Bahuparaakulu - బహుపరాకులు
Vasavi Bahuparaakulu - వాసవి బహుపరాకులు |
1.
అంబా శ్రీ వాసవాంబా! ఆది శక్తి స్వరూణీ బహుపరాక్ బహుపరాక్
2.
అకల్మష కృపామూర్తి ! అశేషానందదాయినీ బహుపరాక్ బహుపరాక్
3.
అష్టసిద్దిప్రదా అంబా ! అష్ట్యైశ్వర్య ప్రదాయినీ బహుపరాక్ బహుపరాక్
4.
అఖిలాగ మార్చితాంఘ్రీ - అనంత ముక్తిదాయినీ బహుపరాక్ బహుపరాక్
5.
అమృతాంసు బింబకోటి సముద్దీప్త శుభాననా బహుపరాక్ బహుపరాక్
6.
అనర్ఘరత్న కాంచన వస్త్ర భాస్వత్కటీ తటీ బహుపరాక్ బహుపరాక్
7.
అష్టాదశ పట్టణాన్విత విట్సామ్రాజ్య పోషిణీ బహుపరాక్ బహుపరాక్
8.
అమేయ శాంతి స్వరూపా! అహింసావ్రత దీక్షితా బహుపరాక్ బహుపరాక్
9.
అహింసాత్మక వినూత్న రణస్రష్టా! అభంగురా! బహుపరాక్ బహుపరాక్
10.
ఆర్యవైశ్య కులోద్బూతా! అర్షధర్మ, ప్రబోధినీ బహుపరాక్ బహుపరాక్
11.
ఆబాల గోప విదితా ఆదర్శమయజీవితా బహుపరాక్ బహుపరాక్
12.
ఆత్మగౌరవ సౌజన్య బోధినీ, ఆత్మరూపిణీ బహుపరాక్ బహుపరాక్
13.
ఆత్మత్యాగ మహాయజ్ఞకారిణీ! ఆత్మరూపిణీ బహుపరాక్ బహుపరాక్
14.
ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణీ, ఇంది శీతలా బహుపరాక్ బహుపరాక్
15.
ఇష్టకామ్యార్థ ఫలదా! ఈతిబాధా నివారిణీ! బహుపరాక్ బహుపరాక్
16.
ఊహాతీత ప్రభావాఢ్యా! ఊర్ధ్వలోక గతిప్రదా! బహుపరాక్ బహుపరాక్
17.
ఋతస్వరూపిణి దేవీ! ఋణత్రయ నివారిణీ! బహుపరాక్ బహుపరాక్
18.
ఐహికా ముష్మికాఖిల సౌఖ్యానంద ప్రదాయినీ బహుపరాక్ బహుపరాక్
19.
ఓంకార మూల బీజాత్మా! ఔదార్య రసవాహినీ! బహుపరాక్ బహుపరాక్
20.
కమ్ర గోదావరీ తన్వీ నిత్యధౌత పదాంబుజా బహుపరాక్ బహుపరాక్
21.
కమనీయర్చావతారా ! కన్యకా పరమేశ్వరీ బహుపరాక్ బహుపరాక్
22.
కళావతీ! కళారూపా! కళాధారా! కళానిధీ బహుపరాక్ బహుపరాక్
23.
కర్మయెగాంతఫలదా!
కర్మయెగ ప్రబోధినీ బహుపరాక్ బహుపరాక్
24.
కర్మబంధాఖిలచ్చేద్యా!
కలికల్మష హారిణీ బహుపరాక్ బహుపరాక్
25.
కామక్రోధ
లోభమెహమద మాత్సర్యనాశినీ బహుపరాక్
బహుపరాక్
26.
కుసుంభాగర్భ
సంభూతా! కుమారీ! క్రోధ నాశనీ బహుపరాక్
బహుపరాక్
27.
గీతామృత
సారమూర్తి! గోప్త్రీ! గోవింద సోదరీ బహుపరాక్
బహుపరాక్
28.
చరాచర
జగన్నేత్రీ ! చతురాసన పూజితా బహుపరాక్
బహుపరాక్
29.
చతుష్టష్టి
కళారూపా! చతుర్ధశ రూపశోభితా బహుపరాక్
బహుపరాక్
30.
చిదగ్నికుండ
సంభూతా! చిన్మయానంద రూపిణీ బహుపరాక్
బహుపరాక్
31.
త్యాగమయీ!
త్యాగయెగా! త్యాగధర్మ ప్రబోధినీ బహుపరాక్
బహుపరాక్
32.
త్యాగాగ్ని
జ్వాలా మండిత ప్రచండోజ్జ్వల రూపిణీ బహుపరాక్
బహుపరాక్
33.
ధర్మ రూపా!
ధర్మాధారా ! ధర్మదా, ధర్మవర్ధినీ బహుపరాక్ బహుపరాక్
34.
ధర్మనందన
సంపూజ్యా! ధరణీ భార నివారిణీ బహుపరాక్
బహుపరాక్
35.
ద్యుత్తర
శత హోమకుండ మహాయజ్ఞ ప్రదాయినీ బహుపరాక్
బహుపరాక్
36.
ద్యుత్తర
శత లింగాన్విత దివ్య పట్టణ వాసినీ బహుపరాక్
బహుపరాక్
37.
నవావరణ
చక్రేశీ! నవదుర్గా స్వరూపిణీ బహుపరాక్
బహుపరాక్
38.
నవరాత్రీ
మహః కలితా! నందివిద్యాస్వరూపిణీ బహుపరాక్
బహుపరాక్
39.
నందగోపసుతారూపా!
నగరి పెనుగొండేశ్వరీ బహుపరాక్ బహుపరాక్
40.
పరాశక్తీ!
పరావిద్యా! పరంధామా! పరాత్పరీ బహుపరాక్
బహుపరాక్
41.
పుత్రకామేష్టి
సుఫలా! పురుషార్థ ప్రదాయినీ బహుపరాక్
బహుపరాక్
42.
బ్రహ్మకుండాది
సుక్షేత్ర పరివేష్టిత పీఠికా బహుపరాక్
బహుపరాక్
43.
మణిద్వీప
మహారాజ్ఞీ! మణీసింహాసన స్థితా బహుపరాక్
బహుపరాక్
44.
మహాకాళీ!
మహాలక్ష్మీ! మాతా మహాసరస్వతీ బహుపరాక్
బహుపరాక్
45.
యెగనిద్రా!
యెగమాయా! యెగయెగేశ్వరేశ్వరీ బహుపరాక్
బహుపరాక్
46.
రాగతాళ
భావానందా! రాగయెగ ఫలప్రదా బహుపరాక్
బహుపరాక్
47.
లక్ష్మీ
వాక్సతీగిరిజా లక్షణాంచిత విగ్రహా బహుపరాక్
బహుపరాక్
48.
వరాద్బుత
శాంత్యహింసా త్యాగాయుధ ప్రదాయినీ బహుపరాక్
బహుపరాక్
49.
విశ్వాధారా!
విశ్వారూపా!విశ్వపాపవినాశినీ బహుపరాక్
బహుపరాక్
50.
వివాహ
రహితా! విజ్ఞా!విరూపాక్ష సహోదరి బహుపరాక్
బహుపరాక్
51.
విష్ణువర్ధన
సంహర్త్రీ!వీరధర్మావతారిణీ బహుపరాక్
బహుపరాక్
52.
వైశాఖ
శుద్ద దశమీ భృగువాసర సంభవా బహుపరాక్
బహుపరాక్
53.
శ్రీ
చక్రపుర సామ్రాజ్జీ! శ్రీ మత్సంహాసనేశ్వరీ బహుపరాక్
బహుపరాక్
54.
సర్వార్ధ
సాధక చక్రస్వామినీ! సర్వమెహినీ బహుపరాక్
బహుపరాక్
55.
సర్వసిద్దిప్రద
చక్రస్వామినీ సర్వకామదా బహుపరాక్ బహుపరాక్
56.
సర్వ
సౌభాగ్యదాయక కన్యాచక్ర విహారిణీ బహుపరాక్
బహుపరాక్
57.
సర్వానంద
మయ చక్రస్వామినీ! సర్వతోముఖీ బహుపరాక్
బహుపరాక్
58.
సర్వరోగహార
శ్రీ చక్రస్వామినీ! సర్వక్షేమదా బహుపరాక్
బహుపరాక్
59.
సర్వసంక్షోభణ
చక్రస్వామినీ!సద్గతి ప్రదా బహుపరాక్
బహుపరాక్
60.
సర్వసన్నుత
మహా గౌరవబాలికా సంఘ నాయికా బహుపరాక్
బహుపరాక్
61.
సర్వోత్తమ
మహా బాలనాగర సేనానివహ సేవితా బహుపరాక్
బహుపరాక్
62.
హంస
మంత్రార్థరూపా !హవ్యవాహ సమర్చితా బహుపరాక్
బహుపరాక్
63.
హ్రీంకారాగ్ని
పరంజ్యోతీ! హ్రీంకార కన్యకామణీ బహుపరాక్
బహుపరాక్
64.
క్షమాశీలా!
క్షామహన్త్రీ! క్షేత్రపాల సమర్చితా బహుపరాక్
బహుపరాక్
65.
ఆదికన్యా!
శ్రీ కన్యకా! కన్యకాపరమేశ్వరీ బహుపరాక్
బహుపరాక్
66. వైశ్య వర్ణ సముద్ధర్తీ! వాసవీ కన్యకాంబికా బహుపరాక్ బహుపరాక్
సూచన: ఈ బహుపరాకులను పాటవలెగాక వచనంవలె ఉత్తేజంతో
పలుకవలెను. ఒకరు ప్రతిపంక్తి పఠించిన వెంటనే మిగిలిన వారందరూ సామూహికముగా బహుపరాక్
బహుపరాక్ అని ఎలిగెత్తి పలుకవలెను
బహుపరాక్ 2
శ్రీ వైశ్యకులములో, సిరిగల్గి, జన్మించె, గుణశాలియైనట్టి, కుసుమశెట్టి బహుపరాక్
అతనికి కులసతియైన, కుసుమాంబయువన్నెగాంచెను, పతివ్రతలలోన బహుపరాక్
వారిద్దరును, భోగవైభవంబులను పొంది, సంతానంబులేక చింతతోను బహుపరాక్
పుత్రకామేష్టియు, పొలు పొందగావించె, అగ్ని హోత్రుడు మెచ్చె, అమిత కరుణ బహుపరాక్
మీకు సంతానంబు, మెరయుకద్దని, పలికిన, సంతోషంబు, నుండె నంత్తవేడ బహుపరాక్
దమరుకుసుమాంబ, గర్భంబు, దాల్చెనంత్త బహుపరాక్
నవమాసంబులు మెసి, ప్రసవించె, కుసుమాంబ, శుభవైశాఖ, దశమి యందు బహుపరాక్
అపుడా శిశువుకు, పార్వతి కన్యయనుచు, పేరుపెట్టిరి, పెద్దలు ప్రేమతోడ బహుపరాక్
ఒకటి అంటే ఒకటి కాదు బహుపరాక్
రెండు అంటే రెండు కాదు బహుపరాక్
మూడు అంటే మూడు కాదు బహుపరాక్
నాల్గు అంటే నాల్గు కాదు బహుపరాక్
ఐదు అంటే ఐదు కాదు బహుపరాక్
ఆరు అంటే ఆరు కాదు బహుపరాక్
ఏడు అంటే ఏడు కాదు బహుపరాక్
ఎనిమిది అంటే ఏడు కాదు బహుపరాక్
తొమ్మిది అంటే తొమ్మిది కాదు బహుపరాక్
పది అంటే పది కాదు బహుపరాక్
పది అనగా దశావతారములు బహుపరాక్
తొమ్మిది అనగా నవగ్రహములు బహుపరాక్
ఎనిమిది అనగా అష్టవసువులు బహుపరాక్
ఏడు అనగా సప్తమహర్షులు బహుపరాక్
ఆరు అనగా అరిషడ్వర్గములు బహుపరాక్
ఐదు అనగా పంచ భూతములు బహుపరాక్
నాల్గు అనగా వేదములు బహుపరాక్
మూడు అనగా త్రిగుణములు బహుపరాక్
రెండు అనగా సూర్యచంద్రులు బహుపరాక్
ఒకటి అనగా వాసవి కన్యకయే బహుపరాక్
కులముద్దరించిన తల్లికి గోవిందా, గోవిందా బహుపరాక్
0 Comments