Sri Vasavi Kanyaka Parameswari Devi 4 

 శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము

Sri Vasavi Kanyaka Parameswari Devi 4 - శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము

Sri Vasavi Kanyaka Parameswari Devi 4 

 శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము

కైలాస వైభవం

శ్రీ మహావిష్ణువు కామధేనువు అవరారము ధరించగా బ్రహ్మాందముగా వెలుగులు విరజిమ్ముచున్న దివ్యసురభిని దేవతలు పూజించిరి. క్రయ విక్రయాదులు నిర్వహించు నిమిత్తార్ధమై భూలోక ప్రయాణమునకు సిద్దముగ నున్న, ఆర్యవైశ్య ఋషులను గాంచి కరుణతో పరమేశ్వరుడు "ఓ భక్తులారా! పరాశక్తిని ప్రసన్నం చేసుకొని ఆమెని మీ కుమార్తెయగు వరమును స్వీకరించి యున్న మీరు నా కైలాసమునకు రండు" అని కైలాస ప్రవేశము గావీంచెను. అచ్చట శివభక్తులు కోటానుకోట్ల మంది గలరు.

అనంతమైన రజితగిరి ముప్పదిమూడు కోట్ల అమడల విస్తీర్ణములో , అనేక ద్వారరములు గలవు. విఘ్నేశ్వరుడు అష్టదుర్గలు, బిల్వదళసమేత ఏకాదసరుద్రులు, ప్రమధగణములు, భూతగణములు, నందీశ్వర్, చండీశ్వర, భృంగీశ్వర,కార్తికేయ, వీరభద్ర, సమేతముగా శివపంచాయతనముతో గలిగి ఉన్న కైలాసమునకు వీరిని తీసికెళ్ళెను. ఆర్యవైశ్య ఋషులను కైలాసంలోని వారందరూ దీవించుచుండిరి.

పరమేశ్వరుడు " ఆర్యవైశ్యులారా! పరమాత్మను విశ్వసించు నాస్తికులకు, స్వప్నములో కూడా దర్శించుటకు అసాధ్యమైన కైలాసమును, మానవులైన మీ ఆర్యవైశ్య ఋషులు మహాఘోర తపస్సు ఫలితముగ దర్శించి ధన్యులైరి. అందువలన నేను మీ ఒక వరము ఇచ్చెదను. భూలోకమున మీరు ప్రవేశించు పట్టణమున పరమేశ్వరుండనైన నేనుఆర్యవైశ్య నగర ఈశ్వరుడు- నగరేశ్వరుడుయను పేర వెలసి, పిలిస్తే పలికే దైవంగా, ప్రతిక్షణము మిమ్ములను రక్షించెదను. నాకు కలిగిన కోటి (శివ లింగములు) పేర్లతోనగరేశ్వరుడను  పేరు ఆర్యవైశ్యులకు మాత్రమే పరిమితము!" అని వరమించెదను. పార్వతిదేవి " బిడ్డలారా! భూలోకములో వెలయుచున్న నగరేశ్వర శివలింగము ప్రక్కనే నేనువింధ్యవాసినీయను పేర వెలసి, కోరగానే వరాలనిచ్చు అక్షయభాండము వెలె కోరికలు నెరవేర్చెదను" అని వరమిచ్చెను.

వైకుంఠ వైభవం

విషయములను తెలుసుకొనిన స్థితికారకుడగు మహా విష్ణువు ఆర్య వైశ్యులను కైలాసమునుండీ వైకుంఠమునకు తీసుకెళ్ళెను. క్షీరసాగరము పై, ఆదిశేషుని పాన్పుమీద, అలంకారప్రియుడు శ్రీ విష్ణువు పవళించి యుండెను. లక్ష్మీ దేవి పాదసేవ చేయుచుండెను. తూర్పుదుక్కున శ్రీవల్లీ, సిద్దీదేవి యను కుమారైల్తోనూ, ఉత్తరమున దేవేరులైన, బృందా, తులసీ, శ్రీ దేవి, భూదేవి సమేత అష్టలక్ష్ములు కొలువుదీరియుండ, విష్ణువాహనమైన గరుత్మంతుడు నమస్కరించు చుండగా, సుదర్శనము, శంఖము,గద, ఖడ్గము, శార్గము, లు వెలుగురు విరజిమ్ముచుండగా జయ విజయములను మహర్షుల పారావారంతో, చిత్రవిచిత్రమైన రంగవల్లులతో అలరారుచున్న వైకుంఠమును దర్శించిన ఆర్యవైశ్య ఋషులు ఆశ్చర్యాను భూతులతో తిలకించి నమస్కరించిరి.

అచ్చట మహావిష్ణుమూర్తి ఆర్యవైశ్య ఋషులతో, "కృషిగోరక్ష్య వాణిజ్యములు నిర్వర్తించుటకు భువికేగు ఆర్యవైశ్యులారా! మీరు ప్రవేశించు పట్టణము యందు నేను, మీ అభీష్టములు నెరవేర్చుటకైజనార్థనస్వామియను నామమ్య్తో వెలసెదను.

ఎల్లవేళలా మిమ్ములను రక్షించగలను అని వరము ఇచ్చెదను. లక్ష్మీదేవి " బిడ్డలారా! బ్రాహ్మణోత్తములకుసరస్వతీ పుత్రులుగనూ, క్షత్రియులకువీరపుత్రులుగనూ బిరుదులున్నవి. క్షణమునుండి మహాభక్తులైన మీరులక్ష్మీపుత్రులు-కుబేర సంపన్నులూ-ఆర్యవైశ్యులుఅను బిరుదులు ఇచ్చెదను. లక్ష్మీదేవినైన నేను గోనగమలాదేవి అను నామముతో వెల్సెదను" యని వరము నొసంగెను.(గోన=కాడ, కమల=పుష్పము. అనగా కాడ కలిగిన పుష్పముపై నివసించియున్న లక్ష్మీదేవి-గోనగమయని భావము) ఇంకనూ లక్ష్మీదేవి ఇలా బోధించసాగెను. "కోటికి పడగెత్తు కోమట్లు", యను పేరు మీకు మాత్రమే లభింపగలదు. ప్రతి నిత్యము మీరు చేయు వ్యాపార ప్రారంభములో గోనగమయగు నన్ను ధ్యాన్నించండి. మీకు ఐస్వర్యము బాహుళ్యముగా సమకూర్చగలను" అని బోధించెను.

ఆర్యవైశ్యుల భూలోక ప్రవేశం చేయుచున్న విషయము నారదుని ద్వారా తెలుసుకొన పరబ్రహ్మ వేంచేసి " బిడ్డలారా! ఎటువంటి లాభాపేక్షలేక, నిస్వార్థ జీవనము ప్రారంభించబోవు మీకు నేను గూడా వరమిచ్చెదను. నా లోకమునకు రాండి" అని సత్యలోక ప్రవేశం చేయించెను. ఆర్యవైశ్య ఋషులు సత్యలోకమున అనేకమైనవి చూసినారు. ధృవుడు, మార్కండేయుడు, బ్రాహ్మీమాతృకలు, అష్టవసువులు, సప్తమాతృకలు, గంధర్వులు, యక్షులు, కినరులు మెదలైనవారు ఆసీనులై ఉండిరి. సరస్వతిదేవి మీటుతున్న వీణా మాధుర్యము నుండి, సప్తస్వరము రహస్యములు ఆలకించుచూ, నిత్యవేద పఠనంబుతో, హ్రస్వ, దీర్ఘ,ప్లుత, హల్లుల, అక్షరశభ్దాలతో బ్రహ్మలోకము మార్మోగుచుండెను. మరియును అర్భుద సంఖ్యలోనున్న తాళపత్ర గ్రంథములలరారుచున్న సత్యలోకమును గాంచిన ఆర్యవైశ్య ఋషులందరూ, అమితాశ్చర్యములతో వాణీసమేత సృష్టికర్తకు సాష్టాంగ ప్రణామము చేయగా, " భక్తులారా మీ నగరములో నేను - బ్రాహ్మణాగ్రగణ్యుడైన భృంగు వంశములో, భాస్కరాచార్యుడుఅను నామముతో ఉద్బవించిఆచార్య కులగురువుగా ప్రభవించెదను. అష్టాదశ నగరములను మీ ఆర్యవైశ్యులే ప్రజలుగా, భటులుగా, మంత్రులుగా, చక్రవర్తులుగా రాజ్యాధికారం నిర్వహించెదరు గాన, పరరాజులను అవలీలగా ఓడించు నేర్పరితనమైన క్షాత్రవిద్యలు మీకు అవసరము. రాజ్యపరిపాలన నిర్వహించు మీ ఆర్యవైశ్యులకు క్షత్రియ విద్యలైన ఖడ్గ విద్య, గుర్రపుస్వారీ, విలువిద్య, మల్లయుద్దము, గదా, ముష్టి యుద్దములేకాక, బ్రహ్మ, వారుణ, నాగ, సుదర్శనముల వంటి అష్టాదశ అస్త్రములు, గరుడ, పద్మ, చక్ర, క్రేంచారణములు వంటి అష్టాదశ ప్యూహములు మీకు అభ్యాసము చెసెదను. ఇంకనూ ఇహముక్తి గలుగుటకై యెగవిద్య, పరముక్తి కొరకు బ్రహ్మవిద్య బోదించి, సమస్త విద్యలలోనూ ఆర్యవైశ్యులకు ప్రవేశము గలదని నిరూపించగలను. తదాస్తు!" యని వరము నొసంగి దీవించెను.

సరస్వతిదేవి ఆర్యవైశ్య ఋషులతో " భక్తులారా! భాస్కరాచార్యుని ధర్మపత్ని యగుభారతియను పేర నేను జన్మించెదను. మీరు అందరూ సమస్త వేదములున్నూ, ఉపనిషత్తులను, షట్ శాస్త్రములు, అష్టదశ పురాణములు, నవవ్యాకరణములూ బోధ్ంచెదను. ఇంకనూ మీ గృహములోని కన్యకామణులకు వీణాగానము, వేణుగానము, నృత్యము, సంగీతము, కవిత్వము మెదలైన సాహిత్య కళా ప్రవేశముతో, చతుర్దశ విద్యలు, సమస్త వేదాంత జ్ఞానమునూ బోధన చేయు ’గురుపత్ని’ గా ఉద్బవించెదను గాక!" అని వరములు ఇచ్చెను.

ఈ విధముగా పరాశక్తి వరము త్రిమూర్తుల, త్రిశక్తుల వరములు స్వీకరించిన ఆర్యవైశ్య ఋషులను గాంచిన నందీశ్వరుడు "ఓ ఆర్యవైశ్య ఋషులారా! మీ గృహమున జన్మించబోవు వాసవాంబకు సోదరుడుగా నందీశ్వరుండనైన నేణు ’విరూపాక్షుడు’ అను పేర జన్మించెదను. ఆర్యవైశ్య యువజన సంఘమునకు నాయకత్వము వహించి, అష్టాదశ నగరసామ్రాజ్యమునకు యువరాజుగా, ధర్మపరిపాలనము జేయుటకు అవతరించెదను" అని నందీశ్వరుడువరమివ్వగా ఆర్యవైశ్య ఋషులందరునూ మహదానందము పొందిరి, ఇంతమంది దేవతలు భూభాగమున వైశ్యలోకమునకు ప్రవేశించుట గాంచి ఉత్సాహముతో భూలోక ప్రవేశం చేయుటకు సిద్దమైరి. పరాశక్తి ఒసంగిన ’వ్యాపార సాద్ధనముల’ ను పార్వతీ దేవి తన దివ్యశక్తితో 714 మూటలుగా కట్టి ఆర్యవైశ్య ఋషుల శిరోభాగము నందుంచెను. కామధేనువు గర్బము(మఠము) లోకి ఆర్యవైశ్యలు ప్రవేశించిరి. ఆ వ్ధముగా ఆర్యవైశ్యులకు ’గోమఠీయులు’ యను నామమేర్పడెను.

ఆర్యవైశ్యులనందర్నీ తీసుకొని భూలోకమున వెళ్ళుచున్న కామధేనువునకు దేవతలందరూ పూజించుచుండిరి. వెంటనే పార్వతీదేవి నారద మునీంద్రుని పిలిచి "ఓ నారదా! మహావరములతో ఆర్యవైశ్యులందరూ గో కుక్షిలోకి ప్రవేశించిరి. కామధేనువు వారిని భూలోకమునకు చేర్చుచున్నది. ఇప్పుడు వారు మార్గమధ్యమున ఉందురు. 714 గోత్రీకులు వెళ్ళి ఎచ్చట నివసించెదరు? ఎచ్చట బుజించెదరు? విశ్రమించునదెక్కడ? వరములు సిద్దింపజేసుకొనిన ఆర్యవైశ్యులకు వసతులు సంపూర్ణముగ నుండవలెను. నీవు మరియు నీ కుమారుడగు మయ బ్రహ్మ (మయుడు), కామధేనువు కన్న ముందుగ భూమికి జేరి వారు నివసించుటకు అష్టాదశ నగరములను, బాహుళ్యమైన సౌధములను నిర్మించుడు. క్రయ విక్రయాదులు నిర్వహించు ఆర్యవైశ్యులకు పవిత్ర జీవనదియగు పశ్చిమ గౌతమీ తీరమున పట్టణములను నిర్మించండి" అని అనుజ్ఞ నిచ్చెను. మయబ్రహ్మ నారదుడు ఇరువురూ భూలోకమున-చతుర్వేదములు, అష్టదశ పురాణములు, రామాయణ, భారతాది కావ్యములు బహిర్గతమైన భారతదేశమునకు వేంచేసి మయబ్రహ్మ తూర్పుగోదావరీ తీరమున తొమ్మిదియున్నూ,పశ్చిమ గోదావరీ తీరమున తొమ్మిదియున్నూ మెత్తం 18 నగరములను 18 ఆమడల విస్తీర్ణ స్థలములో దేవతల సాధములకు ధీటుగా నిర్మించెను. అచట్ నవరత్నములు, సువర్ణముతో, తన కళాచాతుర్యముతో, అమృతమయ జలములతో సెలయేరులు, పారుచుండెను. ప్రశాంత వాతావరణము నెలకొనియున్న చిత్రచిత్రములైన కుడ్యములు, కందకములు, కోటలు, అందమైన బురుజులు, చందనముతో సృష్టించిన ద్వారములు, మెగలి, సంపెంగ, వృక్షజాతుల సముదాయ పరిమళములు వెదజల్లుచు నుండ, హంసలూ, నెమళ్ళూ, చిలకలూ, కిలకిలరావములతో అపూర్వముగ అలరారుచుండెను. ఆ చిత్రములు మాటల కందనటువంటివి. నవనిధులతో నింపియున్న 18 అంతస్తులతో కొన్నివేల సౌధములు తన అద్బుత దివ్యశక్తితో మయుడు నిర్మించెను. ఈ 18 నగరములు  బ్రహ్మ ముహూర్తమున, ఉదయించు లేలేత సూర్యుడు వెలుగులకు తళుక్ మని మెరయుచుండెను. దేవతలకు గృహములు నిర్మించు విశ్వకర్మ మానవులకు గృహములు నిర్మించుట తృణప్రాయమైనది. ప్రతి పట్టణమున ఒక్కొక్క దేవతను ప్రతిష్టించి, నామకరణము జేసి, ఆయా ఆపట్టణములకు ఆ దేవతా నమములనే లఖించెను.

మయబ్రహ్మ ప్రతిష్టించిన లింగములు, సృష్టించిన నగరములు

ప్రతిష్ట                            నగర నామకరణం          పూర్వపేరు         ప్రస్తుత పేరు

శ్రీ నరసింహస్వామి         నరసింహపురము          నరసము           నరసాపురం

శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి    పాలకొలను                    పాలకుండము    పాలకొల్లు

శ్రీ ఆచంటేశ్వరస్వామి      ఆచంటము                    ఆచంటి             ఆచంట

శ్రీ జనార్ధనస్వామి           హేలాపురము                హేలాపురి          ఏలూరు

శ్రీ ఘంటేశ్వరస్వామి        ఘంటశాలము               ఘంటశాలము   ఘంటసాల

శ్రీధర్మేశ్వరస్వామి           ధర్మపురము                 డెందపురము     దెందులూరు

శ్రీ భీమేశ్వరస్వామి          భీమాభిఖ్యపురము        భీమమి             భీమవరం

శ్రీ గోలింగేశ్వరస్వామి       నిరవద్యపురము            నిరవద్యకము     నిడదవోలు

శ్రీ నగరేశ్వరస్వామి          నగరేశ్వరపురము           జ్యేష్ఠశైలము       పెనుగొండ

శ్రీముమ్మిడేశ్వరస్వామి    ముమ్మిడివరము           ఉమ్మడివరము  ముమ్మిడివరం

శ్రీకళింగేశ్వరస్వామి         కళింగపురము               కళింగకము       కళింగపురం

శ్రీ ధనేశ్వరస్వామి           ధనపురము                   ధనదము          ధవళేశ్వరం

శ్రీ నాగేశ్వరస్వామి           నాగేంద్రపురము             నగరీడు             నగరవీడు

శ్రీ శివేశ్వరస్వామి            శివపురము                   శివపురము       శివపురం

శ్రీకుక్కుటేశ్వరస్వామి      పీఠికాపురము                పిఠికాపురము    పిఠాపురం

శ్రీ జగన్నాధస్వామి         జగన్నాధము                 జగన్నాధము     కాకినాడ

శ్రీ అగస్త్యేశ్వరస్వామి        అగస్య్తేశ్వరపురము         అగస్త్యేశ్వరం       అంగలూరు

శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి  శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి  వీరనారాయణము         అన్నవరం

ఈ పట్టణములు ఎటు చూసిననూ 8 మైళ్ళ విస్తీర్ణము కలిగియుండెను. మధ్యలోనున్న నగరేశ్వరపురము 18 పట్నములకు రాజధాని. ఈ కేంద్రములో 18  పట్నములను పరిపాలన చేయు ఆర్యవైశ్యరాజు వుండును. రాజభవనములు కందకములు ఎక్కువ గలవు. కచ్చేరి మందిరము, సభామండపము, ఉద్యాన వనములు, పూలతోటలు, ప్రధాన వేదపాఠశాల, భాస్కరాచార్య గురుకులము ఈ నగరమునందే కలవు

 

నగరముల నిర్మాణాంతరం, జ్యేష్ఠశుద్దపాడ్యమి బ్రాహ్మీ ముహూర్తములో ఆర్యవైశ్యులను తీసుకొనివచ్చిన కామధేనువు ఉత్తర దేశములోని, అయెధ్య పట్టణ సమీపములో ఉన్న నైమిశారణ్య సానువులలోని జీవ నదియగు సరయూనదీ ప్రాంతమున వచ్చి నిలచెను. అచ్చటకు నారదమునీంద్రుడు, మయబ్రహ్మలతో కలసి కుబేరుడు కూడా వచ్చి చేరెను. వీరు ముగ్గురూ గోవుకు నమస్కరించగా దివ్యసురభి దక్షిణ కర్ణము నుండి పురుషులు వెలువడిరి. గోకర్ణము నుండి ఆర్యవైశ్యులు ఉద్బవించిరి గాన ఆ క్షేత్రమునకు గోకర్ణక్షేత్రమనీ, ఆ నదికీ గోమతీనది యనీ నామములేర్పడెను. ఈ ఆర్యవైశ్య పురుషులందరికి తొలినుండి భూలోకమున నివసించుచున్న, ’ఆదిసంభూతుల’ని పిలవబడు ఆర్యవైశ్యుల సంతానమైన కన్యా రత్నములతో వివాహములు జరిపించిరి. నూతన దంపతులు యావన్మందీ మయ, నారద, కుబేర, విష్ణుమూర్తి (గోవు) మెదలయిన దేవతలందరికీ సాష్టాంగ నమస్కారములు జేసి, స్తోత్రములు పఠించి మంగళకర్పూర దివ్య నీరాజనములిచ్చిరి. ఆ క్షణమున శ్రీ విష్ణుమూర్తి ఆర్యవైశ్యులతో "ఓ  ఆర్యవైశ్య దంపతులారా! పరాశక్తి అనుమతితో మిమ్ములను భూలోక ప్రవేశం చేయించు బాధ్యత పరసమాప్తమయినది. దానధర్మములు, కృషి, వాణిజ్య, గోరక్ష్యములను ధర్మముగా నిర్వహించి, పరోపకార స్వభావముతో సంచరించండి.

దేవతల ద్వారా వరములు బొందిన మీరు అర్థము కొరకు ఒకరిని ’దేహి’ అని అర్థించవలదు. నేను ’జనార్ధన స్వామి’ యను పేరుతో మీకి ప్రతిక్షణము రక్షణగా ఉందెదను. వర్ణమునకు విశ్వబ్రాహ్మణుడైన మయుడు, 18 పట్టణములను 18 దేవతల గృహాలతో సమానంగా నిర్మించెను. కనుక విశ్వబ్రాహ్మణులను (కంసాలులు, మాసాబత్తులు, వడ్లా బత్తులు మెదలగువారు) వంశజులను మీ వివాహ సమయములలో తప్పక గౌరవించి పూజించండి. అయెనిజాలుగా జన్మించి దేవమాన ప్రకారం త్రిలోకములూ సంచరించి, దేవతలతో ఏకమైయున్న మీరు ఈ క్షణమునుండి మానవమాన ప్రకారము. ఆచార వ్యవహారాదులు, ఆహార నియమములు అన్నియూ భూలోక వాతావరణము ప్రకారము మానవులుగా సంచరించెదరుగాక!" అని బోధించి అదృశ్యమయ్యెను.

        గోకర్ణక్షేత్రము నుండి ఆర్యవైశ్య దంపతులనందరినీ 18 క్శ్ఃఏత్రములను గుర్తించుటకు వారినందరినీ నగర ప్రవేశం చేయించిన కుబేరునకు ఆర్య వైశ్యులంతా నమస్కరించిరి. సంతసించిన నారదుడు ఆర్యవైశ్యాగ్రజుడైన ధర్మనందనుడు మెదలగు వారితో "ఓ ఆర్యవైశ్య ప్రముఖులారా! ’గోవు’ ద్వారా మీరు భూలోక ప్రవేశము జేసిరి గాన భవిష్యత్తున తమ గృహ ప్రవేశములకు ముందుగా, ’కామధేనువు’ ను ప్రధమముగా ప్రవేశింపజేసిన వారి ’స్థితి’ రమ్యముగా నుండును. మరియునూ మీ గృహమున జరగబోవు పుంసనవ, శ్రీమంత, నామకరణ, అన్నప్రాసన, ఉపనయన, వివాహములు మెదలైన శుభకార్యముల యందు తప్పక గోవుకు, గుగ్గుళ్ళు,పిండి, అలచందలు, ధాన్యములు, నైవేద్యముగా నుంచి నమస్కరించవలెను. ఇది తప్పించినవారు కృతఘ్నలు ఆచరించిన వారు ధన్యులు" అని గోవు మహర్మ్యమును తెలిపి, దీవెనలిచ్చి ధర్మనందనునకు నవ నిధులనిచ్చి అదృశ్యాయెను. నారద మునీంద్రుడు - మయబ్రహ్మలు "జ్యేష్ట శుద్ద పాడ్యమి ఇంద్రయాగము చేయుడు" అని ఆర్యవైశ్యుల తో చెప్పి సత్యలోకము నకు జనుదెంచిరి. ధర్మనందనుని అధ్యక్షతగా 714 గోత్రీకులు దంపతీ సమేతముగా, ఆదిశక్తిని ప్రార్థించి, పాడ్యమిన ఇంద్రయాగము చేయగా, ఇంద్రుడు వీరి భక్తికి మెచ్చి సకాలమున వర్షములు కురిపించుతూ, పాడిపంటలతో వీరి నగరములను సస్యశ్యామలముగా చేయుచుండెను. ఆర్యవైశ్యులందరూ ఆ క్షణము నుండీ చక్రవర్తులుగా అష్టాదశ నగరముల పరిపాలన ప్రారంభించిరి. ఈ విధమున కాలము గడుచుచుండసాగెను.

కుసుమశ్రేష్టి పూర్వవంశీయుల చరిత్ర

ఉద్యాహుడుయను ఆర్యవైశ్యుడు ’ప్రభాతస’ గోత్రమున జన్మించెను. ఉద్వాహుని ఇంటిపేరు ’వాసా’. ఇతను వంశపారంపర్యముగా మయబ్రహ్మ నిర్మిత అష్టాదశ నగరములను, పరులు స్వీయులను బేధము లెంచక 714  గోత్రఆర్యవైశ్యులను కన్నబిడ్డలువలె పరిపాలన చేయుచుండేను. ఈ చక్రవర్తికి కుమారుడు మఘుడు, ఈతని హయాంలో యాగములు గొప్పగా జేసి దేవతలను ఆరాధించి మహాభక్తాగ్రేసరుడని బిరుదు గడించెను. మఘుని కుమారుడు మధుమంతుడు. ఇతను భూతలముపై ప్రసిద్దిగాంచి, లక్ష్మీనాధుడైన శ్రీమహావిష్ణువు నారాధించి, కాలగమనమున ప్రయాణించు అద్బుతమయిన పుష్పక విమానమును  బొందెను. ఒక దినమున విమానమి నధి రోహించి కైలాసమున వెళ్ళుచుండ, మార్గ మధ్యమున, మధుమంతుని గొప్పతనం తెలుసుకొనిన గంధర్వరాజు విశ్వావసుడు, ఉత్తమకన్యయగు తన కుమార్తె కోకిలాదేవినిచ్చి ఘనముగా వివాహము జరిపించెను. కొలదికాలమునకు వీరికి మణిమంతుడు, ముచికుందుడు, స్వేతుడు, కీర్తిమంతుడు, విరోచనుడుయను ఐదుగురు కుమారులు జన్మించిరి. ఐదవ కుమారుడైన విరోచనునకు తులాధారుడు - మణిధారుడు యను కవలలు జన్మించిరి. పెద్దకుమారుడైన తులాధారుడు తపశక్తిగలవాడు. అతను వైరాగ్యభావనతో పాదయాత్రచేసి వారణాసీ క్శ్ఃఏత్రమునకు వెళ్ళెను. అచ్చట జాబాలుయను మహర్షి అష్టవధానములలో ప్రసిద్దిగాంచెను.

జాబాలి మహర్షి చరిత్ర

పూర్వము జాబాలి మహర్షి నైమిశరణ్యమున తపస్సు చేయుచుండగా, ఆకాశవాణి "జాబాలీ గర్వం విడచిపెట్టు! సర్వసంగ పరిత్యాగివైన నీకు ఎంతమాత్రమూ అహంకారము పనికిరాదు. నీ తపస్సు పరిపూర్ణము చెందలేది. నీకు జ్ఞానోదయం కలుగుటకు ఇంకా సమయమున్నది. అందుచేత నీవు వారాణాసీ క్షేత్రమునకెళ్ళి అచ్చటనే నివసించుము. భవిష్యత్తులో ఒక సుముహూర్తమున, మహాతపశక్తి సంపనుడు, తులాధారుడను ఆర్యవైశ్యుడు వారణాసీ క్షేత్రమునకు వేంచేసినప్పుడు అతనిని పూజింపుము

 

తులాధారుని మహిమతో నీకు మెక్షము కలుగును". అని చెప్పిన పలుకులతో, వారణాసీ క్షేత్రమందు జాబాలి మహర్షిని అష్టావధాన పరాజితుని గావించెను. తదుపరి జాబాలికి ఉపదేశమిచ్చెను. మరికొన్ని ధర్మములు బోధించి తులాధారుడు తన తపశక్తిని జాబాలి మహర్షికి ఇచ్చి పరిపూర్ణునిగా జేసెను. ఆవిధముగా జాబాలి దేహము విడచి మెక్షప్రాప్తినొందెను.

తదుపరి తులాధారుడు జ్యేష్టశైలమునకు వేంచేసి తన తమ్ముడైన మణిధారుని అష్టాదశ నగరములకు రారాజుగా పట్టాభిషేకము జేసి, మరల తపస్సుకై భీకరారణ్యములకు వెళ్ళెను. మణిధారుని పుత్రుడు పద్మాక్షుడు. అతని శరీరము బంగారువర్ణము కలిగి యున్నందున పద్మాక్షునికి "హేమ వర్ణుడు" అని బిరుదు కూడా కలదు. ఈ పద్మాక్షునికి కల్యాణమైన బహువర్షములు గడిచిననూ సంతానము కలుగలేదు. వృద్దాప్యమున ఇతనికి శ్రావణ కుమారుడు జన్మించెను. తల్లితండ్రులైన పద్మాక్ష దంపతులు శాప కారనమున అంధులైరి. వీరికి సద్గతులు ప్రాప్తించాలనే ఆలోచనలో ఇరువురినీ భుజముపై ’కావిడి’ లో నుంచి విశ్వేశ్వరుని పై భారమువేసి, మహాప్రయాసతో కావిడి మెయుచూ వారణాసికి ప్రయాణమయ్యెను. తల్లిదండ్రులను అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని స్పృశింపజేసి, తక్షణము వారిని అయెధ్యా నగరమునకు చేరవేయు దననే తళంపుతో బయలుదేరెను. మార్గమధ్యమున ఒకరోజు మధ్యాహ్న వేళ కుమారుని తల్లిదండ్రులు దాహమడిగిరి. శ్రావణ కుమారుడు కావిడిని ఒక చెట్టుక్రింద ఉంచి చిన్న మూతికుండ తీసుకొని దగ్గరలోని కొలను లోనినీటిలో కుండను ముంచుచుండెను. ఆ సమయమున సూర్యవంశపు రాజైన దశరథ మహారాజు (అయెధ్య నుండి) అదే మార్గమున వెళ్ళుచుండెను. శ్రావణుడు నీటిలో ముంచుతున్న కుండశబ్దము విని, వింత మృగమనుకొని కొలనులో ’సబ్దభేధి’ శక్తితో బాణ ప్రయెగము చేయగా, ఆబాణము సరాసరి శ్రావణ కుమారుని వక్షస్థలమునకు తగిలి అతను మృతి చెందెను.

            ఈ వార్త శ్రావణుని తల్లిదండ్రులకు తెలిపి, తాను తెలియక చేసిన అపరధమును మన్నించమని దశరధుడు వేడుకొనగా, కోపోద్రిక్తులైన పద్మాక్ష దంపతులు "అంధులైన మమ్ము వారణాసీ క్షేత్రమునకు 8 మాసముల పాటు కావిడిలో తీసుకొచ్చిన మా కుమారుని అన్యాయముగ వధించినావు. నీకు నలుగురు కుమారులుండి కూడా నీ అవసాన దశలో వారు చెంతలేనపుడు మరణించెదవు గాక!" యని పుత్రశోకములో శాపమిచ్చి ఆత్మార్పణ గావించిరి. పద్మాక్షునికి కనిష్ట భార్యా సంతానము సత్యసంధుడు. అతను పరిశుద్దుడు, పద్మాక్షుని కనిష్ట భార్య సంతానము శివుడు. శివుని పుత్రుడు గోముఖుడు. ఇతని కుమారుడు కుముదుడు. కుముదుడు కుమారుడే కల్హరుడు. కల్హరుని పుత్రుడు బలదేవశ్రేష్టి, కోడలు భారత సామ్రాజ్యలక్ష్మీ, ఈ పూణ్యదంపతుల కుమారుడే కుసుమశ్రేష్టి 


కుసుమశ్రేష్టి జననము, బాల్యము

సర్వధారినామ సంవత్సర వైశాఖశుద్ద పంచమిన కుసుమశ్రేష్ఠి జన్మించెను. ఈ బాలుడు జన్మించునపుడు ఆకాశ మార్గమున నుండి పుష్పవృష్టి గురిసెను. అందులచే బాలునకు కుసుమశ్రేష్టియను పేరున పిలుచుచుండిరి. బలదేవశ్రేష్టి దంపతులు మంచి సుముహూర్తమున  బారసాల కార్యక్రమము నిర్వహించి బందుగణమును పెనుగొండకు రప్పించెను. అంత భాస్కరాచార్యుడు బాలుని భవిష్యత్తును అంతయూ దివ్యదృష్టితో గనుగొనినవాడై ’విషయవాసవా’ రహితముగ గోచరించినందున, ఈ బాలునికి ’వాసవశ్రేష్టి’ యనే నామకరణము కూడా గావించెను. భేరి మృదంగాది వాద్య రావములు మిన్నుముట్టెను. "యువరాజు కుసుమశ్రేష్ఠికి జై" యంటూ వంది మాగధులు జేజేలు పలికిరి. కవీశ్వరులు ’వాసవ’ పేరు మీద కవిత్వము గట్టనారంభించిరి.

 జ్యోతిష్కులు వాసవశ్రేష్ఠి నామధేయముతో జాతకం వ్రాసి బలదేవశ్రేష్ఠికి ఇచ్చరి. ఆ విధముగ బారసాల కార్యక్రమములు పూర్తి అయినవి, తదుపరి 6  సంవత్సరముల గడచెను. బంధు మిత్రాదుల సమక్షమున కుసుమశ్రేష్ఠికి అక్షరాభ్యాసము గావించిరి. ఆ మహో త్సవమునకు, హేలాపురము నుండి కుసుమశ్రేష్టి మేనమామలు గూడవచ్చి బాలుని దీవించిరి. అనంతరం భాస్కరాచార్య గురుకులమున విద్యాభ్యాసమునకు కుసుమ శ్రేష్ఠిని జేర్పించిరి. బ్రహ్మాంశసంభూతుడగు భాస్కరాచార్యుడు ప్రత్యేకముగా యువరాజుకు విద్యాభ్యాసము చేయుచుండెను. ఆ రోజులలో విద్యార్థి గురువు వద్దనే వుండాలి. తల్లితండ్రులే ఆశ్రమమునకు వచ్చి బిడ్డలను జూసివెళ్ళెడివారు. గురువు గారు ఉన్నతాసీనమున ఆసీనుడై విద్యాబోధన చేసేవారు. వేదాలు నేర్పేవారిని మాత్రమే గురువులనేవారు. విద్యార్థులు నేలపైన సిరిసాపలపై ఆసీనులయ్యేవారు. తల్లిదండ్రులు కుసుమగుప్తతో "శ్రద్దగా చదువుకో నాయనా! ఎటువంటి పరిస్థితులలోనూ గురువుగారికెదురు జెప్పరాదు. మంచి పనులతో వారిని సంతోష పరచుచుండుము.

గురువుగారి భార్యయగు భారతీదేవి మాట ఎదురు ఆడవద్దు. ఆమె ఆజ్ఞ పాలించుట నీ కర్తవ్యము. మానవత్వము-మానవసేవ ఈ రెండు మాత్రమే నిన్ను మంచిదారిలో నిలబెడతాయి." అని జెప్పి పంపిచిరి. అందరినీ సమభావనతో జూసే గురువుగారిమాట శిరసా వహించాలని ఖచ్చితంగా భావించేవాడు. ఆశ్రమ క్రమశిక్షణ సాధించాలనే కఠోరనియమం ఉండేది. భిక్షాటన చేసి తీసుకువచ్చిన భీక్షాన్నమును శిష్యులందరూ పంచుకొని భుజించేవారు. అప్పుడే భక్తిభావనములు, సహనం సదా ఏర్పడేవి. ప్రతినిత్యం విద్యాభ్యాసం సంపూర్తయ్యాక భోజనం శిష్యులే సమకూర్చుకోవాలి. అయితే భోజనం పంపకం వ్యక్తిగత విషయం కాదు. విద్యార్థులందరూ గూడి సమావేశమై గురువునుండి ఆశీస్సులు పొంది సామూహికంగా తెచ్చిన ఆహారాన్ని పంచుకుని భోజనం చేసే వారు. సాయంకాల సమయమున తరగతి స్థలమును శుభ్రపరచడం, యజ్ఞాని దర్భలు, సమిధలు కొరకు అరణ్యమునకు వెళ్ళుట, తదుపరి మెక్కలకు నీరు పోయుట, పశువులకు మేత తీసుకురావటం మెదలగు ఇతర విషయాలు శిష్యులకు అప్పగించబడేవి. దినచర్య ముగుసిన తర్వాత సూర్యాస్తమయం కాగానే చాపల పై వారు నిద్రించేవారు. కుసుమశ్రేష్ఠి తనకు అప్పగించిన పనిని క్షణంలో చేసేవాడు. గురువుగారి పులుపు వినగానే వారి వద్ద నిలిచేవాడు. భాస్కర గురువు అంటే 714  ఆర్యగోత్ర వైశ్య బిడ్డలందరికీ గౌరవభావం ఉండేది. గురువు నుండి ఏ ఆజ్ఞలు పొందకయే గురువు ముఖ కవళికలను బట్టి, వారి మనోభావములను గ్రహించి క్షణంలో ఆకృత్యాన్ని కుసుమశ్రేష్ఠి నెరవేర్చి ఉత్తమశిష్యుడనిపించు కున్నాడు.

ఈ విధముగా ఆశ్రమంలో అటు గురువైన భాస్కరాచార్యునకూ, ఇటు తోటి విద్యార్థులకూ అభిమాన పాత్రుడైనాడు. ఈతని విద్యాభ్యాస పద్దతి కూడా విశిష్టమై స్సామధర్వణ వేదములు అదనంగా, గదాయుద్దమును ఏకసంధాగ్రహిగా కుసుమశ్రేష్టి నేర్చుకొనెను. యౌవన ప్రాయుడైన తదుపరి నవవ్యాకరణములు, షట్ శాస్త్రములలో ప్రావీణ్యుడాయెను. విద్యాభ్యాసములన్నియూ ముగించుకొనిన తదుపరి భాస్కరాచార్యుడు ఒక మంచి సుముహూర్తమున శిష్యుని తీసుకువచ్చి జననీ జనకుల కు అప్పగించెను.

కుసుమగుప్తునకు పట్టాభిషేకం, కళ్యాణము

కుమారుని జూసి మహదానందభరుతులైన తల్లిదండ్రులు నగరస్వాముల సలహామేరకు పురోహితుల వేదగోష్టితో, పీష్వా, అమాత్యుడు, సచివుడు మెదలగు వారి ఆశీర్వచనములతో కుసుమశ్రేష్టిని ఆష్టాదశ పట్టణములకు యువరాజుగా రాజ్య పట్టాభిషేకము గావించిరి. ఆ రోజు నుండి 18 పట్నములను యువరాజు పరిపాలించసాగెను. ఈతని రాజ్య పట్టాభిషేకము గురించి అన్ని రాజ్యములలోనూ గొప్పగా జెప్పకొనుచుండిరి. కుసుమగుప్తుడు సత్యవాక్య పరిపాలనా విషయంలో రెండవ హరిశ్చంద్రుడా! యన్నట్లుగా, ధానధర్మ విషయములో మేఘములాగున, ధైర్యమున మేరుపర్వతము వలె, గంభీరమున సముద్రము లాగున, వైభమునదేవేంద్రని వలె రాజ్యపరిపాలన చేయుచుండెను. ప్రజలందరూ యువరాజును దీవించుచుండిరి. ఆర్యవైశ్యులు మేనరిక ధర్మములు ఆ కాలములో తప్పక ఆచరించువారు.

కుసుమశ్రేష్టి మేనమామలయిన, హేలాపురం వాస్తవ్యులు, పౌలస్త్యస గోత్రోద్భవుల కుమార్తె అయిన కుసుమాంబను కుసుమ శ్రేష్టికిచ్చి సాధారణ నామసంవత్సర మాఘశుద్ద పంచమిన అంగరంగ వైభవమున వివాహము జరిపించిరి. 18 పట్నములలోని 714 గోత్ర సంబంధీక బంధుగణమంతయూ నూతన దంపతులనాశీర్వదించిరి. వధువగు కుసుమాంబ హేలాపురము నుండి పెనుగొండకు అత్త వారింటికి చేరెను. కుసుమశ్రేష్ఠి తల్లిదండ్రులు వచ్చిన బంధుమిత్రులకు అనేక బహుమతులునిచ్చి గౌరవించిరి. భారత సామ్రాజ్యలక్ష్మీ, కోడలైన కుసుమాంబతో గౌరిదేవి వ్రతము జేయించి పట్టణ మహిళామణు లందరకూ తాంబూల సహిత వాయనము లిప్పించగా సువాసినులందరూ కుసుమాంబను ’దీర్ఘసుమంగళీభవ’ యని దీవించిరి. కుసుమాంబ భర్తను దైవంగా నెంచి, అత్తమామలను తల్లిదండ్రులుగా భావించి ఉత్తమ ఇల్లాలుగా పేరుగాంచెను. మంగళ ప్రదమైన ముఖ లక్షణములతో ఉండేడిది. పరులకు ఉపకారము చేయుటలో అగ్రగణ్యురాలు. భర్తయగు కుసుమశ్రేష్ఠితో గౌరవముగా మాట్లాడుచూ, ప్రియముగా సంచరిస్తూ, రామాయణ, భారత, భగవత, భగవద్గీతలను భక్తాదులకు బోధించుతూ, వేదాంత ప్రవేశం కూడా కలదని నిరూపించెను. ఈ పుణ్యదంపతులు అష్టైశ్వర్యములతో తులతూగుచూ గురుభాస్కరాచార్యుని సలహాలతో 18  నగరములను పరిపాలించుచుండిరి. కాలము గడుచుచుండ వీరికి కళ్యాణ అనంతరం దాదాపు 36  సంవత్సరములు గడచినవి.

వయెవృద్దాప్య మంకురించి నది గాని సంతానము లేకపోయెను. పట్టణ మహిళలందరూ కుసుమ గుప్త దంపతులను హేళన చేయుచుండిరి. మరికొంతకాలమునకు అవమాన కరమగు మాటలతో కుసుమాంబ మనస్సును గాయపరచ ప్రారంభించిరి. వివాహాధి శుభకార్యములకు, నోములకు, వ్రతాలకు, పేరంటములకు, వాయనాలకు బిలువకుండిరి.

ఇలా వుండగా ఒక సుముహూర్తమున కుసుమ దంపతులిరువురూ గురుకులమునకు వెళ్ళిరి. భాస్కర గురువులు కుసుమదంపతులకు ఉచితాసములిచ్చి గౌరవించి కారణమడుగగా కుసుమగుప్త "ఓ గురువర్యా! అష్టైశ్వర్యములతో, ధనధాన్యములతో, కృషిగోరక్ష్యవాణిద్యాభివృద్దితో అష్టాదశ నగరపరిపాలన చేయుచూ లేమి ఎరుగక ఆగర్భ శ్రీమంతులుగా ఉన్నాము. కానీ సంతానములేదు. వంశోద్దారకుడు లేని కారణాన మా ప్రభాతస గోత్రం అంతరించి పోవలసిందేనా? సప్తసంతాన కార్యములు సలిపితిమి. కొందరు మహర్షులు పుష్పాలతో శివకేశవులకు పూజలు చేయమని సెలెవిచ్చినందున మా దినచర్యలో పుష్పపూజ నిత్యకృత్యమయినది. అతిధులకు అన్నదానం, యాచకులు ధనదానం చేశాము. కానీ ఆ దైవం మమ్ములను  కరుణించలేదు.

ఇంకనూ దైవారాధన చేయుచున్నాము. గాని సంతాన రహితులము" అని చెప్పగా వెంటనే కుసుమాంబ "గురువయ్యా! ’అపుత్రస్యగతిర్నాస్తీ....’ యను సూక్తి ప్రకారం, సంతానం లేని దంపతులకు స్వర్గ ప్రవేశం లేదు గదా? మాకు నరకమే శరణ్యమా? నోములు, వ్రతాలు చేశాము. దేవతలను తదేకంగా పూజించాము. అయినా పుత్రులు కలగలేదు. సంతానము కొరకు వ్రతం చేయాలి? దేవతారాధన చేయాలి? సెలవివ్వండ్" అని దీనంగా విలపించింది. భాస్కర గురువు " కుసుమదంపతులారా! పూర్వం పార్వతీ పరమేశ్వరులకు, సత్యహరిశ్చంద్రులకు, సీతారాములకూ, నలదమయంతులకు ముందు సంతానలేమి తప్పలేదు. సంతానం లేదని మీరు దుఃఖించవలదు. పరమాత్మ పరీక్షలో నెగ్గినవారే స్థితప్రజ్ఞులు. కళ్యాణమైన బహుకాలమునకు జన్మించిన బిడ్డలకు తప్పక దైవాంశ గలుగును. దశరధుడు,దృపదుడు, వృద్దాప్యంలోనే సంతానవంతులైనారు. పుత్రకామేష్టియను యజ్ఞము చేసి కృతార్ధులైరి. కనుక మీ దంపతులు కూడా పవిత్రమైనపుత్రకామేష్టియాగమును భక్తితో నిర్వహించితే మీకు సంతానము కలుగుననుటలో సందేహము లేదు" అని బోధించెను.

పుత్ర కామేష్టి యాగము ప్రారంభము:-

కుసుమరాజా యజ్ఞసమయమడుగగా భాస్కరాచార్యుడు "పంచభూతాలు ప్రత్యక్షదైవాలు కనుక అగ్నికి సమర్పించిన హవిస్సును పరమాత్మ గ్రహిస్తాడు. ఈ యాగమును మండల 44 దినములు, జీవనదుయగు గోదావరీ నదీ తీరాన ప్రారంభించాలి. పవిత్రశ్రావణ శుద్ద పాడ్యమిరోజున ప్రారంభమునకు మంచి దినము. నిర్విఘ్నంగా యాగ నిర్వహణ జరగాలి గనుక మండలం దినములకుగాను సమిధలను సైన్యముతో సిద్దము చేయించుము. ఆజ్యమును బాహుళ్యముగా అర్పించవలెను. శక్తివంచనలేకుండా దానధర్మాలు, అన్నదానములు చేయవలెను" అని యాగ విషయములను బోధించెను

 

గృహోన్ముఖులైన దంపతులు నగర స్వాములనూ, వణిగ్వరులనూ సమావేశపరచి యజ్ఞ కార్యక్రమము గురించి తెలిపిరి. ఈ విషయం సన్నిహితులు, శ్రేయెభిలాషులు, మిత్రులు, బంధువులు, పెనుగొండ పురవాసులందరికీ తెలిసినది. అష్టాదశ నగరాధ్యక్షుడు చేయు పుత్రకామెష్టి గురించి రాజ్యమంతయూ గొప్పగా జెప్పుకొనిరి. ప్రతిగృహము పండుగ వాతావరణంలో ఉన్నది. 18 నగరములోని వీధులు పచ్చని తోరణములతో, పందిళ్లతో, పుష్పమాలలతో, సుగంధద్రవ్యభరిత మహావైభవోపేతముతో అలరారుచున్నవి. పెనుగొండ నుండి గౌతమీ నదీతీరానికి దంపతులు బయలుదేరిరి. ముందుగా భేరిమృదంగాది వాద్యరావాలు నభోపదమ్మున మిన్నుముట్టగా వంది మాగధులతో నృత్యకాంతలు కళానైపుణ్యంతో నాట్యము చేయుచుండగా వచ్చిన పట్టణవాసులు నయనా నందముగా తిలకించుచుండిరి. బంధుకోటి, భాస్కరాచార్య గురువు,వారి శిష్యగణము పూర్ణకుంభముతో స్వాగతము పలుకుచుండగా కుసుమదంపతులు నడుచుచుండిరి. ప్రకృతి అంతా పులకించి యున్నది. ఈ దంపతుల వెనుకనే ఆస్థానమంత్రులు, భటవర్గము, ఋత్విక్ గణము, తదుపరి మహాఋషీశ్వరులు, మిత్రకోటి జ్యేష్ఠశైల పురోహితులు వేల జనాభాతో సాధువులు, సర్వసంగ పరిత్యాగులు, అతిరధులు గజవాహన అశ్వవాహన సైన్యపారవారములతో గోదావరి మార్గము నిండియున్నది.

18 నగరములలోని జనులందరూ సంతోషముతో నడుచుచుండిరి. కుసుమ రాజావారి మనోభీష్టము నెరవేరాలని సకలజనమనోద్దేశ్వము. ఈ విధముగా సమతము వెళ్ళి పశ్చిమ గౌతమీ తీరమున విశాల ప్రాంగణములోని చేరిరి. వచ్చిన వారందరికి యజ్ఞప్రసాద, అతిధి సత్కారములు జరిగినవి. భాస్కరాచార్యులు పుత్రకామేష్టి యజ్ఞమును మంత్ర్ములతో వెలిగించిరి. ఋత్విక్కులు ప్రణవమగు "ఓమ్" కారనాదము చేసిరి. కుసుమ దంపతులు మంత్రములతో ఆజ్యమును అగ్నిలోకి సమర్పించుచుండిరి.

కుసుమదంపతులు భూ, గోదానములు బాహుళ్యముగా చేయుచుండిరి. దానము పుచ్చుకొన్న వారందరూ "సుసంతానప్రాప్తిరస్తు" అని దీవించుచుండిరి. ఈ విధముగా దంపతులు యజ్ఞమున సమర్పించు ఆజ్యాన్ని అగ్నిదేవుడు స్వీకరించ లేక అతనికే అజీర్తి చేస్తున్నదా! అన్నట్లు బాహుళ్యముగా ఆజ్యాన్ని సమర్పించుచుండిరి. ఆర్యవైశ్యులభక్తి,శ్రద్దలకు మహదానందభరితుడైన అగ్నిదేవుడు కూడా ఈ దంపతులకు సంతానము కలగాలని దీవించి, హవిస్సును దేవతలకు అందజేసెను. కాలము గడిచి మండలము రోజుల అనంతరం పూర్ణాహురికి పార్వతీ పరమేశ్వరులిరువురూ ప్రకాశవంతమున పుత్రకామేష్టి యజ్ఞమున సాక్షాత్కరించిరి. తేజోవంతులైన యజ్ఞేశ్వరీ యజ్ఞేశ్వరులను గాంచిన దంపతులు భక్తితో ఈ విధముగా స్తోత్రములు చేసిరి.

కుసుమశ్రేష్ఠి-కుసుమంబ
కుసుమశ్రేష్ఠి-కుసుమంబ
కుసుమ దంపతులు పఠించిన శివ పంచాక్షరీ స్తోత్రము

ఓంకార మంత్ర సంయుక్తం | నిత్యం ధ్యాయంతి యెగినః

కామదం మెక్షదం తస్మై | ఓం కారాయ నమెనమః ||

నమ్సస్తే దేవదేవేశ| నమస్తే పరమేశ్వరీ

నమస్తే వృషభారూఢ! న కారాయ నమెనమః ||

మహాదేవం మహాత్మానం | మహాపాతక నాశనం

మహాపాప హరం వందే| మ కారాయ నమెనమః ||

శివం శాంతం జగన్నాధం | లోకానుగ్రహ కారణం

శివమేకం వరంవందే | శి కారాయ నమెనమః ||

వాహనం వృషభోయస్య | వాసికిః కంఠభూషణం

వామేశక్తి పరంవందే | వ కారాయ నమెనమః

యత్ర కుత్ర స్థితం దేవం | సర్వ వ్యాపినమీశ్వరం

యల్లింగం పూజయేన్నిత్యం | య కారాయ నమెనమః

మరియు లింగాష్టకం పఠించి సాష్టాంగ నమస్కారము చేసిరి. భక్తులందరూ "దాక్షాయణికి జై! పార్వతీదేవికి జై!! పరమేశ్వరునకు జై!!!" అని జయజయ ధ్వానములు చేయుచుండిరి. కుసుమాంబ "అమ్మా! సంతానము కొరకు పుత్ర కామేష్టియాగమును నిద్రాహారాలు లేకుండా నిర్వహించితిమి. మహాభక్తి పరాయణ మూర్తి, దైవతత్వపరుడు, సారవిహీన సంసారంలో సంతోషపెట్టు కుమారుడూ, గృహమును పావనం చేయుటకు గృహలక్ష్మీ ఇరువురు బిడ్డలు కావలెము!" అని పార్వతీదేవిని అడుగగా వెంటనే అమ్మవారు "ఓ కుసుమ దంపతులారా! ఆదిపరాశక్తి- స్వరూప పార్వతీదేవియగు నేను మీ కుమారైగా!  జన్మించెదను. నందీశ్వరుడు వర ప్రకారంగా నాకు సోదరుడైన విరూపాక్షుడుగా ’కవలలుగా’ జన్మించెదము!" అని వరమిచ్చెను. పరమేశ్వరు పార్వతీదేవితో చెప్పగా అమ్మవారు తన దివ్య శక్తితో వరఫల ద్వయమును సృష్టించెను. ఆ ఫలమును కళ్ళకద్దుకొని పరమేశ్వరునకివ్వగా పరమేశ్వరుడు కుసుమ దంపతులకు నొసంగెను. కుసుమాంబ నమస్కరించి స్వీకరించెను. పార్వతీశ్వరులు ఈ దంపతులను దీవించి అదృశమయ్యిరి. యజ్ఞం పరిసమాప్తం అయ్యింది. ప్రజలు వారివారి నగరములకు తరలి వెళ్ళిరి.

శుక్లపక్ష చంద్రునివలె దినదినప్రవర్థమానముగా కుసుమాంబ యెక్క గర్భము వృద్దిపొందుచుండెను. హేలాపురి నుండి వచ్చిన కుసుమాంబ 11 మంది సోదరులు, వదినలు, మరదళ్ళు తల్లిదంద్రులు వచ్చి పుంసనవము, శ్రీ మంతము మెదలైన కర్మలనాచరింపజేసి కుసుమాంబతో నవరత్నములను, వజ్రవైడూర్యములను, వస్త్రములను కుసుమాంబతో దానమిప్పించిరి. గోనకమలా-జనార్ధులను, వింధ్యవాసినీ-నగరేశ్వరులను అర్చనలు చేసి కృపను పొందిరి. ఈ విధముగా దాన ధర్మములు చేయు నగరముగా పెనుగొండ వర్దిల్లసాగెను.

ఆ సమయమున భూదేవి వైకుంఠమునకు వెళ్ళి భర్తయగు విష్ణువును "నాథా! భూలోకంలో ఎక్కడచూసినా కామాంధులు, దుర్మార్గులు, రాక్షస ప్రవృతిగలవారు ఎక్కవయ్యిరి. వారి భారమును నేను మెయలేకపోవుచున్నాను. భగవద్గీతయందు ధర్మమునకు వినాశము పెరిగినప్పుడు ధర్మసంస్థాపన కొరకు యుగ యుగముల యందు నేను సంభవిస్తానని గీతాచార్యునిగా బోధించారు కదా! మరి ఎప్పుడు వచ్చి వారిని దుర్మాడెదవు? శెలవివ్వుడు" అని కోరెను. అప్పుడు శ్రీ విష్ణువు "భార్యామణీ! నేనాధర్మం భగవద్వీతలో బోదించిన మాట వాస్తవమే! ఇప్పుడు కలియుగంలో కామాంధులను, దుర్మార్గులను సంహరించుటకు, ధర్మోద్దరణ చేయుటకు ఆదిపరాశక్తి త్వరలో అవతారం ధరించబోవుచున్నది.

కృతయుగమున పరాశక్తి - మహాశక్తి సంపన్నుడైన జమదగ్ని మహర్షి భార్య రేనుకా మహాదేవి అను పేర జన్మించి కామాంధులను నాశనం చేసినది. త్రేతాయుగమున జనక మహారాజు కుమారైయై జానకీదేవిగా ఉద్భవించెను. ఆయుగమున "శతకంఠ రావణాసురుని" మట్టు పెట్టినది. తదనంతరము పరాశక్తి ద్వాపరయుగమున ద్రుపద మహారాజు చేసిన పుత్రకామేష్టిలో  ద్రౌపదీదేవి పేర జన్మించినది. ఈమెతో దృష్టద్యుమ్నుడు అను వీరుడు కూడా అగ్నిలో జన్మించెను. అజ్ఞాతవాసమందు విరాట మహారాజు కొలువులోని సైరంద్రి ఉద్యోగంలో మాలిని యను పేరుతో కామాంధుడగు కీచకుని భీమసేనుని ద్వారా సంహరించుటయే కాక, కురుక్షేత్రములో మహాబలశాలులైన 11  అక్షోహిణీల కౌరవ సైన్యాన్ని యుద్ద రణరంగమందు గూల్చుటకు కారణభూతురాలైనది. తదుపరి కలియుగమున ఆదిపరాశక్తి స్వరూపముతో పార్వతీదేవి అంశమున కుసుమశ్రేష్టి దంపతులకు శ్రీ వాసవిగా జన్మించి, ధైర్య, స్ధైర్య, సత్య, శీల, పాతివ్రత్య మహిమతో ’అహింస’ అను ఆయుధముతో, కామాంధుడగు విష్ణువర్ధనుని అంతమెందించును" అని చెప్పెను