Sri Gananayaka Ashtakam - శ్రీ గణనాయకాష్టకం

sri ganesh
Sri Gananayaka Ashtakam - శ్రీ గణనాయకాష్టకం

 

యతోనంతశక్తే రనంతాశ్చజీవా యతోనిర్గుణా దప్రమేయాద్గుణాస్తే

యతోభాతి సర్వం త్రిధా బేధభిన్నం సదా తం గణేశం నమామె భజామః

యతశ్చావిరాసీజగత్సర్వమేతత్తథాబ్జాసనో విశ్వగో విశ్వగోప్తా

తథేంద్రాదయె దేవసంఘా మనుష్యాః సదా తం గణేశం నమామె భజామః

యతో వహ్ని భానూ భవో భూర్జలం యతః సాగరాశ్చంద్రమావ్యోమ వాయుః

యతః స్థావరా జంగమా వృక్షసంఘా సదా తం గణేశం నమామె భజామః

యతో దానవాః కిన్నరా యక్షసంఘాః యతశ్చారణా వారణాః శ్వాపదాశ్చ

యతః పక్షికీటా యతో వీరుధశ్చ సదా తం గణేశం నమామె భజామః

యతో బుద్ధిరజ్ఞాననాశో ముముక్షోర్యతః సమ్పదో భక్త సంతోషికాః స్యుః

యతో విఘ్ననాశో యతః కార్యసిద్ధిః సదా తం గణేశం నమామె భజామః

యతః పుత్రసమ్పద్యతో వాంఛితార్థో యతోభక్తవిఘ్నా స్తథానేకరూపాః

యతః శోకమెహౌ యతః కామ ఏవ సదా తం గణేశం నమామె భజామః

యతోనంతశక్తిః శేషో బ్భూవ ధరాధారణేనేక రూపే శక్తః

యతోనేకధా స్వర్గలోకా హి నానా సదా తం గణేశం నమామె భజామః

యతో వేదవాచో వికుంఠా మనోభిః సదా నేతి నేతీతి యత్తా గృణన్తి

పరబ్రఃహ్మరూపం చిదానందభూతం సదా తం గణేశం నమామె భజామః

భావం

నిర్గుణ పరమాత్మా! అనంతశక్తి స్వరూపుడా! అనేక జీవ ఆత్మస్వరూపుడా! అప్రమేయ గుణస్వరూపుడా! నీకివే మా నమెవాకములు!

అనంతమూ నిర్గుణమూ అపరిమితమూ అయి భేదరహితమైన అనాద్యంతమౌ నీ పరబ్రహ్మ స్వరూపమునకు సదా గణేశదేవునకు నమెనమె భజింతముగాక!

ఎవరి నుంచి ఈ సమస్త విశ్వమూ సమస్త చరాచర జీవస్వరూపములు సృష్టికర్తయగు పద్మసంభవుడూ, విశ్వదేవతలూ, అష్తదిక్పాలకులూ ఉద్భ్హవించారో అట్టి విశ్వరక్షకుడు సమస్త సృష్టికర్తయైన నీకిదే నమెవాకములు

సమస్త సృష్టిరూపమగు ఇంద్రాది సర్వదేవతలు, దైత్యసంఘములు, మనుష్య కీటక పశుగణములు ఇలా సమస్త రూపములూ ధరించిన గణేశ భగవానుడా! నీకిదే నమస్కారము.

ఓ అంతరాత్మస్వరూడా! అంతర్యామీ! ఎవరినుండి ఈ అగ్ని హూత్రము, ఆకాశమూ, భూమీ, జలము, సప్త సముద్రాలూ, చంద్రాది గ్రహనక్షత్రములు, వాయువూ, ఆకాశమూ, స్వర్గమూ, సమస్థ స్థావర జంగమాత్మాకమైన

వృక్షసంఘములూ ఈ సృష్టిస్వరూపం ధరించి ఆవిర్భవించాయె అట్టి భగవంతుడైన గణేశునకు నమెనమె నమస్కారం

ఎవరినుండి యక్ష, దానవ, కిన్నెర, సిద్ధ, చారుణ, అశ్వ, మృగ పక్షిసంఘములు జన్మించాయె అట్టి సృష్టికర్త, అంతరాత్మ స్వరూపుడూ, పరమాత్ముడైన గణేశదేవునికి నమెనమె నమస్కారములు సమర్పించి భజింతుముగాక!

ఎవరివల్ల మాకీ బుద్ది, అజ్ఞానమును నశింప చేసే ఈ జ్ఞానమూ మెక్షమును కోరవలెననే ఓ వివేకమూ కల్గినవో అట్టి ఆత్మప్రచోదకునకు పరబ్రహ్మమూర్తి విఘ్నవినాశకునకు గణేశునకు సవస్త కార్యసిద్ధి ప్రదాతయైన గణపతికి నమస్కారం. హెచ్చుగా మా నమస్కారం.

భక్తులకు సంపదలను, సంతోషములను, కోరిన కోరికలు తీర్చే వరప్రదునకు విఘ్నవినారణకు, సమస్త కార్యసిద్దీ అనుగ్రహించే దేవదేవేశా! గణేశా! నీకిదే శరణు శరణు!

ఎవరి నుండి పుత్రకళత్ర సంపద, భోగము, సమస్త సౌఖ్యములు కోరిన కోరికలన్నీ అనుగ్రహించబడుతున్నాయె అట్టి ఏక మూర్తియగు అనేక స్వరూపుడు, భక్తివిద్యా ప్రదునకు సర్వేశ్వరునకు ఇవే మా నమస్సులు.

మాలోని శోకమెహములు, కోరికలు ఎక్కడ నుండి కలుగుతున్నాయె వాటిని నివారించే జ్ఞానము, ముముక్షుత్వము, వివేకమును తిరిగి మాకు ఎవరు ప్రసాదిస్తున్నారో అట్టి గణేశదేవినకు నమెనమె నమస్కారములు

మాలోని శోకమెహములు, కోరికలు ఏక్కడ నుండి కలుగుతున్నాయె వాటిని నివారింఛే జ్ఞానము, ముముక్షుత్వము, వివేకమును తిరిగి మాకు ఎవరు ప్రసాదిస్తున్నారో అట్టి గణేశదేవునకు నమెనమె నమస్కారము.

ఏ పరమాత్ముని అనంతశక్తిచేత ఆదిశేషుడు భూమిని మెయగల శక్తిమంతుడయ్యాడో అనేక రూపములు ధరించి అనేక విధములుగా స్వర్గ, పాతాళ, బ్రహ్మలోకాలలో సాక్షాత్కరించిన నానారూపధరుడగు గణేశ స్వామికి నమెనమె నమస్కారము

ఏ భగవంతుని స్తుతించలేక వేదములే మాట పెగలక మూగపోయినవో మనస్సుకు సహితం అందని పరబ్రహ్మరూపియగు బ్రహ్మతత్త్వముగా ’నేతినేతి’ అని వర్ణించలేకపోయాయె, చిత్, సత్, అనంద స్వరూపునకు, సదా గణేశ స్వరూపూనకు నమస్కారము నమెనమెనమః

సకల సంకటాలు తొలగించే గణపతి అనుగ్రహం కోసం సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ద, విశ్వాసముతో పఠిస్తే గణేశుని విశేష అనుగ్రహం కలుగుతుంది


శ్రీ గణనాయకాష్టకం