Margashira Masa sankashtahara Chaturthi Vrata Katha - మార్గశిర మాస మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ
Margashira Masa sankashtahara Chaturthi Vrata Katha - మార్గశిర మాస మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ |
పార్వతీదేవి గణపతితో గణపతి!
మార్గశీర్ష మాసమున శ్రీ సంకష్ట హరచతుర్థీ వ్రత విశేషము లెట్టివో వివరింపుము" అని అడుగగా, గణపతి
"అమ్మా! పార్వతీదేవి! మార్గశీర్ష మాసమున నన్ను "గజాననుడు" గా భావించి, పూజింపవలెను. ఆనాడు మోదకములతో (కుడుములతో) హోమము చేయవలెను. ఇట్లు చేసినచో శత్రువులెల్లరు తన ఆజ్ఞకు లోబడియుందురు. ఇందులకు గల పూర్వ వృత్తాంతమును తెల్పెదను వినుము .
పూర్వము త్రేతాయుగమున దశరథుడను చక్రవర్తి గలడు. అతడొక బ్రాహ్మణ బ్రహ్మచారిని - నీటనున్న ఏనుగుగా భ్రమించి, బాణముతో కొట్టగా అతడు మృతి నొందెను. అతని తల్లిదండ్రులు మిక్కిలి వృద్దులు, గ్రుడ్డివారు గనుక, పుత్ర శోకమును భరించలేక, కోపించినవారై " నీవు పుత్ర శోకమున మరణింతువుగాక" అని దశరథుని శపించిరి.
పిదప, దైవప్రేరణచే దశరథుడు పుత్రకామేష్టిచేసెను. అందులకు సంతసించిన మహావిష్ణువు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా అతనికి సంతానమై అవతరించెను. శ్రీ రాముడు లక్ష్మీరూపిణియగు సీతను పెండ్లాడెను. కైక వరములు
కారణముగా, పితృవాక్య పరిపాలనార్థమై సీతా లక్ష్మణ సమేతుడై రాముడు అరణ్యములకు వెళ్ళెను. లోకవిద్రావణుడగు రావణుడు రామలక్ష్మణులను వంచించి,
సీతను అపహరించి,
లంకలో దాచియుంచెను.
రాముడు, లక్ష్మణుడు సీతకై వెదకుచుండ,
మార్గమధ్యమున సుగ్రీవునితో సఖ్యమేర్పడెను.
హనుమదాదులు సుగ్రీవాజ్ఞపై సీతాన్వేషణార్థము దక్షిణదిక్కున కేగిరి.
సంపాతి వలన
లంకారావణుల వృత్తాంతము నెరింగిరి. "హనుమంతుడు మహాబలుడు వాయునందనుడు గనుక,
సముద్రమును లంఘించి,
లంకను చేరి
సీతను చూచి
రాగలడు. ఇతరులకు ఈ కార్యము దుస్సాధ్యము" అని
చెప్పి సంపాతి
హనుమంతునితో "వాయునందనా! శ్రీరామ దూతా! సర్వకష్టములను తొలగించి,
కార్యసిద్ది నొందించునట్టి శ్రీ సంకష్టహర
చతుర్థీ వ్రతము గలదు.
నీవు భక్తిశ్రద్ధలతో ఆ
వ్రతమును ఆచరింతువేని,
సముద్రోల్లంఘనము, సీతాదర్శనము, రాక్షస
బాధా నివృత్తి గలిగి, క్షేమము నొందగలవు" అని
వివరించెను. "బుద్ధిమతాంవరిష్టు"డగు హనుమంతుడు సంపాతి సూచన
ప్రకారము గణపతి సాక్షాత్కారము పొంది,
ఆస్వామి అనుగ్రహమున నిర్వఘ్నముగ శ్రీ రామకార్యమును శిఘ్రముగ నెరవేర్చెను". అని
చెప్పెను
ఇట్లు శ్రీ కృష్ణ యుధిష్టిర సంవాదాత్మకమై శ్రీ సంకష్టహర చతుర్థీ వ్రతమున మార్గ శీర్షమాస కథ సమాప్తము
"శ్రీ
రామదూతం శిరసా నమామి"
శ్రీ మహాగణపతి ప్రసాదసిద్ధి రస్తు
"శుభం
భవతు"
ఓం శాంతి శాంతి శాంతిః
0 Comments