Phalguna Masa sankashtahara Chaturthi Vrata Katha - ఫాల్గుణ మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ

Phalguna Masa sankashtahara Chaturthi Vrata Katha - ఫాల్గుణ మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ
Phalguna Masa sankashtahara Chaturthi Vrata Katha - ఫాల్గుణ మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ

        పార్వతీదేవి గణపతితో "గణపతీ! ఫాల్గునమాసమున సంకష్టహర చతుర్థీ వ్రతమును ఆచరించు విధానమును, విశేషములను వివరింపుము" అని అడుగగా గణపతి ఇట్లు వివరించను.

            "అమ్మా! కాత్యాయనీ! ఫాల్గున మాసమున నన్ను "హేరంబుడు" అను పేరున పూజించవలెను. ఈ మాసమున నన్ను బిల్వపత్రములతో పూజించి, నాకు మిక్కిలి ప్రియమైన ఫలములను, లడ్డులను, కుడుములను నివేదించవలెను. కరవీర పుష్పములతో (ఎర్రగన్నేరు), దూర్వయుగ్మములతో (రెండేసి గరికలతో) హోమము గావించవలెను. ఇందులకు పూర్వము జరిగిన వృత్తాంతమును దెల్పెదను వినుము.

            కృతయుగమున యువనాశ్వు డను రాజు గలదు. అతడు ధర్మశీలుడు. సత్యవచనుడు. అతని రాజ్యమున ’విష్ణుశర్మ’ అను బ్రాహ్మణుడొకడు కలడు. ఆ బ్రహ్మాణుమికి ఏడుమంది కుమారులు గలరు. అతడు వార్థక్యకారణముగ దుర్భలు డయ్యెను. అతడు సంకష్టహర గణపతి వ్రతము చేయదలచి, పెద్దకోడలితో ఈ సంగతి చెప్పి ఇందులకు కావలసిన పూజాద్రవ్యములను ఏర్పటు చేయు మనెను. ఆ కోడలు గర్వించనదై "అయ్యా! వ్రతము ఏమిటో, ఆ గణపతి ఎవ్వరో నా కేమియు తెలియదు. అంతయు నాటక మాడుచున్నావు. ఇటనుండి వెళ్ళుము "అని మామను కసురుకొనెను. అతడు గత్యంతరము లేక, అరుమందికోడండ్రను ఈ వ్రతసాహాయ్యమునకై అరిథించెను. అందరును తిరస్కరించిరి. ఇట్లే ఏడవ కోడలిని అర్థింపగా ఆమె చాలా సంతోషించినదై, సంకష్ట హర చతుర్థీ వ్రతమునకై కావలసిన పూజాద్రవ్యములను చేకూర్చి, మామతోబాటు, భక్తి శ్రద్దలతో వ్రతము ఆచరించెను. ఆ వ్రతప్రభావమున, గణపతి అనుగ్రహమున చిన్నకోడలి యింట ’సిరి సంపదలు’ నాట్యమాడినవి, వారికష్టములన్నియు తీరినవి. వారి జీవనము సుఖశాంతులతో హాయిగా నుండెను. ఇది చూచి, మిగిలిన ఆరుమంది ఈమెపై అసూయ జెంది, తామును ఈ వ్రతమును ఆచరిమ్చిరి. కాని భక్తిలేని కారణమున వారి ఆశ తీర దయ్యెను.

            అమ్మా! గౌరీదేవి! భక్తిశ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించిన వారికే సత్సలముల చేకూరునుగాని ఈర్ష్యద్వేషాసూయలతో, దుష్టచిత్తముతో ఆచరించువారికి ఎట్టి ప్రయెజనమును చేకూరదు. నా పూజలో అన్నిటికంటే భక్తి చాలా ముఖ్యము.

            ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించి, దమయంతి నలుని, శ్రీరాముడు సీతను పొందెను. బ్రాహ్మదేవుడును సృష్టిప్రారంభమున ఈ వ్రతమును చేయుటవలననే అతని సృష్టికార్యము నేటికిని నిర్వఘ్నముగా కొనసాగుచున్నది. కనుకనే శ్రీకృష్ణుడు ఈ వ్రతమును చేయుమని ధర్మరాజుకు ఉపదేశించెను."

ఇట్లు శ్రీ కృష్ణయుధిష్టిర సంవాదమందలి, శ్రీ సంకష్టహర చతుర్థీ వ్రతమున పాల్గున మాస కథ సమాప్తము.

శ్రీమహాగణపతి ప్రసాదసిద్ధి రస్తు

"భక్తలొక పరిత్రాణ దీక్షా ముదితచేతసే

హేరంబాయ గణేశాయ నమె జ్ఞానైక మూర్తయే

ఓం శాంతి శాంతి శాంతిః

మాఘమాస మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ