Chaitra Masa sankashtahara Chaturthi Vrata Katha - చైత్ర మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ

Chaitra Masa sankashtahara Chaturthi Vrata Katha - చైత్ర మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ
 Chaitra Masa sankashtahara Chaturthi Vrata Katha - చైత్ర మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ

పార్వతి దేవి మహాగణపతితో అయ్యా గణపతి! చైత్ర మాసమున సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించు విధానమును వివరింపుము అని కోరగా గణపతి ఇట్లు చెప్ప సాగెను. అమ్మ సర్వమంగళ చైత్ర మాసమున నన్ను వికటుడు అను పేరున పూజించ వలెను.

ఈ మాసమున నన్ను భక్తి పూజించి స్మరించి వారికి సర్వకార్యాములు సిద్దించును. ఇందులకు అద్భుతమైన కథను తెలిపెదను వినుము. పూర్వం కృత యుగమున మకరద్వజుడు అను రాజు గలడు ఇతని రాజ్యమున ప్రజలు సుఖజీవులై ఉండిరి. ఇతడు మహదాత దర్మాత అయినను సంతనము లేదు యాజ్ఞవల్యక మహర్షి ‍అనుగ్రహము వలన కొంత కాలమునకు ఒక కుమారుడు కలిగేను. రాజు రాజ్య బారము అంతయు మంత్రికి అప్పగించి తన కుమారునికి రాజ్యపాలన విధానములు నేర్పుటకై నిమగునుడై ఉండేను.

మంత్రికి గుణవతి శీలవతి దార్మిక చిత్త గలుగు ఒక కోడలు గలదు. ఈమె ప్రతి చైత్ర మాస కృష్ణ పక్ష చతుర్థి నాడు గణపతిని భక్తి శ్రద్దలతో పూజించుచుండేను. ఇది చూచి ఈమె అత్తగారు కోడలన్ని నీవు ఎందులకి ఈ వ్రతమును చేయుచున్నావు అని మాటిమాటికి ప్రశ్నింప సాగేను. అత్త ఎంతగా మందిలిచినను కోడలు వ్రతమును అట్లే సక్త్రముగా చేయుచుండేను. అందులకు కోపగించిన అత్త నీవు ఈ వ్రతము మానుకోనచో నీవు ఇంట్లో నుండి తరిమివేయుదును అని కడితముగా పలికెను. అంతట కోడలు అత్తగారు ఉత్తమ ఫల పేక్షలతో సకల కష్ట నివారణార్థమై ఈ సంకష్టహర చతుర్థి వ్రతము చేయుచున్నాను అని అనేను.

అత్త మరి కోపించినదై కూమారుని పిలిచి కుమారా! ఎంత చెప్పినను నీ భార్య ఈ గణపతి వ్రతమును మానుకోవడం లేదు కష్ట నివారకుడగు ఆ గణపతి ఎక్కడ ఉన్నాడు అనుచు అతని మనుస్సును కలిషతమును చేసేను. తల్లి మాటలే నిజము అని నమ్మి అనేక విధాములుగా భార్యను హింసంపసాగేను.

అంతట ఆ కోడలు స్వామి గణేష! నాపై దయలేదా ఇంత జరుగుచున్న ఏలా ఉరుకున్నావు నా ప్రార్థన మనించి మా అత్తగారికి నీ యందు భక్తి కలుగునట్లు చేయుము అని వినివించుకోనేను. గణపతి ఆమె ప్రార్థనలు ఆలకించి రాజు చూచుండగనే రాకుమారుని మాయం చేసి మంత్రి ఇంట దాచై ఉంచేను. కుమారుని కానక రాజు మంత్రిని పిలిచి కుమారుని అచుకి తెలుసుకొమని ఆజ్ఞా పించేను. భటులు వేతికి వేతికి వేసారి వచ్చి బాలుని జాడ తెలియ లేదు అని వినవించేను.

కుమారుని దుస్తులు ఆభరణములు అని ఉన్నవి కాని కుమారుడు మాత్రం కనిపించ నందున రాజు కోపించి మంత్రిని పిలిచి మంత్రి నిజము చెప్పుము మా కుమారుని ఏమి చేసితివి ఎచ్చట దాచితివి చెప్పవేమి నీవు చెప్పనచో నిన్ను నీ వంశమును సములముగా నశనము గావించేదను అని మంత్రిని మందలించేను. ఇది అంత మంత్రికి ఆగతం గోచరం కాగ ఇంటికి వచ్చి జరిగినది అంతా వివరించేను.

మామగారి మాటలు విన్న కోడలు మామ ఏలా భయపడదవు సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించినచో రాకుమారుడు తపక లభించును నా మాట నమ్మడి అని వినవించేను. అంతట మంత్రి రాజుకు చెప్పి గణపతి వ్రతము చేయిచేను.

గణపతి సంతోషించి రాకుమారుని తేచ్చి ఇచ్చేను అందరు అనందించిరి. రాజు మంత్రితో నీ కోడలు హితబోద దయ వలన నా కోడకు నాకు లభించినాడు. ఇటి నీ కోడలు మికిలి ధన్యురాలు ఉత్తమురాలు ఈమె వలన మీరు ధన్యులు అను కృత్తజ్ఞతలు తెలిపెను. ఈ సనివేశమును చూసి రాజు పలుకు విని అంత ఆచర్యపడి బుద్ది తెచ్చుకొని కోడలని అప్యాయముగ చూడసాగేను. కోడలు ఆచరించే సంకష్ట చతుర్థి వ్రతమున తానును సహరించు ఉండేను.

గణపతి కృప వలన ఎట్టి మనస్సపర్థలు లేక మంత్రి కుంటుబము సుఖశాంతులతో వర్థిలేను. శ్రీ కృష్ణుడు ధర్మరాజా నీవు ఈ వ్రతమును గాంచి ధన్యుడు గావుము అని ఉపదేసించేను.

అని ఇట్లు శ్రీ కృష్ణ సంభవాత్మక సంకష్ట హర చతుర్థి వ్రతమున చైత్ర మాసమున కథ సమాప్తము

మంగళం శ్రీ గణేశాయా మంగళం

సంకష్టహర మూర్తియే మంగాలాయ

నివాసాయా భక్తాభీష్ట ప్రదాయినే

శ్రీ విఘ్నేశ్వర ఫల సిద్ది రస్తు

ఓం శాంతిః శాంతిః శాంతిః

నూతన యజ్ఞోపవీత ధారణ