Magha Masa sankashtahara Chaturthi Vrata Katha - మాఘమాస మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ

Magha Masa sankashtahara Chaturthi Vrata Katha - మాఘమాస మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ
Magha Masa sankashtahara Chaturthi Vrata Katha - మాఘమాస మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ

పార్వతీదేవి, వినాయకుని జూచి, "హేరంబా! మాఘమాసము నందు ఆచరింపదగిన సంకష్టహర చతుర్థీ వ్రతమును గూర్చిన విశేషములు వివరింపుము" అని అడుగగా, గణపతి " అమ్మా! పార్వతీదేవి! మాఘమాసమున నన్ను "ద్విజప్రియుడు" అను పేరున పూజించవలెను. శక్తికొలది మోదకములు మున్నుగునవి నైవేద్యముగావించి, రాత్రి చంద్రోదయమైన తరువాత అర్ఘ్యమువదలి బంధువులతో గూడి భుజించవలెను. శక్తి వంచనలేక బ్రాహ్మణులను పూజించి, సదక్షిణముగ మోదకములను వారికి దానము చేయవలెను. ఇందులకు పూర్వము జరిగిన కథను దెల్పెదను వినుము.

పూర్వము సత్యవచనుడు, బలపరాక్రమ సంపన్నుడు, బుద్దిశాలియగు హరిశ్చంద్రుడను పేరుగల బ్రాహ్మణుడొకడుండెను. ఒక కుమారుడు కల్గినంతట, ఋష్యశర్మ దివంగతుడయ్యను. భార్య, పసివాడగు కుమారుని పోషనకై, నానావస్థలు పడుచు, బిక్షమెత్తుచు, అతికష్టముతో కాలము గడుపుచుండెను. ట్లున్నను గణపతి యందలి స్థిరభక్తివలన, యాచించి తెచ్చిన వస్తువులతోడనే భక్తిస్రద్ధా పూర్వకముగ శ్రీ సంకష్టహర చతుర్థీ వ్రతమును ఆచరించుచుండెను.

ఒకనాడు ఆమె గణపతిని పూజించుచుండగా, కుమారుడు ఒక గణపతి విగ్రహమును గైకొని, దాని మెడకు త్రాడుకట్టి, ఆదుకొనుటకై బయటికి వెళ్లెను. అంతట ఒక నీచుడు ఆబాలుని తీసికొని, తనయింటికి చెరి, కుండలను కాల్చు నెప్పమున బాలుని మంటలలో పడవేసెను. వ్రతానంతరము ఆబాలునితల్లి, కుమారుడు కనిపించ నందున బోరున విలపించుచు, గణపతిని చేరి " గజాననా! పుత్రదుఃఖము పొందిన నన్ను రక్షింపుము. నా కుమారుని రప్పించి, నాకడకు జేర్చుము" అని ప్రార్థించెను.

ఇట్లుండగా అచ్చట మరునాడు ఆనీచుడు కాలిన కుందలను తీయుటకైరాగా, బాలుడు అక్కడెయున్న నీటిలో హాయిగా ఆడుకొనుచుడుట జూచి, మిక్కిలి భయపడి, ప్రాంతమును పాలించు రాజునొద్దకు వెళ్ళి "రాజా! నా కుమార్తె పెండ్లికై కుండలను చేసి, ఎంతకాల్చినను అవి కాలవయ్యెను. ఒక మాంత్రికుడు " వార్తతెలిసి ఒక బాలుని బలి యిచ్చినచో నీ కార్యము నెరవేరును" అని చెప్పెను. అంతట నేను ఒక విధకుమారుని దెచ్చి, మంటలలో వేసితిని, ఉదయము చూడగా ఆబాలుడు యథాపూర్వుడై, చెక్కుచెదరక, హాయిగా ఆదుకొనుచుండుట జూచి, భయపడివచ్చి, మీకు వార్త విన్నవించితిని" అని చెప్పగా, రాజువిని, ఆశ్చర్యచకితుడై, కుమ్మరి వెంట వచ్చి, అచ్చట అడుకొనుచున్న బాలుని, అతని వద్దనున్న మెడకు త్రాడుగల కాంతి మంతమైయున్న గణపతీ విగ్రహమును జూచి, "నాయనా! నీవు ఎవ్వరవు? నీ తల్లీదండ్రు లెవరు?" అని అడిగి, వాడు చెప్పిన గుర్తులను బట్టి , వాని తల్లికాడకు వచ్చిరి. జరిగిన దంతయు వివరించిరి. అంతట బాలుని తల్లి అయ్యా! నేను ఆచరించుచున్న శ్రీ సంకష్టహర చతుర్థీవ్రతము వలననే నాకుమారుడు  మంటలలో మాడక, సుఖముగా బ్రదికి వచ్చినాడు. అంతయు గణపతి కృపాబలమే!" అని పల్కగా, సంతోషించిన రాజు, మందిరమునకు వచ్చి, వెంతనే సంకష్టహర చతుర్థీవ్రతమును తాను చేయటయే గాక, తనరాజ్యమున ప్రజలందరును వ్రతమును చెయవలె నని ఆదేశించెను. ఎల్లరును వ్రతమును ఆచరించి, సుఖించిరి" అనెను.

 

ఇట్లు శ్రీ కృష్ణ యుధిష్టిర సంవాదాత్మకమగు శ్రీ సంకష్టహర చతుర్థీ వ్రతకల్పమున మాఘ మాస కథ సమాప్తము

"స్కందాగ్రజ! నమ స్తుభ్యం, బుక్తి ముక్తి ప్రదాయక!

అష్టకష్ట వినిర్బేదిన్! పాహి మాం గణనాయక!

శ్రీ మహాగణపతి ప్రసాదసిద్ధి రస్తు

ఓం శాంతి శాంతి శాంతిః

మార్గశిర మాస మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ