Sri Vasavi Kanyaka Devi Vijayaghosa - శ్రీ వాసవీ కన్యకాదేవీ విజయఘోష
Sri Vasavi Kanyaka Devi Vijayaghosa - శ్రీ వాసవీ కన్యకాదేవీ విజయఘోష |
1.
శ్రీ విఘ్న నాయకుని శ్రీ శివావాక్సతుల జై వాసవాంబా! జై కన్యకాంబా
2.
శ్రీ సద్గురూత్తముని సేవించి పూజించి జై వాసవాంబా! జై కన్యకాంబా
3.
చెప్పబూనితినయ్య వాసవీ చరితమ్ము జై వాసవాంబా! జై కన్యకాంబా
4.
చిత్తగింపుడు మీరు శ్రద్దతో భక్తితో జై వాసవాంబా! జై కన్యకాంబా
5.
శ్రీ వైశ్య కుల మందు సిరులొప్ప జన్మించె జై వాసవాంబా! జై కన్యకాంబా
6.
గుణశాలిధీరుండు కుసుమార్య నాముండు జై వాసవాంబా! జై కన్యకాంబా
7.
కుసుమాంబ అయ్యార్యు కులపత్నియై యెప్పె జై వాసవాంబా! జై కన్యకాంబా
8.
సంతులేని కతాన చింతనొందిరి వారు జై వాసవాంబా! జై కన్యకాంబా
9.
గురుభాస్కరుడు వారి కొరత దీర్చగ నెంచె జై వాసవాంబా! జై కన్యకాంబా
10.
పుత్రకామేష్టినొగి చేయుడని బోధించె జై వాసవాంబా! జై కన్యకాంబా
11.
నిష్టతోడుత వారు పుత్రేష్ఠి సలుపంగ జై వాసవాంబా! జై కన్యకాంబా
12.
ప్రత్యక్షమై నిల్చె, పరమాంబయే అచట జై వాసవాంబా! జై కన్యకాంబా
13.
వారి భక్తికి మెచ్చి ఇచ్చె పాయసపాత్ర జై వాసవాంబా! జై కన్యకాంబా
14.
ఆశీర్వదించి మరి అదృశ్యురాలయ్యై జై వాసవాంబా! జై కన్యకాంబా
15.
అత్యంత భక్తితో ఆ పాయసమును గొని, జై వాసవాంబా! జై కన్యకాంబా
16.
ఆరగించిన రాణి అదృష్టమే పండె జై వాసవాంబా! జై కన్యకాంబా
17.
గర్భమ్ము దాల్చినది ఆ తన్వి కుసుమాంబ జై వాసవాంబా! జై కన్యకాంబా
18.
నవమాసములు నిండె నళిని నేత్రకునంత జై వాసవాంబా! జై కన్యకాంబా
19.
శుభద వైశాఖాన శుద్ద దశమీ తిధిని జై వాసవాంబా! జై కన్యకాంబా
20.
శుక్రవారమునాడు సుతను సుతునిన్గాంచె! జై వాసవాంబా! జై కన్యకాంబా
21.
ప్రభవించి శ్రీ కన్య పాపయై ఆ యమ్మకు జై వాసవాంబా! జై కన్యకాంబా
22.
వాసవీకన్యకగ వాసికెక్కెను బాల జై వాసవాంబా! జై కన్యకాంబా
23.
భువన మెహన మూర్తి పుణ్య సద్గుణ దీప్తి జై వాసవాంబా! జై కన్యకాంబా
24.
శాంత్యహింసాజ్యోతి యను కీర్తిగొనె కన్య జై వాసవాంబా! జై కన్యకాంబా
25.
విరూపాక్షాంశుడై విలసిల్లె బుడతండు జై వాసవాంబా! జై కన్యకాంబా
26.
విరూపాక్షాఖ్యుడై వినుతికెక్కెను అతడు జై వాసవాంబా! జై కన్యకాంబా
27.
అటవేలంగిదేశాన రాజ్మహేంద్రవరాన జై వాసవాంబా! జై కన్యకాంబా
28.
భండాసురాంశతో ప్రభవించెనొక రాజు జై వాసవాంబా! జై కన్యకాంబా
29.
విష్ణువర్దన నాముడై వీర్రవీగుచూ జై వాసవాంబా! జై కన్యకాంబా
30.
జైత్రయాత్రన్నల్పి శత్రురాజుల గూల్చె జై వాసవాంబా! జై కన్యకాంబా
31.
తిరిగి పోవును చేరె పెనుగొండ తీరాన జై వాసవాంబా! జై కన్యకాంబా
32.
కుసుమార్యుడెదురేగి గొనివచ్చెనా ప్రభుని జై వాసవాంబా! జై కన్యకాంబా
33.
అతిధి సత్కారాల సద్బుతమ్ముగ సల్పె జై వాసవాంబా! జై కన్యకాంబా
34.
విడిది చేసిన రాజు విశ్రాంతి గొనుచుండె జై వాసవాంబా! జై కన్యకాంబా
35.
చెలులతోడత గూడి శ్రీ వాసవీ బాల జై వాసవాంబా! జై కన్యకాంబా
36.
వింధ్య వాసినిదేవి సేవింపగా వెడలె జై వాసవాంబా! జై కన్యకాంబా
37.
రాచవీధిని బోవు రమణి వాసవిగాంచి జై వాసవాంబా! జై కన్యకాంబా
38.
రారాజు వ్యామెహ వివశుడై కామించె జై వాసవాంబా! జై కన్యకాంబా
39.
కళ్ళు చెదరన్ జేయు కన్యసౌందర్యమ్ము జై వాసవాంబా! జై కన్యకాంబా
40.
కుటిల రారాజు నెద గూడ గట్టుక నిల్చె జై వాసవాంబా! జై కన్యకాంబా
41.
విరహాన వ్రేగెనా విష్ణువర్ధన రాజు జై వాసవాంబా! జై కన్యకాంబా
42.
కుసుమ శ్రేష్టిని బిల్చి కూతునిమ్మనియడిగె జై వాసవాంబా! జై కన్యకాంబా
43.
ఆశ్చర్యకరమైన ఆదుష్టు కోర్కె విని, జై వాసవాంబా! జై కన్యకాంబా
44.
ఆర్యవైశ్యుల గుండె లవశి పోసాగినవి జై వాసవాంబా! జై కన్యకాంబా
45.
ధర్మము పోనాడి తనయ రాజునకీయ జై వాసవాంబా! జై కన్యకాంబా
46.
తగదంచు నెల్లరును తల్లడిల్లిరి చాల జై వాసవాంబా! జై కన్యకాంబా
47.
"పద్దెంది పట్నాల ప్రతినిధుల సభలోన జై వాసవాంబా! జై కన్యకాంబా
48.
చర్చించి నిర్ణయము చెప్పెదము" అనివారు జై వాసవాంబా! జై కన్యకాంబా
49.
అది విన్న వేంగీశుడతి కృద్దుడై పల్కె జై వాసవాంబా! జై కన్యకాంబా
50.
"ఏడు రోజుల గడువు నిచ్చి ఏగుచునుంటి జై వాసవాంబా! జై కన్యకాంబా
51.
ఈ లోన మీ కన్యనిడు వార్తరాకున్న జై వాసవాంబా! జై కన్యకాంబా
52.
సేనతో అరుదెంచి చంపి మిమ్మెల్లరను జై వాసవాంబా! జై కన్యకాంబా
53.
బాల వాసవిని నే బల్మి దండునటకాపుంచి, జై వాసవాంబా! జై కన్యకాంబా
54.
తరలె రారాజు తన రాజధానికి వేగ జై వాసవాంబా! జై కన్యకాంబా
55.
వైశ్య సభ జరుగగా వైరుధ్యములు గలిగె జై వాసవాంబా! జై కన్యకాంబా
56.
వైశ్య సంఘము రెండు తెగలుగా విడిపోయె జై వాసవాంబా! జై కన్యకాంబా
57.
ఆరువందల పైన పదునాల్గు గోత్రాల జై వాసవాంబా! జై కన్యకాంబా
58.
పిరికివారలు భీతిసభ వీడి చనినారం జై వాసవాంబా! జై కన్యకాంబా
59.
నూటయిబ్బండ్రైన గోత్రములు వైశ్యులు జై వాసవాంబా! జై కన్యకాంబా
60.
ఒకత్రాటి పైనిల్చి ఉత్తేజపడినారు జై వాసవాంబా! జై కన్యకాంబా
61.
యుద్మమ్ము గావించి ఉర్వీపతిని గూల్చి జై వాసవాంబా! జై కన్యకాంబా
62.
కన్యకను గాతుమని గర్జించిలేచారు జై వాసవాంబా! జై కన్యకాంబా
63.
వాసవీ కన్యాంబ వారి వారించినది జై వాసవాంబా! జై కన్యకాంబా
64.
కూడదీ హింసాయని కూర్మి భోదించినది జై వాసవాంబా! జై కన్యకాంబా
65.
శాంత్యహింసయని కూర్మి భోదించినది జై వాసవాంబా! జై కన్యకాంబా
66.
శాంత్యహింసలె సత్య సాధనమ్ములు కాగ జై వాసవాంబా! జై కన్యకాంబా
67.
ఆత్మత్యాగమ్మె మహిమాన్వితాస్త్రమ్ము కాగ జై వాసవాంబా! జై కన్యకాంబా
68.
దుష్టత్వమును బాపి శిష్టత్వమును నిల్పు జై వాసవాంబా! జై కన్యకాంబా
69.
అతి నూత్న రణ నీతి నంబ వాసవి దెల్పె జై వాసవాంబా! జై కన్యకాంబా
70.
"అగ్ని లోపల దూకి ఆత్మాహుతిన్ జేతు జై వాసవాంబా! జై కన్యకాంబా
71.
అవనినాధుని దౌష్ట్య మంతరింపగజేతు" జై వాసవాంబా! జై కన్యకాంబా
72.
అనుచు వాసవి పలుకు ఆ మాటలన్నియును జై వాసవాంబా! జై కన్యకాంబా
73.
ఆర్ష మంత్రములట్లు ఆకట్టుకొనె జనుల జై వాసవాంబా! జై కన్యకాంబా
74.
నూట యిబ్బడి, గోత్రముల వైశ్యదంపతులు జై వాసవాంబా! జై కన్యకాంబా
75.
ఆ కన్యతో గూడి అగ్నులందున దూకి, జై వాసవాంబా! జై కన్యకాంబా
76.
ఆత్మాహుతుల సల్ప ఆయత్తమైరచట జై వాసవాంబా! జై కన్యకాంబా
77.
ఉద్యమమ్మును సెల్పె ఉవిద వాసవి కన్య జై వాసవాంబా! జై కన్యకాంబా
78.
వీర కంకణములను వేవేగ కట్టించె జై వాసవాంబా! జై కన్యకాంబా
79.
అగ్ని కుండమ్ములను అతి వేగ త్రవ్వించె జై వాసవాంబా! జై కన్యకాంబా
80.
ఆత్మాహుతుల వార్త నంపె రాజేంద్రునకు జై వాసవాంబా! జై కన్యకాంబా
81.
ప్రజలెల్ల కన్యకను ప్రస్తుతించిరిచాల జై వాసవాంబా! జై కన్యకాంబా
82.
నగర యాత్రను సల్పి నడచిరగ్నుల జేర జై వాసవాంబా! జై కన్యకాంబా
83.
క్రమ శిక్షణతొ నడుచు ఘన సైనికులవోలె జై వాసవాంబా! జై కన్యకాంబా
84.
అగ్ని కుండము చెంత కరుదెంచి నిల్చినది జై వాసవాంబా! జై కన్యకాంబా
85.
ధైర్య లక్ష్మిని బోలి తరుణి వాసవి కన్య జై వాసవాంబా! జై కన్యకాంబా
86.
ఆ తల్లి మహిమమ్ము, నరసి కావలివారు జై వాసవాంబా! జై కన్యకాంబా
87.
సైనికులు, పౌరులును, సర్వజనులచ్చోట జై వాసవాంబా! జై కన్యకాంబా
88.
వాసవీకన్యకా వరభక్తులుగ మార జై వాసవాంబా! జై కన్యకాంబా
89.
ఆదిశక్తి విధాన అలరె వాసవి కన్య జై వాసవాంబా! జై కన్యకాంబా
90.
ఆ యమ్మను గాల్చుటకు అతిభీతుడై యగ్ని జై వాసవాంబా! జై కన్యకాంబా
91.
అబ్బురమ్ముగ అరగి, ఆరిపోవగసాగె జై వాసవాంబా! జై కన్యకాంబా
92.
ఆ చిత్రమును జూచి చకితులౌ జనులెల్ల జై వాసవాంబా! జై కన్యకాంబా
93.
చిత్తాన చింతింపగా సాగినారిటుల జై వాసవాంబా! జై కన్యకాంబా
94.
సర్వధర్మమ్ములను శాసనమ్ములనిడిన జై వాసవాంబా! జై కన్యకాంబా
95.
ధర్మ స్వరూపయౌ యీ తరుణియెవ్వరు! జై వాసవాంబా! జై కన్యకాంబా
96.
వేదాంత విజ్ఞాన వీధులన్ నడిపించు జై వాసవాంబా! జై కన్యకాంబా
97.
మార్గమ్మునలను దెల్పు యీ మగువయెవ్వరు! జై వాసవాంబా! జై కన్యకాంబా
98.
అనుచు ఆ కన్యకా తత్త్వమరయగ గోరి జై వాసవాంబా! జై కన్యకాంబా
99.
చకితులై వాసవిని జూజుచుండిరి వారు జై వాసవాంబా! జై కన్యకాంబా
100.
అంతలో ఆ కన్య అఖిలలోకమ్ములను జై వాసవాంబా! జై కన్యకాంబా
101.
ఆక్రమించుచు పెరిగి ఆకాశమునె అంటె జై వాసవాంబా! జై కన్యకాంబా
102.
విశ్వరూపము దాల్చి వెల్గులను ప్రసరించి జై వాసవాంబా! జై కన్యకాంబా
103.
బ్రహ్మాండ భాండాల తనలోనె ప్రకటించె జై వాసవాంబా! జై కన్యకాంబా
104.
ఆ దివ్య రూపమ్ము నరయజాలక జనుల్ జై వాసవాంబా! జై కన్యకాంబా
105.
ఆర్తులై వేడంగ అమ్మ కరుణించినది. జై వాసవాంబా! జై కన్యకాంబా
106.
ఆత్మాహుతిన్ జేయు ఆర్య దంపతులెల్ల జై వాసవాంబా! జై కన్యకాంబా
107.
పరమ పదమందగల రంచరంచు వరమిచ్చినది జై వాసవాంబా! జై కన్యకాంబా
108.
చక్రవర్తికీ వార్త చెవిసోకినంతనే జై వాసవాంబా! జై కన్యకాంబా
109.
తలపగిలిచచ్చునని తగు శాపమిచ్చినది! జై వాసవాంబా! జై కన్యకాంబా
110.
అతి నిరంకుశమైన అధికార దర్పమును జై వాసవాంబా! జై కన్యకాంబా
111.
ఘోర హింసాపూర్ణ కౄరత్వదౌష్ట్యముల జై వాసవాంబా! జై కన్యకాంబా
112.
హద్దుగానక పెరుగుచున్న అవినీతిని జై వాసవాంబా! జై కన్యకాంబా
113.
అణిచివేయగ గోరి రా ఆర్యదంపతులు! జై వాసవాంబా! జై కన్యకాంబా
114.
అగ్నులందున దూకి అశువులనె అర్పించు జై వాసవాంబా! జై కన్యకాంబా
115.
ఆర్యవైశ్యుల కీర్తి అవని యందెల్లెడల జై వాసవాంబా! జై కన్యకాంబా
116.
ఆ చంద్రతారార్కమై విరాజిల్లునని జై వాసవాంబా! జై కన్యకాంబా
117.
చాటి వాసవి విశ్వరూపమ్ముచాలించె జై వాసవాంబా! జై కన్యకాంబా
118.
"వాసవీ కన్యకా పరమేశ్వరిగ నేను జై వాసవాంబా! జై కన్యకాంబా
119.
అర్చావతారనై ఆవిర్భవించెదను జై వాసవాంబా! జై కన్యకాంబా
120.
అన్ని వేళల మిమ్ము అతి ప్రేమ బ్రోచెదను" జై వాసవాంబా! జై కన్యకాంబా
121.
అని పల్కి ఆ కన్య అగ్నిదేవుడు మండె జై వాసవాంబా! జై కన్యకాంబా
122.
అంతనా కన్యాంబ ఆర్యదంపతులతో జై వాసవాంబా! జై కన్యకాంబా
123.
అతిరయమ్మున అగ్నికుండాలలో దూకే జై వాసవాంబా! జై కన్యకాంబా
124.
హాహారవాలతో ఆకసము ధ్వనియించె జై వాసవాంబా! జై కన్యకాంబా
125.
అగ్ని కుండమ్ములో అబ్జ పీఠముపైన జై వాసవాంబా! జై కన్యకాంబా
126.
హిమకరుని రేఖతో, హేమ మకుటముతోడ జై వాసవాంబా! జై కన్యకాంబా
127.
స్వర్ణాంబరా భూష శోభలే వెల్గొంద జై వాసవాంబా! జై కన్యకాంబా
128.
అర్చావతారమ్ము ఆవిర్భవించినది జై వాసవాంబా! జై కన్యకాంబా
129.
కీరసంయుత పద్మ వేద కరముతో రెండు జై వాసవాంబా! జై కన్యకాంబా
130.
మాలాయుతాభీతివర హస్తములు రెండు జై వాసవాంబా! జై కన్యకాంబా
131.
నాల్గు చేతుల వెల్గు నవ్య రూపమ్ముతో జై వాసవాంబా! జై కన్యకాంబా
132.
అర్చావరారయై అటవెలసె వాసవి జై వాసవాంబా! జై కన్యకాంబా
133.
ముగ్గురమ్మలందుండు మూర్తి వైభవమంత జై వాసవాంబా! జై కన్యకాంబా
134.
ముచ్చటగ తనయందు దాల్చి వెల్లొందునా జై వాసవాంబా! జై కన్యకాంబా
135.
అర్చవతారమ్ము నరసి జనులెల్లరును జై వాసవాంబా! జై కన్యకాంబా
136.
జన్మములు ధన్యమ్ములైనవని తలచారు జై వాసవాంబా! జై కన్యకాంబా
137.
వినినంత ఆవార్త విష్ణువర్థబ రాజు శబ్ద జై వాసవాంబా! జై కన్యకాంబా
138.
యెగమ్ముతో శిరము పగిలిపడంగ ఘొర జై వాసవాంబా! జై కన్యకాంబా
139.
మరణమునందె క్రూరత్వఫలితముగ జై వాసవాంబా! జై కన్యకాంబా
140.
సకల ప్రజావళికి సంతసము చేకూరె! జై వాసవాంబా! జై కన్యకాంబా
141.
అహింసా జ్యోతి జగమతటను వెల్గినది జై వాసవాంబా! జై కన్యకాంబా
142.
అవనిలో దుష్టత్వమంతరించినదంత జై వాసవాంబా! జై కన్యకాంబా
143.
ఉర్వి ఆనందాబ్ది ఊగులాడినపుడు జై వాసవాంబా! జై కన్యకాంబా
144.
వెల్లి విరిసెను శాంతి విశ్వమందెల్లెడల జై వాసవాంబా! జై కన్యకాంబా
145.
ఆయమ్మ అందించి నట్టి నవ్యోద్యమమ్ము జై వాసవాంబా! జై కన్యకాంబా
146.
శాంత్యహింసాత్యాగ దివ్యాస్త్ర నిచయమ్ము జై వాసవాంబా! జై కన్యకాంబా
147.
అహింసాత్మక నూత్న ఆహవ విధానమ్ము జై వాసవాంబా! జై కన్యకాంబా
148.
అరయ సత్యాగ్రహమ్మను పేరునందుకొనె జై వాసవాంబా! జై కన్యకాంబా
149.
అదె మహాత్మాగాంధీ, మహితాస్త్రమైవెల్గె జై వాసవాంబా! జై కన్యకాంబా
150.
ఆంగ్లేయ ప్రభుతనే అంతరింపగజేసె జై వాసవాంబా! జై కన్యకాంబా
151.
పొట్టి శ్రీరాములు చేబట్టె ఆ అస్త్రమునె జై వాసవాంబా! జై కన్యకాంబా
152.
ఆంధ్రరాష్ట్రము దెచ్చి అందించెనే మనకు జై వాసవాంబా! జై కన్యకాంబా
153.
అమ్మ జూపిన యట్టి ఆధునిక ధర్మమ్మె జై వాసవాంబా! జై కన్యకాంబా
154.
ధరణి నెల్లెడ మహాదర్శమై వరలినది జై వాసవాంబా! జై కన్యకాంబా
155.
అఖిల జగదారాధ్యయౌచు వాసవి కన్య జై వాసవాంబా! జై కన్యకాంబా
156.
కలికాల దైవమై కొలువు దీరెను నేడు జై వాసవాంబా! జై కన్యకాంబా
157.
ఆది పరమాంబయే అవతరించెను నేల జై వాసవాంబా! జై కన్యకాంబా
158.
అమ్మ! నీ లీలలను అరయనెవ్వరితరము! జై వాసవాంబా! జై కన్యకాంబా
159.
దుర్గాస్వరూపిణీ దుర్గతి వినాశినీ జై వాసవాంబా! జై కన్యకాంబా
160.
చండీ స్వరూపిణి శారదాంబవు నీవే జై వాసవాంబా! జై కన్యకాంబా
161.
కుముద కృష్ణాఖ్యకా, కోమాంగీదేవి జై వాసవాంబా! జై కన్యకాంబా
162.
వింధ్య వాసిని మాత, వేల్పులకు రారాణి జై వాసవాంబా! జై కన్యకాంబా
163.
మాధవీ, కాళికా, మాయా స్వరూపిణి జై వాసవాంబా! జై కన్యకాంబా
164.
విజయాఖ్యకా, వైష్ణవీ రూపధారిణీ జై వాసవాంబా! జై కన్యకాంబా
165.
ఈశాని నారాయణీ, సకల రూపిణీ జై వాసవాంబా! జై కన్యకాంబా
166.
వాసవీ కన్యకా, వందనమ్ములు నీకు జై వాసవాంబా! జై కన్యకాంబా
167.
నీ నామ మహిమమ్ము నిఖిల విశ్వమ్ములో జై వాసవాంబా! జై కన్యకాంబా
168.
నిండంగ జేసెదము నీదివ్య కరుణతో జై వాసవాంబా! జై కన్యకాంబా
169.
జయమంగళము నీకు జగదీస్వరీ కన్య జై వాసవాంబా! జై కన్యకాంబా
170.
సన్మంగళము నీకు సర్వలోక శరణ్య జై వాసవాంబా! జై కన్యకాంబా
171.
శుభ మంగళము నీకు సురసేవితామాత జై వాసవాంబా! జై కన్యకాంబా
172.
నిత్యమంగలమమ్మ నీకు శ్రీ వాసవీ జై వాసవాంబా! జై కన్యకాంబా
శ్రీ వాసవి వర్ణమాల
0 Comments