Annamayya Keerthanalu అన్నమయ్య కీర్తనలు
Annamayya Keerthanalu అన్నమయ్య కీర్తనలు
1.మిశ్ర
హరికాంభోజి -- ఆది
రచన: అన్నమయ్య
స్వరరచన: శ్రీ ఎం. బాలమురళీకృష్ణ
ప: ఇందరికి
అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
చ: 1 వెలలేని వేదములు వెదకి తెచ్చిన
చేయి
చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కలికియగు భూకాంత కౌగిలించిన చేయి
వలనైన కొనుగోళ్ల వాడి చేయి ||ఇందరికి||
చ: 2 తనివోక బలిచేత దానమడిగిన చేయి
ఒనరంగ భూదాన మెసగు చేయి
మెనసి జలనిధి యమ్ముమెనకు దెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి ||ఇందరికి||
చ: 3 పురసతుల మానముల పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి
తిరువేంకటాచలాధీశుడై మెక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ||ఇందరికి||
2.ఆనందభైరవి
- ఆది
రచన: అన్నమయ్య
స్వరరచన: శ్రీ జి. బాలకృష్ణా
ప్రసాద్
చిట్టస్వరం: శ్రీ యరగొల్ల శ్రీనివాస
యాదవ్
ప: ఆదిమూలమే
మాకు అంగరక్ష
శ్రీదేవుడే మాకు జీవరక్ష
చ:1 భూమిదేవి పతి యైన పురుషోత్తముడే
మాకు
భూమిపై ఏడనున్నా భూమి రక్ష
ఆమని జలధిశాయి అయిన దేవుడే మాకు
సామీప్య మందున్న జలరక్ష
చి.స్వ. నిసగరి గమపా మగమా | గమప సనిద పదప మగమ||
పా మా గరిసనిసా | పా సా మా గరిసనిసా ||
పా సా నిదపా మగమా
| గమపా మాగరిసా || ||ఆది||
చ:2 మ్రెయుచు అగ్నిలో
యజ్ఞమూర్తి యైన దేవుడే
ఆయములు దాకకుండ అగ్ని రక్ష
వాయుసుతు నేలినట్టి వనజనాభుడే మాకు
వాయువందు కందకుండ వాయురక్ష ||శ్రీ
దేవుడే||
చ:3 పాదమాకాశమునకు పారజాచే
విష్ణువే
గాదిలియై మాకు ఆకాశరక్ష
సాధించి వేంకటాద్రి సర్వేశ్వరుడే మాకు
సాదరము మీరినట్టి సర్వరక్ష ||శ్రీ దేవుడే||
3.మధ్యమావతి
-- ఆది -- తిశ్ర నడ
రచన: అన్నమయ్య
స్వరరచన: శ్రీ జి. బాలకృష్ణా ప్రసాద్
చిట్టస్వరం: శ్రీ యరగొల్ల శ్రీనివాస
యాదవ్
ప: ఈడగు
పెండ్లి ఇద్దరి చేసేము
చేడె లాల ఇది చెప్పురుగా
చ:1 పచ్చిక బయళ్ల పడతి యాడగా
ముచ్చట కృష్ణుడు మెహించి
వెచ్చపు పూదండ వేసి వచ్చెనట
గచ్చుల నాతని కానరుగా
చి.స్వ: నిసరిమ
పనిపమ మపమరి రిమరిస |
రిమపని సరిసని నిసనిప పనిపమ ||
రిమరి రిపమ రినిప రిసని పమరిస|
సనిస రిసరి మరిమ పమప మరిరిస || ||ఈడగు||
చ:2 ముతైపు ముంగిట ముదిత నడువగా
ఉత్తముడే చెలి వురమునను
చిత్తరువు వ్రాసి చెలగి వచ్చె నొళ
జొత్తువాని ఇటు చూపరుగా ||ఈడగు||
చ:3 కొత్త చవికలో కొమ్మ నిలిచితే
పొత్తున తలబాలు పోసెనట
ఇత్తల శ్రీ వేంకటేశుడు నవ్వుచు
హత్తి సతిగూడెనని పాడరుగా ||ఈడగు||
4.పాడి
-- ఆది
రచన: అన్నమయ్య
స్వర రచన: శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ
శర్మ
ప: చక్కని
తల్లికి చాంగుభళా
చక్కర మెవికి చాంగుభళా
చ: 1 కులికెడి మురిపెపు
కుమ్మరింపు తన
సళుకు చూపులకు చాంగుభళా
పలుకుల సొలపుల పతితో కసరెడి
చలముల అలుకకు చాంగుభళా ||చక్కని ||
చ: 2 కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెరుగులకు చాంగుభళా
ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా ||చక్కని ||
చ: 3 జందెపు ముత్యపు సరుల హారముల
చందన గంధికి చాంగుభళా
విందయి వెంకట విభు పెనచిన తన
సంది దండలకు చాంగుభళా ||చక్కని ||
5.జోన్పూరి--ఆది
రచన: శ్రీ అన్నమయ్య
స్వరరచన : శ్రీ.డి. పశుపతి
ప: హరి
నామము కడు ఆనందకరము
మరుగవొ మరుగవొ మరుగవొ మనసా
చ:1 నళినాక్షుని శ్రీ నామము
కలిదోష హరము | కైవల్యము
ఫల సారము బహుబంధ మెచనము
తలచవొ తలచవొ తలచవొ మనసా ||హరి నామము||
చ:2 నగధరు నామము నరక హరణము
జగదేక హితము | సమ్మతము
సగుణ నిర్గుణము | సాక్షాత్కారము
పొగడవొ పొగడవొ పొగడవొ మనసా ||హరి నామము||
చ:3 కడిగి శ్రీ వేంకటపతి నామము
బడి బడినే సంపత్కరము
అడియాలంబిల | నతి సుఖమూలము
తడవవొ తడవవొ | తడవవొ మనసా ||హరి నామము||
6.కాపి
-- ఆది -- తిశ్రనడ
రచన: శ్రీ అన్నమయ్య
స్వరచన : శ్రీ జి. బాలకృష్ణప్రసాద్
ప: మాధవ కేశవ
మధుసూదనా విష్ణు
శ్రీధరా పదనఖం చింతయామి యూయం
చ:1 వామన గోవింద వాసుదేవ
ప్రద్యుమ్న
రామ రామ కృష్ణ నారాయణాచ్యుత
దామెదరానిరుద్ద దైన పుండరీకాక్ష
నామత్రయాదీశ నమె నమె ||మాధవ||
చ:2 పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య
హరి సంరక్షణా అధోక్షజా
నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమా
శరణాగత రక్ష జయ జయసేవే ||మాధవ||
చ:3 మహిత జనార్ధన మత్స్యకూర్మ వరాహ
సహజ భార్గవ బుద్ద జయ తురగ కల్కి
విహిత విజ్ఞాన శ్రీ వేంకటేశ శుభకరం
అహమిహ తవపద దాస్యం అనిశం భజామి ||మాధవ||
7.భౌళి
-- ఆది
రచన: శ్రీ అన్నమయ్య
స్వరరచన: శ్రీ మల్లిక్
చిట్టస్వరం: శ్రీ యరగొల్ల శ్రీనివాస
యాదవ్
ప: విన్నపాలు
వినవలె వింత వింతలు
పన్నగపు దోమతెర పైకెత్త వేలయ్యా
చ:1 తెల్లవారె జామెక్కె | దేవతలు మునులు
అల్లనల్ల నంత నింత |అదివో వారే
చల్లని తమ్మిరేకుల సారస్యపు కన్నులు
మెల్ల మెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా
చి.స్వ: గాగ పాపదప గపదప గరిసరి |
గగా పాపదప గపదప గరిసరి ||
గరిగ పగప దపద సనిద పగపద |
పద సనిద పగరి సరీగరీ గా
పా దా గపద సా, నీ , |
దా, సనిద
పా, గా, రీ, ప
||గరి|| ||విన్నపాలు||
చ:2 గరుడ కిన్నెర యక్షకామినులు
గములై
విరహపు గీతముల వింత తాళాల
పరి పరి విధముల బాడేరు | రాగాల
నిన్నదివో
సిరి మెగము దెరచి | చిత్తగించ వేలయ్యా ||విన్నపాలు||
చ:3 పంకపు శేషాదులు |తుంబుర నారదాదులు
పంకజభవాదులు నీ | పాదాలు చేరి
అంకెలనున్నారు లేచి | అలమేలుమంగను
వేంకటేశుడా రెప్పలు | విచ్చి
చూచులేవయ్యా ||విన్నపాలు||
8.తిలంగ్
- ఆది
రచన : శ్రీ చిన
తిరుమలాచార్యులు
స్వరరచన: శ్రీ ఏం.ఏస్.
బాలసుబ్రహ్మణ్యశర్మ
చిట్టస్వరం: శ్రీ యరగొల్ల శ్రీనివాస
యాదవ్
ప: అప్పని
వరప్రసాది అన్నమయ్య
అప్పసము మాకే కలడన్నమయ్య
చ:1 అంతటికి ఏలికైన | ఆదినారాయణు తన
అంతరంగానా నిలిపిన అన్నమయ్య
సంతసాన చెలువొందే సనకసనందనాదు
లంతటివాడు తాళ్ళపాక అన్నమయ్య
చి.స్వ: సగ మ
పానిసా సనిప నిపమగా|
గమప గపమగస నీసగామ పనిపా||
మగా పమా నిపా సనీ పమా|నిపా సనీ గసా నిపా ||
మగా స నీ గసా నిసా గమా
గమ పనిసగ సాని పామ గా స నిస గమ ||పనిపా|| ||అప్పని||
చ:2 బిరుదు టెక్కెములుగా
పెక్కు సంకీర్తనములు
హరిమీద విన్నవించె నన్నమయ్య
విరివి గలిగినట్టి వేదముల అర్థమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||అప్పని||
చ:3 అందమైన రామానుజ
ఆచార్యమతమున
అందుకొని నిలిపినాడు అన్నమయ్యా
విందువలె మాకును శ్రీ వేంకటనాధుని ఇచ్చే
అందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||అప్పని||
9.హిందోళ
-- ఆది -- తిశ్ర నడ
రచన: అన్నమయ్య
స్వరరచన: శ్రీ వేదవ్యాస ఆనంద భట్టర్
చిట్టస్వరం: శ్రీ యర గొల్ల శ్రీనివాస
యాదవ్
ప: కట్టెదుర
వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయె మహిమలు తిరుమల కొండ
చ:1 వేదములే శిలలై వెలసినదీ కొండ
ఏ దెస పుణ్యరాశులే ఏరులైనదీ కొండ
గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ
శ్రీ దేవుడుంటేటి శేషాద్రి ఈ కొండ
చి.స్వ. మదని
సాస సాస నిగస | దసనీ మనిదా గమద||
నీని నీని దసనీ మని
| దా గదమా గస గమదని ||
సమగస నిగసని దసనిద | మనిదమ గస నిస గమ
దని|| ||కట్టెదుర||
చ:2 సర్వ దేవతలు
మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
ఉర్వి తపసులే తరువులై నిలిచిన కొండ
పూర్వపు టంజనాద్రి ఈ పొడవాటి కొండ ||కట్టెదుర||
చ:3 వరములు కొట్టారుగా
వక్కాణించి పెంచే కొండ
పరుగు లక్ష్మీకాంతు శోబనపు కొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దిదివో శ్రీవేంకటపు కొండ ||కట్టెదుర||
0 Comments