Vasavi Kanyaka Parameswari Devi Charitra

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము

Vasavi Kanyaka Parameswari Devi Charitra
Vasavi Kanyaka Parameswari Devi Charitra
శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము

పరమ పవిత్రమైన గోదావరీ నదీ తీరమున సాలంకాయన మహర్షి యను ఋషిపుంగవుడు నివసించుచుండెను. ఒకనాడు మణిగుప్తడను వైశ్యోత్తముడు తన బంధు మిత్రులతో జ్యేష్టశైలము నుండి బయలు దేరి హిమాలయాది పర్వతములను, గంగానది మెదలు పినాకిని వరకు గల పుణ్యతీర్థములను, మరియు పవిత్ర క్షేత్రములను సేవించి వచ్చి గోదావరీ నది స్నానమాచరించి, సమీపమునందు గల సాలంకాయన మహర్షిని దర్శించెను. సాలంకాయనుడు వారిని సగౌరవముగా ఆహ్వానించెను.

అపుడు మణిగుప్తాదులు సాలంకాయనునితో "ఓ ఋషిసత్తమామా వైశ్యుల పూర్వచరిత్రను గూర్చియు, మా వంశమున ఆదిపరాశక్తి ఆవతారిణిగా వెలసిన వాసవీ కన్యకాదేవీ చరిత్రను గూర్చి చెప్పమని ప్రార్థించిరి. మహర్షి మణిగుప్తాది వైశ్య ఋషులకు ఈ విధాముగా చెప్పనారంభించెను.

కృత యుగంలో ప్రజాకంటకులైన శుంభ, నిశుంభులు అనే ఇద్దరు రాక్షుసులని చంపిన మహిషాసుర మర్థిని, త్రేతా యుగంలో అహంకారంతో విర్రవీగే క్షత్రుయులని చంపిన పరశురాముని కన్న రేణుకాదేవి, ద్వాపర యుగంలో యశోదా దేవికి కూతిరిగా అవతరించి, కంస సంహారానికి సహకరించిన మాయాదేవి ఐన ఆ పరాశక్తే కలియుగంలో ఆర్యవైశ్య వంశంలో శ్రీ వాసవీ దేవిగా జన్మించింది . ఇచ్చాశక్తి, క్రియశక్తి , జ్ఞానశక్తి ప్రసాదించే ఆ పరాదేవే సాక్షాత్తు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్చరీ రూపంలో పిలిచినప్పుడు పలికేందుకు భూమి మీద అవతరించింది . సాలంకాయన మహర్షి చెప్పడం ప్రారంభించాడు

ఆ జగన్మాత గురించి వైశ్య మహర్షులంతా ఎంతో భక్తిగా, ఆసక్తిగా వినసాగారు

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి పూర్వ చరిత్ర

కృతయుగమున భగవంతుని ఊరువుల నుండీ ఉద్భవింపబడినవారై ఊరుజులు- ఆది సంభూతులు మెదలైన పేర్లతో పిలువబడుచున్న ఆర్యవైశ్యులు కైలాస ప్రాంతములోని "మహాగిరి" యను పట్టణమును ఏకఛత్రాధిపత్యముగా పరిపాలనము చేయుచుండిరి. వీరిలో అగ్రజులైన ఇరువురు సోదరులు శంభుశ్రేష్టి, సోమకాంతుడు అను ప్రముఖులు మూల పురుషులుగా నుండిరి. ఉపనయన సంస్కారానంతరము వీరు చిన్న వయస్సుననే సకల విద్యలను గడించి, షోడశకళలలో ప్రవేశించి నవవ్యాకరణములు అధ్యయనం చేసి  విద్యలో పరిపూర్ణులైరి. యుక్త వయస్కులైన వీరికి కాలక్రమమున రాజ్యాధిపత్యమును చేపట్టి నగర ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించుచూ శ్రేష్ఠులని పిలువబడుచుండిరి. జీవవనోపాధిగా కృషి , గోరక్ష్య, వాణిజ్యములు ఉండగా దైవ ప్రీతికరములైన యజ్ఞయాగాదులనూ, దానధర్మములను చేయుచుండిన వీరికి అగ్రజుడైన శంభుశ్రేష్ఠికి ప్రభావతియను కన్యా రత్నముతోనూ, అనూజుడైన సోమకాంతునకు సుశీలాదేవీయను కన్యారత్నముతోనూ, పెద్దలు మంచి సుముహూర్తమున అంగరంగ వైభవముగా కళ్యాణములు జరిపించిరి. కాపురమునకై అత్తగారింట అడుగిడిన తోడికోడళ్ళు ఇరువురునూ అన్యోన్యముగా నుండిరి.

            ఈ దంపతులు రాజ్యములోని వారందరిని సమానముగా చూచుచుండిరి. మహాభక్తిపరులై ప్రతి నిత్యము తదేక నిష్టతో శవకేశవులను పూజించుచుండిరి. వీరికి కళ్యాణమై చాలాకాలము గడిచిననూ సంతానము కలుగలేదు. కాని వయెవృద్దత్వమం వచ్చెను. నగరస్వాములు, జ్ఞానసంపన్నులు, బంధుమిత్రులు మెదలైనవారు వేంచేసి "మీరు సంతానము కొరకు శక్తిసంపన్నులైన మహాఋషీశ్వరులను సేవించి, వారి ఆశీర్వచనములను శిరసా వహించిన యెడల సంతానప్రాప్తికి సలహా ఇవ్వగలరు. వారు నివసించు పవిత్రస్థలమే నైమిశారణ్యము " యని ఈ దంపతులతో చెప్పగా శుంభు శ్రేష్ఠి- సోమకాంతులు దంపతీసమేతముగా ఆశ్వవాహనారూఢులై నైమిశారణ్యమునకు చేరిరి.

            ప్రాచిన కాలంలోని గురుశిష్య పరంపరలో ప్రశ్నోత్తరాల రూపంలోనే బోదన సాగెది. జిజ్ఞాసువులు అయిన శిష్యులు తమ గురువు సన్నిధిలో కూర్చొని అత్యంత శ్రద్దాభక్తితో అనేక విషయాలను గురుముఖంగా వినేవారు. సందేహ నివృతికోసం మళ్ళీ మళ్ళీ ప్రశ్నించేవారు. శిష్యులను జ్ఞానవంతులుగా చేసేందుకు గురువు జటిలమైన శాస్త్రాలను, అనంతమైన ఆధ్యాత్మిక సంపత్తిని మనస్సుకు హత్తుకొనేలా కథల రూపంలో వివరించేవాడు. ఆవిధంగా ఆర్షధర్మంలో పురాణాలూ, ఇతి హాసాలూ ఆవిర్భవించాయి.

నైమిశారణ్య చరిత్ర:

నైమిశారణ్య చరిత్ర:

నైమిశారణ్య చరిత్ర:

                శాలంకాయన మహర్షి భక్తాదులకు ఈ విధముగా చెప్పనారంభించెను.  "ప్రధమ మను మహారాజు తన భార్య- సత్ రూపాదేవితో కలసి ఇక్కడి కీకారణ్యంలో 23 వేల సంవత్సరాలపాటు తప్పస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా వేదవ్యాసుడు ఈ ప్రదేశంలోనే దీక్షబూని అష్టాదశ పురాణాలను రచించాడని సనాతన ధర్మం విశ్వసిస్తుంది. నైమిశారణ్యానికి ఆ పేరు రావడం వెనుక ఒక పురాణ గాథ ఉన్నది.

          ఒకానొక సమయమున మహర్షి సమూహమంతయూ వైకుంఠమునకు వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో "ఓ ఆర్తత్రాణ పరాయణా! లక్ష్మీనాధా!ధన్యోస్మి! ప్రపంచంలో ఎచ్చట గాంచిననూ దుర్మార్గులు, రాక్షసులు మెండాయిరి. వారు దుశ్చుర్యలకు అంతులేదు. వారు దరిచేరని సముచితమగు ప్రదేశమును చూపించిన ప్రార్థన" అని ప్రార్థించగా ఋషీశ్వరుల విన్నపమును ఆలకించిన విష్ణుమూర్తి తక్షణము తన దక్షిణ హస్తమున ఉన్నసుదర్శన చక్రమును భూలోకమునకు పంపించెను. మహాదివ్య తేజస్సుతో ప్రయాణము చేయుచున్న సుదర్శనమును 14 లోకములోని జనులందరూ దర్శించుకొనుచుండిరి. వెంటనే లక్ష్మీనాథుడు "ఓ మహర్షులారా! ఈ సుదర్శనము ఏ అరణ్యమున నిలిచునో ఆ ప్రదేశమే పవిత్ర మీ తపోభూమి. పరమపవిత్రమగు ఆ స్థలమునకు దుర్మార్గులు ప్రవేశించుటకు అర్హత లేదు". అని వివరములను తెలియపరిచెను. ఆ విధముగా వైకుంఠమున ప్రారంభమైన సుదర్శనము వచ్చి ఒక భీకరారణ్యమున ’నిమిశ’ మైనది. కనుకనే ’నైమిశారణ్య’ మని పేరుగాంచెను. విష్ణువు లీలతో నైమిశారణ్యమున జాతి వైరం కలిగిన జంతువులు వైషమ్యము లేకుండా సంచరించును. చక్రనేమికి సంకేతంగా ఆ ప్రాంతానికి నైమిశారణ్యం అని పేరు వచ్చింది. ఆ స్థల మహత్మ్యాన్ని ఋషులు విధాత ద్వారా తెలుసుకున్నారు. అక్కడ ఒక్కప్పుడు ఆదిదేవి, శ్రీలలిత పేరుతో తపస్సు చేసిందని గ్రహించారు. తమ తపస్సు నిరాఘాటంగా కొనసాగాలని చక్రనేమి స్థిరబడిన ప్రదేశంలో ఋషిగణము ఆ జగన్మాతను ప్రార్థించారు. దేవి అను గ్రహంతో వారి సత్కార్యములు సిద్దించినవి. నైమిశారణ్యానికి మూడు క్రోసుల దూరంలో మిశ్రఖ్ తీర్థ్ ఉంది. ఇక్కడ వృత్రాసుర సంహరణార్థం ఆర్యవైశ్యుడైన దధీచి మహర్షి అపూర్వ త్యాగభావంతో తన వెన్నెముకను దేవేంద్రునకు ఆయుధంగా సమర్పించాడని పురాణాలు పేర్కొన్నాయి" అని శాలంకాయనుడు బోధించెను.

          నైమిశారణ్యము చేరిన ఈ దంపతులు మహాఋషీశ్వరులకు మరల పాదాభి వందనము చేసిరి. వీరి భక్తికి మెచ్చిన సాంధీప, కశ్యప, జాబాలి, మార్కండేయ, కౌశిక, పరాశర మెదలైన మహర్షులు మహదానందముగా "ఓ దంపతులారా! రాజ్య పరిపాలన చేయుచూ కృషి, గోరక్ష్య, వాణిజ్యములను నిర్వర్తించుచున్న మీ మనోభీష్టమేమిటి"? అని అడిగిరి. వెంటనే శంభుశ్రేష్ఠి-సోమకాంత దంపతులు "ఓ మహాఋషీశ్వరులారా! మాకు కళ్యాణములు జరిగి దీర్ఘకాలమైననూ సంతానము కలుగలేదు. త్రికాల జ్ఞాన సంపన్నులైన మీరు మా వంశోద్దారమునకు మార్గము చూప్పుము అని ప్రార్థన" అని దీనులై అర్ధించిరి. అంత మహాఋషులు "ఓ దంపతులారా! సంతానము లేదని చింతించవలదు. ’పుత్రకామేకామేష్టి’ యాగమును నిర్వహించడి. మీకు పరమేశ్వరుని కరుణతో అయెని సంభూతముగా సంతానము లభించగలదు" అని బోధించిరి. ఆర్యవైశ్య దంపతులు సంతోషముతో నిజపురంబునకు బయలుదేరిరి, సుముహూర్తమున "పుత్రకామేష్టి" యాగమును ప్రారంభించగా నగరస్వాములు, సామంతరాజులు, గ్రామ ప్రజలందరూ, ఆర్యవైశ్య చక్రవర్తులు చేయుచున్న యజ్ఞస్థలానికి చేరిరి. వచ్చిన వారందరికి అన్నసంతర్పణ చేసిరి. స్వీకరించిన వారందరూ "సుసంతాన ప్రాప్తిరస్తు" యని దంపతులను దీవించసాగిరి. ఈ విధమున పుత్రకామేష్టి యాగము మండలము (44) రోజులు అహోరాత్రిశ్చా దిగ్విజయంగా నిర్వహించిరి.

            "మహాఋషీశ్వరులను పూర్ణాహుతికి తీసుకొనిరండి" యని కులగురువులు చెప్పగా, అన్నగారైన శుంభుశ్రేష్టి అశ్వ వహనరూఢుడై వెళ్ళి అరణ్యమున తపస్సు చేయుచున్న ఆరు వందల పన్నెండు మంది (612) మహాఋషీశ్వరులను పుత్రకామేష్ఠి యాగము చెంతకు తీసుకొని రాగా, తమ్ముడైన సోమకాంతుడు కూడా గజ వాహనారూఢుడై వెళ్ళి అరణ్యమున తప్పస్సు చేయుచున్న నూట రెండు (102) మంది మహాఋషీశ్వరులను పుత్రకామేష్టి యాగమునకు తీసుకొని వచ్చెను. మెత్తం 714 మంది మహర్షులు ఆసనములపై కూర్చుండిరి.

ఫూర్ణాహుతి ఘడియ ప్రారంభమైనపుడు ముందుగా సూర్యభగవానుని కుమారుడైన "ప్రభతుడు" యను మహర్షి "ఓ ఆర్యవైశ్య దంపతులారా! అయెని సంభూతులుగా శిశువులు ఇప్పుడు అగ్నిలో ఉద్బవించెదరు. 44 రోజులు అహోరాత్రిశ్చా ఉపవాసదీక్షతో ’పుత్రకామేష్ఠి’ యాగము ద్వారా అమితమైన పుణ్యమును మీరు లభ్యము చేసుకొనిరి. యజ్ఞేశ్వరుడు, అగ్నిదేవుడు కూడా సంతసించిరి. అగ్నినుండీ బిడ్డలుద్భవించెదరా? యని మీకు సందేహము కలుగవచ్చు. రాబోవు త్రేతాయుగమున పంచకన్యకలైన భూపుత్రిగా సీతామహాదేవి , ఆకాశము నుండి మండోదరీ దేవీ, వాయుజనితమై అహల్యాదేవి, జల కుమార్తెగా వాలి భార్య తారాదేవియూ జన్మింతురు. తదుపరి ద్వాపరయుగమున అగ్ని గర్భము నుండి ద్రౌపది - దృష్టద్యుమ్నుడు అనువారు కూడా జన్మింతురు. ఆంజనేయుడు , గాంగేయుడు (భీష్ముడు), భీమసేనుడు మెదలగువారు పంచ భూతములకు జన్మించు వారిలో అగ్రగణ్యులు, దైవాంశమున పురాణ పురుషులెందరో పంచభూతములకు సంతానము జన్మించబోతున్నారు" అని బోదించి తన అమృత హస్తముతో ఆజ్యమును పుత్రకామేష్టిలో సమర్పించగా! ఈ ప్రభాత మహర్షి దివ్య తప్పశ్శక్తితో, ఆర్యవైశ్య దంపతులు చేసిన యజ్ఞ ఫలితముగా మహా దివ్యతేజోవంతముగా, సూర్యభగవానునివలె అమితమైన ప్రకాశముతో, ప్రచండ భాసమానమున, యజ్ఞమధ్యమున ఒక శిశువు ఉద్భవించెను. ’ప్రభాత’ మహర్షి ఆ పురుష బిడ్డను తీసుకొని, ఆశీర్వదించి, ఈ దంపతులకు "ఓ వైశ్యశ్రేష్ఠులారా! మీరు భక్తితో చేసిన యజ్ఞము ఫలించినది. అయెనిజునిగా జన్మించిన ఈ బిడ్డను పెంచుకొనుడు" అని చెప్పి బాలునికి మంత్రోపదేశము చేసి దంపతులకిచ్చెను. తీసుకొనిన దంపతులు ఒక ప్రక్క ఆనందముతో, ఒక ప్రక్క ఆశ్చర్యముతోనూ ఆ బిడ్డను తీసుకొని ఉయ్యాలలో ఉంచి ముద్దాడిరి.

ప్రభాత మహర్షి ఆజ్యమును సమర్పించగా జన్మించిన ఈ శిశువు వంశము వారందరూ అప్పటినుండి ఋషిపేరు "ప్రభాత ఋషి" అనియు గోత్రము పేరు "ప్రభాతస" అనియు చెప్పనారంభించెను. వెనువెంట మౌద్గుల్యుడు అను మహర్షి పుత్రకామేష్టిలో ఆజ్యమును సమర్పించగా, ఆ ఋషి తపశ్శక్తి మరియు ఆర్యవైశ్య దంపతుల పుణ్యఫలితముగా యజ్ఞములో మరొక శిశువు అయెనిజునిగా ఉద్భవించెను. మౌద్గల్య మహర్షి వలన జన్మించెను కనుక ఈ బాలుని వంశమంతయూ "మౌద్గల్య మహర్షి" అనియు "మౌద్గల్యస" గోత్రమనియు చెప్పసాగిరి. ఈ బిడ్డకు మంత్రోపదేశం చేసి ఆర్యవైశ్య దంపతులకు అందించెను. ఈ విధమున మూడవ సారి ఆత్రేయ మహర్షి వేంచేసి యజ్ఞమున అజ్యమును సమర్పించగా మరొక శిశువుద్భవించెను. తదుపరి కణ్వ మహర్షి, మరొకసారి వాల్మీకి మహర్షి, భరద్వాజ మహర్షి, జాబాలి మహర్షి మెదలగువారు వరుసగా ఆజ్యమును సమర్పించు చుండిరి. ఆ విధముగా అన్నగారికి 612 మహా ఋషీశ్వరుల తపశ్శక్తి అన్నగారికి 612 మంది బిడ్డలున్నూ, తమ్మునకు 102 మంది బిడ్డలున్నూ అయెనిజులుగా అగ్ని యందుద్భవించిరి. వారే 714 గోత్ర ఆర్యవైశ్యులు. అంత వరకు ఈ ఆర్యవైశ్యులకు గోత్రములు-ఋషులు అనేవి లేవు. ఏ మహర్షిద్వారా ఏ బిడ్డ జన్మించెనో ఆ మహర్షినే తన ’ఋషి’గా, ఆ ఋషి పేరునే ’గోత్రము’గా చెప్పుకొనుచుండిరి. 714 అయెనిజ బిడ్డలను ఈ ఆర్యవైశ్య దంపతులకు మహర్షులు అప్పగించి తదుపరి నైమిశారణ్యమునకు వెళ్ళినారు.

శ్రీ వాసవీ దేవి చరిత్ర