Sri Vasavi Kanyaka Parameswari Devi 5
శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము
Sri Vasavi Kanyaka Parameswari Devi 5 శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము |
వాసవీ విరూపాక్షులు జన్మించుట
కాలక్రమమున గర్భవతియగు కుసుమాంబకు 11 మాసములు నిండినవి. ప్రభవనామ సంవత్సరము వసంత
ఋతువు, పవిత్ర వైశాఖమాసము, శుక్లపక్షమి, దశమి తిధి, మంగళకరమైన
శుక్రవారము, ప్రాతఃకాలము ,పునర్వసు
నక్షత్రమున, అంతఃపురములో కుసుమాంబకు మహాతేజోవంతమున
స్త్రీ శిశివును ఉదయించెను. శుభలగ్నమునందు
ఉచ్చస్థలములైయుండెడు మూడు గ్రహములు
శుభదృష్టితో గాంచుచుండ ఈ బిడ్డలు
ఉదయించిరి. దేవతలు ఆకాశ మార్గమునుండి
పెనుగొండ నగరమున పుష్పవర్షము కురిపించిరి. తదుపరి నందీశ్వరాంశతో ఒక పురుష
శిశువు జన్మించెను. కైలాసములోని చండీశ్వర, భృంగీశ్వర గణములు
పరమానందముతో పుష్పవర్షము కురిపించిరి. కుసుమశ్రేష్ఠ్ "కవలబిడ్డలు"
జన్మించినారని విని ఆనంద బాష్పములతో వెండి గొలుసులతో ఉన్న బంగారు ఊయలలు రెండు
తెప్పించి శిశు ద్వయాన్ని ఊయలలో పరుండపెట్టగా మహిళలందరూ లాలిపాటలు, జోలపాటలు పాడిరి. పురజనులందరూ కుసుమదంపతుల శిశువులను చూచుటకై
వచ్చుచుండెను. వందలాది మహర్షులు వచ్చి "సకలవిద్యా ప్రాప్తిరస్తు" అని
దీవించిరి. ఈ జంటబిడ్డలు లక్ష్మీ చంద్రులా! రామ లక్ష్మణులా! అన్నట్లు వారి శరీరము
కోటి చంద్రుల కాంతితో ధవళవర్ణము కలిగి చూపరులను మైమరచియుండునట్లు చేయుచుండెను. 18
నగరములోని నాగరు లందరూ సతీసమేతముగా
వాహనములపై వచ్చి బిడ్డలను దర్శించుచూ ఆశ్చర్యాను భూతులను పొందుచుండిరి
వాసవీ విరూపాక్షులు |
మూర్తిత్రయం శక్తిత్రయం
వా=వాసుదేవుడి వా=వరలక్ష్మీ
స=సత్యలోకాధిపరి స=సరస్వతి
వి=విశ్వేశ్వరుడు వి=విశ్వేశ్వరి
(పార్వతి)
వాసవీ ప్రప్రధమ విశ్వరూపము
ఊయలలో ఆడుకొనుచున్న వాసవాంబ ముందుగా అందరికీ యెగమాయను ప్రవేశింప చేసి ఆదిపరాశక్తి స్వరూపముతో తేజోమయముగా విశ్వరూపము ప్రదర్శించెను. చతుర్భుజములు కలిగి ఒక హస్తమందు పద్మము పైనున్న నగరేశ్వర లింగముతోను, మరియెక్క హస్తమున పచ్చ చిలకను, వరదాభయ హస్తములతో మెత్తము నాలుగు చేతులతో, బంగారు వన్నెకలిగిన శరీరచ్ఛాయతో నవరత్న మణికుండల హారముతోనూ, దివ్యరత్న ఖచిత భూషణములతోను తల్లిదండ్రులు గురు భాస్కరాచార్య దంపతులకు ఈ నలుగురికి దివ్య దర్శనమివ్వగా అమ్మవారి తేజోధాటికి మానవ నేత్రములతో ఆమె రూపమును వారు గాంచలేక పోయిరి. కన్యకాంబ వీరికి జ్ఞాననేత్రములను ప్రసాదించెను. నేత్రానందముగా శక్తి స్వరూపిణి గాంచిరి. తదుపరి ప్రవేశించిన యెగమాయను వాసవాంబ నిలిపివేసెను. విశ్వరూపమున గాంచిన నలుగురు స్వప్న సమానముగా భావించి మరచిపోయిరి.
వాసవీ లీలలు
ఒకనాడు కుసుమాంబ వాసవితో
ముద్దులాడుచూ అన్నము తినిపించు సమయమున, వాసవి మారము చేయసాగినది. నోరు తెరవమనగా బాలవాసవి
నోరు తెరచెను. అనాడు యశోస దేవి బాలకృష్ణుడు భూమండలాని చూపినట్లు, వాసవి నోటిలో భూమి
ఆకాశము, దశావతారములు, కామధేనువు, కల్పవృక్షము, సమస్త చరాచర జీవరాసులు సృష్టి అంతా వాసవినోటి
యందు చూచి ఆశ్చర్యమైనది కుసుమాంబ. ఈ విషయమును కుసుమశ్రేష్టికి, భాస్కరాచార్యుల వారికి
వివరించగా, ’వాసవి’ సామాన్యురాలు కాదని కారణ జన్మురాలై ఉండ వచ్చునని వాసవి వలన మీకు
మెక్షప్రాప్తి కల్గునని భాస్కరాచార్యులు వివరించారు. బాల్యము
నుండి వాసవి నగరేశ్వర స్వామిని సంకీర్తనా గానములు చేయుచుండేను. నగరేశ్వరుని గురించి
తపోధ్యానములతో నిమగ్నమై యుండుట వాసవికి నిత్యకృత్యమయ్యెను.
మరొకసారి నవరాత్రుల సందర్భముగా కుసుమాంబ
పరాశక్తిని అర్చించుటకు దేవీపీఠమును సిద్ధము చేసి స్వర్ణప్రతిమను ఆ పీఠము పై ఉంచబోగ
5 సంవత్సరాల వయస్సున్న వాసవి ఆ పీఠము పై కూర్చొని యుండుట చూచి కుసుమాంబ కుసుమ శ్రేష్టి
ఇరువురూ అపచారము జరిగినదని వాసవిని ఆ పీఠము పై నుండి క్రిందకు దింపబోయిరి. వారికి బాలవాసవి
మహాలక్ష్మిగా, సరస్వతిగా, గాయత్రిగా, చండికగా, దుర్గగా, శ్రీ కృష్ణుడుగా, రాముడుగా,
యెగమాయగా, మహిషాసురమర్థనిగా నవవిధ రూపములతో దర్శనమిచ్చినది. తరువాత రాజదంపతులు, పరివారము
భాస్కరాచార్యులు అందరికి బాలవాసవిగా దర్శనమిచ్చి పీఠము నుండి వాసవీబాల దిగివచ్చినది.
వాసవీ సామాన్యురాలు కాదు ఆదిపరాశక్తి అని చూచిన అందరు తమ జన్మ సార్థకమైనదని, ధన్యజీవులు
మైనమని ఆనందించిరి.
గురుకుల విద్యాభ్యాసము
వాసవీ విరూపాక్షుల గురుకుల విద్యాభ్యాసము |
వాసవీ విరూపాక్షులకు
6 సంవత్సరములు గడువగా కుసుమ దంపతులు భాస్కరా చార్యుని సమక్షమున వైశాఖశుద్ద పంచమి గురువారం
ఆరుద్ర నక్షత్రములో అక్షరభ్యాస కార్యక్రమము వైభవముగా జరిపించిరి.గణపతి గానము, పంచాక్షరీ
మంత్రములతో, శర్వాణి శ్లోకములతో కూడియున్న గ్రంథములు బాహుళ్యముగా వచ్చిన 714 గోత్ర
ఆర్యవైశ్య బిడ్డలకు బహూకరించిరి.స్వీకరించిన బాలబాలికలు ఆనందించిరి. తల్లితండ్రులకు,
భాస్కర గురు దంపతులకు "మాతృదేవోభవ,పితృదేవభవ, గురుదేవోభవ" అని ప్రార్థించిరి.
శుభ సమయమున కవలలను గురుకుల ప్రవేశం చేయించెను
వాసవీ విరూపాక్షులను 8వ సంవత్సరమున గురుకులమునకు పంపగా వారు. ఋగ్వేదము, యజ్జుర్వేదము,సామాధర్వణ వేదములు, అష్టదశ పురాణాలు,శ్లోకములు చతుష్టష్టి కళలు, 108 ఉపనిషత్తులు,వశిష్ఠగీత భగవద్గీత, జల వాయువు, అగ్నిస్తంభన విద్యను , విరూపాక్షుడు సమస్త విద్యల యందు విలు విద్య, ఖడ్గవిద్యందు శక్తిసామర్థ్యములను గడిచెను. తల్లిదండ్రులు విద్యను అభ్యసించు చున్న వాసవాంబ విరూపాక్షులకు 9 సంవత్సర ప్రాయములో ఉత్తరాయణంలోని మార్గశుద్ద ఏకదాశి సోమావారం రోజు ఉపనయన సంస్కారము చేసిరి.
విరూపాక్షుడు
శివతాండవము లయబద్దముగా నృత్యము చేయుచుండ గాంచిన అందరూ వారివారి కృత్యములను నిలిపివేసి
తన్మయులై బాలుని చూచు చుండిరి. వాసవి సంగీతము మెదలగు లలిత కళలయందును, ఆధ్యాత్మిక విద్యలయందును
అపర సరస్వతిగా కీర్తి గాచినది. ఏకసంధాగ్రాహిగా
సకల విద్యలను నేర్చుకొనిరి.
"మానవసేవయే
మాధవసేవ" అన్న లక్ష్మము గలదైన వాసవి దీనులకు, దుఃఖితులను సేవించుచుండేను, వాసవి
దేవి ఆదిపరాశక్తి ఆరాధించుచూ తన హస్త స్పర్శచే వ్యాధి గ్రస్తులకు రోగములను నయము చేయు
చుండేను. వికాలాంగుల వికలత్వమును పోగట్టుచుండెను.గ్రుడ్డివారికి తన హస్త స్పర్శ వలను
చూపును ప్రసాదించు చుండెను.
వాసవీదేవి చాతుర్మాస్య మహావ్రతమాచరించుట
ఆరోజు ఆషాడ శుక్ల ఏకాదశి, ప్రాతః కాలముననే ర్యాలీ గ్రామంలోని శ్రీ భాస్కరాచార్య గురుకులం వైభవం సంతరించుకున్నది. ఆ రోజునే గురువర్యులు వాసవితో చాతుర్మాస్య వ్రతం ప్రారంభింప జేయడం ఒక విశేషం అష్టాదశ పట్టణాలకు ప్రభువైన చక్రవర్తి కుసుమ శ్రేష్టి అతిధులను ఆహ్వానిస్తుంటే యువరాజు విరూపాక్షుడు గురువర్యులకు వెన్నంటివుండి, వారి ఆజ్ఞతో సమస్త పూజాది వస్తువులను సిద్దం చేస్తున్నాడు. జగజ్జనని వాసవి తన తల్లియైన కుసుమాంబతో కలసి పుష్పాలు, మెదలైన పూజాసామాగ్రి సిద్దం చేస్తున్నది. కుసుమ శ్రేష్ఠికి బావమరియైన హరిశ్రేష్ఠి భోజనశాలలో వుండి, పరస్థలంవారికి భోజన భాజనాదులను చూస్తుండగా, భక్తుల రాకపోకలతో మహావైభవాన్ని సంతరించుకున్నది భాస్కరాచార్యులవారి ఆశ్రమ ప్రాంగణం! ఉదయబానుని లేలేత సూర్య కిరణాలు అప్పుడే ప్రసరించి తిమిరమును దూరంచేస్తూ ఆశ్రమ ప్రాంగణంలో ప్రసరిస్తుండగా, భాస్కరాచార్యుల వారు సంధ్యావందనం పూర్తిచేసి వేదమంత్రాల పఠనంతో యజ్ఞమును ప్రారంబించారు. అత్యంత కాంతితో స్వాహానాధుడు జ్వాలలను వ్యాపించి, ఆజ్యమును ఆద్యంతం స్వీకరించి, యజ్ఞేశ్వరుణాఖూ ప్రీతి కలిగించాడు అలా మధ్యాహ్న సమయం వరకూ యజ్ఞము సాగింది. మహా నివేదనాది మంగళహరతులను ముగుంచిన పిదవ ఆశ్రమ ప్రాంగణంలోని వేదికపై భాస్కరాచార్యులు ఆసీనులైనారు. వారి చుట్టూ మిగతా మహర్షులు, వేదవేదాంగ పండితులు, జ్ఞాన జుజ్ఞాసులు వేదుకనలంకరించారు. వేదిక సమక్షంలో ప్రత్యేకాసనంలో చక్రవర్తియైన కుసుమశ్రేష్టి చేతులు జోడించి గురువులందరికీ నమస్కరించి ఆసీనుడైనాడు. తదుపరి భాస్కరాచార్యులకు ప్రియ శిష్యురాలగు వాసవి గురువర్యల చెంతకేతెంచి పాదములకు నమస్కరించి, వింజామరముతో వీచుతూ సమయముచూచి వినయముగా "గురువర్యా... చాతుర్మాస్యవ్రతం అనగానేమి? దాని విశిష్టతను చెప్పుటకు మీరే సమర్దులు. మీ సమాధానముకై భక్తులు వేచివున్నారు దయవుంచి శలవివ్వుడు" అని ప్రార్థించింది.
శ్లో || చాతుర్మాస్య విధానజ్ఞం విధ్యుక్తవ్రత చారిణం|
ఋషిం యతివరం వన్దే భాస్కరాచార్య సద్గురుం||
ఆ ప్రశ్నకు మందహాస వదనుడైన భాస్కరాచార్యుల వారు వాసవితో "దేవీ.. సరైన సమయంలో చక్కని ప్రశ్న అడిగావు చెబుతాను విను.
చాతుర్మాస్యవ్రతమనగా నాలుగు మాసములు ఆచరించు వ్రతమని పేరు. ఆషాడ శుక్ల ఏకాదశి నాడు ఉపవాసముండి శాస్త్ర ధర్మానుసారంగా యధాశక్తి కొన్నింటినైన అనుష్థించుచూ ఈ చాతుర్మాస్య వ్రతమాచరింపవలెను.
ఈ వ్రతము నాలుగు మాసములు శ్రద్దతో ఆచరించి కార్తీక శుక్ల ద్వాదశి నాటికి పూర్తి చేయవలెను.
అపుడు కుసుమశ్రేష్టి భాస్కరాచార్యునితో "గురువర్యా.. ఈ
వ్రతమున మరి ఇంక ఏదైనను విశిష్టతలు కల్గియున్నదా? .. అని సవినయముగా కోరెను. అపుడు
భాస్కరాచార్యులవారు "ఓ కుసుమార్యా!.. ఈ నాలుగు మాసాలూ శ్రీ విష్ణు భగవానుడు
క్షీరసాగరమున శేషశయనంపై శయనించును, కార్తిక శుద్ద ద్వాదశి
రోజున యెగనిద్ర నుండి మేల్కొనును. అందుకే ఈ ఏకాదశీ ద్వాదశులకు "శయన ఏకాదశీ -
ఉత్థాన ద్వాదశీ" అనియూ, ’హరిబోధినీ’ అనియు పేరు
వచ్చింది. విష్ణువు యెగనిద్రలో ఉండుటచేత సాధువులూ, యెగులూ,
సన్యాసులూ, భక్తులూ ప్రాపంచిక వ్యవహారములను
వదలి ఈ నాలుగ మాసములు జపతపోధ్యాన విష్టాపరులు గావలెను.
విష్ణువు యెగనిద్రయందున్న ఈ చాతుర్మాస్య శుభసమయమున శ్రీ హరి
ప్రీతికై స్నాన, ధ్యాన, మంత్ర,
జప, తపో, హోమ, యజ్ఞ యాగాదులు మెదలగు పుణ్యకార్యములు విశేషంగా ఆచరించితే పూర్ణ పూణ్యఫలితం
కలుగుతుందని" భాస్కరాచార్యులవారు కుసుమరాజుకు బోధించిరి.
ఓ కుసుమ దంపతులారా...! పూర్వము మహార్ములు, యెగిపుంగవులు ఆచరించిన చాతురాస్యవ్రతమును
ఇపుడు మీరు ఈ గోదావరి తీరాన ఆచరించారు. దీనివలన మీకు శతసహస్ర పుష్కర స్నానఫలం
కలుగుతుంది!
పూర్వ పుణ్యమును రెండితలు చేయు ఈ వ్రతమును మీరిపుడు ఆచరించారు. ఇట్టి అవకాశము మరల మరల వచ్చుట బహుదుర్లభము గాన మీరు మీ పుత్ర పుత్రికతో కావలసినంత పుణ్యము ఆర్జించుకొనుడు ఓ కుసుమ దంపతులారా..! మీరు మీ బంధువులైన గోత్రీకులతో ఈ వ్రతమును ఆచరించి కృతార్దులైనారు. గీతోపనిషత్తు వచనములతో సాగుతున్న ఈ వ్రతమునందలి ఋషులకు గాంచిన కృతయుగమునందు నైమిశారణ్యస్ఫురణ కలుగుచున్నది
విష్ణువర్ధన మహారాజు చరిత్ర:-
ఆంధ్రదేశములోని తూర్పుగోదావరి నదీతీరమున ఉండునది రాజమహేంద్ర వరము. ఆ నగరములో చంద్రవంశమున జన్మించిన మహారాజు విష్ణువర్దనుడు. అతను వంశపారంపర్యముగా ఆ రాజమండ్రిని పరిపాలన చేయుచుండెను. పాండురాజు సంతానమైన పాండవమధ్యముడు అర్జునుడు. అర్జునుని కుమారుడే అభిమన్యుచక్రవర్తి. ఆతని కుమారుడు పరీక్షిన్మహారాజు. ఇఅతని కుమారుడు జనమేజయుడు. జనమేజయుని పుత్రుడు శతానందుడు. ఇతని కుమారుడు శతానీకుడు. తన సంతానమే క్షేముడు. క్షేముని కుమారుడు విజయార్క మహారాజు. కోడలు చారుమతీ దేవి. విజయార్క-చారుమతీ కుమారుడు విష్ణువర్ధన మహారాజు.
ఈ విష్ణువర్దనునకు అన్నేక మంది భార్యలు కలరు. అతని జ్యేష్టభార్య కుమారుడు రాజరాజనరేంద్రుడు. ఇతను గాక 164
మంది కుమారులు కలరు. విష్ణువర్ధనునికి జ్యేష్ఠమనవడు సారంగధరుడు. విష్ణువర్ధనునికి
మనుమలు , ఇతను గాక ఇంకనూ 236 మంది
కలరు. ఈ సారంగధరుడు శివభక్తుడు. ఇతనికి భార్య లేదు. విష్ణువర్ధన మహారాజు పాండవుల
తొమ్మిదవ మనమడుగా పేరుగాంచి రాజమహేంద్ర నగరమును ఏకఛత్రాధిపత్యముగా పరిపాలనము
చేయూచుండెను. నగరప్రజలను కన్నబిడ్డవలె చూచుచుండ ఇతనిని ప్రజలందరూ మిన్నగా భావించి
జేజేలు పలుకుచుండిరి. గదా యుద్దముతో సామంతరాజులను వధించి వారి రాజ్యములను తన
రాజమహేంద్రిలో ఐక్యము చేయుచుండెడివాడు. ఆస్థాన మంత్రి(రాజవర్మ), ప్రధానమంత్రి(సుమేధుడు), సేనామంత్రి(రత్ననాధుడు),
ముఖ్యమంత్రి(వీరసింహుడు), మహామంత్రి(సువీరుడు),
ఈ ఐదుమంది మంది మంత్రులు సలహాతో మరియు పురోహితుల సూచనలను పాటించి
విష్ణువర్ధునుడు తన రాజ్యమును పరిపాలన చేయుచుండెడివాడు. దేశములోని బహురాజ్యములు
రాజమండ్రి నగరమునకు సామంతములైయుండెను. అచ్చటి మహారాజులు విష్ణువర్దనుని యుక్తి,
కుయుక్త మేధాసంపత్తులను గాంచి గదాయుద్దమున గొప్పవాడు భీమసేనుడి
మునిమనమడైనందున "కలియుగ భీమసేనుడు" అను బిరుదుతో బిలుచుచుండెడివాడు. ఈ
మహారాజు ధర్మవాక్య పరిపాలనా విషయంలో రెండవ ధర్మరాజా అన్నట్లుగా, వైభవమున దేవేంద్రుడా యన్నట్లు పేరుగాంచెను
మహా శివపూజా ధురంధురుడు, తపశ్శక్తి సంపన్నుడగు విష్ణువర్దనుడు
ఒకరోజు హంసతూలికా తల్పముపైన నిద్రించుచుండగా అర్ధరాత్రివేళ హఠాతుగా నిద్రలేచెను.
రాజు "మహామంత్రీ" అని పిలవగానే "చిత్తం రాజా" అని మహామంత్రి
నమస్కరించెను. "ఓ మహామంత్రీ నాకు ఒక దుస్వప్నము వచ్చెను. ఆస్థాన
జ్యోతిష్కులకు, పురోహితులకు కబురు పంపించండి" అని
అనుమతివ్వగా తెల్లవారగానే జ్యోతిష్కులు, పురోహితులు వచ్చిరి.
వెంటనే రాజు "ఓ జ్యోతిష్కులారా రెండవ ఝాము దాటిన తదుపరి నేనొక దుస్వప్నమును
గాంచితిని. ఒక పరాశక్తి స్వరూపిణి కర, వాల, ఖడ్గ, ముద్గర, త్రిశూల,
శర, శంఖ, చాపములు
ఎనిమిది చేతులలో ధరించి నన్ను దున్మాడుటకు వెంటాడుచుండెను. నేను ఆ
శక్తిస్వరూపమునకు భయభ్రాంతుడనై ప్రాణములు దక్కించుకొనుటకై పరిగెడుచుండగా నన్ను ఆమె
విడువకుండా వెంటాడుచున్నది. నా శిరస్సు గగన మార్గమున ఎగురుచున్నది. నేను భీతిచెంది
నిద్రలేచితిని. కనుక ఈస్వప్నము ద్వారా భవిశ్యత్తున ఏమి జరుగునో చెప్పవలెను"
అని విష్ణువర్ధునుడు కోరెను. సభాస్థలిలోనివారి ఆస్తానములోనివారందరూ
ఆశ్చర్యచకితులైరి. తండ్రిలాంటి మా మహారాజునకు దుస్వప్నమిలా వచ్చెనే? అని భీతితోయుండిరి. జ్యోతిష్కులు రాజు జాతకం కొంటసేపు పరికించి "ఓ
మహారాజా! ఈ దుస్వప్నముద్వారా మాకు గోచరించిన విషయమేమనగా పూర్వము త్రేతాయుగమున
లంకానగరాధీశ్వరుడైన రావణబ్రహ్మ కూడా ఇటువంటి దుస్వప్నమును గాంచెను. అప్పటికి
సరియగు పదిమాసముల అనంతరం హఠాతుగా రావణుడు మరణించెను. అలాంటి దుస్వప్నము గాంచిన
నీకు మరణము సంబవించునని సూచించుచున్నది" అని తెలిపిరి. అప్పటి వరకు
శాంతముగానున్న విష్ణువర్ధన మహారాజు ఈ వార్త తెలిసిన తక్షణము మహా ఉగ్రావేశుడై
"ఓరీ జ్యోతిష్కలారా! నా రాజ్యంలో సేవచేస్తూ, నేనిచ్చిన
జీతభత్యములతో బ్రతుకుతూ, నా ప్రాణమునకే ముప్పు సంభవించునని
చెప్పుటకు మీకు సిద్దులేదా! రాజ్యధిక్కారమునకు పాల్పడిన మీ జ్యోతిష్కలందరినీ నా
ఖడ్గముతో శిరచ్చేదన చేసెదను" అని ఖడ్గము పట్టెను. వెంటనే మహామంత్రి, సేనామంత్రి "ఓ మహారాజా! శాంతించుము జ్యోతిష్కలెల్లరూ పక్షపాతము లేకుండా
సత్యము చెప్పిరి. కాన నిర్ధోషులు" అని చెప్పి జ్యోతిష్కులను పంపించివేసిరి.
రాజుకు మనస్సు శాంతించక ఆ స్వప్నముతో కలవరమెందుచూ భయపడుచుండెను. తక్షణము మానసిక
వైద్యులు విచ్చేసి "మహరాజా! ఇటువంటి దుస్వప్న ధాటికి తట్టుకొనలేని నీ మనస్సు
ఉద్వేగపూరితముగానున్నది. దీనికి పర్యవసానము ఏమనగా నీవు ఈ రాజమహేంద్రవరమును
విడచిపెట్టి కొన్ని మాసములు పరగ్రామమునకు వెళ్ళవలెను. గాలిమార్పిడి చాలా
అవసరమైయున్నది. సుదూర ప్రాంతమునకు చేరిన, తమకు దుస్వప్న భయము
పూర్తిగా పోవును. ఇది తధ్యము" అని తెల్పిరి. ఆ క్షణమున ఎత్తుకు పై ఎత్తులు
వేయుటలో గొప్పవాడైన వీరసింహుడు అనే మంత్రి "ఓ మహారాజా! మన రాజ్యమునకు
సామంతరాజ్యములు బాహుళ్యముగానున్నవి. ఆ సామంతరాజులు మనకు 4 వత్సరములనుండి పన్నులు
కట్టుట మానివేసిరి. ప్రధానమంత్రియగు సుమేధుడు మన సైన్యముతో సామంతరాజ్యమునకు
కప్పముల విషయమై వెళ్ళినప్పుడు వారు ధనమివ్వకపోగా సరైన సమాధానము కూడా చెప్పలేదట. నా
ఆలోచన ఏమనగా మనకున్న నాలుగువేల మంది సైన్యముతో బయలుదేరి దండయాత్రకు తమరు
వెళ్ళవలెను. అటు మానసిక వైద్యులు చెప్పినట్లు గాలిమార్పిడి జరిగినట్లూ ఉంటుంది.
ఇటు కప్పములు సేకరించినట్లు ఉండును" అని చెప్పిన మంత్రి మాటలకు రాజు "శభష్
ధైర్యసాహస మేధాసంపత్తితో దండయాత్రకు సిద్దంకండి" అని మహారాజు ఆనతిచ్చెను.
దేవేంద్రునిలాంటి వారిని కూడా ఓడించు దిట్టయగు సేనామంత్రి
తత్ననాధుడు సేవలవద్దకు వెళ్ళి "ఓ సేనా నాయకులారా! మనకు గల సైన్యాన్నంతా, కత్తులు, కఠారులు,
ఒరిసెలు, మందుగుండు సామాగ్రితో సిద్దంచేయండి.
ఖడ్గములను సాన పట్టించండి. అశ్వములు, మదగజములు, ఒంటెలు. లొట్టిపిటలు సమేతంగా సేనను కదిలించండి" అని ఆజ్ఞాపించెను.
రాజు ఆజ్ఞ ప్రకారం సైన్యమంతా సిద్దమైయుండెను.
సకలశక్తియుక్తులు కలిగి యున్న మహామంత్రి సువీరుడు సైన్యము సిద్దముచేసి, ఈ విషమాన్ని రాజునకు తెలియపరచెను. తండ్రివద్దకు
వచ్చిన రాజరాజనరేంద్రుడు "నాన్నా! ప్రశాంతముగా, ప్రజారంజకంగా,
ఆనందముగానున్న రాజ్యము కదా మనది. ఇప్పుడెందుకు దండయాత్ర?"
అని ప్రశ్నించిన కుమారునితో మహారాజు "రాజరాజనరేంద్రా! రాజకీయం
నీకింక తెలియదు. మనం చేయునది ఎవరికీ చెప్పరాదు. అందరకూ తెలిసినట్ళుగా ఏ పనీ
చేయరాదు. అదే క్షత్రియధర్మం. మనంఅ ప్రశాంతంగా ఉన్నప్పుడే పరరాజులు, సామంతులు దండెత్తివచ్చి చుట్టుముట్టి మన రాజ్యము వారి హస్తగతము
చేసుకొనెదరు. సామంతరాజులు పెక్కుగా ఉండిరని తెలియుచున్నది. వారందరితో కప్పములు
కట్టించెదను. లేదా యుద్దము చేసి వారి రాజ్యాన్ని మన రాజ్యంలో ఐక్యం చేసెదను. ఓడిన
రాజును, సేనలనూ, ధనక వస్తువాహన
సామాగ్రితో పాటు ఆ రాజును మన బానిసగా చేసుకొనవలెను. చిన్న చేపను పెద్ద చేప
మింగాలి. ఇదే రాజనీతి!" అనే విషయాలను చెప్పెను. అంతఃపురంలోకి విచ్చేసిన తన
భార్యలందరూ "నాదా! ఇప్పడెందుకు యుద్దాలు? అని
ప్రశ్నించగా భూపాలుడు "పిడుగునకు వారశూల యుండనా?" అని
ఎదురుప్రశ్న వేసెను.
విష్ణువర్ధనుని దండయాత్ర:-
ఆ విధంగా తన చతురంగబలంతో పంచకళ్యాణి అశ్వరాజంపై దండయాత్రకు
బయలుదేరిన విష్ణువర్ధనుడు "ఓ భార్యలారా! యుద్ద రణరంగమునకు విజయ వీరతిలకం
దిద్ది నాకు ఎదురువచ్చి సాగనంపండి. ఓ కుమారులారా! నేను మరల రాజమహేంద్రికి వచ్చేంత
వరకూ గొప్ప మేథావియగు ప్రధానమంత్రి సుమేధులవారి సలహాలతో రాజ్య ప్రజలందరిని
కన్నబిడ్డలవలె కంటికి రెప్పలాగున కాపాడు బాధ్యత మీది. ఓ మనుమలారా! అందుకోండి
శివానుగ్రహం కలిగిన నా ఆశీస్సులు, ఓ భజంత్రీగణములారా! మేరీమృదంగాది వాద్యరావములతో ఆనందభైరవీ రాగంలో దిక్కులు
పిక్కటిల్లేలా బాకాలు వాయించి విజయఢంకాను మ్రెగించండి. వందిమాగధులారా! కదంతొక్కి
పదం పాడండి. గాయక కవులారా! రాజమహేంద్రవర చంద్రవంశ విజయవీర పతాక గౌరవాన్ని నూతన
పంథాలో వేనవేల పొగడండి. పురోహితులారా! పురమును ప్రతి క్షణము మీ యెక్క హితోక్తులతో
కాపాడండి . గ్రామ పౌరులారా! ఈ దండయాత్రా ప్రయాణానికి చెప్పండి. వీడ్కోలు"
అంటూ వీధులలో వార్లు కూడా పోయుచూ సాగనంపెను. మంగళ కర్పూర నీరాజనములతోనూ, చతురంగ బలములతో సింహ పరాక్రమము కలిగిన వీరసైన్యముతోనూ మహారాజు దండయాత్రను
ప్రారంభించి ముందుగా ఉత్తర దేశమునకు బయలుదేరెను. ఆవిధముగా మూడు మాసములకు బంగాళ
రాజ్యమునకు చేరెను. ఆ సమయమున బంగాళ రాజ్యమంతయూ మహాక్షామ పీడితమైయున్నది. ఆ
రాజ్యమున ప్రజలు తినుటకాహారము లేక క్షుద్భాదతో యుండిరి. విష్ణువర్ధనుడు బంగాళ
రాజుతో "ఓ సామంతరాజా! నీవు మా రాజ్యామునకు గత నాలుగు సంవత్సరముల నుండి బకాయి
ఉన్న కప్పములు కట్టుము" అని అడిగెను.
బంగాళ దేశరాజైన విజయవర్ధనుడు "అయ్యా మహారాజా! తమకు
కప్పములు కట్టవలసిన మాట నిజమేకాని మా రాజ్యము ఎక్కడ చూసినా సస్యశ్యామలమైన పంటలు
పండక, కరువు కాటకాలలో
అల్లాడుచున్నది. కనుక మరు సంవత్సరమున మేమే రాజమహేంద్రికి పన్నులు పంపించెదము. మీరు
శ్రమపడి రానక్కరలేదు" అనుచూ ఇంకనూ తన రాజ్యములోని బాధలు విన్నవించెను. ఆ
రాజుతో విష్ణువర్ధన మహారాజు జాలి, దయ, క్షమాగుణములు
లేక అంగబల గర్వముతో సామంతరాజుని గదాయుద్ద ప్రకరణముతో ఓడించి అక్కడ మిగిలి యున్న
సంపదనంతా తన సైన్యముద్వారా రాజమహేంద్రికి పంపించెను. ఆ రాజ్యములోని ప్రజలనందరినీ
బానిసలుగా చేసుకొని సేనలు, ఆయుధములు మెదలైన వస్తు సామాగ్రిని
కూడా రాజమండ్రికి పంపించెను
ఈ
విధముగా ఉత్తరదేశములోని సామంతరాజ్యములగు కోసల,
నేపాల, మిథిల,
కాశ్మీర, ఘార్జర,
మాళవ, మగధ,
మహరాష్ట్ర మెదలగు
సామంతరాజులందరినీ ఐదు
మాసములలో ఓడించి
అక్కడక్కడ యాత్రలలో దేవాలయముల చేరి
పూజించుచూ తదుపరి
దక్షిణ దేశములోని పాంచాళ, వంగ,
కర్ణాటక, మరాఠ
మెదలగు సామంత
రాజ్యములకు దండయాత్రకై బయలుదేరెను. ఎటువంటి కనికరం చూపక
తన దేహ
ధారుఢ్యముతో పరరాజులను ఓడించుచూ వెడలుచుండెను
0 Comments