Sri Suktam - శ్రీ సూక్తమ్
Sri Suktam - శ్రీ సూక్తమ్ |
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజామ్ |
చంద్రాం హిరణ్యయీం లక్ష్మీం జాతవేదో మావహ || 1 ||
తాం మావహ జాత వేదో లక్ష్మీ మనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్ || 2 ||
అశ్వపూర్వాం రథ మధ్యాం హస్తినాద ప్రబోధీనీమ్ |
శ్రియం దేవీ ముపాహ్వయే శ్రీర్మా దేవిర్ణుష తామ్ || 3 ||
కాం సోస్మితాం హిరణ్యప్రాకారమార్దాం జ్జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్ |
పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపాహ్వయే శ్రియమ్ || 4 ||
చంద్రాం ప్రభాసాం యశసాజ్జ్వలంతీం శ్రియం లోకే దేవ జుష్టాముదారామ్ |
తాం పద్మినీం శరణ మహం ప్రపద్యే-లక్ష్మీ ర్మేనశ్యతాం త్వాం వృణే || 5 ||
ఆదిత్యవర్ణే తపసో ధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః |
తస్య ఫలాని తససా నుదన్తు మాయం తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః || 6 ||
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ |
ప్రాదుర్భుతో స్మిన్ రాష్ట్రే స్మిన్ కీర్తిమృద్ధిం దదాతుమే || 7 ||
క్షుత్పిపాసా మలాం జ్యేష్ఠా మలక్ష్మీం నాశయాన్యహమ్ |
అభూతిమ సమృద్దిం చ సర్వాం నిర్ణుదమే గృహాత్ || 8 ||
గంధద్వారాం దురాదర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ |
ఈశ్వరీగ్ం సర్వ భూతాణాం తామిహో పాహ్వయే శ్రియమ్ || 9 ||
మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి |
పశూనాం రూప మన్నస్యమయి శ్రీః శ్రయతాం యశః || 10 ||
కర్థమేన ప్రజాభూతా మయి సంభవ కర్థమ |
శ్రియం వాసయ మేకులే మాతరం పద్మమాలినీమ్ || 11 ||
అపః సృజంతు స్నిగ్థాని చిక్లీత వస మే గృహే |
నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మేకులే || 12 ||
ఆర్థ్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్ |
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ || 13 ||
ఆర్థ్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మ మాలినీమ్ |
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ || 14 ||
తాం మావహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్ |
యస్యాం హిరణ్యం ప్రభ్య్తం గావో
దాస్యో శ్వాన్, విందేయం పురుషానహమ్ || 15 ||
యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్య మన్వహమ్ |
శ్రియః పంచదశర్చం చ శ్రీ కామః సతతం జపేత్|| 16 ||
ఆనన్దః కర్ధమ శ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః |
ఋషయస్తే త్రయః ప్రోకాస్వయాం శ్రీరేవ దేవతా || 17 ||
పద్మాననే పద్మోరు పద్మాక్షీపద్మసంభవే
త్వం మాం భజస్య పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్ || 18 ||
అశ్వదాయీచ గోదాయీ ధనదాయీ మహాధనే |
ధనం మే జుషతాం దేవి సర్వ కామాంశ్చ దేహిమే || 19 ||
పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యాశ్వాది గవే రథమ్ |
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతుమామ్ || 20
||
చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీమ్ |
చంద్రసూర్యాగ్ని వర్ణాభాం శ్రీ మహలక్ష్మీ ముపస్మహే || 21 ||
ధనమగ్నిర్థనం వాయుర్థనం సూర్యోధనం వసుః |
ధన మింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే || 22 ||
వైనతేయ సోమం పిబసోమం పిబతు వృత్రహా |
సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినిః || 23 ||
న క్రోధో న చ మాత్సర్యం న లోభోనాశుభామతిః |
భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపే త్సదా || 24 ||
వర్షంతుతే విభావరి దివో అభస్య విద్యుతః |
రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మద్విషో జహి || 25 ||
పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షీ|
విశ్వప్రియే విష్ణు మనో సుకూలే తత్పాద పద్మంమయీ సన్నిధత్స్వ || 26 ||
యాసా పద్మాసనస్థా విపులకఠితటీ పద్మపత్రాయతాక్షీ |
గంభీరా వర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా || 27 ||
లక్ష్మీర్ధివ్యైర్గజేంద్రై మణిగణ ఖచితైస్స్నాపితా హేమ కుంభైః |
నిత్యం సా పద్మహస్తా మమ వసతుగృహే సర్వ మంగల్యయుక్తా|| 28 ||
లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ |
శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద పియమ్ || 29
||
సిద్దలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ |
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా|
వరాంకుశౌ పాశమ భీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థామ్
బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజే హ మాద్యాం జగధీశ్వరీం త్వమ్ || 30 ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమెస్తుతే ||
ఓం మహాలక్ష్మీచ విద్మహే విష్ణు పత్నీచ ధీమహి |
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ||
ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః ఋణరోగాది దారిద్ర్య పాపక్షుద్ర మమృత్యవః భయశోక మనస్తాపా నశ్యంతు మమ సర్వదా
ఓం శాంతి శాంతి శాంతిః
శ్రీ సూక్తమ్ భావం
ఓ అగ్నిదేవా! మేలిమి బంగారు ఛాయగలది. విష్ణుపత్ని, బంగారు మరియు వెండి పుష్కహారాలను అలంకరించుకొన్నది చంద్రుని వలె మనస్సునకు ఆహ్లాదాన్ని కలిగించునట్టి మహాలక్ష్మిని నా నిమిత్తం ఆవాహన గావించు(ఆహ్వానించు).
నేను శ్రీదేవిని ప్రార్థిస్థున్నాను. ఎవరు కదులుతుంటే ముందు గుర్రాలు మరియు రథాలు వస్తూ తన శోభను తెలియజేయునో. ఎవరిని ఏనుగుల యెక్క ఘీంకారములు మేలుకొలుపునో, ఆ శ్రీదేవి నన్ను సంతోషపరచు గాక!
ఆనంద స్వరూపిణి చిరుదరహాసంతో, బంగారు ఛాయకలది మరియు బంగారు కోటలో వసించునది. కరుణాస్వరూపిణి, దేదీప్యమానంగా ప్రకాశిస్తూన్నది. తృప్తిని పొందినది మరియు తృప్తిని ప్రసాదించునది భక్తుల హృదయ పద్యాలనే తన శాశ్వత పధంగా చేసుకొన్నది. పద్మమువంటి ఛాయకలదైన శ్రీదేవిని ప్రార్థిస్తున్నాను.
శ్రీదేవి చంద్రుని వలె సముజ్వలమైనది తన కీర్తి చంద్రువనివలె దేదీప్యమానంగా ప్రకాశించునది. దేవతలచే పూజింపబడునది. దయాస్వర్య్పుణి., పద్మములో వసించునది. మెక్షస్వరూపిణి అయిన శ్రీ మాహాలక్ష్మిని శరణుజొచ్చుచున్నాను. నా దారిద్ర్యము నశించాలని నిన్ను ఆర్హిస్తున్నాను.
సూర్యుని ప్రకాశం కలదానా! వనానికి అధిపతియై బిల్చవృక్షం నీ తపోమహిమచే ఉద్బవించింది. దాని ఫలాలు నా తపస్సును ఉత్తేజితం చేసి, అజ్ఞానమైన లోపలి ఆతంకాన్ని అమంగళకరమైన బాహ్య ఆటంకాన్ని నాశనం చేయుగాక.
దేవతలకు మిత్రుడు (కుబేరుడు), నాపై కీర్తిని మరియు ఐశ్వర్యాలను కురిపించుగాక, నేను ఈ దేశములో జన్మించాను. నాకు మరియు ఈ దేశమునకు కీర్తిని, ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక!
శ్రీదేవి కంటే ముందు జన్మించినది. ఆకలి దప్పికలతో కృశింపజేయునది. అభాగ్యాన్ని అసమృద్ధిత్వానికి చిహ్నమైన అలక్ష్మిని నేను నాశనము చేయు దలచుకున్నాను. నీవు దయచేసి వీటిని నా గృహము నుండి నిర్మూలించు.
సిగంధానికి అలవాలమైనది, జయింపనవీలుకానిది, సర్వదా పుష్కలమైన పొడి మరియు పశు సంపదలకు చిహ్నంగా నిలుచునది. దేవతా గజములచే పూజింపబడునది. సకల జీవరాశులను పాలించునదైన శ్రీదేవిని నేను ప్రార్థిస్తున్నాను
మనస్సులో పుట్టే కోరికలు సంపూర్ణమగుగాక, నా ఆలోచలు ఆచరణ యెగ్యముగాక, నా వాక్కు సత్యమునే కలది యుండుగాక, పశువలనుంచు అభించిన ఆహార పదార్థలచేత కలిగే ఆనందం మాకు అభించుగాక! నాలో సంపద మరియు కీర్తి నిలుచుగాక!
కర్థమ అనేడి మహర్షి లక్ష్మి పుత్రుడు బహు భాగ్యవంతుడు. ఓ కర్థమా! దయవుంచి నాలో నివసించు. తామరపువ్వుల మాలను ధరించిన ఆ మాత(మహాలక్ష్మి)నా కులమున (భూమిపై) వసించుగాక.
నీరు మంచి ఆహార పదార్థాలను ఉత్పన్నం చేయుగాక, ఓ చిక్లీతా! నా గృహమున వసించుగాక. జగన్మాత అయిన శ్రీదేవి నా కులమున (భూమిపై) నివసించుగాక.
ఓ అగ్నిదేవా! కరుణాపూరిత హృదయముకలది. చేతిలో దండాన్ని ధరించినది. సూర్యుని వలె జగత్తును ప్రకాశింప చేయునది. బంగారమువలె ప్రకాశించునది. బంగారు హారాలను ధరించినది. బంగారుమయమైనదైన శ్రీమహాలక్ష్మిని నాకై ఆహ్వానించుము.
ఓ అగ్నిదేవా! కరుణాపూరిత మనస్సుగలదీ. కరమున పద్మమును ధరించినది , శ్రేయెదాయకమైనది, బంగారు వన్నెకలది. బంగారుమయమైనది. పద్మమాలను ధరించినది. చంద్రుని పోలినదైన శ్రీమహాలక్ష్మిని నాకై ఆహ్వానించుగాక.
ఓ అగ్నిదేవా! ఎవరివలన నేను అపరిమితమైన బంగారము ఆవులు, గుర్రాలు సేవకులు మరియు బందువులను ప్రాప్తించుకుంటానో, ఆ మహాలక్ష్మిని నా నిమిత్తం ఆహ్వావించుము. ఆ దేవి నన్ను విడిపోకుండా చూడుము
ఎవరు లక్ష్మిదేవి కృపాకటాక్షార్థం ప్రార్థిస్తున్నారో వారు శుచిగా, ఇంద్రియాలు నిగ్రహించిన వారిగా ఉంటూ ప్రతిరోజు నేతితో హోమం చేయాలి. పైన తెలిపిన లక్ష్మిదేవి యెక్క పదిహేను మంత్రాలను సదా జపిస్తూ ఉండాలి.
సిప్రసిద్ధులూ, ఋషులూ అయిన ఆనందుడు, కర్థముడు, చిక్లీతుడు ద్రష్టలు (దర్శించినవారు) మహాలక్ష్మియే దేవత.
పద్మమువంటి ముఖము కలదాన, పద్మము వంటి ఊరువులూ, పద్మము వంటి కన్నులూ కలదానామ్ పద్మౌ నుండి ఉద్భవించినా, నేను దేని వలస సంతృప్తినొందుతానో దాన్ని నువ్వు నాకు అనుగ్రహించు
గిర్రాలను ప్రసాదించుదానా, గోవులను ప్రసాదించుదానా, సంపదలను పరసాఇంచుదానా, ధనానికి అధిదేవత అయిన మహాలక్ష్మి! అభీష్టాలన్నీ నెరవేరేటప్పుడు కలిగే సుఖాన్ని ఇచ్చే సంపదను నాకు ప్రసాదిచు.
పుత్రులు, పౌత్రులు, ధనధాన్యాలు, ఏనుగులు గుర్రాలు ఇత్యాదులు, గోవులు, రథాలు సకలం ప్రసాదించు, జనులకు నువ్వు తల్లిగా భాసిస్తున్నావు. నన్ను ఆయుష్మంతునిగా ఒనరించాలి.
చంద్రునిలా ఆహ్లాదంగా ప్రకాశిస్తూన్నదీ. దేవతల శక్తిగా విరాజిల్లుతూన్నదీ, సూర్యునిలా తేజస్సుతో ప్రకాశిస్తూన్నదీ. శ్రీదేవీ, ఈశ్వరీ, సూర్యచంద్రాగ్నుల యెక్క తేజస్సుకలదైన శ్రీమహాలక్ష్మిని ఆరాధిస్తున్నాను.
చంద్రునిలా ఆహ్లాదంగా ప్రకాశిస్తూన్నదీ, దేవతల శక్తిగా విరాజిల్లుతూన్నదీ, సూర్యునిలా తేజస్సుతో ప్రకాశిస్తూన్నదీ. శ్రీదేవీ, ఈశ్వరీ, సూర్యచంద్రాగ్నుల యెక్క తేజస్సుకలదైన శ్రీమహాలక్ష్మిని ఆరాధిస్తున్నాను.
అగ్నిదేవుడూ, వాయుదేవుడూ, సూర్యభగవానుడు అష్టవససువులూ, దేవేంద్రుడూ, దేవగురువైన బృహస్పతీ, వరుణ దేవుడూ తమ తమ సంపదలను నీ కృపతో అనుభవిస్తున్నారు.
ఓ గరుత్మండుడా! శోమరసం గ్రోలు, వృత్రాసురుని సంహరించిన ఇంద్రుడు సోమరసం గ్రోలనీ. సోమయాగం నిర్వర్తింప ఆశిస్తూన్న నాకు పుష్కలంగా ధనాన్ని ప్రసాదించనీ
పూణ్యం చేసిన భక్తులకు కోపం రాదు. మాత్సర్యం ఉండదు. లోభం నశిస్తుంది. దుర్బుద్ధి పుట్టదు. భక్తిని పొంద, వారు శ్రీసూక్తాన్ని సదా జపం చేయాలి.
నీ క్రుపతో విద్యుల్లతాయుక్తాలైన మేఘాలు రేయింబవళ్ళు వర్షించనీ! విత్తనాలు యావత్తు చక్కగా మెలకెత్తి ఏపుగా పెరుగనీ! భగవంతుని నిందించేవారిని విడిచిపెట్టుము
పద్మముంటే ఇష్టపడేదానా, పద్మకుమారీ, పద్మాన్ని చేత ధరించినదానా, పద్మ నివాసినీ, తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలదానా, లోకానికి ప్రియమైనదానా, విష్ణువు మనస్సుకు అనుకూలరాలైనదానా. నీ పాదపద్మాలను నాపై మెపి నన్ను అనుగ్రహించు
ఎవరు పద్మం మీద ఆసీనురాలై ఉన్నదో, విస్తారమైన పిరిదులు గల వారెవరో, తామర రెకుల వంటి నేత్రాలు గలది. లోతైన నాభి గలది. స్తనాల భారంతో వంగివున్నది స్వచ్చమైన వస్త్తములు, ఉత్తరీయమును ధరించినది, రత్నాలు పోదిగిన భంగారు కలశాల జలంతో దేవలోకంలోని శ్రేష్టతను గజరాజులచే అభిషేకింపబడుచున్నది. పద్మాన్ని చేత ధరించినది సర్వమంగళ స్వరూపిణియైనటువంతి మహాలక్ష్మి నా గృహములో సదా నివాసించాలి
భాగ్యానికి అలవాలమైనదీ, క్షీరసముద్రరాజు కుమార్తె, శ్రీరంగంలో వెలసిన దేవీ, దేవలోక స్త్రీలనందరినీ దాసీజనంగా చేసుకొన్నదీ, లోకానికి ఏకైక దీపంగా భాసిస్తూన్నదీ, ఎవరి మృదుల కటాక్షంతో బ్రహ్మ ఇంద్రుడు గంగాధరుడు వైభవం సంతరించుకొన్నారో, మూడు లోకాలను తన కుటుబంగా చేసుకొన్నదీ, తామర కొలనులో ఉద్బవించినదీ. మహావిష్ణువుకు ప్రియాతి ప్రియమైన నీకు నమస్కారం చేస్తున్నాను
సిద్దలక్ష్మిగాను, ముక్తిని అనిగ్రహించగల మెక్షలక్ష్మిగాను, విజయాన్ని సిద్ధింపచేసే జయలక్ష్మి గాను, విద్యను ప్రసాదించే వాగ్దేవిగాను, సంపదలిచ్చే శ్రీదేవిగాను, వరాలు ప్రసాదించే వాగ్దేవిగాను, సంపదలిచ్చే శ్రీదేవిగాను, వరాలు ప్రసాదించగల వరలక్ష్మిగాను విరాజిల్లుతూన్న నువ్వు సదా నాకు ప్రసన్నురాల్వు.
వర అభయ ముద్రలు చేత దాల్చినదీ, పాశ అంకుశాఅలను చేత ధరించినదీ, పద్మనివాసినీ, కోటి బాల సూర్యుల ప్రకాశం కలదీ, మూడు కన్నులుకలదీ, ఆదిశక్తి, జగదీశ్వరీ అయిన ఆమెను నేను స్తుతిస్తాను.
మంగళాలకల్లా మంగళకరమైన దానవు. మంగళం ప్రసాదించే దానవు, సకల శుభాలను సాదించి ఇచ్చేదానవు శరణు పొందడానికి యుక్తమైన దానవు. మూడు కన్నులున్న దానవు అయిన దేవీ! నీకు నమస్కారము.
మహాలక్ష్మిని భావన చేద్దాం మరియు విష్ణుపత్నియైన ఆమెను అందుకై ధ్యానిద్ధాం. ఆ లక్ష్మిదేవి మనలకు ప్రేరణ నిచ్చుగాక
0 Comments