Karthika Masa sankashtahara Chaturthi Vrata Katha - కార్తీక మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ
Karthika Masa sankashtahara Chaturthi Vrata Katha - కార్తీక మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ |
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
పార్వతి దేవి గణపతితో గణపతి! కార్తీక మాస సంకష్టహర చతుర్థి వ్రత విశేషములను వివరింపుము అని అడగగా గణపతి ఇట్లు
వివరించేను అమ్మా! పార్వతి కార్తికా మాసమున నన్ను గౌరిపుత్రుడుగా పూజించ వలెను. నన్ను బిల్వ పత్రములతో పూజించి శక్తి కొలది.
21 కుడుములు నివేదించ వలెను. పెరుగు
అన్నము, నెయ్యితో హోమము చేసిన
సర్వకార్యములు సిద్దించును. ఈ విషయమై పూర్వ వృతాంతము చెప్పెదను వినుము.
పూర్వము వృతాసురుడు ఇంద్రాదులను జయించి సర్గము సర్వస్వము గావించుకొండెను. నిశతేజుసులైన
దేవతలు శ్రీ మహావిష్ణు కడకు కేగి తమ కష్టమును వినవించిరి. వారి ఆర్తిని విన్న విష్ణువు
దేవతాలారా ఆ రాక్షసుడు దేవతల వలన తనకు మరణము లేనట్లు బ్రహ్మ వలన వరము
పొంది వున్నాడు. మరియు సముద్ర జలము అతనికి బలమును ఇచ్చుచున్నది. కనుక మీరు ఎల్లరు అగస్త్యుని వద్దకు
వెళ్ళి ఆ సముద్రపు నీటినంతయు అతడు త్రాగు నట్లు ప్రార్థింపుడు. అతడట్లు చేసిన పిదప
వృతాసురుడు దుర్భలుడగును. అపుడు మీరు వానిని జయించి, మీస్తానమునుపోందగలరు" అని సూచించెను.
శ్రీమన్నారాయణుని ఆదేశానుసారము దేవతలెల్లరు అగస్త్య మునిని
చేరి నమస్కరించిరి, "ఋషివర్యా!" వృత్రాసురుని వలన మాకు సంబవించిన ఉపద్రవము మీకు తేలిసినదేకదా! అతనిని జయించుటకు ఈ సముద్ర జలమును మీరు త్రాగవలెనని శ్రీ
మన్నారాయణుడు సూచించారు. మాప్రార్థన
మన్నించి, ఈ కష్టము నుండి, మమ్ములను ఉద్ధరింపుము " అని ప్రార్థించిరి.
లోక
కళ్యాణ భావనుడగు అగస్త్యుడు, భగవంతుని
ఆదేశమును శిరసా వహించి, దేవతలతో
"తథాస్తు" అనెను, వారు సంతొషముతో, నారాయణ నామస్మరణము చేయుచు వెళ్ళిరి.
పిదప అగస్త్య
మహర్షి ఇంత పెద్దదైన సముద్రమందలి నీటి నంతయు ఎట్లు
త్రాగుదును?భగవదాజ్ఞను ఎట్లు నెరవేర్తును?
అని చింతించుచుండగా, సంకష్టహర చతుర్థీ వ్రతము స్ఫురణకు వచ్చెను. వెంటనే ఆ వ్రతమును
కల్పోక్తముగ ఆచరించెను. మూడవ నెలలో పూజించుచుండగా, గణపతి ప్రత్యక్షమై అనుగ్రహించెను. అందుచే అగస్త్యుడు సముద్రోదకము
నంతయు ఒక్కమారుగా ఆచమించి, త్రాగేను,
అంతట వృత్రాసురుడు దుర్భలుడై, దేవతలకు కనిపించగా, వారు అతనిని జయించి, స్వర్గమును పొంది, సుఖించిరి" అని
ఇట్లు శ్రీ కృష్ణయుధిష్టిర సంవాదాత్మకమైన
శ్రీ సంకష్టహర చతుర్థీ వ్రతమున కార్తీక మాసవ్రత కథ సమాప్తము.
ఓ నమో నారాయణాయ
శ్రీ మహా గణపతి ప్రసాద సిద్ది రస్తు
సర్వే జనాః సుఖినో భవంతు
ఓం శాంతిః శాంతిః శాంతిః
0 Comments