసివస్తుంది. పశ్చిమదిశకు వెళ్ళు" అనెను. మరికొంతసేపటికి మరల " నీ రథం కదలడం లేదా? నిదురపోతున్నావా ఏమిటి?" అంటూ నిందించెను. సూర్యుడు కోపంతో "విష్ణువర్ధనా! కామాంధత్వముతో ఏమి మాత్లాడుతున్నావో నీకు తెలియడం లేదు. పవిత్ర చంద్రవంశంలో జన్మించి అసురనివలె, ధర్మ విరుద్దముగా ప్రపంచ రక్షకుడనైన నన్ను తూలనాడుచున్నావు. ఆర్యవైశ్య కాంతను కోరిన నీ ముఖము చూసినా నాకు పాపమంతును. పూర్వము కీచకుడనేవాడు ఇలాగే నన్ను దూషించి చచ్చి నరకానికి వెళ్ళాడు. నీకునూ అదే గతి పట్టుగాక" అని పశ్చిమకొండల చాటుకు వెళ్ళిపోయెను. పెనుగొండ మార్గమున పయనిస్తున్న రాజునకు కొంతసేపటికి చంద్రోదయమాయెను. విష్ణువర్ధనుడు "ఓరీ చంద్రా! ఇంతకుముందే సూర్యుణ్ణి నా పరాక్రమముతో పంపించివేశాను. అప్పుడే నీవు దాపురించావా?" అని చంద్రుణ్ణి కూడా తూలనాడెను. చంద్రుడు "ఓ రాజా! పవిత్రమైన నా వంశంలో జన్మించి, నన్ను నిందించి, నీ నాశనమును కొనితెచ్చుకున్నావు. నీకు మృత్యువు సమీపించి నది" అని శపించి అదృశ్యమయ్యెను. ఆ విధముగా ప్రయాణించి బ్రాహ్మీ ముహూర్తమున పెనుగొండ నగర ఉద్యానవనమునకు విష్ణువర్ధనుడు, అతని సైన్యము చేరిరి. భటుల వెళ్ళి రాజు వచ్చిన వార్త కుసుమరాజుకు చెప్పిరి. ఇంకనూ వరుడి తరుపున పెళ్ళి సామాగ్రి సిద్దముచేసి తెచ్చినామని కూడా చెప్పిరి. శ్రేష్టిగారు మహరాజును గ్రామంలోకి రప్పించక కాలయాపన చేయుటకుగాను ఆర్యవైశ్య యువజనులను వనమునకు పంపెను. కొందరు మహాఘటికులైన యువజనులు ఉద్యానవనం చేరిరి. మహరాజుతో "బావగారూ! మా ఆర్యవైశ్య కులమున ’విడిది’ అను ఆచారము కలదు. కాబోవు అల్లుడు వివాహమునకు పూర్వము కన్యాదాతగారి గృహమునకు అరుదెంచరాదు. అలా వచ్చిన యెడల ఆ పెళ్ళి జరగదు. కావున నీవు, నీ సైన్యం ఈ ఉద్యానవనముననే నివసించి, ఇదియే ’విడిది’ అనుకొనవలెను. సాహసించి నగర ప్రవేశం చేయరాదు" అని చెప్పిరి. భూపాలుడు ’గతికితే అతుకదు’ వలె ’విడిది’ కూడా ఆర్యవైశ్యులకు ఆచారమనుకొని ఆ ఉద్యానవనము నందే సైన్యముతో సహా బసచేసెను. సైన్యమతయూ డేరాలు వేసుకొని నివసించిరి. బహుదూరము నుండి వచ్చిన వీరందరూ వారివారి వాహనములైన గుర్రములు, ఏనుగులకు విశ్రాంతినిచ్చిరి. రారాజు రాజమహేంద్రి నుండి తెప్పించిన తన రత్న సింహాసనము నధిరోహించెను. ఆర్యవైశ్య యువజనులందరిని రాజు కుశలప్రశ్నలు వేసెను.
యువజనులు విష్ణువర్ధనుని ’పెండ్లి’ కుమారుని చేయుట:-
కొంత సమయమైన తదుపరి విష్ణువర్ధనుడు ఆర్యవైశ్య యువకులతో "ఓ బావమరుదులారా! నాకు పెండ్లి సమయము ఆసన్నమైనది. కాలయాపన చేయక త్వరగా వివాహము చేయుడు. త్వరితముగా మరల నేను దక్షిణదేశ దండయాత్రకెళ్ళదను" అని త్వరపెట్టెను. అప్పుడు యువజనులు మహా తెలివిగా "ఓ బావగారూ! ముందుగ మేము నిన్ను పెండ్లి కుమారుని చేసెదము. నీవు రాజమహేంద్రికి వెళ్ళిన క్షణము నుండి ఆర్యవైశ్యుల మందరము నిన్ను తలచుకొనని క్షణములేదు. నీవెప్పుడు వస్తే అప్పుడు పెండ్లికుమారుని చేయమని మా ఆర్యవైశ్యరాజు కుసుమ శ్రేష్ఠి మమ్ములను పంపించెను" అని చెప్పిరి. అప్పుడు యుజవనులతో వాసవీదేవికి తండ్రి వరుసైన బింబాధర శ్రేష్టి యువకుడు వచ్చి ఒక రాయిని తెచ్చి రాజును "అల్లుడా! సింహాసనుఅముగా భావించి కూర్చొనుము" అనెను. అదికూడా ఆర్యవైశ్య ఆచారమనుకొని రాజు రత్న సింహాసనమును విడనాడి రాయిపై కూర్చొండెను. ఆ తదుపరి వాసవికి అల్లుడు వరుసైన కామేశ్వరగుప్త ముందుకు వచ్చిన పగిలిన కుండముక్కను తెచ్చి రాజుతో "ఓ మామగారూ! ఈ అద్దములో నీ మెమును చూడుము. ఇది మా గౌరవము!" అని అనగా రారాజు ఆనందముతో కుండముక్క నద్దముగా చూసుకొనెను.
వెంటనే వాసవికి తమ్ముడు వరుసయగు చక్రపాణిశ్రేష్ఠి, భోంచేసిన విస్తరి ఒకటి తెచ్చి దానికి పుల్ల గ్రుచ్చి రారాజు పైన ఉంచి "బావగారూ! ఇది నీ గొడుగు! బాగున్నదా!" అనెను. అప్పుడు ఆ విస్తరిలోని తినగా మిగిలినపోయిన పదార్థములు విష్ణువర్ధునిపై పడుచుండెను. రారాజు "గొడుగు బాగున్నది" అని చెప్పెను. తదనంతరం వాసవికి అన్న వరుసయగు నరేంద్రగుప్త యను యువకుడు కాయగూరలతో దండ ఒకటి సిద్దము చేసి "బావగారూ! ఇది నీ కంఠమాల" అని చెప్పి మహరాజు మెడలో ధరించెను. అప్పుడు మరికొందరు బిడ్దలు రాజు శరీరమునకు సున్నము, పసుపు పూసిరి. యువజనులు చేయు వింత పనులకు భూపాలుడు క్రోధము లేక ఆనందముతో నుండెను. ఇవన్నియూ ఆర్యవైశ్యుల ఆచారములు కాబోలుననుకొని సంతృప్తి పడెను. ఎవరు ఏమిచేసినా, కామాంధుడైనా రాజు ఆవేశము చెందలేదు. అక్కడనే ఉన్న రాజమంత్రి, మహామంత్రి, పారావార మహాసైన్యమంతయూ రాజు అవతారమును చూసి పకపక నవ్వుచుండిరి. వారితో కలసి రాజు కూడా నవ్వసాగెను. కొందరు వేగులు రహస్యముగా బయలుదేరివెళ్ళి కుసుమ రాజాగారితో రాజు విషయములు చెప్పి రాజును వనమున వుంచి కాలయాపన చేయుచున్నామని తెలియపరచిరి.
0 Comments