Sri Vasavi Kanyaka Parameswari Devi 9
శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము
Sri Vasavi Kanyaka Parameswari Devi 9 - శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము |
కన్యకాంబకు మంగళ స్నానము:
భాస్కరాచార్యుడు ఆస్థానమండపమునకు వచ్చి కుసుమశ్రేష్టితో "అగ్ని
ప్రవేశమునకు పవిత్రశుద్ద విదియ ఘడియలు ప్రారంభమైనవి. కనుక యువరాణి వాసవికీ 18 మంది
కన్యలతో మంగళస్నానము చేయించవలెను. అందరికి గృహము నందు ఇద్దరు(దంపతులు)
అగ్నిప్రవేశమున్అకు సిద్దమైతిరి. మీ గృహమునందు ముగ్గురు (వాసవితో) అగ్నిప్రవేశము కావలయును. బ్రహ్మ రాత తప్పించుట్
ఎవరి తరము కాదు" అని చెప్పెను. మేటి గోత్రజులగు 18 మంది కన్యకలు అంతఃపురమున వాసవికి, అత్తరు,పన్నీరు,సుగంధ
ద్రవ్యాల మిశ్రమంతో కూడిన జలముతో మంగళ స్నానము చేయించిరి. కుసుమాంబ, వాసవాంబకు స్వేతపట్టు వస్త్రము కట్టి కన్నీరు మున్నీరుగా
దుఃఖించుచూనేయున్నది. ఆ సమయమున అక్కడ అందరూ దుఃఖించసాగిరి. తల్లిదండ్రులు, వాసవితో వాసవీ "పుత్రకామేష్టి" చేసి పార్వతీశ్వరులను మెప్పించి
నిన్ను కుమార్తెగా పొండి చిన్నప్పటినుండి అల్లారు ముద్దుగా పెంచిన మాకు గర్భశోకమే
కదా! 102 గోత్ర దంపతులతో మేమగ్ని ప్రవేశం గావించెదము. మన గ్హము నీవు
సుఖముగానుండుము" అని దుఃఖించుచుండిరి.
తల్లిదండ్రులకు వాసవికన్య వైరాగ్యబోధ:-
దుఃఖించుచున్న తల్లిదండ్రులను గాంచిన కన్యకాంబ ఇలా చెప్పెను.
"చిన్ననాటి నుండి పెంచిన మీరు అగ్నిప్రవేశము కాగా నేనున్నాసార్థకమేమిటి? విధాత- రాతకు ఎదురాడుటకు ఎవరికి ధైర్యము? పూర్వము రాజ్యములేలిన మహాచక్రవర్తులేరి? అవతార
పురుషులేరి? షట్చక్రవర్తులు భువినేలినా, మరణము జయించుటకెవ్వరికీ శక్తిలేదు. వారికీర్తి మాత్రము స్థిరము. జీవితము
అస్థిరము,యవ్వనము, సంతానము అన్నియూ
అస్థిరములు, ధర్మము, కీర్తి
సూర్యచంద్రాదులున్నంత వరకు ఉండును. ఈ విషయమున దుఃఖించుట అజ్ఞానము, మానవులైన వారందరకూ మరణము తప్పదు. అదేవిధంగా జన్మము తప్పదు. ఆదిపరాశక్తి
యగు నేను జనన మరణాలకు అతీతము, ’పాపీ చిరాయువు - పుణ్యా
గతాయువు’ అన్నట్లు పుణ్యం పండిన మానవులు బువిపై ఉండరు" అని ఆధ్యాత్మిక
రహస్యములు చెప్పుచుండెను. దుఃఖముతో ఉన్న తండ్రీ ఆవేశంతో "ఎందరెందరో రాజులు ఈ
భువినేలిరి. ఇంకముందెందరో ఏలెదరు. కాని ఆర్యవైశ్య కాంతను రాజు కోరకూడదు! ఇంతమంది
అగ్నిప్రవేశ కారకుడైన విష్ణువర్దనుడు రావణ, దుర్యోధన,
కీచకునివలె పతనము చెందుగాక" అనెను. అప్పుడు కన్యకాంబ శాంతముతో
"తండ్రీ! ఎంత అజ్ఞానుడవు! ఆ విష్ణువర్ధనుని, రాజమండ్రిని,
ప్రపంచా న్నంతటిని సృష్టించినది ఆదిపరాశక్తియగు నేనే! లోకమంతయు
నాకుక్షియందు న్నది. 84 లక్షల జీవరాశిని సృష్టించుట నా చాతుర్యమే! పిపీలికాది
నుండి అండాండ, పిండాండ, బ్రహ్మాండమంతయూ
నడిపించుట, భూతభవిష్యత్ వర్తమాన కాలములందు పరిభ్రమించునట్లు
చేయుట నా చాకచక్యమే. మెహాంధకారమున కాలములందు పరిభ్రమించునట్లు చేయుట నా చాకచక్యమే.
మెహాంధకారమున నన్ను చూసి మెహించిన రాజు ప్రతియుగమున నన్ను మెహిస్తూనే యున్నాడు.
అతనికి నాకు ప్రతి జన్మయందు శతృత్వము నడుచుచునేయున్నది. నా శాప ప్రకారంగా అతనిని
’అహింస’ ద్వారా నశింపజేసెదము" అని చెప్పెను.
అంతలో కుసుమాంబ "ఓ వాసవీ! బువిలో ఎందరో శ్రీమతులుండగా నా గర్భమున
నీవెందుకు జన్మించావు? పుట్టుట మా
ప్రాప్తమనుకొనినా నీ కళ్యాణము చూసే యెగం మాకు లేదు కదా! పుత్రకామేష్టి గొప్పగా
చేసి మిమ్ములను గన్న మాకేమిటి సుఖం?" అని
దుఃఖించుచున్నది. మరికొంత సేపటికి సోదరుడు విరూపాక్షుడు అచ్చటకు వచ్చి చెల్లెలైన
వాసవాంబతో "మేనత్త కుమారునితో స్వయంవరంలో నీకు కళ్యాణం చేద్దామని
అనుకున్నాము. కట్నమిచ్చి అత్తగారింటికి వేడుకలతో పంపుదామనుకున్నాము. అత్తగారింటి
నుండి అప్పుడప్పుడు పిలిచి చీరె-సారెల అర్పించుదామని ఎన్నియె ఆశలు ఉన్నవి. నీవు
చిన్నప్పటి నుంఛి ’అన్నా- అన్నా’ అని పిలిచిన మాటలు నేనెలా రేపటినుండి మరువగలను?
తల్లిదండ్రులు-సోదరియూ లేక నేను రాజ్యాన్నేలలేను. నేను కూడా అగ్ని
ప్రవేశమయ్యెదను" అని ఆవేశము కూడిన దుఃఖముతో నడిగెను. వాసవి "అన్నా నేను
మానవతిని కాను - దేవతను. బంధుత్వము మానవులైన మీకు మాత్రమే! ఒక్కో గోత్రమునకు ఒక్క
వయెవృద్ద దంపతులు మాత్రమే అగ్నిప్రవేశార్హత. ప్రభాతస (పెళ్లికుల) గోత్రం
అంతరించకుండా ఉండాలంటే నీవగ్ని ప్రవేశమునకు రారాదు. భవిష్యత్తులో 18 నగరములకు నీవు
మహరాజుగా నీ సహధర్మచారిణి రత్నవతీ శిరోమణి మహారాణిగా, నీ
సుపుత్రుడగు మణిగుప్త యువరాజుగా బాధ్యలు చేబూని ఆర్యవైశ్య సంఘమును నడిపించవలసిన
బాధ్యత మీయందున్నది. భాస్కర గురువునకు, నగరస్వాములకు,
మహామంత్రికి మీరెదురాడక వారి నేతృత్వంలో మీరు సంచరించవలెను"
అని చెప్పెను.
102 వ గోత్రీకుల చరిత్ర:-
పెనుగొండ నగరమునకు దగ్గరలోని ఆచంట నగరమున ఒక ఆర్యవైశ్య దంపతులు గలరు. వారి గోత్రం లాభాల. ఋషి ధనదస. వారికి ఒక్కగానిక్క కుమారుడు ’ధనదగుప్త’ యని కలడు. ఇఅతను తప్ప ఈ గోత్రీకులకు అన్నదములెవ్వరూ లేరు. తల్లిదండ్రులు అతనికి కళ్యాణము చేయదలంచిరి. పెనుగొండ పట్టణమున నివసించుచున్నట్టి సనకసః గోత్రికుల సంతతిలోని కన్యా రత్నమగు ’ధనలక్ష్మీ’ యను ఉత్తమకన్యతో కళ్యాణము చేయ బూనిరి. పెద్దలందరూ కలసి సంప్రదించుకొని ధన దగుప్తకు అత్తగారి గ్రామమైన పెనుగొండ పట్టణ కన్యాదాతగారి గ్హమునందు భాద్రపద బహుళ ఏకాదశి రోజు ధనదగుప్త- ధనలక్ష్మీల కళ్యాణము అంగ రంగ వైభవముగా జరిపించిరి. కళ్యాణము అంగ రంగ వైభవముగా జరిపించిరి. కళ్యాణమైన మాసం రోజులు పూర్తయిన సందర్భంగా ధలక్ష్మీ అత్తగారింటికి (ఆచంట) వెళ్ళు సమయము ఆసన్నమైనది. వరునితో బంధువర్గము "ఈ పెనుగొండ నగరేశ్వర దేవాలయము నకు ప్రసిద్ది చెందినది. కోరిన వారికి కోరుకున్న వరాలు ఇచ్చుటలో నగరేశ్వరునికన్నా వేరు దైవము లేదు. గ్రామ పొలిమేరలో నున్న ఆ దేవాలయమును నూతన దంపతులైన మీరు దర్శించి ఆచంటకు వెళ్ళవలెను" అని తెలిపిరి. ఆ దంపతులు పెద్దలు వాక్కు ననుసరించి భక్తితో నగరేశ్వరస్వామి దేవాలయమునకు విచ్చేసిరి. అచ్చట అగ్ని గుండములలోని ఆకాశమునకంటుచున్న అగ్నిజ్వాలలను చూసి అది ఒకవేళ గ్రామము దగ్దమవుతున్నదనుకొని అచ్చటనున్న భటులను విషయమడిగిరి. ఆ భటులు ఈ దంపతులతో "అయ్యా! ఆ అగ్నిగ్రామము దహించుటకాదు, ఈ నగర కుసుమ దంపతులు వారి కుమార్తె 101 గోత్ర దంపతులతో సహా విదియ సుముహుర్తమున అగ్నిప్రవేశ ఆత్మార్పణ ద్వారా కైలాసమున కెళ్ళుచున్నారు. వారి అగ్నిగుండములోని మంటలే మీరు చూస్తున్నది" అని చెప్పిరి. వెంటనే ఆ దంపతులు గుండముల వద్దకు వచ్చిరి. వీరకంకణములను 101 గోత్ర దంపతులకు భాస్కరాచార్యుడు ధరింపజేసినాడని, మిగతా 102వ గోత్రీకులైన ధనదస గోత్రీకులు అక్కడలేరని తెలుసుకొనిరి. మానవదేహము అశాశ్వతమని బోధించు చున్న వాసవిని చూసిరి. ఆ విధముగా వారికి వైరాగ్యభావము ఏర్పడినది. వాసవాంబ వద్దకు వచ్చిన ఆ దంపతులు వారికి కూడా వీరకంకణములు ధరింపజేయుమని కోరిరి.
అప్పుడు వాసవి కన్య "ధనదశ్రేష్ఠీ! మీరిరువురూ
పిన్నవారు. అదియును గాక పసుపు వస్త్రముతో శుభముగనున్నారు. చెంప కాటుక, గంధము గుర్తులు చెదిరిపోలేదు. మీ
గోత్రాభివిద్దికి నీకన్నదమ్ములు కూడా ఎవ్వరునూ లేరు. పైగా అగ్నిప్రవేశమునకు నీ
తల్లిదండ్రుల అనుమతి నీవు తీసుకొనలేదు. మీ మామగారూ చెప్పలేదు. కనుక కంకణములు కట్టి
అగ్నిప్రవేశం చేయించుట ధర్మము కాదు. నీవు నీ భార్యతో ఆచంట నగరమునకు వెళ్ళి
నూటరెండవ గోత్రీకులగు నీ తల్లిదండ్రులను అగ్నిప్రవేశానికి పంపించు చాలు! వయెవృద్ద
దంపతులకు మాత్రమే అగ్ని ప్రవేశమునకు అర్హత కలదు" అని బోధించెను. అప్పుడు
ధనదగుప్త "అమ్మా! వాసవీ! మా నగరము ఇక్కడనుండి 18 క్రోసుల దూరములో కలసు. నేనక్కడికి
కాలినడకన వెళ్ళుటెట్లు? వారి అనుమతితో మరల పెనుగొండకు
వచ్చుటెట్లు? సమయము లేదు కదా! నీచ సంసారమనీ, అధమాధమ మరణము ద్వారా నరకము తధ్యమని మేమెరిగితిమి. మానవ దేహము అశాశ్వతమని
వైరాగ్య భావమేర్పడిన మాకు అగ్నిప్రవేశము ద్వారా మెక్షము సిద్దింపజేయుము.
మేమగ్నిప్రవేశము చేసెదము" అని దీనముగా కంకణములు కట్టమని కోరిరి. ఆలోచించిన
వాసవి ఈ నూతన దంపతులకు వీర కంకణములు కట్టవెలెనని భాస్కరాచార్యుల వారికి ఆదేశించగా
భాస్కరాచార్యుడు మంత్రముతో వీరకంకణములు ధరింపజేసెను.
102 వ గోత్రీకులకు వాసవి దేవి ఇచ్చిన వరము:-
101 గోత్రికులు, బంధుగణం, బాలగణం యువజనులందరితోను ’వాసవీ శక్తి’ ఇలా
చెప్పెను. '101 గోత్రికులకు సంతానము బాహుళ్యముగానున్నది కాని
ఈ 102 వ గోత్రీకులకు సంతానము లేదు కనుక ఇకనుండి ఆర్యవైశ్యులెల్లరూ ప్రతి
శుభకార్యములందు ముందుగా ధనలక్ష్మీ, ధనగుప్తలను తలచుకొని
వారిపేర ఒక తాంబూలము సమర్పించి ధ్యానించవలయును. సంకల్పములో, సంధ్యా
వందనములో ఈ దంపతులను, వీరి గోత్రమైన ధనదస, లాభాల గోత్రములను ఉచ్చరించవల్యును. అంతేగాక మీమీ పెద్దలకు పిండములు,
అబ్దీకములు సమర్పించునప్పుడు వీరికి కూడా సపిండీకరణము సమర్పించ
వలయును, ఇంకనూ ’ధనలక్ష్మీ ’దేవ్యై నమ: అనియూ స్మరించి వ్యాపారం
ప్రారంభించవలెను. మరియు వస్తువులు, ధాన్యమును ఎంచునపుడు
"ఒకటి’ బదులు ’లాభం’ అని లెక్కవేయవలెను. ధనదగుప్త, ధనలష్మీ
దంపతులను లాభాల గోత్రమును మరచి ఎవరైతే వ్యాపారం చేయుదురో వారికి ధనక్షీణమై,
వ్యాపారములందు లాభములుండవు" అని బోధించెను. ఆ క్షణమున అచ్చట ఉన్న ఆర్యవైశ్యులందరూ సమ్మతించి వాసవీ
బోధించినట్లుగా వ్యాపారములు చేయుదుమని ప్రతిజ్ఞచేసిరి. ధనదగుప్త దంపతులు
వాసవిదేవికి సాష్టాంగ నమస్కారము చేసిరి
అగ్నిగుండముల చెంత వాసవి ధర్మోపదేశములు:-
బాల బాలికలనుద్దేశించి అగ్నిగుండములు చెంత వాసవి "ఓ
బాలబాలికలారా! మేమగ్నిప్రవేశమైన తదుపరి మీరందరూ భాస్కరాచార్య గురుకులమున
ప్రవేశించండి. గురువుగారి మాటకు శిరసా వహించంది. సర్వభూతదయ, నిస్వార్థ సేవ, స్వకులాచరణ,
భగవత్ప్రార్ధన, బ్రహ్మజ్ఞానుల సేవ, ధ్యాననిష్ట, అహంకార మమకార త్యాగము, సోహం భావం, అలవర్చుకొనుడు. నేనగ్నిప్రవేశమిన స్థలమగు
పెనుగొండ క్షేత్రమందు, అష్టాదశ (18) శక్తిపీఠములవలె,12 జ్యోతిర్లింగముల వెలె నేను స్వయంబువుగా శిలారూపమున వెలసెదను. ఆ
విగ్రహమును తీయుటకు ఎవరూ సాహసించవలదు. ఎండకూ, వర్షమునకూ
రక్షణగా నా విగ్రహమునకు ఆచ్చాదన ఏర్పాటు చేయుడు. నిత్యధూప, దీప,
నైవేద్య, మంగళ హారతులిచ్చి నన్ను పూజించండి.
శారీరకంగా నేను లేకపోయిననూ మిమ్ములను, మీ బిడ్డలను వెన్నంటి
రక్షించుచూనే యుందును. ఇకనుండి "ఆర్యవైశ్య కులదేవత"గా, ’ఇలవేల్పు’గా ప్రతి ఇంటి ఆడబిడ్డగా నన్ను మీరు గౌరవించవలెను. నా పీఠము మీ
నగరమునకు, మీ గృహమున కొచ్చినప్పుడు గౌరవించి పూజింపుడు. నా
సత్కధ ప్రతిదినము పఠించుడు, అతిధి అభ్యాగతులను గౌరవించుడు.
దానధర్మములు, యజ్ఞయాగాదులు, పరోపకారము
చేయుట మరువరాదు. దేవాలయాలు నిర్మించుడు. ఉద్యానవనాలను అభివృద్దిచేయుట, తటాకములు (చెరువులు) నిర్మించుట, పవిత్ర గ్రంధములను
కృతినొందించుట చేయుచుండుడు. గృహము యెక్క పెరుడునందు పాతర వేసిన ధనమును, వజ్రములను దానమ్య్ చేయుడు. చక్రవర్తులైన మీకు "ధనము లేదు"
"బంగారము లేదు" అని పదములు రాకుండా ఉండుగాక! తధ్యము! మీ గృహము లందు
శుభకార్యములలో ప్రప్రధముగా నాకున్నూ తదుపరి నగరేశ్వరునకూ, శ్రీజనార్ధనస్వామికీ,
గోన కమలాదేవికీ, వింధ్యవాసికినీ, భాస్కరగురునకూ, శ్రీవాణికినీ, ప్రభాతస
గోత్రమునకూ, లాభాల గోత్రమునకూ, బాలనగరులకూ,
102 గోత్రములకూ తప్పక తాంబూలములు నుంచవలెను.
వాసవీమాత ధర్మోపదేశములు:-
1. దీనులయెడ దయచూపుడు
2. చిత్తములను వైరాగ్యము ద్వారా జయింపుడు
3. హృదయమందు కామక్రోధాదులకు తావీయకుడు
4. సజ్ఞనులను, మహాత్ములను, పెద్దలను గౌరవింపుము
5. ఆత్మజ్ఞానము చేతనే మెక్షము సిద్దించును
6. విషయాసక్తి బంధకారణము
7. ఈ దేహమును సత్యజ్ఞాన రూపముగా తలచకుడు
8. యతులకు శమము, వానప్రస్తులకు నియమనిష్టలు, బ్రహ్మచారులు, పెద్దలకు సేవచేయుట
9. ఆత్మశుద్దిగా నగరేశ్వరుని ప్రార్థించిన సర్వ పాపములు
తొలగును
10.శబ్దాది విషయములే బంధకారణములు
11. విషయాసక్తిని విడిచి పరమాత్మ యందు ఆసక్తికలిగి
ముక్తినొందుడు
12. సర్వవ్యాప్తమైన ఆత్మను లేదనుకొనువాడు నాస్తికుడు
13.సర్వవ్యాప్తమైన పరమాత్మను నేనేనని గ్రహించుడు
14.గురుభాస్కరాచార్యుని మాటకెదురాడవలదు
15. నాపీఠములు తెచ్చిన వారిని గౌరవించి పంపగలరు
16. మీమీ శుభకార్యములయందు నన్ను తప్పక పూజింపుడు
17. మీ జీవితములో ఒక్క మంచి పనైనాచేసి ఆచమ్ద్రార్కము కీర్తి
గణించి ధన్యులుకండి
18. ఇప్పుడున్న ధనసంపద యంతయూ ఆరు భాగములు చేసి,
గురుభాస్కరాచార్య గురుకులమునకు
నా దేవాలయ నిత్యధూప, దీప, నైవేద్యాలకు
నగరేశ్వర దేవాలయ నిత్యధూపదీప నైవేద్యాలకు వినియెగించాలి
చెరువులు నిర్మించుటకు
ఉద్యానవనాభివృద్దికి
దానధర్మములకు
19. బ్రహ్మచారికి దండధారణము, గురుశుశ్రూష, బిక్షాచరణ,
బ్రహ్మచర్యము, సత్యము, అహింస,
వేదాధ్యయనములు విధులు
20. ఉపనయనము కానిచో అందరూ సూద్రసమానులే. ఉపనయనమైననూ చేయరాని
నీచకర్మలు చేసినచో మరల ఉపనయమునము చేయవలయును.
21. ధర్మాపేక్షలో గోవు, బ్రాహ్మణ, స్త్రీ,
బాలాదులను రక్షించుటకై ఆత్మ రక్షణార్థము వర్ణసాంకర్యమును
తప్పించుకొరకు ఆయుధములు పట్ట వచ్చును
22. అగ్న్యాదానమును, యజ్ఞమును వర్షఋతువు నందు చేయవ్లెను.
23. యజ్ఞోపవీతము ఎడమ భుజమందున్న యెడల ఉపవీతమనియు, కంఠ మందున్న యెడల నివీతమనియు, కుడిభుజమునందున్న యెడల ప్రాచీనావీత మనియు చెప్పవలయును
24. ద్విజులు గురుసన్నిధిలో వేదాధ్యయనముఅ ప్రతీకవ్రతము, గాయత్రీ వ్రతము గురువాజ్ఞనను పొంది
సమావర్తము చేయవలెను.
25. వైశ్యులకు కృషి, గోరక్ష్య, వాణిజ్యములు హక్కు కలిగిన వృత్తులు
(స్వధర్మములు). అంతియేగాక వేదాధ్యయనము, సేవావృత్తి
(ఉద్యోగము) చేయవచ్చును
26. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, బాలసారె
మెదలు స్మశానా గమనము వరకు సర్వకర్మలు వేదమంత్రములతోనే చేయించవలెను.
27. పెద్దలను సేవించి, వారికి నమస్కరించువారికి ఆయుర్ వృద్ది, యశోబలము
చేకూరును
28. పవిత మహామంత్రములను, విష్ణుశివాదుల ప్రీతిగా అందరూ జపించవచ్చును
29.వేదములు చదివి, దాని అర్ధములు తెలుసుకున్న యెడల జీవితములు సార్థకమగును
30. మీరందరూ భక్తిశ్రద్దలతో స్వధర్మమును పరిపాలించిన యెడల
నగరేశ్వరుడు సిరిసంపదలనిచ్చి చివరకు ముక్తినొందింప జేయును
31.వేదోక్త విధులతోనే వేదమంత్రములతోనే భగవంతుని పూజింపవలెను
32. మీరు, మీ సంతానము ఎల్లప్పుడూ ధర్మపరాయణులై సర్వసంపదలతో, తపోధ్యానాదులతో
ఇఅహపరములందు సుఖములొందుడు
33. నేను నాతో కలసి 102 దంపతులతో అగ్నిగుండ ప్రవేశమయ్యెదము.
ఈ వార్త నినగానే క్రూరుడగు విష్ణువర్ధనుడు అంతమెందును
34. బాలబాలికలారా! మీరు అగ్నిప్రవేశము చేయవద్దు.
వివేకవంతులైన వంశపవిత్ర కీర్తిని నిలబెట్టుడు. ధర్మములు మరువక ఆచరించుడు. ఇది
మీకందరకు శ్రేయెదాయకము
యజ్ఞోపవీత రహస్యము:-
యజ్ఞోపవీత ధారణ చేయుటలో ఒక గూడార్థమున్నది. యజ్ఞోపవీతమనగా కేవలం పైకి ధరించే
దారాలతో చేసిన జందెము మాత్రమేకాదు. ఇది మనలోని శ్వాసకు సంకేతము. మరియు సకలదేవతల
నిలయము. మనిషికి రక్షణ. మామూలుగా చూస్తే ఒకే దారం కనబడుతుంది. ఇందులో అర్థమేమనగా
"నీవు మానవుడుగా జన్మించి అనేక రకాల దేవతలను పూజిస్తావు. కాని ఉన్నది ఒకటే
దైవం. ఏకో నారాయణమూర్తి ఒక్కడే! ’సర్వం విష్ణుమయం జగత్....’ అనే విషయాన్ని, ఏకత్వాన్ని ఈ ఒక దారం బోధిస్తుంది. మరల ఆ ఒక్క దారాన్ని
విడదీస్తే మూడు దారాలను విడదీసి పలికిస్తే మూడు మూళ్ళు తొమ్మిది దారాము కనబడును. ఈ
భావం ఏమనగా ఆ ధరించిన వ్యక్తికి నవగ్రహాలు ప్రతికూలించక అనుకూలించును. ఇదే
అంతరార్థం. మరొక్క సారి ఆ తొమ్మిది దారాలను విడదీసి చూస్తే తొమ్మిది మూళ్ళు
ఇరువైఏడు సన్నవి దారాలు గోచరించును. హిందువులు పరమ పవిత్రంగా భావిస్తున్న తెలుగు
నక్షత్రాలైన అశ్వని, భరణి, కృత్తిక,రోహిణి, హస్త మైదలైన ఇరువది ఏడు నక్షత్రాల
ప్రతిరూపమే ఈ సంఖ్య. ఏకో నారాయణమూర్తి, త్రిమూర్తులు,
నవగ్రహాలు, తెలుగు నక్షత్రాలు... ఈ దేవతలందరూ
ఒడుగు ధరించిన వ్యక్తికి ప్రతి క్షణము కంటికి రెప్పలా రక్షణగా ఉండును. మానవుడు
ప్రాణాయాయం చేసే ప్రక్రియలో కుడి ముక్కుతో పీల్చిన సూర్యనాడి ’పింగళ’ పనిచేస్తుంది. ఎడమ ముక్కుతో పీల్చిన
చంద్రనాడి ’ఇళ’ పనిచేస్తుంది. ఈ రెండు ముక్కులు సమానంగా పనిచేసినపుడు లేదా రెండు
ముక్కులు సమానంగా శూన్యమై ’కేవల కుంభకం’ నిలిచినపుడు వెన్నులోని ’సుషమ్ననాడి’
తెరుచుకుంటుంది. అది శిరస్సులోని ’సహస్రారదళ పద్మము’ వరకు వ్యాపించి ఉంటుంది.
నా భక్తిలైన 102 గోత్ర దంపతులు అగ్నిప్రవేశానంతరం మెక్షము నొందుదురు. 612 గోత్రీకులు అధర్మాచరణ కలిగి పలిదిక్కులకు పోయి
దుర్విచారముగా సంచరించుదురు. కనుక మీరు వారిలో ఎట్టి సంబంధములు జరుపరాదు. ఋషి
గోత్రములు మీరు మరువరాదు. సాంకేతిక నామములు అనగా ఉదా:- పెళ్ళికుల, మునికుల, చిద్రుపేళ్ళ, నాభిళ్ళ, ఇనకాల మెదలగు సాంకేత నామములు గోత్రములుగా
వ్యవహరించరాదు. ఇవి కేవలం 612 గోత్రీకులతో సంబంధములు కలుగకుండునట్లు చేయుటకొరకే౧
కాని మీ ఋషిని మాత్రము గోత్రముగా తలంచవలెను. మీరందరూ సర్వస్వరూపిణియైన గాయత్రీ
దేవిని నిరంతరము జపించుచూ వివాహాది సమయములందు ఆరు రాత్రులు దీక్ష వహింపుము. మనతో
ఉండి తరువాత వేరైన 612 గోత్రీకులు మధ్య మాంసములు భుజించుచూ భ్రష్టులయ్యెదరు.
అట్టివారలు మీతో సంబంధము కోరినయెడల వారితో సంబంధ బాంధవ్యములు చేసికొనుచూ ఫలాపేక్ష
లేక చేయుదానిని కర్మయెగ మందురు. అన్ని శుభకార్యములయందు నా గోత్రమైన ప్రభాతసకు మీ
స్వగోత్రమునకు ప్రధమ, ద్వితీయ తాంబూలాదు లిచ్చి
గౌరవించవలెను.
భాస్కరాచార్యుడు గుండములకు సంఖ్యలు వేయుట:-
దేదీపయమానముగా వెలుగుచున్న వాసవాంబ ప్రత్యేకముగా
సిద్దముచేసిన తన గుండము వద్దకు వచ్చెను. భక్తాదులందరూ నారికేళములు సమర్పించి
మంగళహారతు లిచ్చిచిండిరి. భాస్కరాచార్యుడు 102 మంది దంపతులను అగ్నిగుండముల వద్దకు
రప్పించి వారివారి నామ, జన్మనక్షత
ప్రకారముగా గుండములు వద్దకు అనుమతినిచ్చెను. ప్రత్యేక గుండము వసవీ మాతకూ, ప్రధమ గుండము కుసుమశ్రేష్టి - కుసుమాంబ దంపతులందరకూ, నూట రెండవ గుండము లాభాల గోత్రీకులకు ’అదృష్ట సంఖ్యలు’ వేసి నిర్ణయించెను.
102 అగ్ని గుండములు,
సంకేత నామములు, గోత్ర ఋషులు, అగ్ని ప్రవేశమైన దంపతులు
102 మంది పుణ్య దంపతులు అగ్ని ప్రవేశమునకు సన్నద్ధమగుట:
మాఘశుద్ద విదియ రోజు బ్రాహ్మీ ముహూర్తమున భాస్కరాచార్య ఆనతి ప్రకారము 102 గోత్రీకులందరూ వారివారి గుండములు వద్దకు వచ్చి చేరిరి. భక్తితో విశ్వబ్రాహ్మణులొసంగిన సువర్ణ మంగళసూత్రములు స్త్రీలు ధరించుకొనిరి. దేవాంగులు, సాలీలు భక్తితో నేసి ఇచ్చిన పట్టు చీరెలు స్త్రీలు, పట్టు పంచెలు పురుషులు ధరించుకొని అగ్నిప్రవేశమునకు సిద్దమయ్యిరి. ప్రతివారున్నూ "జై వాసవీ - జైజై వాసవీ" అను నినాదములు చేయుచుండిరి.
ఆ రోజు మాఘ శుద్ద విదియ 103 గుండములలో అగ్నిజ్వాలలు
జాజ్వల్యమానంగా ఆకాశమునకు జ్వలించుచున్నవి.
మరి కొన్ని నిమిషాలలో...
102 గోత్ర వైశ్యులు అగ్ని ప్రవేశము చేయుటకు సిద్దంగా వున్నారు. ఆ సమయములో
102 గోత్ర ఆర్యవైశ్యులందరూ వాసవితో.. "అమా వాసవి ఇక్కడ అగ్నిగుండ ప్రవేశం
చేసే మేమంతా దంపతీసమేతంగా సిద్దమైనాము, నీవు మాత్రమే
ఒంటరిగా ఎలాదూకుతావు?" అని ప్రశ్నించారు. అప్పుడు వాసవి దేవీ "ఓ బంధులారా! నేను పార్వతీ
స్వరూపిణిని అ అగ్ని ప్రవేశ నిర్ణయము నా నాధుడైన ఈశ్వరుని సంకల్పంతో ఏనాడో
జరిగిపోయింది. వాసవినైన నన్ను ఆ పరమేశ్వరుడే వివాహం చేసుకోగలడు, నేను కూడా మీతో పాటే పతీపత్ని
సమేతముగా అగ్నిప్రవేశం చేయగలము" అన్నది.
అదే సమయంలో భాస్కరాచార్యులవారు అక్కడికి వచ్చి, "అమ్మా వాసవి అగ్నిగుండ ప్రవేశనికి సమయం సిద్దమయింది. రామ్మా వాసవీ!"
అన్నారు, అప్పుడు
వాసవీదేవి "ఓ గురువర్యా! ముందుగా నేను అగ్నిప్రవేశం చేయాలంటే ’కన్య్’ నైన నాఉ
అగ్ని ప్రవేశ అర్హత లేదంటావేమిటి? నీ మనసులోని అంతర్యం వివరించు వాసవి" అన్నారు!.
అప్పుడు వాసవి దేవి "గురువర్య! మన హిందూ ధర్మంప్రకారం వివాహమైన స్త్రీ
మరణిస్తే ఆ కళేబరాన్ని దహనసంస్కారం చేస్తారు.
అదే వివాహం కాని కన్య విధవశాత్తు గా మరణిస్తే .. ఆ కన్య
కళేబరాన్ని ’భూస్థాపన’ చేస్తారు కదా!
’వాసవీ కన్య’ అనబడే నాకు అగ్నిప్రవేశం అర్హత లేదు కదా!
వివాహం కాని అగ్నిలో ఎలా ప్రవేశం అర్హత లేదు కదా! వివాహం కాని నేను అగ్నిలో ఎలా
ప్రవేశించగలను?" అన్నది. అప్పుడు భాస్కరాచార్యులవారు "అలా అయితే వాసవి,
నీవు అగ్నిప్రవేశం
చేయాలంటే.. నీకు వివాహమే కావాలంటే నీ మేనత్త కుమారులైన బావగార్లు అనేక మంది
ఉన్నారుకదా! వారిలో యెగ్యుడైన వారిని నీవు వివాహం చేసుకుంటావా? చెప్పమ్మా వాసవి"
అన్నారు.
అప్పుడు వాసవి దేవి "ఓ గురువర్యా నేను ఆదిశక్తి
స్వరూపంతో పార్వతి అంశతో వాసవి రూపంగా అవతరించాను. నన్ను వివాహమాడే అర్హత ఆ
దేవదేవుడైన ఈశ్వరునికే ఉన్నది" అన్నది. అప్పుడు భాస్కరాచార్యులు వారు "ఓ
వాసవీ ఆ శివుడు లింగరూపంలో ఉన్నాడు కదా! ఆయన రావడం ఎట్లా? నీ మెడలో మాంగల్యధారణ చేయడం ఎట్లా? నీవు అగ్నిప్రవేశం చేయడం ఎట్లా?" అన్నారు.
"ఓ గుర్వర్యా ఈ సుముహూర్తంతో వాసవినైన నేను నా శక్తి
స్వరూపంతో ఈశ్వరుని పిలిచిన వెంటనే స్వామి ప్రత్యక్షమై రాగలడు. నా మెడలో మంగళ
సూత్ర ధారణ చేయగలడు. మీరంతా చూడగలరు, నేను అగ్నిప్రవేశం
చేయగలను." అని వాసవిదేవి ఈశ్వరుని లింగం వద్దకు వెళ్లి గంభీరమైన స్వరంతో
బిగ్గరగా.. ’ఓ పార్వతీ వల్లభ! ’ఓ జగన్నాయకా! ’ఓదీన బంధూ! ’హృదయ నివాసా!" అని
ప్రార్థించగానే "తళుక్.. తళుక్" అనే మెరుపులతో ’త్రినేత్రుడు,
త్రిశూలధారుడు’ అయిన ఆ
పరమేశ్వరుడు ఆ గర్బాలయంలోని లింగం నుండి ప్రత్యక్షమై వాసవి పక్కకు వచ్చి
నిలుచున్నాడు. అప్పుడు భక్తులందరూ జయజయ ధ్వనాలతో శివుని కీర్తించారు.
అప్పుడు కొంతమంది ఆర్యవైశ్య బంధువులు భాస్కరాచార్యు లవారితో
" ఓ గురువర్యా! పెళ్లి అంటేనే బంధువులతో ఆనందగా హడావిడిగా సంతోషంగా
జరుగుతుందికదా!. ఇక్కడ నిలిచి ఉన్న 102 గోత్రాల జంటలుఅందరూ పెళ్లికూతురు తరుపు
వారే ఉన్నారు.
మరి పెళ్లి కొడుకు తరుపు బంధువులు ఎవరు? ఇప్పుడు ఈశ్వరుడు ఒక్కరే ప్రత్యక్షమైనారు కదా!. మనము ఇచ్చె కన్యాదానము
స్వీకరించాలి అంటే? పెళ్ళికొడుకు తరుపువారి బంధువులు కానీ, తల్లీదండ్రుల కానీ, కులము గోత్రము, వివరాలుగాని సంకల్పంలో చెప్పాలికాదా!."
"శ్రీ సీతారాములకళ్యాణంలో కూడా.. వధూవరుల వంశం, సంకల్పం చెప్పి వివాహం జరిపిస్తారు కదా!." అన్నారు.. అప్పుడు
భాస్కరాచార్యుల వారు "ఆది విష్ణువుకూ, ఆది శివునకూ, కులగోత్రాలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఉండరు!" అన్నారు.
అప్పుడు ఈ 102 గోత్ర బంధువులలో చివరి గోత్రం వారైనా
"లాభాల’ గోత్రీకులైన’ ధనలక్ష్మీ ధనగుప్త’ దంపతులు ముందుకు వచ్చి.. "మా
దంపతులకు సంతానం లేదు, మేము ఆ పరమేశ్వరుణ్ణి మా కుమారునిగా ’దత్తు’ తీసుకుంటున్నాము..
మేము వాసవికి మేనత్తగోత్రం వారము కనుక, వాసవి పరమేశ్వరుఇని పెళ్లి చేసుకుంటే మేనరిక వివాహం
చేసుకున్నట్లు అవుతుంది" అని అనగానే అక్కడున్న ఆర్యవైశ్యకుల బంధువులందరూ
సంతోషంతో అంగీకరించారు. అప్పుడు భాస్కరాచార్యులవారు ఆవుపాలతో శివుని చేతులను తడిపి
లాభాలగోత్ర దంపతుల చేతులలో శివుని చేతులు ఉంచి, ’దత్తత స్వీకరణ’ మంత్రాన్ని చదివారు. ఈ క్షణం నుంచి మీకు
శివుడే పుత్రుడు అయినాడు నీ వంశం వారందరూ సద్గతినిపొంది తరించారు" అని
భాస్కరాచార్యులవారన్నారు.
అలా వారికి సాక్షాత్తు పరమేశ్వరుడె కుమారుడుకాగా.. అక్కడ
ఉన్న పెనుగొండ నగర ప్రజలు అందరూ సంతోషించి పరమేశ్వరుని స్తోత్రాలతో స్తుతించారు.
అప్పుడు శివుడు "ఓ మహా భక్తిలారా! ఈ క్షణం నుంచినాకు
’లాభ’ దంపతులు తల్లిదండ్రులు అయినారు కనుక... నేను కూడా మీకు ఒక వరం ఇస్తున్నాను.
"ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్" అన్నట్లుగా ఈరోజు నుంచి ఎవరైతే వ్యాపార
ప్రారంభంలో ప్రప్రథమంగా ఈశ్వరుడినైన నా "లాభాల" గోత్రాన్ని
"లాభం" అని వ్యాపారంలో స్మరిస్తారో వాసికి నేను అనంతానంత ఐశ్వర్యం
అనుగ్రహిస్తాను!" అని వరం ఇచ్చారు.
అప్పుడు నగర ప్రజలందరూ "ఓ పరమేశ్వరా! ఇంతటి మహత్తర
వరమును మాకు అందించి, మా నగరవాసులను అనందింప చేశారు, కనుక ఓ రోజు నుంచి మిమ్మల్ని
మా నగర-ఈశ్వరుడి’ గా శ్రీ నగరేశ్వర స్వామి అనే పేరుతో పూజలు అందుకుంటారు" అని
నమస్కరించారు.
ఆ విధంగా ఈ ధనలక్ష్మీ, దనదగుప్తా దంపతుల
వివాహసమయంలో ’కన్య’ ను కోడలిగా.. స్వీకరణను చేసుకున్నారు.
అలా వాసవి కూడా తన అగ్నిగుండ ప్రవేశం సమయంలో తన నాధుడైన
నగరేశ్వర చిహ్నంగా లింగమును చేతధరించి అగ్నిప్రవేశం చేయడానికి కారణమైనది...
అప్పుడు కుసుమశ్రేష్టి కుసుమాంబ దంపతులూ.. విరూపాక్షుడూ..
శివునకు అనేక నమస్కారాలు ఆచరించి, గంగాజలకలశం తెచ్చి
పరమేశ్వరుని పాదాలు కడిగి అ జలాన్ని వారి శిరస్సులపై చల్లుకొని పునీతులయ్యారు
అప్పుడు భాస్కరాచార్యులవారు మంగళసూత్రం సిద్దం చేసి
పరమేశ్వరుని చేతికి అందించారు.. ఈశ్వరుడు మంగళసూత్రాన్ని వాసవి మెడలో ధారణ చేస్తూ
ఉండగా.. అప్పుడూ భాస్కరాచార్యులవారు "ఓం మాంగల్యం తంతునానేనా లోక రక్షణ్
హేతునా కంఠే భధ్నామి సుభగే సంజీవ శరణాంశతం"
అనే పెళ్లి మంత్రం చదువుతుండగా.. ఆ సమయంలో భజంత్రీలు, మంగళవయిద్యాలు మారుమ్రెగుతుండగా ఆకాశం నుంచి దేవతలు దేవదుందుభులు
మెగిస్తుండగా, కిన్నర
కింపురుషులు ఆనందభైరవి ఆలపిస్తుండగా... నారదాది మహామునులు దివ్య మంత్రాలతో
ఆశీర్వదిస్తూ ఉండగా.. ముప్పది మూడు కోట్ల దేవతలు ఆకాశం నుంచి పుష్పవర్షం
కురిపిస్తుండగా.. 102 గోత్రాలవైశ్యులు నూతన దంపతులపై ఆశీర్వాదాక్షతలు
సమర్పిస్తుండగా... వాసవి మెడలో మంగళసూత్ర ధారణ గావించాడు పరమేశ్వరుడు..
తదుపరి వాసవీ ఈశ్వరులు ఆ అగ్నిగుండానికి మూడుసార్లు
ప్రదక్షణ చేసి ఏడడుగులు నడిచారు.
అలా వాసవి వివాహానంతరం ఆర్యవైశ్య బంధులందరూ వచ్చి
"అమ్మ వాసవి ఇప్పుడు మీకు వివాహం అయ్యింది కదా! మరి నిన్ను వాసవి ’కన్యక’ అని
పిలవాలా! ఎలా పిలవాలి?" అని ప్రశ్నించారు. అప్పుడు వాసవి దేవి "ఓ బంధువులారా!
నేను అగ్ని ప్రవేశర్హత కోసం నా నాధుడైన నగరేశ్వరునితో నేను మంగళసూత్రధారణ జరిపించుకున్నానేగానీ,
నాకు భర్తతో సంగమం జరగలేదు.
నేను ఆజన్మ బ్రహ్మచారిని, కనుక నేను ’కన్య’ ను కాను ’కన్యక; ను అన్నది వాసవి దేవి.
అనగా ఏ స్త్రీ అయిన పుష్పవతి అయి వివాహం కాక
పూర్వము ’కన్య’ అనీ.. మంగళ సూత్రధారణ క్జరిగినా.. భర్తతో సంగమం జరగని మధ్య కాలంలో ’కన్యక’
అనీ తదుపరి భర్తతో కాపురానికి వెళ్లిన తరువాత ’శ్రీమతి’ అనీ అంటారు.
కనుక నేను అగ్ని ప్రవేస అర్హత కోసం, నేను నా నాధుడైన నగరేశ్వరనితో మంగళసూత్రధారణ
జరిపించుకున్ననే కానీ, నాకు భర్తతో సంగమం జరగలేదు, నేను ’ఆజన్మ బ్రహ్మచారిణి’ నేను ’కన్య’ ను కాదు ’కన్యక’ ను,
అని అన్నది వాసవిదేవి
ఈ రోజు నుంచి మీరు నన్ను
’కన్యకా పరమేశ్వరి’ అని పిలవాలి అన్నది. అందుకే ఈ క్షణం నుంచే ఈమెకు కన్యకా పరమేశ్వరి
అనే పేరు వచ్చింది.
’పరమేశ్వరుడు’ అనగ శివుడు...!
’పరమేశ్వరి’ అనదా పార్వతి
అని అర్థం!
ఇంతకు ముందు వరకు అమ్మవారికి,
వాసవీ, వాసవికన్య, వాసవాంబ, వాసవిబాల, కన్యకాంబ అనే పేర్లు మాత్రమే ఉండేవి.
అందుకే వాసవికి
వివాహం అయినది కనుక ఈనాటికీ ప్రపంచంలోని అనేక వాసవి దేవాలయాలలో ఆమెకు మెడలో మంగళ సూత్రాలు
కనిపించడానికి కారణం
వాసవిదేవికి
మనం ’బడిబాలు’ పోయడానికి కారణం
వాసవిదేవికి
మెడలో నల్లపూసలు కనిపించడానికి కారణం
దంపతులకు
మాత్రమే చేసే ’వసంతోత్సవం’ సేవలు శ్రీవాసవినగరేశ్వరలకు చేయటానికి కారణం.
వాసవి ప్రక్కనే
నగరేశ్వర స్వామి ఉండడానికి కారణం
మనం ’వాసవి’
ని ’కన్యకాపరమేశ్వరి’ అని పిలవడానికి గల కారణం
వాసవిని
నగరేశ్వరుడు వివాహం చేసుకున్నాడు కనుకనే, పెనుగొండలోని నగరేశ్వర ఆలయంలో నగరేశ్వర స్వామికి
ఎదురుగా రెండు పెద్ద నందులు ఉంటాయి.
అందులో ఒకటి ద్వాపరయుగం పురాతన నంది రెండవది కలుయుగ నూతన నంది. ఈశ్వరుడూ, నగరేశ్వరుడు, అనే రెండు పేర్లతో ఒకే లింగం లో శివుడు ఉన్నాడు. కనుకనే పెనుగొండ లోని నగరేశ్వర ఆలయంలో ఓ రోజు కి మనం దర్శించవచ్చు.
వాసవికి
వివాహమైన ఈ సన్నివేశం ఇదే దేవాలయంలోని ఏడంతస్తుల గాలిగోపురం పైకి మనం మెట్లు ఎక్కుతూ
ఉండగా.. కొంత భాగం పైకి వెళ్ళగానే వాసవిని నగరేశ్వరుడు వివాహం చేసుకున్న చిత్రాలనూ..
శివుడు వాసవి ని తన తొడపైన కూర్చుండ వెట్టుకుని కైలాసం తీసుకువెళ్లిన విశేషాలనూ
మనం దర్శించవచ్చును.
పెనుగొండ క్షేత్రం వారు 1958 లో రచించిన వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర
పురాతన ఆది గ్రంథంలో కూడా, వాసవికి వివహమైన చరిత్ర శ్లోకాలు తో సహ ఉండటాని మనం చదవచ్చు.
వాసవీ తృతీయ విశ్వరూప ప్రదర్శన:-
బంగారు ఛాయతో వెలుగుచున్న వాసవి కొంగు నడుమునకు బిగగట్టి
గుండమునకు మూడుసార్లు ప్రదక్షిణమెనరించి ముందుగా అగ్నిదేవునకు నమస్కరించి, నిలచి ఉగ్రముతో "ఓరీ! విష్ణువర్ధనా! ’వాసవికన్యతో
ఆర్యవైశ్యులు అగ్నిప్రవేశమయ్యిరి’ అనే వార్త ఎప్పుడు వినెదవో అప్పుడే నీ శిరస్సు
సహస్ర వ్రయ్యలవుగాక!" అని శాపమిచ్చెను. దంపతులందరూ స్తోత్రములు చేయుచుండగా
సమస్త మానవులకు శ్రీవాసవీమాత భానుకోటి ప్రభాభాసమానముగా తృతయ విశ్వరూపము
ప్రదర్శించెను. ఆమె భూమి ఆకాశములకు ఒక్కసారిగా తన శరీరమును పెంచెను. ఆమె
బ్రహ్మాండమంతయూ నిండెను. కోటిసూర్యుల కాంతితో హరిహరాదులకైనా అందని దూరమున తన
ఆకృతిని నింపెను. వాసవి వెలుగుతో సర్వజీవులకు ఆ క్షణమున జ్ఞానము పెరిగెను.
రెండువేల కరములు, వెయ్యి శిరములతో, దేవి
1000 ముఖములు, రెండువేల నేత్రములు, రెండువేల
కరములు, వెయ్యి శిరములతో, దేవి
1000 ముఖములు, రెండువేల
నేత్రములు, రెండువేల పాదములు, కోటానుకోట్ల
ఆయుధాలతో విశ్వరూపము ప్రదర్శించెను. ఆకాశం - శిరస్సుగా మారిపోయెను. సూర్యచంద్రులు
ఆమెకు నేత్రాలు, దిక్కులే చెవులు, చతుర్వేదాలు
ఆమెకు వాక్యాలు, ఉపనిషత్ లు ఆమె అడుగులు, వాయువే ప్రాణం, ప్రపంచము మెత్తం ఆమె హృదయం, భూమి ఆ శక్తికి నడుము, కోటానుకోట్ల నక్షత్రాలన్నీ ఆమె వక్షస్థలం, మహర్లోక జనోలోక తపోలోకలు దేవికి కంఠము, ఇంద్రాది దేవతలు - బాహువులు, రాత్రి, పగలు ఆమె కనురెప్పలు, బ్రహ్మలోకం - కనుబొమ్మలు, శబ్దం - స్తోత్రాలు, మాయ్- నవ్వు, స్నేహం-దంతాలు, స్వర్గం-చూపులు, సముద్రాలు- గర్భం, పర్వతాలు- అస్థికలు, నదులు-నాడులు, వృక్షాలు - కేశములు, బాల్య, యౌవన, కౌమార, వార్థక్యాలు-గతులు, మేఘాలు - అలికిడి, సంధ్యలు - వస్త్రాలు, చంద్రుడు - మనస్సు, దివ్యమైన ఆభరణములతో, గంధర్వ, ఉఅక్ష, గరుడ, కింపురుష, రాక్షస, దేవగణములన్నియూ "జైవాసవీ" "జైజై ఆదిశక్తీ" అనుచుండిరి.
వాసవీ మాత, కొందరు భక్తులకు రాక్షసులను నాశనమెనరించిన భద్రకాళిగా, కొందరికి నరపాలకులనంతమెందించిన రేణుకాదేవిగా, వేర్కొందరికి శతకంఠ నిర్మూలన చేసిన సీతామాయిగా, ఇంకొందరికి నరకాసురుని సంహారము చేసిన సత్యభామగా కనిపించెను. అందరూ సాష్టాంగ నమస్కారము చేసి దండకములు, స్తోత్రములు పఠించిరి. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకికి నారికేళ, ఫల, పుష్ప, కర్పూర నీరాంజనములు అర్పించినంతనే మాత శాంతించి వాసవికన్యలా కనపడెను. సమస్త భక్తాదులు నమస్కారములు చేసి ధన్యులైరి.
అగ్ని గుండములు చల్లారుట:
అగ్ని ప్రవేశమునకు ముందు భాస్కరాచార్యులవారు శుద్ద విదియ పవిత్ర ఘడియలు ప్రారంభమైనవని తెలుపగనే ఆ గుండములలోని ఆకాశమున కంటుచున్న అగ్ని అంతయూ చల్లగా చల్లారిపోయెను. అందరు భక్తాదులున్నూ ఆశ్చర్యము చెందిరి.
వాసవీశక్తి "ఓ అగ్నిదేవా!" అని పిలిచెను. వాయువేగమున అగ్నిదేవుడు వాసవి యెదుట ప్రత్యక్షమై "నమస్కారము తల్లీ!" అనెను. కన్యకాంబ "స్వాహానాథా! ఓ పరమపావనా! పవిత్రస్వరూపా! భక్తిభావములు నిండిన మేము అగ్ని ప్రవేశరూపేణా కైలాసమునకు వెళ్ళుచుంటిమి! నీవు ప్రజ్వరిల్లలేదెందులకు? కారణమేమిటి?" అని అడిగెను. అప్పుడు అగ్నిదేవుడు "అమ్మా! ఆదిశక్తీ! పవిత్రులను, భక్తులను, కల్మషరహితులను, పతివ్రతలను దహించుటకు నాకు శక్తిలేదు. నేను పుణ్య మూర్తులను స్వీకరించలేను. పూర్వం దక్షయజ్ఞమున దాక్షాయణీదేవిని దగ్ధము చేయలేక ఆమె శరీరమును పరమశివునకు ఒప్పజెప్పితిని. అదేవిధముగా జానకీ మాతను అగ్నిప్రవేశం చేయించి శ్రీరామచంద్రునకు ఒప్పజెప్పితిని! ఇప్పుడు కారణము లేకుండా ఇన్ని వందలమందిని దహించలేను. పైగా నూటరెండు గోత్ర దంపతులు నుదిటిపై ఆ విధాత ఏవిధముగా మరణము సంభవించునని వ్రాసెనో? నన్ను మన్నించు తల్లీ!" అని చెప్పెను. వెంటనే వాసవీశక్తి బ్రహ్మదేవుని భక్తితో పిలచెను. హంసవాహనుడక్కడ కొన్ని ఘడియలలో ప్రత్యక్షమాయెను. బ్రహ్మ వాసవిని చూసి "అమ్మా! నమస్కారము! నన్ను పిలిచిన కారణమేమిటి!" అని అడుగగా, వాసవిని చూసి "అమ్మా!నమస్కారము! నన్ను పిలిచిన కారణమేమిటి!" అని అడుగగా, వాసవి"ఓ వాణీనాథా! నూటరెండు గోత్రదంపతులకు వారి నుదిటిపైన మరణము ఏవిధముగా ప్రాప్తించునని తలరాత లిఖించితివి? త్వరితముగా తెల్పుము" అని ప్రశ్నించెను. అప్పుడు పరబ్రహ్మ శీఘ్రముగా తలరాతలు చదువుటలో నేర్పరి. శుక్లస గోత్రీకుడగు ’చిత్రగుప్త’ ను శీఘ్రముగా పిలచెను. చిత్రగుప్త ప్రత్యక్షమై ఒక్క క్షణములో అక్కడున్న అందరి నిదిటి రాతలు చదివి వాసవాంబతో "లోకమాతా వాసవీ! నీతో సహా ఈ నూటరెండు గోత్రమాన్యులందరకూ ’అగ్ని ద్వారా మరణము సంభవించును గాక!" యని కనుగొంటిని తల్లీ! బ్రహ్మరాత సత్యము!" అని నుడివెను.
ఆప్పుడావాసవి అగ్నిదేవుడితో "ఓ అగ్నిదేవా! నూటరెండు గోత్రమాన్యులందరకూ అగ్ని ద్వారా మరణము సంభవించునని చిత్రగుప్త, బ్రహ్మదేవులు నుడివిరి. ఆలకించితివి గదా! ప్రచండభాసమానముగా గుండములు యందు ప్రజ్వరిల్లుము! అగ్నిప్రవేశ పవిత్ర సుముహూర్తమైన విదియా ఘడియ ఇంకనూ పద్దెనిమిది నిమిషములున్నది" అని చెప్పెను. శ్రీ వాసవీశక్తికి సాష్టాంగ నమస్కారము చేసిన అగ్ని, వాసవి దీవెనలందుకొని అన్ని అగ్నిగుండములయందు మహా ప్రచండముతో తన ప్రతాపము చూపి ఆకాశము వరకు వ్యాపించి యుండెను.
102 గోత్ర
దంపతులతో వాసవీశక్తి అగ్నిప్రవేశము:-
భాస్కరగురువు మంత్రోచ్చరణ చేయుచుండగా వాసవీమాత తన గుండము
వద్దకు వచ్చి చేరెను. నూటరెండు గోత్ర దంపతులు వారివారి గుండముల వద్దకు వచ్చిరి.
భాస్కరుని ఆనతితో అగ్నిప్రవేశము కాగలందులకందరూ ఎదురుచూచుచుండిరి. పవిత్ర ముహూర్తము
నందు "అమ్మా!వాసవీ! నీవగ్నియందు ప్రవేశించు తల్లీ!" అని భాస్కరాచార్యుడు
పల్కెను. మహా ఉగ్రముతో నున్న వాసవి " అల్లల్లవీరవీరా! అల్లల్ల
శరభశ్శరభా!" అనెను. భేరీమృదంగాది వాద్యరావాలు దిక్కులు పిక్కటిల్లేలా
మిన్నుమిట్టగా బాకాలు వీరంగముల వారు మ్రెగించుచుండెను. భక్తాదులు "వాసవాంబకు
జై! ఆదిశక్తికి జై! వాసవి కన్యకాంబకు జైజై!" అని అనుచుండిరి. మరికొందరు
భక్తులు "ఓం నమెనారాయణాయ" "ఓం నమశ్శివాయ" అష్టాక్షరీ
మంత్రములను బిగ్గరగా పఠించుచుండిరి. ఆకాశమునుండి దేవతలు పెనుగొండ క్షేత్రము పైకి
పుశ్ఃపములు చల్లుచుండిరి. ఆకాశమునుండి దేవతలు పెనుగొండ క్షేత్రముపైకి పుశ్ఃపములు
చల్లుచుండిరి. ఆకాశము నుండి దేవతలు పెనుగొండ క్షేత్రముపైకి పుష్పములు
చల్లుచుండిరి. ఆకాశమంతయూ నిర్మలంగా ఉండి అక్కడక్కడా తళుక్కున మెరుపులు
మెరయుచుందెను. ప్రకృతి అంతయూ పరవశించి పులకించుచున్నది. చల్లని చిరుగాలులు
మందహాసమున బయలుదేరినవి. దేశమంతయూ అనేకానేకములైన శుభశకునములు గోచరించుచున్నవి.
మహాఋషీశ్వరులు వారి దివ్యదృష్టితో అగ్ని గుండములను పరికించి ప్రణవమగు ’ఓం’ కార
నాదమును చేయుచుండిరి. కొందరు భక్తులు వాసవాంబను స్తోత్రములతోను, మరికొందరు దండకములతోనూ అమ్మను
పొగడుచుండిరి. ఆ విధమున "ఓం ఆదిమధ్యాంతరహితాయై నమః" "ఓం త్రిమూర్తి
మాతృకాదేవ్యైనమః" అంటూ భక్తాదులు ఉచ్చరించుచుండగా వాసవీ శక్తి
అగ్నిప్రవేశమైనది. శ్రీ వాసవీకన్యక బంధువులను చూసి నేను నా భర్తకడకేగుచున్నానని
చెప్పి, ప్రవేశించె. ఈశ్వరుడు అగ్నియందు నుండి యామెను తనచేత
లేవనెత్తి తన అంక పీఠముయందు జేర్చుకొనెను. అప్పుడు దేవి శంకరుని యెక్క అర్థ శరీర
మందు ప్రవేశించెను. నూటరెండు దంపతులు వెనువెంటనే వారివారి గుండముల యందగ్ని
ప్రవేశము గావించిరి. భక్తిభావముతో ఉన్న ఈ నూటరెండు దంపతులెవరికీ శరీరము కాలుటగాని,
గాయములై హాహాకారములు చేయుటగాని జరగలేదు. గుండమున దూకినంతనే అతి
శీతోష్ణమైన శివవిమానములు యందు బయలుదేరి కైలాస పర్వతములపైనా నిలచిరి. మరికొందరు
భక్తులు వైకుంఠము నందు పుష్పములపై నిలచిరి. ఇలా వాసవి లీలలి అనుభవించిన నూటరెండు
దంపతులందరూ ఆశ్వర్యచకితులై అమ్మకు నమస్కరించిరి.
ఇదే సమయమున భాస్కరాచార్యుల ఆనతి ప్రకారం పెనుగొండలో
మరికొన్ని ఉపగుండములు సిద్దము చేయబడినవి. ఆ గుండములయందు వాసవీదేవి భక్తులైన
బ్రహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, దేవాంగులు, శ్రీవైష్ణవులు, ఆచార్యులు,
పద్మ శాలీలు, పురోహితులు మెదలైన పరిశుద్దులు
అగ్నిప్రవేశమై ఆత్మ స్వరూపముతో మెక్షమునకు చేరిరి.
విష్ణువర్ధనుని
శిరస్సు విచ్చిన్నము:
వాసవీదేవి నూటరెండు గోత్రికులతో
అగ్ని ప్రవేశమైనదను వార్త మరికొంట సేపటికి రాజభటులు వెళ్ళి మహారాజుకు తెలిపిరి. పిడుగుతో
సమానమగు అగ్ని ప్రవేశ విషయమును వినినంతనే రారాజుకు నేత్రములు తిరిగినవి. అతను కొంత
సేపు వణకెను, దుఃఖించెను. సింహాసమునము పై నుండి క్రిందకు పడెను. వాసవీ శాపముతో రాజు
శిరస్సు భారమై వెయ్యి వ్రక్కలుగా విచ్చిన్నమయ్యెను. అతని పవిత్రమైన ఆత్మ గంధర్వ లోకమునకు
వెళ్ళెను. మంత్రులైదుగురు, ప్రివారము ఒక్క నిముషము సంతాపము ప్రకటించిరి. భటవర్గమంతయూ
’మేనా’ తెప్పించి శిరస్సులేని రాజ శరీరమును అందులో పరుండబెట్టి మేనా కవాటములు బిగించిరి.
వాసవి లీలలు గాంచిన రాజు సైన్యములోని కొందరు భటులు భక్తితో పెనుగొండకు వచ్చి ఆర్యవైశ్య
సైన్యములో కలసిపోయిరి. మిగిలిన సైన్యము వారి సామాగ్రి అంతయూ సర్దుకొని విష్ణువర్ధన
రాజ కళేబరము కలిగిన మేనాతో రాజమహేంద్రికి బయలుదేరి కొంతసేపు ప్రయాణించిన వారికి రాజు
భార్యలు పెనుగొండకు కాలినడకన వచ్చు దృశ్యము కనపడెను. మహామంత్రులు, సైన్యము అందరూ ఆగిపోయిరి.
మహారాణులందరూ తమ భర్త పెళ్ళికి నిరాకరించి వెనుకకు వచ్చు చున్నాడనే ఆనందమున వెళ్ళి
"నాథా! రాజమహేంద్రికి వచ్చుచున్నారా?" అనుచూ మేనా కవాటములు తెరచిరి. శిరస్సులేని
భర్త మెండెమును చూసి హాహాకారములతో దుఃఖముతో మహారాజు కళేబరమును మంత్రులు, సైన్యము రాజమహేంద్రికి
చేర్చిరి. విష్ణువర్దనుని గురువుగారైన ధౌమ్యముని శాస్త్రోక్త విధానముగా రాజరాజనరేంద్రనితో
రాజ కళేబరమునకు అంత్యక్రియలు గావించెను. రాజమహేంద్రి అంతయూ దుఃఖముతో నిండియున్నది.
పెద్దలు రాణులను రాజపుత్రులనూ, రాజపౌత్రులనూ ఓదార్చిరి. ఆలోచించిన రాజరాజనరేంద్రునకు
ఆర్యవైశ్యులపై అమితకోపావేశములు ప్రారంభమైనవి. తండ్రిగారితో పెళ్ళిచేస్తామనే ఆశచూపి
అంతము చేశారని తన గురువుతో చెప్పెను. గురువు మహారాజు కామాంధుడని ఆర్యవైశ్యుల మెసం ఏమియూ
లేదని తన కామమే తన ప్రాణాంతకమైనదని చెప్పెను. కానీ రాజరాజనరేంద్రుడు సైన్యాధ్యక్షుడిని
రప్పించి అతనితో "మనం త్వరగా పెనుగొండకు వెళ్ళి ఆర్యవైశ్యులను యుద్దము చేసి చంపవలెను.
మా నాన్నను చంపిన ఆర్యవైశ్యులైన వారెవరూ బ్రతికి యుండరాదు. సర్వ ఆయుధములను, సర్వ సైన్యమును
పెనుగొండకు సిద్దము చేయుడు" అని చెప్పెను. సైన్యాధ్యక్షుడు సేనామంత్రియగు రత్ననాధునితో
చెప్పి సైన్యమును సిద్దము చేసెను. ఈ సంగతి విన్న రాజపురోహితుడగు ధౌమ్య మహర్షి రాజరాజనరేందుని
సమీపించి "నాయనా! విషయమంతయు వింటిని. ’జాతస్య మరణం ధృవం’ అని మనకందరకూ తెలిసినదే
కదా! అందునా మీ తండ్రిగారు ఆదిశక్తి పాదములయందు లీనమై మెక్షము నొందెను. చింతింపవలదు,
తదుపరి కార్యక్రమమునకు సిద్దమగుము" అని చెప్పెను. యువరాజు తన తండ్రికి అంత్యక్రియలు
గావించెను. వెంటనే గురువు గారు రాజరాజనరేంద్రునితో "నీవు నీ మంత్రి సమేతముగా బయలుదేరి
పెనుగొండకు చేరి అచ్చటగల బాలనగరులతోను, ఆర్యవైశ్య సంఘముతోను నీ తండ్రి ఒనర్చిన అపరాధమును
మన్నింపుమని వేడుకొనుము. వెంటనే వారి ఆశీర్వచనములు పొంది వారితో సఖ్యత కాంక్షింపుము"
అని చెప్పగా సర్వ సైన్యముతో పెనుగొండకు బయలుదేరెను.
నూటరెండు ఆర్యవైశ్య దంపతులు
అగ్నిప్రవేశమైన తదుపరి వారి సంతానమును (బాలబాలికలను) భాస్కరాచార్యుడు వాసవీమాత ఆనతి
ప్రకారం గురుకులమునకు తీసుకెళ్ళి పెంచుతుండెను. అగ్నిప్రవేశమైన స్థలమున వాసవీదేవి శిలారూపముగా
వెలసెను. ఆ వెలసిన తల్లికి దేవాలయము కట్టించి ప్రతి నిత్యము ధూపదీప నైవేద్యాదులు సమర్పించుచుండిరి.
అన్ని రాష్ట్రములలోని, దేశములలోని హిందువులు వాసవి గాధ తెలుసుకొని పెనుగొండ క్షేత్రమునకు
వచ్చి అమ్మను దర్శించి దీవెనలందుకొనుచుండిరి. ఆ విధముగా ఆ క్షేత్రము ప్రసిద్దమైనది.
ఉగ్రావేశముతో సైన్యసమేతుడై వచ్చిన రాజరాజనరేంద్రునితో శ్రీవాసవీదేవి వెలసిన విషయాన్ని
భాస్కర గురువు చెప్పెను. దేవాలయ పరిసరములకు వచ్చు సరికి రాజరాజనరేంద్రుని క్రోధము తగ్గి
శాంతముగా మారిపోయెను. అంతియేకాక మహామంత్రులు సమస్తసైన్యమంతయూ శాంతము చెందిరి. ఇంకనూ
దేవాలయలయమునకు మూడుసార్లు ప్రదక్షిణము చేసిన రాజరాజనరేంద్రుడు అమ్మచారికి సాష్టాంగ
నమస్కారము చేసి, విరూపాక్షుని కుశల ప్రశ్నలు వేసెను. ఆ క్షణమున దేవి మహావెలుగులు విరజిమ్ముచూ
అగ్ని గుండమునుండి వెలుపలకు వచ్చెను. భాస్కరాచార్యుడు, గురుపత్ని, విరూపాక్షుడు, రత్నవతీ,
మణిగుప్త, రాజరాజ నరేంద్రుడు అతని సైన్యము మెదలైన భక్తాదులందరికీ వాసవీదేవి జ్ఞానోపదేశము
చేసినది. వారివారి కోరికలన్నియూ తీర్చెదనని వరములిచ్చినది.
ప్రప్రధమ ’వాసవీదీక్షా ధారణ’ గావించిన రాజరాజ నరేంద్రుడు:
’వాసవీదీక్ష’ తో తనను పూజించిన మహా ఆనందమని, దీక్ష స్వీకరించిన వారికెవరికీ ఎటువంటి బాధలు
ఉండవని, కోరికలు తీర్చెదనని వాసవీమాత బోధించినది. ఆవిధముగా
రాజరాజనరేంద్రుడు వాసవీదీక్షా విధానము
గురించి భాస్కరాచార్యుని సంప్రదించగా భాస్కరాచార్యుడు ’శ్రీ వాసవీ పూజావిధానము’,
’వాసవీ అష్టోత్తరము’ అను ఛందోబద్దముగా శాస్త్రప్రకారముగా రచించెను.
వాసవీదేవి లీలతో భాస్కరాచార్యునిద్వారా రాజరాజనరేంద్రుడు
ప్రప్రధముగా ’శ్రీవాసవీదీక్ష’ శ్రద్దాభక్తులతో మాల ధరించి, మండలము(44 రోజులు) దీక్ష చెపట్టెను.
అమ్మకృపకు పాత్రుడయ్యెను. తదుపరి తన సైన్యముతో రాజ మహేంద్రవరము చేరెను.
పట్టాభిషేకములు:-
కొలది రోజులకు విరూపాక్షుడు సైన్యసమేతుడై భాస్కరాచార్యుని
అనుమతితో రాజమహేంద్రవరమునకు చేరి రాజరాజనరేంద్రుని ’రాజ మహేంద్రవర మహారాజు’ గను, సారంగధరుని ’రాజమహేంద్రవర యువరాజు’ గా
పట్టాభిషేకము చేసెను. నగర పురోహితులు, పెద్దలు, పట్టణవాసులు అందరూ మహరాజైన రాజరాజనరేంద్రుని దీవించిరి. బద్దశత్రువైన
విరూపాక్షుడు ఈ విధంగా శత్రుత్వాన్ని మరచి తనను మహారాజుగా చేసి గౌరవించాడని
పశ్చాత్తాపం పొందిన రాజరాజ నరేంద్రుడు మైత్రిభావముతో వెలిమి ప్రకటించి, పెనుగొండ క్షేత్రమునకు మరల తన సైన్యసమేతముగా వచ్చి, ఆర్యవైశ్య
శ్రేష్ఠులు, భాస్కర గురువు నగరవాసుల సమక్షమున అష్టాదశ(18)
నగరములకు శ్రీ విరూపాక్షుని మహా రాజుగా, రత్నవతీ దేవిని
మహారాణిగా, మణిగుప్తుని యువరాజుగా చేసి తన రాజమండ్రి
రాజ్యములో అర్దరాజ్యము విరూపాక్షునికి ఇచ్చుచున్నానని ప్రకటించెను. అప్పటినుండి
పెనుగొండ రాజమహేంద్రి రాజ్యములు మిత్ర రాజ్యములుగా ఉండెను. ఈ "శ్రీ వాసవీ
కన్యకాపరమేశ్వరీ దేవి జీవితచరిత్రము" ను చదివినవారికి, చెప్పినవారికి,
విన్నవారికి, వ్రాసిన వారికి మాతృశ్రీ వాసవాంబ
ఆయురారోగ్యములు భోగభాగ్యములిచ్చి కాపాడుగాకా! తధ్యము.
0 Comments