Bhadrapada Masa sankashtahara Chaturthi Vrata Katha - భాద్రపదమాస మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ
Bhadrapada Masa sankashtahara Chaturthi Vrata Katha - భాద్రపదమాస మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ |
శ్రీ మహాగణాధిపతయే నమః
పార్వతీదేవి గణపతితో
"గణపతీ! భాద్రపద మాసమున ఈ సంకష్టహర గణపతి
వ్రతమును, ఏ పేరున, ఏ విధముగా ఆచరించవలెనో వివరింపుపు" అని అడుగగా, గణపతి "
అమ్మా!
పార్వతీదేవి! భాద్రపద మాసమున ఈ సంకష్టహర చతుర్థీ వ్రతము సర్వకార్యములను సిద్ధింపజేయును. ప్రతి మాసమునను వేర్వేరు
పేర్లతో నన్ను పూజింపవలెను. ఏకదంతుడు, వక్రతుండుడు, గజాననుడు,
గణాధిపుడు, హేరంబుడు, విఘ్నరాజు మున్నుగు నామములతో ఆయా మాసములందు నన్ను పూజించు వారికి కష్టములు తొలగి సుఖములు చేకూరును.
ఈ వ్రతమును సాయంకాలము చేసి, చంద్రోదయమైన పిదప, అర్ఘ్యప్రదానము
గావించవలెను. ఈ విషయమై పూర్వము జరిగిన వృత్తాంతమును చెప్పెదను వినుము.
షట్చక్రవర్తులలో ఒకడగు నలమహారాజు
విధివంచితుడై, జూదమున సర్వస్వమును
కోల్పోయెను. మంత్రులు అసమర్థిలై రాజ్యమును నాశనము చేసిరి. నలుడు అరణ్యముల
పాలయ్యెను. దురదృష్టవశమున దమయంతియు దూరమయ్యెను. అసామాన్య చక్రవర్తి
సామాన్య మానవుడయ్యెను. భార్యయగు దమయంతి అనేక కష్టములను అనుభవింప సాగెను. అరణ్యసంచారమున దమయంతి ఒకనాడు శరభంగ మహర్షి ఆశ్రమమును జేరి, ఋషికి నమస్కరించి, "ఋషివర్యా! నేను నలమహారాజు
భార్యను దమయంతిని, కలివంచితులమై మేము రాజ్యభ్రష్టులమైతిమి. నాభర్త నాకు దూరమయ్యెను. నాయందు
దయయుంచి, నా భర్తను, రాజ్యమును మరల పొంది, సంతానముతో సుఖముగా
ఉండుటకై ఏదైన ఉత్తమ మార్గమును సూచించి,
అనుగ్రహింపుడు" అని ప్రార్థింపగా, శరభంగ మహర్షి, అమ్మా! దమయంతీ! "సర్వక్ష్టములను
తొలగించి, ఇష్టార్థములు ఇచ్చునది,
"సంకష్టహర
చతుర్థీ వ్రత" ఉన్నది.
దానిని భక్తి స్రద్దలతో ఆచరించి నీ కష్టములు తొలగి, నీ భర్తను, రాజ్యమును
పొంది, సంతానముతో సుఖముగ ఉండెదవు " అని వ్రత విధాన
మంతయు వివరింపగా, దమయంతి శరభంగ మహర్షి చెప్పిన ప్రకారము శ్రీ సంకష్టహర చతుర్థీ వ్రతమును ప్రారంభించి, ఏడవనెల వ్రతముము చేయు చుండగనే, తన భర్తయు, కోల్పోయిన రాజ్యమును లభించి, సంతానముతో పూర్వ వైభవము పొంది, సుఖించెను.
కనుక ఓ ధర్మరాజా! నీవును ఈ వ్రతమును
ఆచరించి, శత్రువులను జయించి, కష్టములను తొలగించుకొని, రాజ్యసుఖము పొందుము అని
ఉపదేశించె నని వివరించెను.
ఇట్లు శ్రీ కృష్ణ యుధిష్టిర సంవాదాత్మకమగు
భాద్రపదమాస సంకష్టహర చతుర్థీ వ్రత కథ సమాప్తము
శ్రీ మహాగణప్తి ప్రసాదసిద్ధి రస్తు
"సర్వే జనా
స్సుఖినో భవంతు"
ఓం శాంతి శాంతిః శాంతిః
0 Comments