Ashwayuja Masa sankashtahara Chaturthi Vrata Katha - ఆశ్వయుజమాస మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ
Ashwayuja Masa sankashtahara Chaturthi Vrata Katha - ఆశ్వయుజమాస మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ |
శ్రీ సంకష్టహర గణపతయే నమః
పార్వతీదేవి గణపతితో "గణపతీ! ఆశ్వయుజ మాసమున శ్రీ సంకష్టహర
చతుర్థీ వ్రతమును ఎట్లు
ఆచరించ వలెనో, ఎవరు ఆచరించి, ఎట్టి ఫలమును పొందిరో వివరింపుము" అని కోరగా, గణపతి ఇట్లు
వివరించెను.
"అమ్మా! పార్వతీదేవి! శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన విశేషములు నీకును
వివరింతును. ఆశ్వయుజ కృష్ణ చతుర్థి నాడు గణపతిని "గజాననుడు" గా పూజింపవలెను. నిర్మలమైన మనస్సుతో నన్ను ధ్యానించి, దూర్వాయుగ్మమ్లతో, బిల్వదళములతో
(గరిక,
మారేడు) పూజించి, ఫలములు, మోదకములు (కుడుములు) నివేదింపవలెను.
బాణాసురుని పుత్రిక "ఉష" నిద్రించుచుండగ, స్వప్నమున అనిరుద్ధుని చూచి, అతని సౌందర్యమును మెచ్చి, అతనినే వివాహమాడ వలెనని
తలంచి, ఇది ఎట్లు సాధ్యామగునా? అని వ్యాకుల మనస్క యయ్యెను. పితప
తన చెల్లికత్తెను పిలిచి,
"చెలి! నేను
కలలో అనిరుద్ధుని వివాహమాడితిని. కనుక
నీవు ఎట్లయినను ప్రయత్నించి, నా
మనోనాథుని ఇచ్చటికి తీసుకొనిరమ్ము. లేనిచో
నేను బ్రతకను"
అని చెప్పగా,
చెలికత్తె చిత్రలేఖ,
ఉష కోరకను
నెరవేర్చుటకై, సాయం
సమయమునకు ద్వారకా నగరమును చేరి,
గోధూళివేళ తన
మాయా బలమున
అనిరుద్ధుని గైకొని
వచ్చి, ఉషామందిరమున జేర్చెను.
రాత్రి
యనను ఇంటికి
రాకున్న అనిరుద్ధునికై ప్రద్యుమ్ముదు (త్రండి), మిక్కిలి వగచి, ఈ
వార్తా తన
తల్లిదండ్రులగు రుక్మిణీ శ్రీ
కృష్ణులకు విన్నవించెను.
వారును మనుమని
అదృశ్యవార్త విని
మిక్కిలి చింతింపసాగిరి.
రుక్మిణి దుఃఖమును భరింపలేక, శ్రీకృష్ణునితో "నాథా! నామనుమడగు అనిరుద్ధుని
చూదకనే నొక్క
క్షణమైనను మనజాలను.
అతడు నాకు
ప్రాణములకన్న మిన్నకనుక వెంతనే అనిరుద్ధుని తెచ్చి,
నాముందుంచుము" అని
విలపించెను.
అంతట సర్వజ్ఞుడు, లీలామానుష విగ్రహుడు, జగన్నాటక సూత్రధారియగు శ్రీ కృష్ణుడు రుక్మిణి కోర్కె నెరవేర్చుటకై, సభ కేతెంచి, అచ్చట నున్న లోమశ (రోమశ) మహర్షిని జూచి, నమస్కరించి, " ఋషీశ్వరా! నామనుమని అనిరుద్ధుని ఎవరు తీసికొని పోయిరో, వాడు ఇప్పుడు ఎక్కడ నున్నాడో? ఏమైనాడో! తెలియకున్నది. మీఋ దివ్యదృష్టితో చూచి, సర్వము వివరింపుము" అని ప్రార్థింపగా, లోమశ మహర్షి "దేవా! శ్రీకృష్ణా ! సర్వము తెలిసియు, నన్నిట్లు ప్రశ్నింతువా? ఏమి నీలీల! నీ మనుమడగు అనిరుద్ధుని బాణాసురుని కుమార్తె ఉష భర్తగా వరించి, చెలికత్తె వలన మాయోపాయమున తెప్పించుకొని, తన అంతఃపురమున దాచియున్నది.
ఈ విషయము నారద ముని వలన తెలిసినది. మీరు శ్రీ సంకష్టహర చతుర్థీ వ్రతమును ఆచరించి, గణపతిని పూజిస్తే, మీ మనమని పొందగలరు" అని చెప్పెను. అంతట శ్రీకృష్ణుడు మునుల వలన ఈ వ్రత విధానమును
తెలుసుకొని, కల్పోక్త ప్రకారముగా రుక్మిణీయుతుడై ఈ వ్రతము ఆచరించెను. తత్ఫలముగా బాణాసురునితో యుద్ధము చేసి, వాని హస్తములను ఖండించి, విజయము పొంది, ఉషానిరుద్ధులను స్వీకరించి, ద్వారకానగరము చేరి, పుత్రపౌత్ర ప్రపౌత్రాదులతో సుఖముగ ఉండెను.
కనుక
అమ్మా! ఈ వ్రతము గొప్ప ప్రభావము గలది. దీనిని ఆచరించుటచే సర్వవిఘ్నములు తొలుగును. సర్వపుణ్యతీర్థములు సేవించిన ఫలము చేకూరును." అని చెప్పెను .
ఇట్లు శ్రీ కృష్ణ యుధిష్టిర సంవాదాత్మకమైన శ్రీ సంకష్టహర గణపతి చతుర్థీ వ్రతమున ఆశ్వయుజమాస కథ సమాప్తము
"మాకం కరోతి వాచాలం, పంగుం లంఘయతే గిరిమ్
యత్కృపాత మహం వందే వరమానందమాధవమ్
శ్రీ కృష్ణార్పణ మస్తు
శ్రీ మహాగణప్తి ప్రసాదసిద్ధి రస్తు
"సర్వే
జనా స్సుఖినో భవంతు"
ఓం శాంతి శాంతిః శాంతిః
0 Comments