Varalakshmi Vratam - వర లక్ష్మీ వ్రతం

Varalakshmi Vratam - వర లక్ష్మీ వ్రతం
Varalakshmi Vratam - వర లక్ష్మీ వ్రతం

శ్రీ మహాగణాధిపతయే నమః

శ్రీ గురుభ్యో నమః

హరిః ఓం

శుచిః

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతో పి వా

యః స్మరేత్ పుండరీకాక్షం బాహ్యాభ్యంతరః శుచిః

పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష

ప్రార్థన

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నేపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

దేవీం వాచమజనయన్త దేవాస్తాం విశ్వరూపాః పశవో వదన్తి

సా నో మన్ద్రేషమూర్జం దుహానా ధేనుర్వాగస్మానుప సుష్టుతైతు

యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వ మంగళ

తయెః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం

అయం ముహూర్తః సుముహూర్తోస్తు

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం

తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి

గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః

ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః

సర్వమంగళ మాంగళ్యే శివె సర్వార్థ సాధికే

శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమెస్తుతే

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః

ఉమా మహేశ్వరాభ్యాం నమః

వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః

శచీ పురందరాభ్యాం నమః

అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః

శ్రీ సీతారామాభ్యాం నమః

మాతా పితృభ్యో నమః

సర్వేభ్యో మహజనేభ్యో నమః

గాయత్రో ప్రార్థన

ఓం ముక్తా విద్రుమహేమనీల దవళచ్చాయై ర్ముఖైస్త్రీక్షణైః

యుక్తా మిందుకళానిబద్దరత్న ముకుతామ్ తత్త్వార్థవర్ణాత్మికామ్

గాయత్రీ వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలంగదాం

శంఖం చక్రమాధారవింద యుగళం హస్తైర్వహ న్తీంభజే

గాయత్రీ మంత్రము

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్యదీమహిః ధియోయోనః ప్రచోదయాత్

దీపారాధన

దీపంజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్

దీపేన సాధ్యతే సర్వం పూజాసమయే దీపం నమోస్తుతే

దీపస్త్వం బ్రహ్మ రూపొసి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్నామాంశ్చ దేహి మే

భో దీప దేవి రూపస్త్వం కర్మసాక్షీ హ్యవిఘ్నకృత్

యావత్పూజం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ

శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదమ్

శత్రుబుద్దివినాశం చ దీప జ్యోతిర్నమోస్తుతే

దీపారాధన ముహూర్తః సుముహూర్తోస్తు

అచమనము

ఓం కేశవాయ స్వాహా

ఓం నారాయణాయ స్వాహా

ఓం మాధవాయ స్వాహా

ఓం గోవిందాయ నమః

ఓం విష్ణువే నమః

ఓం మధుసూదనాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం వామనాయ నమః

ఓం శ్రీధరాయ నమః

ఓం హృషీకేశాయ నమః

ఓం పద్మనాభాయ నమః

ఓం దామోదరాయ నమః

ఓం సంకర్షణాయ నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం ప్రద్యుమ్నాయ నమః

ఓం అనిరుద్దాయ నమః

ఓం పురుషోత్తమాయ నమః

ఓం అధోక్షజాయ నమః

ఓం నారసింహాయ నమః

ఓం అచ్యుతాయ నమః

ఓం జనార్థనాయ నమః

ఓం ఉపేంద్రాయ నమః

ఓం హరయే నమః

ఓం శ్రీకృష్ణాయ నమః

ఘంట పూజా

ఓం జయధ్వని మంత్రమాతః స్వాహా

ఘంతదేవతాభ్యో నమః

సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి

ఘంటనాదం

(క్రింది మంత్రము చెప్పుచు ఘంటా నాదము చేయవలెను)

ఆగమార్థంతు దేవానాం గమనార్థం తు రాక్షసాం

కురుఘంటారవం తత్రదేవతాహ్వాన లాంఛనమ్

ఇతి ఘంతానాదం కృత్వా

భూతోచ్ఛాటనం

(క్రింది మంత్రము చెప్పుచు నీళ్లు ప్రోక్షించవలెను)

ఓం ఉత్తిష్ఠంతు భూత పిశాచాః య ఏతే భూమి భారకాః

ఏతేషామవిరీధేన బ్రహ్మకర్మ సమారభే

అపసర్పన్తు తే భూతా యే భూతా భూమి సంస్థితాః

యే భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయా

ప్రాణాయామం

(క్రింది మంత్రము చెప్పుచు ప్రాణాయామము చేయవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః

ఓం జనః ఓం తపః ఓం సత్యం

ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్

ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

సంకల్పం

మమ ఉపాత్త సమస్త దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యార్థం శుభాభ్యం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహవిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితియ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరత ఖండే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానెన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే....................... సంవత్సరే..................... ఆయనే ................... ఋతౌ శ్రావణ. మాసే శుక్ల పక్షే ................... తిథౌ శుక్ర వాసరే ..................  శుభ నక్షత్ర శుభ యోగ శుభకరణ ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమస్థైర్య దైర్ఘ్య వీర్య విజయ, అభయ ఆయుః, ఆయురారోగ్యైశ్వర్య అభివృద్ది సిద్ద్యర్థం, భక్తిజ్ఞాన వైరాగ్య సిద్ద్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ద్యర్థం, పుత్రపౌత్రాబి వృద్ద్యర్థం, సద్బుద్దీత్యాది, సర్వశుభఫలప్రాత్రాబి వృద్ద్యర్థం, సద్బుద్దీత్యాది, సర్వశుభఫలప్రాప్త్యర్థం శీఘ్రమేవ దంపతీనాం, అనుకూల దాంపత్య సిద్ద్యర్థం సంతానార్థినాం, శ్రీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం, సమస్తరోగ నివారణ సిద్యార్థం, జాతకరీతయ్య, గోచారరీత్య సంపూర్ణ నవగ్రహ దోష నివార్ణార్థం, సర్వాబీష్ట సిద్ద్యర్థం గృహేషు అలక్ష్మీ నివార్ణార్థం, సర్వకాల మహాలక్ష్మీ సిద్ద్యర్థం, మమ గృహే వస్తు వాహన ధనదాన్య, పశు, క్షేత్ర, అష్టా ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం, మనోవాచన ఫల సిద్ధ్యర్థం మమ గృహే సుఖ సంతోషం అభి వృద్ధ్యర్థం మమ గృహే సర్వకాల వరమహాలక్ష్మీ స్థరత సిద్ధ్యర్థం, రాజ ప్రసాద దేవతా ప్రసాద సిద్ధ్యర్థం, సౌభాగ్య ఫలావాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రసాద సిద్ధ్యర్థం శ్రావణ మాస పూణ్యకాలే శ్రీ వరలక్ష్మీ దేవతా ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యార్థం కలశ పూజాం కరిషే

తదంగ కలశారాధనం కరిషే

కలశపూజ

కలశం గంధపుష్పాక్షతైరభర్బ్య తదుపరి హస్తమ్ నిధాయ

కలశస్య ముఖేః విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్నగణాశ్రితా కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంతు సమాశ్రితా ఆయాంతు దేవ పూజార్థం మమదురి తక్షయకారకాః అత్ర గాయత్రీ సావిత్రీ శాంతిః పుష్టీకరీశ్వరీ

ఆపో వా ఇదగ్ం సర్వం విస్వా భూతాన్యాపః

ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపః

సమ్రాడాపో విరాడాపః స్వరాణాపశ్ఛందాగ్ స్యాపో

జ్యోతిగ్ ష్యాపో యజూగ్ ష్యాపః సత్యమాపః

సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప

ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు

కావేరి తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ

భాగీరధీ చ విఖ్యాతాః పంచ గంగాః ప్రకీర్తితః

కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవమాత్మానంచ సంప్రోక్ష, ఆత్మానంచ సంప్రోక్ష్య

గణపతి పూజ

అథ మహాగణపతి పూజాంకరిష్యే

అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి పూజయామి

ధ్యానం

హరిద్రాభం చతుర్భాహుం

హరిద్రావదనం ప్రభుమ్ |

పాశాంకుశధరం దేవం

మోదకం దంతమేవ చ |

భక్తాభయ ప్రదాతారం

వందే విఘ్నవినాశనమ్ |

ఓం హరిద్రా గణపతేయే నమః

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం

అనేక దంతం భక్తానం ఏకదంతముపాస్మహే

ఓం గణానాం త్వా గణపతిం హవామహే

కవిం కవీనాముపమశ్రవస్తమమ్

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత

ఆనః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్

ఓం మహాగణపతయే నమః

ధ్యాయామి | ధ్యానం సమర్పయామి |

ఓం మహాగణపతయే నమః

ఆవాహయామి | ఆవాహనం సమర్పయామి |

ఓం మహాగణపతయే నమః

నవరత్న ఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి  |

ఓం మహాగణపతయే నమః

పాదయోః పాద్యం సమర్పయామి |

ఓం మహాగణపతయే నమః

హస్త యోః అర్ఘ్యం సమర్పయామి |

ఓం మహాగణపతయే నమః

ముఖే ఆచమనీయం సమర్పయామి

ఓం మహాగణపతయే నమః

శుద్ధోదక స్నానం సమర్పయామి

స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |

ఓం శ్రీ మహాగణపతయే నమః

వస్త్రం సమర్పయామి

ఓం మహాగణపతయే నమః

యజ్ఞోపవీతం సమర్పయామి

ఓం మహాగణపతయే నమః

దివ్య శ్రీ గంథం సమర్పయామి

గంథస్యోపరి అలంకరణార్థం హరిద్రా కుంకుమ సమర్పయామి ||

ఓం మహాగణపతయే నమః

అక్షతాన్ సమర్పయామి

ఓం మహాగణపతయే నమః

పరిమళ పత్రపుష్యైః పూజయామి

పుష్పం

ఓం సుముఖాయ నమః

ఓం ఏకదంతాయ నమః

ఓం కపిలాయ నమః

ఓం గజకర్ణికాయ నమః

ఓం లంబోదరాయ నమః

ఓం వికాటాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం గణాధిపాయ నమః

ఓం ధూమకేతవే నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం ఫాలచంద్రాయ నమః

ఓం గజాననాయ నమః

ఓం వక్రతుండాయ నమః

ఓం శూర్పకర్ణాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం స్కందపూర్వజాయ నమః

ఓం సర్వసిద్దిప్రదాయ నమః

ఓం శ్రీ మహాగణపతయే నమః

ఇతి షోడశ నామావళి పూజం సమర్పయామి

ధూపం

వనస్సత్యుద్భవిర్దివ్యై నానా గంధైః సుసంయుతః

ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం

ఓం మహాగణపతయే నమః

ధూపం ఆఘ్రాపయామి

దీపం [ఏకార్తి]

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం |

గృహణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ ||

భక్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే |

త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే ||

ఓం మహాగణపతయే నమః

ప్రత్యక్ష దీపం సమర్పయామి

ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి

ఓం మహాగణపతయే నమః

నైవేద్యం సమర్పయామి

నీరాజనం

మంగళం సుముఖోదేవ మంగళం ఆఖువాహన మంగళం విఘ్నరాజాయ మంగళం స్కందపూర్వజః

ఓం శ్రీ మహాగణపతయే నమః

కర్పూర నీరాజనం సమర్పయామి

మంత్రపుష్పం

సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ||

ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః

వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కంద పూర్వజః ||

షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి

విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా

సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే

ఓం మహాగణపతయే నమః

సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి

ఓం మహాగణపతయే నమః

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

ఓం మహాగణపతయే నమః

ఛత్ర చామరాది సమస్త రాజోపచారాన్ సమర్పయామి ||

క్షమాప్రార్థన

“వక్రతుండ ! మహాకాయ ! సూర్య కోటి సమప్రభ !

నిర్వఘ్నం కురు మే దేవ ! సర్వ కార్యేషు సర్వదా “

అనయా ధ్యాన ఆవాహనాది షోడశో పచార పూజయా

భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు

ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు |

ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు || మమ ఇష్తకామ్యార్థ సిద్దిరస్తు

శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి ||

ఓం శ్రీ మహాగణపతయే నమః యథాస్థానం ప్రతిష్ఠాపయామి ||

శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ |

ఓం శాంతిః శాంతిః

అథ పీఠ పూజాంకరిష్యే

పీఠపూజ

ఓం ఆదారశక్త్యే నమః

ఓం మూల ప్రకృత్యై నమః

ఓం కూర్మాయ నమః

ఓం వరాహాయ నమః

ఓం ‍అనంతాయ నమః

ఓం ‍అష్టదిగ్గజేభ్యో నమః

ఓం తన్మధ్యేక్షీరార్ణవాయ నమః

ఓం క్షీరార్ణవ మధ్యేశ్వేత ద్వీపాయ నమః

శ్వేతద్వీప స్యాధః

కల్పవృక్షాయ నమః కల్పవృక్ష స్యాధః

సువర్ణమంటపాయ నమః

ఇతి పీఠపూజాం సమార్పయామి

అథ ద్వారపాలక పూజాంకరిష్యే

పూర్వద్వారే ద్వార శ్రియై నమః విజయాయ నమః

దక్షిణద్వారే ద్వారశ్రియై నమః

నందాయ నమః  సునందాయ నమః

పశ్చిమ ద్వారే శ్రియై నమః

బలాయ నమః ప్రబలాయ నమః

ఉత్తరద్వారే ద్వారశియై నమః కుముదాయనమః కుముదాక్షాయ నమః

ఇది ద్వారపాలక పూజాం సమర్పయామి

 

యమునాదేవి పూజ

ఓం శ్రీ యమున దేవత ముదిస్య యమున దేవత ప్రీత్యార్థం యమున దేవత పూజాంచ కరిష్యే

లోక-పాల-స్తుతం దేవి-మింద్ర-నీల-సమప్రభం,

యమునే త్వామహం ధ్యాయే సర్వ-కామర్థ-సిధయే,

యమునాయై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి |

 

ఆవాహనం

ఓం ఇమామ్ మే గంగే యమునే సరస్వతీ

శుతుధ్రీ స్తోమం సచథా పరుషణ్య,

అసిక్త్యా మరుధ్వద్రిధే వితస్థ-యార్జీర్ కియే

శ్రణుహ్య సుశోమాయ సరస్వతీ వ్రత సుపూర్తి హేతవే.

యమునాయే నమః,

అస్మిన్ కాలే యమున మావ ఆవాహయామి.

ఆసనం

సింహాసన సమరుడే దేవ శక్తి సమన్వతే,

సర్వ లక్షణ సంపూర్ణే

యమునాయై నమోస్తుతే ఆసనం సమర్పయామి

పాద్యం

 రుద్ర-పాధే నమస్తుభ్యం సర్వలోక హితప్రియే,

సర్వ-పాప-ప్రశమని తాంగిన్యై నమోస్తుతే.

యమునాయై నమః పాద్యం సమర్పయామి .

అర్ఘ్యం

తక్షయర్పధే నమస్తుభ్యం శంకర ప్రియ భామినీ,

సర్వ కామ ప్రధానే దేవీయమునే తే నమో నమః.

యమునాయై నమః అర్ఘ్యం సమర్పయామి .

ఆచమనీయం

విష్ణు పాధోద్బవే దేవి సర్వ బరణే భూషితే,

కృష్ణ మూర్తే మహాదేవి కృష్ణ-వేణ్యైనమోస్తుతే.

యమునాయై నమః ఆచమ నీయం సమర్పయామి.

మధుపర్కం

సర్వ పాప హరే దేవి విశ్వస్య ప్రియ-దర్శిణీ,

సౌభాగ్యం యమునే దేహియామయై నమోస్తుతే.

యమునాయై నమః మధుపర్కం సమర్పయామి

సాన్నం

గంగేచ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ

నర్మదే సింధు కావేరి

యమునాయై నమః సాన్నం సమర్పయామి

పంచామృత స్నానం

నన్ధిపాధే మహాదేవీ శంకరదర్శరిణి,

సర్వేలోక హితే దేవీభీమ-రథ్యాయై నమోస్తుతే.

యమునాయై నమః పంచామృత స్నానం సమర్పయామి .

(పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి)

శుద్దోదక స్నానం

 సింహ పాధోధ్-భవ దేవి నరసింహ సమ-ప్రభే,

సర్వ-లక్షణ సంపూర్ణే భవ-నాశిని ది నమః.

యమునాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి..

వస్త్రం

 విష్ణు పాధాబ్జ సంభూతే గంగే త్రిపద గామినీ,

సర్వ పాప-హరే దేవి భగీరథాయై నమోస్తుతే.

యమునాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

యజ్ఞోపవీతం

యజ్ఞోపవీతం పరమం పవిత్రం

ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్

ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రమ్

యజ్ఞోపవీతం బలమస్తు తేజః

ఉపావీతార్థం పుష్పనీయం పూజయామి

గంథం

చందనాగురు కస్తూరీ ప్రోచనానం

కుంకుమ తథదా కర్పూరేణ సమాయుక్తం

గంథం ద్వలిత పంచద యమునాయై నమః

యమునాయై నమః గంథం సమర్పయామి

ఆభరణం

సువర్ణ భూషితం దివ్యం నానా రత్న సు-శోభితం

త్రి-లోక్య ఔజితే దేవి గ్రహణ-బరణం శుభమ్.

యమునాయై నమః ఆభరణాని సమర్పయామి.

అక్షంతలు

శ్వేతాంశ్చ చన్ద్ర వర్ణాభాన్ హరిద్ర రాగ-

రంగితమ్ అక్షతం సుర శ్రేష్ఠే దధామి యమునే శుభే.

యమునాయై నమః అక్షతాన్ సమర్పయామి.

హరిద్ర కుంకుమ

కాంత సూత్రంథాలపత్రం హరిద్ర కుంకుమ -అంజనం,

సింధూరాధి ప్రధ ప్రధాస్యామి సౌభాగ్యం దేహి మే-అవ్యయే,

సౌభాగ్య హరిద్ర కుంకుమం సమర్పయామి.

పుష్పాలు

మందారామాలా కేతకీ, జాజి,పునగై, చంపకైర్-భ్కులై

హీ శుభైహి పూజయామి.

దేవేశి యమనే భక్తవత్సలై.

యమునాయై నమః  పుష్పాణి సమర్పయామి.

అంగపూజ

ఓం చంచాలాయై నమః - పాదౌ పూజయామి

ఓం చపలాయై నమః - జానునీ పూజయామి

ఓం భక్త వత్సాలాయ నమః - కటిం పూజయామి

ఓం మహోధారాయే నమః - నాభిం పూజయామి

ఓం మనమథ వాసిన్యే నమః - గృహ్యం పూజయామి

ఓం అజ్ఞాన నాశినే నమః - హృదయం పూజయామి

ఓం భద్రాయే నమః - స్థనం పూజయామి

ఓం అగాత్రే నమః - భుజౌ పూజయామి

ఓం రక్త కంఠే నమః - కఠః పూజయామి

ఓం భవవృదే నమః - ముఖం పూజయామి

ఓం గౌర్య నమః - నేత్రే పూజయామి

ఓం భగీరథే నమః - లలాటం పూజయామి

ఓం యమునాయై నమః - శిరః పూజయామి

ఓం సరస్వతే నమః సర్వ అంగాని పూజయామి

అష్టోత్తరం

ఓం యమునాయై నమః

ఓం  సీతాయై నమః

ఓం విమాలాయే నమః

ఓం  ఉపలాయే నమః

ఓం అభిష్టదాయే నమః

ఓం దాత్రే నమః

ఓం హరభ్య రూపిణ్యేయ నమః

ఓం గంగాయే నమః

ఓం నర్మాదాయే నమః

ఓం గౌర్యె నమః

ఓం భగీరథే నమః

ఓం తుంగాయే నమః

ఓం భద్రాయే నమః

ఓం కృష్ణవేణిణే నమః

ఓం భువనాశిన్యే నమః

ఓం సరస్వతీ నమః

ఓం కావేర్యె నమః

ఓం సిద్దవే నమః

ఓం గౌతమ్యయ నమః

ఓం గౌమత్యే నమః

ఓం గాయత్రీ నమః

ఓం గరుడాయ నమః

ఓం గీరీజాయ నమః

ఓం చంద్ర చూడాయే నమః

ఓం సర్వేశ్వర్యె నమః

ఓం  మహాలక్ష్మ్యే నమః

సర్వ పాపహరే దేవి సర్వప భద్రనాశిని సర్వసంప్రదే దేవి

యమునాయే నమోస్తుతే యమునాదేవ్యై నమః

నానావిధ పరిమళ పత్ర పుష్పం పూజయామి

కడ్డీలు

 దశాంగంగుగుఉలోపేతం సుగంధం మనోహరం,

కపిలగోఘృత సమాయుక్తం ధూపోయం ప్రతి గృహ్యతాం

ఓం శ్రీ యమునాయై నమః  ధూపమాఘ్రాపయామి

ఏకార్తి

ఘృతాక్తవర్తి సమాయుక్తం వన్యయా యోజితం

మయ గృహణ దీపీత్తందేవ్యే సరవైశ్వర్యై

ప్రదాయిని యమున దేవాయే నమః

ఏకార్తి దర్శయామి

ఏకార్తి దీపానంతరం అచమనీయం సమర్పయామి

నైవేద్యం

ఓం భూర్బువస్సువః తత్సవితర్వరేణ్యమ్

భర్గో దేవస్య దీమహి ధియో యోనః

ప్రచోదయాత్ సత్యం త్వా ఋతేన పరిషించామి

[సాయంత్రం ఋతం త్వా సత్యేన పరిషించామి]

అమృతమస్తు అమృతాపస్తరణమసి

ఓం శ్రీ యమునాయై నమః  నైవేద్యం సమర్పయామి

ఓం ప్రాణాయ స్వాహ

ఓం అపానాయ స్వాహ

ఓం వ్యానాయ స్వాహ

ఓం ఉదానాయ స్వాహ

ఓం సమానాయ స్వాహ

ఓం శ్రీ యమునాయై నమః హస్త ప్రక్షాళనం సమర్పయామి

తాంబూలం

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం

కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం

ఓం శ్రీ యమునాయై నమః తాంబూలం సమర్పయామి

తాంబూల చర్యణానంతరం ఆచమనీయం సమర్పయామి

హరతి

కర్పూరవర్తి సంయుక్తం దీప్యమాన మనోహరం

ఇదం గృహణ దేవేశ మంగళం కురు సర్వదా

ఓం శ్రీ యమునాయై నమః  నీరాజనం సమర్పయామి

ఓం శ్రీ యమునాయై నమః మంత్రపుష్పం సమర్పయామి

నమాస్కారం

కేతకిజాతి కుశుమైహి మలితా బై వైః

పుష్పాంజాలి దుదుదంతో రుద్ర ప్రీతేన్య నమః

నమోస్తుతే యమున దేవ్యే నమః పుష్పాంజాలి సమర్పయామి

ఓం శ్రీ యమునాయై నమః ప్రదక్షణ సమర్పయామి

ప్రార్థన

ఓం భావానీచ మహలక్ష్మీ సర్వాకామ ప్రదాయిని

ధృత సంఫూర్ణ ధ్యాతో యమునాయై నమః

మనశాజిష్ఠ ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి

శ్రీ వరలక్ష్మీ వ్రతము

శ్రీ వరలక్ష్మీ దేవతా ముదిశ్య అథ మండపం పూజాం కరిష్యె

ఓం సువర్ణ మండపాయ నమః

ఓం హిమ ప్రాకారాయ నమః

ఓం చిత్ర మండపాయ నమః

ఓం విచిత్ర మండపాయ నమః

ఇతి మండపం పూజం సమర్పయామి

పీఠపూజ

ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పీఠపూజసమర్పయామి

అథ ద్వారపాలక పూజ

ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అథ ద్వారపాలక పూజం సమర్పయామి

నవశక్తి పూజ

ఓం వామాయ నమః

ఓం జ్యేష్ఠాయ నమః

ఓం రౌద్రే నమః

ఓం కాళియే నమః

ఓం కలవికళినే నమః

ఓం బల వికళినే నమః

ఓం ప్రమదినే నమః

ఓం సర్వభూత ప్రదిన్యె నమః

ఓం మనోమన్సినే నమః

అథ నూతన ద్వార స్థాపన కుర్యత్

ఓం క్షౌమం నవం మహదేవ్యే కుంకుమార్థం సుదోరకం

ద్వాదశ గ్రంధి సంయుక్తం ఉపకల్ప ప్రబోజయేత్ దుర్గాన దేవతా

ఓం మహాదేవ్యై విద్మహే విష్ణు పత్న్యృచ

ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్

దుర్గాన్ దేవతా మహాలక్ష్మీ ఆవాహయామి

స్థాపయామి పూజయామి

దుర్గాన్ దేవతాయై హరిద్ర కుంకుమ సమర్పయామి

కుంకుమ చూర్ణం సమర్పయామి

పుష్పా అక్షితాన్ సమర్పయామి

ప్రాణ ప్రతిష్ఠాపనం

ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజామ్ |

చంద్రాం హిరణ్యయీం లక్ష్మీం జాతవేదో మావహ ||

తాం మావహ జాత వేదో లక్ష్మీ మనపగామినీమ్ |

యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్ ||

ఓం అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ

మిహనీదేహి భోగమ్ జ్యోకృశ్యేమ సూర్యముచ్చరంత

మనుమతే మృడయాన స్వస్తి, అత్ర ఆవాహితోభవ,

సం స్థాపితోభవ, అవకుంఠితోభవ, వ్యాప్తోభవ

కృపాహితభవ, సుస్థిరభవ మమ సుప్రసన్నో భవ

స్వామి జగనాథ వ్యవహ పూజాదికం తావత్ పరిపాలకేన

బింబెస్మీన్, కలసెస్మీన్, ద్యాన్స్మీన్ సనిదికురు

ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణు పత్న్యృచ

ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్

ఓం భుః వర మహాలక్ష్మీ మావహయామి

ఓం భువః వర మహాలక్ష్మీ మావహయామి

ఓం సువః వర మహాలక్ష్మీ మావహయామి

ఓం భూర్బువస్సువః వర మహాలక్ష్మీ మావహయామి

స్థాపయామి పూజయామి

ప్రాణప్రతిష్ఠా సుముహూర్తోస్తు

ధ్యానం

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే

నారాయణ ప్రియె దేవీ సుప్రీతా భవ సర్వదా

క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే

సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి

ఆవాహనం

సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్శస్థ్సలాలయే

ఆవహాయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆవహయామి

సింహసనం

సూర్యాయుత నిభస్ఫూర్తే స్సురద్రత్న విభూషితే

సింహాసనమిదం దేవీ స్థీయతాం సురపూజితే

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః రత్నసింహాసనం సమర్పయామి

అర్ఘ్యం

శుద్ధోదకం పాత్రస్థం గంథ పుష్పాది మిశ్రితం

అర్ఘ్యం దాస్వామి తే దేవీ గృహ్యతాం హరివల్లభే

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః రత్నఅర్ఘ్యం సమర్పయామి

పాద్యం

సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం

పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పాద్యం సమర్పయామి

ఆచమనీయం

సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం

గృహాణాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి

పంచామృత స్నానం

యోదధి ఘృతోపేతం శర్కరామధు సంయుతం

పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి

(గమనిక: స్వామి వారి ప్రతిమను ముందుగా పంచామృతాలతో అభీషేకము చేసి తరువాత పూజచేయవలెను)

పంచామృత అభిషేకం

క్షీరం [ పాలు ]

ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వత స్సోమ వృష్టియమ్

     భవా వాజస్య సంగధే క్షీరేణ స్నపయామి

దధి [పెరుగు]

ఓం దధిక్రావ్ణో అకారిషం జిష్టోరశ్వస్య వాజినః

      సురభినో ముఖా కరత్ప్రణ ఆయూగ్ంషి తారిషత్దధ్నా స్నపయామి

అజ్యం [ నెయ్యి ]

 ఓం శుక్ర మసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్సునాతు

       అచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభి ఆజ్యేన స్నపయామి

మధు [తేనె]

ఓం మధు వాతా బుతాయతే మధుక్షరన్తి సింధవః |

మాధ్వీ ర్న సన్త్వౌషధీ |

మధు నక్త ముతోషసి మధుమ త్పార్ధివగ్ం రజః|

మధు ద్యౌరస్తు నః పితా |

మధుమాన్నో వనస్పతి ర్మధుమాగ్ం అస్తు సూర్యః

మాధ్వీర్గావో భవంతు నః |

మధునా స్నపయామి ||

శర్కరా [ చక్కర ]

ఓం స్వాదుః పవస్వ దివ్యాయ జన్ననే |

స్వాదు రింద్రాయ సుహవేతు నామ్నే |

స్వాదు ర్మిత్రాయ వరుణాయ వాయవే |

బృహస్పతయే మధుమాం అధాభ్యః |

శర్కరేణ స్నపయామి ||

ఫలోదకం [ కొబ్బరినీళ్ళూ ]

యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుప్పిణీః

 బృహస్పతి ప్రసూతాస్తానో మున్చన్త్వగ్ం హసః

 ఫలోదకేన స్నపయామి ||

(ఇతి ఫలోదకం = పండ్లరసం, లేక కొబ్బరినీళ్ళు)

శుద్ధోదకం [నీళ్ళు]

ఇతి పంచామృతస్నానం |

ఓం  అపో హిష్టా మయోభువస్తా ఊర్జే దధాతన |

మహేరణాయ చక్షసే |

యో వః శివతమో రసస్తస్య భాజయతే నః |

ఉశతీరివ మాతరః |

తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ |

 ఆపో జనయథా నః |

గంగాజలం మయానీతం మహదేవశిరస్థ్సితం

శుద్ధోదక స్నానమిదం గృహాణ విధుసోదరి

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః

శూద్ధోదకేన స్నపయామి ||

స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి

ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి

తన్నో విష్ణుః ప్రచోదయాత్

ఓం మహాదేవ్యై విద్మహే విష్ణుపత్నీ ధీమహి

తన్నో లక్ష్మీః ప్రచోదయాత్

అభిశేక ప్రోక్షణ

ఓం అశ్వగ్రాతేన తత్గ్రాతేన విష్ణుగ్రాతేన వసుందర శిరశదరిశ్యామి రక్ష స్వమప పదేపదే

వస్రయుగ్మం

సురార్చితాంఘ్రి యుగళే దుకూలవసన ప్రియే

వస్త్రయుగ్మం ప్రదాస్యామి గ్రుహాణ సురపూజితే

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి

ఆభరణం

కేయూర కంకణా దివ్యే హార నూపుర మేఖలాః

విభూషణాన్య మూల్యాని గృహాణ ఋషిపూజితే

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆభరణాని సమర్పయామి

మాంగళ్యం

తప్తహేమకృతం దేవీ మాంగళ్యం మంగళప్రదం

మయా సమర్పితం దేవీ గృహాణ త్వం శుభప్రదే

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మాంగళ్యం సమర్పయామి

గంథం

కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం

గంథం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః గంథం సమర్పయామి

అక్షతాన్

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్

తండులాన్ శూభాన్

హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్దిపుత్రికే

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి

పుష్పపూజ

మల్లికా జాజికుసుమైశ్చంపకైర్వకుళైరపి

శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరి ప్రియే

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పుష్పాణి పూజయామి

గంధాది పరిమళ ద్రవ్యాణి

గంథద్వారాం దురాధర్షం నిత్యపుష్టం కరీషిణీమ్

ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్బయె శ్రియమ్

శ్రీఖండాగరు కర్పూర మృగనాభిసమన్వితమ్

విలేపనం గృహాణాశు నమోస్తు భక్తవత్సలే

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః చందనం సమర్పయామి

ఓం రక్తచందన సమ్మిశ్రం పారిజాత సముద్బువమ్

మయాదత్తం గృహాణాశు చందనం గంధ సంయుక్తం

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః రక్త చందనం సమర్పయామి

ఓం సిందూరం రక్త వర్ణం సిందూర తిలకప్రియే

భక్త్యా దత్తం మయా దేవి సిందూరం ప్రతిగృహ్యతామ్

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః సిందూరం సమర్పయామి

ఓం కుంకుమం కామదం దివ్యం కుంకుమం కామరూపినమ్

అఖమ్ద కామసౌభాగ్యం కుంకుమ ప్రతిగృహ్యతామ్

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః కుంకుమం సమర్పయామి

ఓం తైలాని సుగంధీని ద్రవ్యాణి వివిధాని

మయా దత్తాని లేపార్థం గృహాణ పరమేశ్వరి

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః సుగంధి తైలం సమర్పయామి

పుష్పాణి

మనసః కామమాకూతిం వాచః సత్యమశీ మహి

పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః

ఓం మందార పారిజాతాదీన్పాటలీం కేతకీం తథా

మరువామోగరం చైవ గృహాణాశు నమోస్తుతే

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పుష్పాణి సమర్పయామి

ఓం విష్ణ్వది సర్వదేవానాం దూర్వాం స్వీకురు సర్వదా

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దుర్వాః సమర్పయామి

పుష్పమాలా

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ

శ్రియం వాసయ మేకులే మాతరం పద్మమాలినీమ్

ఓం పద్మశంఖజ పుష్పైః శతపత్త్రెర్వి చిత్రితామ్

పుష్పమాలాం ప్రయచ్చామి గృహణ త్వం సురేశ్వరి

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పుష్పమాలామ్ సమర్పయామి

అథాంగ పూజ

ఓం చంచలాయై నమః - పాదౌ పూజయామి

ఓం చపలాయై నమః - జానునీ  పూజయామి

ఓం పీతాంబరధరాయై నమః - ఊరూ పూజయామి

ఓం కమల వాసిన్యై నమః - కటిం పూజయామి

ఓం పద్మాలయాయై నమః - నాభిం పూజయామి

ఓం మదనమాత్రే నమః - స్తనౌ పూజయామి

ఓం లలితాయై నమః - భుజధ్వయం పూజయామి

ఓం కంబుకంఠ్యై నమః - కంఠం  పూజయామి

ఓం సుముఖాయై నమః - ముఖం పూజయామి

ఓం శ్రియై నమః - ఓష్ఠౌ పూజయామి

ఓం సునాసికాయై నమః - నాసికాం పూజయామి

ఓం సునేత్రాయై నమః - నేత్రౌ పూజయామి

ఓం రమాయై నమః - కర్ణౌ పూజయామి

ఓం కమలాయై నమః - శిరః పూజయామి

ఓం వరలక్ష్మీ నమః సర్వాణ్యంగాని పూజయామి

పత్రం పూజ

మహాలక్ష్మై నమః - మాజి పత్రం సమర్పయామి

మాయ నమః - మర్గ పత్రం సమర్పయామి

క్షేమకరీయ నమః - సమంతిక పత్రం సమర్పయామి

శుభప్రదాయ నమః - బిల్వ పత్రం సమర్పయామి

అథ తోరగ్రంధి పూజా

ఓం కమలాయై నమః - ప్రథమ గ్రంథిం పూజయామి

ఓం రమయై నమః - ద్వితీయ గ్రంథిం పూజయామి

ఓం లోకమాత్రే నమః - తృతీయ గ్రంథిం పూజయామి

ఓం విశ్వజనస్యై  నమః - చతుర్థ గ్రంథిం పూజయామి

ఓం మహాలక్ష్మ్యై నమః - పంచమ గ్రంథిం పూజయామి

ఓం క్షీరాబ్ధితనయాయై నమః - షష్టమ గ్రంథిం పూజయామి

ఓం విశ్వసాక్షిణ్యై నమః - సప్తమ గ్రంథిం పూజయామి

ఓం చంద్రసోదర్యై నమః - అష్టమ గ్రంథిం పూజయామి

ఓం హరివల్లభాయై నమః - నవమ గ్రంథిం పూజయామి

పుష్పాల పూజా

ఓం రమాయ నమః - జాజి పుష్పం పూజయామి

ఓం ఇంద్రియ నమః -  పువ్వు పుష్పం పూజయామి

ఓం హరిప్రియ నమః - వక్కుల పుష్పం పూజయామి

ఓం లోకమాత్రే నమః - మల్లిక పుష్పం పూజయామి

ఓం కమలవాసినే నమః - శమత్మాక పుష్పం పూజయామి

ఓం పద్మ నిలయయే నమః - పద్మ పుష్పం పూజయామి

ఓం శ్రీ వరమహాలక్ష్మీ నమః - నీల్పాల పుష్పం పూజయామి

ఓం సర్వైశ్వర్య కర్ణయ నమః - నాదియక పుష్పం పూజయామి

 

 

Lakshmi Ashtothram – లక్ష్మీ అష్టోత్తరం

ఓం ప్రకృత్యై నమః |

ఓం వికృత్యై నమః |

ఓం విద్యాయై నమః |

ఓం సర్వభూతహితప్రదాయై నమః |

ఓం శ్రద్ధాయై నమః |

ఓం విభూత్యై నమః |

ఓం సురభ్యై నమః |

ఓం పరమాత్మికాయై నమః |

ఓం వాచే నమః |

ఓం పద్మాలయాయై నమః || 10 ||

ఓం పద్మాయై నమః |

ఓం శుచయే నమః |

ఓం స్వాహాయై నమః |

ఓం స్వధాయై నమః |

ఓం సుధాయై నమః |

ఓం ధన్యాయై నమః |

ఓం హిరణ్మయ్యై నమః |

ఓం లక్ష్మ్యై నమః | ౧౮

ఓం నిత్యపుష్టాయై నమః || 20 ||

ఓం విభావర్యై నమః |

ఓం అదిత్యై నమః |

ఓం దిత్యై నమః |

ఓం దీప్తాయై నమః |

ఓం వసుధాయై నమః |

ఓం వసుధారిణ్యై నమః |

ఓం కమలాయై నమః |

ఓం కాంతాయై నమః |

ఓం కామాక్ష్యై నమః |

ఓం క్రోధసంభవాయై నమః || 30 ||

ఓం అనుగ్రహపరాయై నమః |

ఓం బుద్ధయే నమః |

ఓం అనఘాయై నమః |

ఓం హరివల్లభాయై నమః |

ఓం అశోకాయై నమః |

ఓం అమృతాయై నమః |

ఓం దీప్తాయై నమః |

ఓం లోకశోకవినాశిన్యై నమః |

ఓం ధర్మనిలయాయై నమః |

ఓం కరుణాయై నమః || 40 ||

ఓం లోకమాత్రే నమః |

ఓం పద్మప్రియాయై నమః |

ఓం పద్మహస్తాయై నమః |

ఓం పద్మాక్ష్యై నమః |

ఓం పద్మసుందర్యై నమః |

ఓం పద్మోద్భవాయై నమః |

ఓం పద్మముఖ్యై నమః |

ఓం పద్మనాభప్రియాయై నమః |

ఓం రమాయై నమః |

ఓం పద్మమాలాధరాయై నమః || 50 ||

ఓం దేవ్యై నమః |

ఓం పద్మిన్యై నమః |

ఓం పద్మగంధిన్యై నమః |

ఓం పుణ్యగంధాయై నమః |

ఓం సుప్రసన్నాయై నమః |

ఓం ప్రసాదాభిముఖ్యై నమః |

ఓం ప్రభాయై నమః |

ఓం చంద్రవదనాయై నమః |

ఓం చంద్రాయై నమః |

ఓం చంద్రసహోదర్యై నమః || 60 ||

ఓం చతుర్భుజాయై నమః |

ఓం చంద్రరూపాయై నమః |

ఓం ఇందిరాయై నమః |

ఓం ఇందుశీతలాయై నమః |

ఓం ఆహ్లాదజనన్యై నమః |

ఓం పుష్ట్యై నమః |

ఓం శివాయై నమః |

ఓం శివకర్యై నమః |

ఓం సత్యై నమః |

ఓం విమలాయై నమః || 70 ||

ఓం విశ్వజనన్యై నమః |

ఓం తుష్ట్యై నమః |

ఓం దారిద్ర్యనాశిన్యై నమః |

ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః |

ఓం శాంతాయై నమః |

ఓం శుక్లమాల్యాంబరాయై నమః |

ఓం శ్రియై నమః |

ఓం భాస్కర్యై నమః |

ఓం బిల్వనిలయాయై నమః |

ఓం వరారోహాయై నమః || 80 ||

ఓం యశస్విన్యై నమః |

ఓం వసుంధరాయై నమః |

ఓం ఉదారాంగాయై నమః |

ఓం హరిణ్యై నమః |

ఓం హేమమాలిన్యై నమః |

ఓం ధనధాన్యకర్యై నమః |

ఓం సిద్ధయే నమః |

ఓం స్త్రైణసౌమ్యాయై నమః |

ఓం శుభప్రదాయై నమః |

ఓం నృపవేశ్మగతానందాయై నమః || 90 ||

ఓం వరలక్ష్మ్యై నమః |

ఓం వసుప్రదాయై నమః |

ఓం శుభాయై నమః |

ఓం హిరణ్యప్రాకారాయై నమః |

ఓం సముద్రతనయాయై నమః |

ఓం జయాయై నమః |

ఓం మంగళా దేవ్యై నమః |

ఓం విష్ణువక్షఃస్థలస్థితాయై నమః |

ఓం విష్ణుపత్న్యై నమః |

ఓం ప్రసన్నాక్ష్యై నమః || 100 ||

ఓం నారాయణసమాశ్రితాయై నమః |

ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః |

ఓం దేవ్యై నమః |

ఓం సర్వోపద్రవవారిణ్యై నమః |

ఓం నవదుర్గాయై నమః |

ఓం మహాకాల్యై నమః |

ఓం బ్రహ్మావిష్ణుశివాత్మికాయై నమః |

ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః |

ఓం భువనేశ్వర్యై నమః |

ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిః సంపూర్ణం ||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పుష్పాణి సమర్పయామి

Sri Lakshmi Sahasranamam in Telugu – శ్రీ లక్ష్మీ సహస్రనామము

ధూపం

దశాంగం గుగ్గులోపేతం సుగంధం మనోహరం
ధూపం దాస్యామి తే దేవీ గృహాణ కమలప్రియే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాఘ్రపయామి

దీపం

ఘృతాక్తవర్తి సమాయుక్తం అంధకార వినాశకం
దీపం దాస్యామి తే దేవీ గృహాణముదితా భవ
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దీపం సమర్పయామి

దూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి

ఏకార్తి

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం |

గృహణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ ||

భక్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే |

త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే ||

ఆర్థ్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మ మాలినీమ్

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ

ఓం శ్రీ వరమహలక్ష్మీ దేవతాయ నమః

ఏకార్తి దీపం దర్శయామి

ఏకార్తి దీపానంతరం ఆచమనీయం సమర్పయామి

త్రియార్తి

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ |

ప్రాదుర్భుతో  స్మిన్ రాష్ట్రే స్మిన్ కీర్తిమృద్ధిం దదాతుమే

అపః సృజంతు స్నిగ్థాని చిక్లీత వస మే గృహే

నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మేకులే

ఓం శ్రీ వరమహలక్ష్మీ దేవతాయ నమః

త్రియార్తి దీపం దర్శయామి

త్రియార్తి దీపానంతరం ఆచమనీయం సమర్పయామి

తోరబంధన మంత్రం

(వరలక్ష్మీ దేవికి)

వరలక్ష్మీ దేవతాయై నమః తోరగ్రంథిం సమర్పయామి

బధ్నామి దక్ష్మిణేహస్తె నవసూత్రం శుభప్రదం

పుత్ర పౌత్రాభి వృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే

వరలక్ష్మీ వ్రత కథ

సూత మహాముని శౌనకుడు మొదలగు మహర్షులను జూచి ఇట్లనియె. “మునివర్యులారా! స్త్రీలకు సర్వసౌభాగ్యములు గలుగునట్టి యొక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి జెప్పెను. దానిని చెప్పెద వినుండు.

కైలాసపర్వతమున వజ్రవైఢూర్యాది మణిగణ ఖచితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుండు కూర్చిండియుండ, పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా! లోకంబున స్త్రీలు ఏ వ్రతంబొనర్చిన సర్వసౌభాగ్యంబులును, పుత్రపౌత్రాదులును కలిగి సుఖంబుగనుందురో, అట్టి వ్రతంబు నా కానతీయ వలయు ” ననిన నప్పరమేశ్వరుండిట్లనియె. “ఓ మనోహరీ! స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు గలుగ జేసెడి వరలక్ష్మీ వ్రతంబను నొక వ్రతంబు గలదు.

ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారమునాడు చేయవలయు” ననిన పార్వతీదేవి ఇట్లనియే. ” ఓ లోకరాధ్యా! నీ వానతి ఇచ్చిన వరలక్ష్మీ వ్రతంబును ఎట్లు చేయవలయును? ఆ వ్రతంబునకు విధియేమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వం బెవరిచే నీ వ్రతం బాచరింపబడియె? వీనినెల్ల సవివరంబుగా వచియింపవలయు”నని ప్రార్థించిన పరమేశ్వరుండు పార్వతీదేవిని గాంచి, “ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రతమును సవిస్తరంబుగ జెప్పెద వినుము.

మగధ దేశంబున కుండినంబను నొక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను, బంగారు గోడలు గల ఇండ్లతోడను గూడియుండు. అట్టి పట్టణము నందు చారుమతియను నొక మహిళ గలదు. ఆ వనితామణి ప్రతిదినంబును ఉషఃకాలంబున మేల్కాంచి స్నానంబు చేసి, పెద్దలకు అనేక విధంబులైన యుపచారంబులను జేసి, ఇంటి పనులను జేసికొని, మితముగాను, ప్రియముగాను భాషించుచు నుండెను.

ఇట్లుండ ఆమె యందు మహాలక్ష్మికి యనుగ్రహము గలిగి యొకనాడు స్వప్నంబున ప్రసన్నయై, ’ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని, నీయందు నాకు అనుగ్రహము గలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడు శుక్రవారమునాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబుల నిచ్చేద’ నని వచించిన, చారుమతీదేవి స్వప్నంబులోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి యనేక విధంబుల స్తోత్రము చేసి, ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు గలిగెనేని జనులు ధన్యులగును, విద్వాంసులుగను, సకల సంపన్నులుగను నయ్యెదరు. నేను జన్మాంతరంబున జేసిన పుణ్య విశేషం వలన నీ పాదదర్శనంబు నాకు గలిగె’ నని చెప్పిన మహాలక్ష్మి సంతోషంబు జెంది చారుమతికి ననేక వరంబులిచ్చి యంతర్థానంబు నొందె.

చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలంజూచి వరలక్ష్మీదేవిని గానక ఓహో! నేను కలగంటిననుకొని భావించి యా స్వప్న వృత్తాంతమును పెనిమిటి, మామగారు మొదలయిన వాండ్రతో జెప్ప, వారు ఈ స్వప్నము ముగుల నుత్తమమైనది, శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతం బవశ్యంబుగ జేయవలసినదని చెప్పిరి. పిమ్మట చారుమతియును, స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణమాసం బెప్పుడు వచ్చునాయని ఎదురుచూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారము వచ్చెను.

అంత చారుమతి మొదలగు స్త్రీలందరునూ ఈ దినంబే గదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబని, ఉదయంబుననే మేల్కాంచి, స్నానంబులంజేసి, చిత్ర వస్త్రంబులం గట్టుకొని, చారుమతీదేవి గృహంబున నొక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మంటపం బేర్పరిచి, యందొక ఆసనంబువైచి, దానిపై క్రొత్త బియ్యము పోసి, మర్రి చిగుళ్ళు మొదలగు పంచ పల్లవంబులచే కలశం బేర్పరచి, యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి, మిగుల భక్తియుక్తులై ధ్యానావాహనాది షోడశోపచార పూజలను జేసి, తొమ్మిది సూత్రంబులను గల తోరంబును దక్షిణహస్తంబున గట్టుకొని వరలక్ష్మీ దేవికి నానావిధ భక్ష్యభోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణంబు చేసిరి.

ఇట్లొక ప్రదక్షిణము చేయగనే ఆ స్త్రీల కొందరికి కాళ్ళ యందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము గలిగే. అంత కాళ్ళం జూచికొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగియుండగ, వారందరును ఓహో! వరలక్ష్మీదేవి కటాక్షము వలన గలిగినవని పరమానందంబునొంది మరియొక ప్రదక్షిణంబు చేయ హస్తములందు ధగద్ధగాయ మానంబుగ పొలయుచుండు నవరత్న ఖచితంబులైన కంకణములు మొదలగు నాభరణములుండుటం గనిరి. ఇంక చెప్పనేల. మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే యా స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. ఆ స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథగజతురగ వాహనంబులతోడ నిండియుండెను.

అంత నా స్త్రీలందోడ్కొని గృహంబులకు బోవుటకు వారివారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వచ్చి నిల్చియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారముగా పూజచేయించిన పురోహితునికి పండ్రెండు కుడుములు వాయన దానం బిచ్చి, దక్షిణ తాంబూలంబు లొసంగి, ఆశీర్వాదంబు నొంది, వరలక్ష్మీ దేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతోడ నెల్లరును భుజించి, తమ కొరకు వచ్చి కాచుకొనియున్న గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములనెక్కి తమ తమ ఇండ్లకు బోవుచూ ఒకరితో నొకరు ’ఓహో! చారుమతీదేవీ భాగ్యంబేమని చెప్పవచ్చును.

వరలక్ష్మీ దేవి తనంతట స్వప్నములో వచ్చి ప్రత్యక్షంబాయెను. ఆ చారుమతీదేవి వలననే గదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు గలిగె’ నని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచూ తమ తమ ఇండ్లకు బోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరును ప్రతి సంవత్సరము నీ వ్రతంబు సేయుచూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనముల తోడం గూడుకొని సుఖంబుగనుండిరి.

కావున ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతమును అందరును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వసౌభాగ్యంబులును కలిగి సుఖంబుగ నుందురు. ఈ కథను వినువారలకును, చదువువారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యంబులు సిద్ధించును” అని పరమేశ్వరుడు పలికెను”.

వరలక్ష్మీ వ్రతకథ సంపూర్ణం

నైవేద్యం

నైవేద్యం షడ్రసోపేతం దధి మధ్వాజ్య సంయుతం

నానాభక్ష్యఫలోపేతం గృహాణ హరివల్లభే

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్యదీమహిః

ధియోయోనః ప్రచోదయాత్

సత్యం త్వా ఋతేన పరిషించామి

[సాయంత్రం - ఋతం త్వా సత్యేన పరిషించామి]

అమృతమస్తు అమృతాపస్తరణమసి

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మహా నైవేద్యం సమర్పయామి

ఓం ప్రాణాయ స్వాహా

ఓం అపానాయ స్వాహా

ఓం వ్యానాయ స్వాహా

ఓం ఉదానాయ స్వాహా

ఓం సమానాయ స్వాహా

పానీయం

ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం

పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరం
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి

అమృతాపిధానమసి

ఉత్తరాపోశనం సమర్పయామి

హస్త ప్రక్షాళనం సమర్పయామి

ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి

తాంబూలం

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి

ఓం ఫలేన ఫలితం సర్వం త్రైలోక్యం సచరా చరమ్

తస్మాత్పల ప్రదానేన పూర్ణాస్సన్తు మనోరథాః

ఓం శ్రీ వర మహాలక్ష్మీ నమః ఫలం సమర్పయామి

ఓం హిరణ్యగర్భస్థం హేమబీజం విభావసోః

అనంతపుణ్య ఫలదం అతః శన్తి ప్రయచ్ఛమే

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దక్షిణాం సమర్పయామి

పంచార్తి

అశ్వపూర్వాం రథ మధ్యాం హస్తినాద  ప్రబోధీనీమ్ |

శ్రియం దేవీ ముపాహ్వయే శ్రీర్మా దేవిర్ణుష తామ్

కాం సోస్మితాం హిరణ్యప్రాకారమార్దాం జ్జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్ |

పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపాహ్వయే శ్రియమ్

చంద్రాం ప్రభాసాం యశసాజ్జ్వలంతీం శ్రియం లోకే దేవ జుష్టాముదారామ్ |

తాం  పద్మినీం శరణ మహం ప్రపద్యే-లక్ష్మీ ర్మేనశ్యతాం త్వాం వృణే

శ్రీ వరమహాలక్ష్మీ దేవతాయై నమః పంచార్తి దీపం దర్శయామి

పంచార్తి దీపానంతరం ఆచమనీయం సమర్పయామి

మంత్రపుష్పం

పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే
నారయణప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మంత్రపుష్పం సమర్పయామి

నీరాజనం

నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమెస్తుతే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి

ప్రదక్షిణ

యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే |  

పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ|

త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలా |

అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ |

తస్మాత్‌కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దని

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి

నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి

వాయన విధిః

ఏవం సంపుజ్య కళ్యాణీం వరలక్ష్మీ స్వశక్తతః

దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే

వాయనదాన మంత్రం

ఇందిరా ప్ర్తిగృహ్ణతు ఇందిరాయై దదాతి చ

ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమె నమః

సర్వోపచారాః

ఓం శ్రీ వరలక్ష్మై నమః ఛత్రం ఆచ్ఛాదయామి |

ఓం శ్రీ వరలక్ష్మైనమః చామరైర్వీజయామి |

ఓం శ్రీ వరలక్ష్మైనమః నృత్యం దర్శయామి |

ఓం శ్రీ వరలక్ష్మైనమః గీతం శ్రావయామి |

ఓం శ్రీ వరలక్ష్మైనమః ఆందోళికాన్నారోహయామి |

ఓం శ్రీ వరలక్ష్మైనమః అశ్వానారోహయామి |

ఓం శ్రీ వరలక్ష్మైనమః గజానారోహయామి |

సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |

క్షమా ప్రార్థన

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |

న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్ |

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన I

యాత్పూజితం మాయా దేవ పరిపూర్ణం తదస్తుతే I

అనయా పురుషసూక్త విధానేన ధ్యాన ఆవాహనాది

షోడశోపచార పూజనేన భగవాన్‌సర్వాత్మకః

శ్రీ వరలక్ష్మైనమః సుప్రీతా సుప్రసన్నో వరదో భవంతు

యదక్షరం పదభ్రష్టమ్ మాత్రాహీనమ్ చ యదృవేత్

నిర్మాల్యం గంథాన ధారాయమి

నిర్మాల్యం అక్షతాం సమర్పయామి

నిర్మాల్యం పుష్పాణీం పూజయామి బలి నివేదయామి

ఫూర్ణ ఫలం

ఓం యిదం ఫలం య దేవ దత్తం

పుత్రం పౌత్రం వృదియే

దేవి పూర్ణ ఫలం దేహి

కృపా కురిషివే మహి

ఓం వరమహాలక్ష్మీ దేవతాయ నమః ఇతి పూర్ణ ఫలం సమర్పయామి

తీర్థము

[క్రింది మంత్రముతో తీర్థము తీసుకొనవలెను]

అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం

సమస్త పాపక్షయకరం శ్రీ వరలక్ష్మీపాదోదకం పావనం శుభం

శ్రీ వరలక్ష్మై నమః ప్రసాదం శిరసా గృహ్ణామి

ప్రసాదము

[క్రింది మంత్రముతో పుష్ప ప్రసాదము తీసుకొనవలెన]

శ్రీ వరలక్ష్మీస్వామినే నమః

శ్రీ వరలక్ష్మీపాదోత్పలం పుష్పం తత్సుష్పం శిరసావహమ్

కోటిజన్మ కృతం పాపం తత్ క్షణేన వినశ్యతి

ఉద్యాసనం

[పూవ్వులు అక్షంతలు దేవునిపై ఉంచుకొని క్రింది మంత్రముతో దేవుని కదిలిచ్చి వాటిని దేవుని ముందు ఉంచవలెను]

ఓం యజ్ఞేన యజ్ఞమయ జన్తదేవాః

తాని ధర్మాణి ప్రథమాన్యాసన్

తే హ నాకం మహిమానస్యజంతే

యత్ర పూర్వే సాధ్యాః సన్తిదేవాః

శ్రీ వరలక్ష్మీస్వామినే నమః

యథాస్తానం ప్రతిష్టాపయామి

శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ

ఓం శాంతిః శాంతిః శాంతిః

 

 

Sriman Mahalakshmi Song – శ్రీమన్ మహలక్ష్మి చేరవచ్చింది పాట

శ్రీమన్ మహలక్ష్మి చేరవచ్చింది

సౌభాగ్య శోభల వరంతెచ్చింది

శ్రీమన్ మహలక్ష్మి చేరవచ్చింది

సౌభాగ్య శోభల వరంతెచ్చింది

కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది

కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది

మంగళారతులేత్తి ఎదురుగా రండి

జనులారా రండి ఎదురుగా రండి

శుక్రవారపు సిరిని సేవించరండి

శ్రీమన్ మహలక్ష్మి చేరవచ్చింది

సౌభాగ్య శోభల వరంతెచ్చింది

సిద్ధి బుధులనొసగు భారతి మూర్తి

ఆఆ.. ఆఆ…

శక్తి యుక్తులనొసగు పార్వతి మూర్తి

ఆఆ…ఆఆ….

అష్ట సంపదలొసఁగు శ్రీ సతి మూర్తి

ముమ్మూర్తులకు మూలం ఈ దివ్య దీప్తి

కల లేని కన్నులకు కనిపించదండి

కలత ఎరుగునై సతుల కరుణిచునండి