Sri Vasavi Kanyaka Parameshwari Dandakam -వాసవీ కన్యకా పరమేశ్వరీ దండకము

 Sri Vasavi Kanyaka Parameshwari Dandakam -వాసవీ కన్యకా పరమేశ్వరీ దండకము

Sri Vasavi Kanyaka Parameshwari Dandakam
Sri Vasavi Kanyaka Parameshwari Dandakam
వాసవీ కన్యకా పరమేశ్వరీ దండకము

                శ్రీ మన్మహాదేవీ ! దాక్షాయిణీ! లోక కల్యాణ సంధాయీనీ! భక్త లోకైక రక్షామణీ! దేవి, భూలోక భారంబు దీర్పంగ నాంద్రావనిన్ ఆంధ్ర రాష్ట్రంబునన్ పూతగోదావరీ మండలంబందు, సింగారముంగారు, బంగారు రంగారు నత్యున్నతీత్తుంగమెరమ్య హార్మాణితో, రత్నమాణిక్య ణీరాజితంబైన ప్రాకారముల్ గల్గియున్ శ్రీ పార్వతితో గూడి కైలాసవాసుండవౌ శ్రీ పురీశుండు నిత్యంబుగానుండ శ్రీలక్ష్మీ నారాయణుండన్ సదా నిల్చియుండంగ నొప్పారుచున్ వేదవేదాంగ పారాయణుల్ బాడబుల్ రత్నమాణిక్యవాణిజ్య పారీణులౌ వైశ్యరత్నాలు స్వర్ణంబు పండింపగాజాలు బల్ కర్షకానీక సందీప్తమై యెప్పుచున్ నూరు లింగమ్బులన్ నూరు కోనేరులన్ నూరు పెన్ బావులన్ నూరు పూదోటలున్ గల్గియున్ పూర్వ చారిత్రమందెన్న సత్కీర్తులన్ గన్న, పెన్గొండ పట్నబునన్ వైశ్యరత్నంబువై పుట్టియున్ వాసవీబాల నామంబుతో శుక్లపక్షంపు చంద్రుండునావృద్ది బొందంగ దేదీప్యమానంబుగా వెల్గు నీదివ్య రూపంబు వీక్షించి విష్ణ్వర్న నామాంకితుండైన రాజేంద్రుడొక్కండు మెహించి పెండ్లాడ నూహించి యత్నంబుగావింపగా, వైశ్యలోకంబు యెచించి యెచించి వర్ణాంతరంబైన వైవాహికంబెన్న దూష్యంబటంచెంచి నిన్నీయగా నొల్లమంచన్న నారాజు క్షాత్రంబు జూపించి దండించగా, నెంచ నప్పట్టునన్ నీవు వర్ణించు ధర్మాల కాపాడగా బూని ఎన్నెన్నియె యార్య ధర్మంబులన్ దెల్పి యా మీదటన్నీవు వంశమ్ము కొక్కరిన నిల్చి యాబాల వృద్దాదులన గూడి, కైలాస నాధాలయ ప్రాంగణంబందు చండాగ్ని గుండంబులం జొచ్చి స్వర్ణంపు రూపంబుతో నుద్భవందియున్నీవు వైశ్యాళికిన్ నీదు భకాంతళికిన్ బ్రీతి కళ్యాణముల్ కూర్చికాపాడవో దివ్య కల్యాణి, రుద్రాణి, మీనాక్షి, మహేశ్వరీమాత నిత్యంబు నీ దివ్యపాదార విందంబు లత్యంతమెదంబుతో గొల్తు నన్నేలుమె తల్లి ! యానంద సంధాయినీ సర్వ సౌభాగ్యముల్ సర్వసౌఖ్యంబులున్ మంచి సంతానమున్ ఆయురారోగ్యముల్ గూర్చి యెల్లప్పుడున్ బ్రోవు కాత్యాయినీ రాజేశ్వరీ, దుర్గ, సర్వేశ్వరీ, శాంకరీ, వాసవీబాల జాలంబు సేయంగ నీకేలవేవేగ రావమ్మ! మానేరముల్ సైచి మన్నించి నీదివ్యకారుణ్యమున నీ కూర్మి భక్తాళిలో జేర్చి నన్నేలుమెయంబ, చిత్తంబునన్యత్ర సంచారమున్ సేయకెల్లప్డు, నిన్నే  ద్యానమ్ముసేయంగ నన్నేలుమె, యార్త రక్షాకరీ, కాళి, నీకన్న నాకెవర్వున్,బ్రాపులేరంచు

పల్మారు ప్రార్థింతు రక్షింపు, రక్షింపు, రక్షింపు, మంబా, నమస్తే, నమస్తే నమస్తే నమః

ఓం హ్ర్రీం శ్రీ మాత్రే నమః

Vasavi Kanyaka Parameswari Devi Charitra


Post a Comment

0 Comments