Sri Krishnastami Vratham – శ్రీ కృష్ణాష్టమి వ్రతం

Sri Krishnastami Vratham – శ్రీ కృష్ణాష్టమి వ్రతం

Sri Krishnastami Vratham – శ్రీ కృష్ణాష్టమి వ్రతం

శ్రీ మహాగణాధిపతయే నమః

శ్రీ గురుభ్యో నమః                                                                                                                              

హరిః ఓం

శుచిః

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతో పి వా

యః స్మరేత్ పుండరీకాక్షం బాహ్యాభ్యంతరః శుచిః

పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష

ప్రార్థన

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నేపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

దేవీం వాచమజనయన్త దేవాస్తాం విశ్వరూపాః పశవో వదన్తి

సా నో మన్ద్రేషమూర్జం దుహానా ధేనుర్వాగస్మానుప సుష్టుతైతు

యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వ మంగళ

తయెః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం

అయం ముహూర్తః సుముహూర్తోస్తు

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం

తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి

గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః

ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః

సర్వమంగళ మాంగళ్యే శివె సర్వార్థ సాధికే

శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమెస్తుతే

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః

ఉమా మహేశ్వరాభ్యాం నమః

వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః

శచీ పురందరాభ్యాం నమః

అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః

శ్రీ సీతారామాభ్యాం నమః

మాతా పితృభ్యో నమః

సర్వేభ్యో మహజనేభ్యో నమః

గాయత్రో ప్రార్థన

ఓం ముక్తా విద్రుమహేమనీల దవళచ్చాయై ర్ముఖైస్త్రీక్షణైః

యుక్తా మిందుకళానిబద్దరత్న ముకుతామ్ తత్త్వార్థవర్ణాత్మికామ్

గాయత్రీ వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలంగదాం

శంఖం చక్రమాధారవింద యుగళం హస్తైర్వహ న్తీంభజే

గాయత్రీ మంత్రము

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్యదీమహిః ధియోయోనః ప్రచోదయాత్

దీపారాధన

దీపంజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్

దీపేన సాధ్యతే సర్వం పూజాసమయే దీపం నమోస్తుతే

దీపస్త్వం బ్రహ్మ రూపొసి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్నామాంశ్చ దేహి మే

భో దీప దేవి రూపస్త్వం కర్మసాక్షీ హ్యవిఘ్నకృత్

యావత్పూజం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ

శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదమ్

శత్రుబుద్దివినాశం చ దీప జ్యోతిర్నమోస్తుతే

దీపారాధన ముహూర్తః సుముహూర్తోస్తు

అచమనము

ఓం కేశవాయ స్వాహా

ఓం నారాయణాయ స్వాహా

ఓం మాధవాయ స్వాహా

ఓం గోవిందాయ నమః

ఓం విష్ణువే నమః

ఓం మధుసూదనాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం వామనాయ నమః

ఓం శ్రీధరాయ నమః

ఓం హృషీకేశాయ నమః

ఓం పద్మనాభాయ నమః

ఓం దామోదరాయ నమః

ఓం సంకర్షణాయ నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం ప్రద్యుమ్నాయ నమః

ఓం అనిరుద్దాయ నమః

ఓం పురుషోత్తమాయ నమః

ఓం అధోక్షజాయ నమః

ఓం నారసింహాయ నమః

ఓం అచ్యుతాయ నమః

ఓం జనార్థనాయ నమః

ఓం ఉపేంద్రాయ నమః

ఓం హరయే నమః

ఓం శ్రీకృష్ణాయ నమః

ఘంట పూజా

ఓం జయధ్వని మంత్రమాతః స్వాహా

ఘంతదేవతాభ్యో నమః

సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి

ఘంటనాదం

(క్రింది మంత్రము చెప్పుచు ఘంటా నాదము చేయవలెను)

ఆగమార్థంతు దేవానాం గమనార్థం తు రాక్షసాం

కురుఘంటారవం తత్రదేవతాహ్వాన లాంఛనమ్

ఇతి ఘంతానాదం కృత్వా

భూతోచ్ఛాటనం

(క్రింది మంత్రము చెప్పుచు నీళ్లు ప్రోక్షించవలెను)

ఓం ఉత్తిష్ఠంతు భూత పిశాచాః య ఏతే భూమి భారకాః

ఏతేషామవిరీధేన బ్రహ్మకర్మ సమారభే

అపసర్పన్తు తే భూతా యే భూతా భూమి సంస్థితాః

యే భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయా

ప్రాణాయామం

(క్రింది మంత్రము చెప్పుచు ప్రాణాయామము చేయవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః

ఓం జనః ఓం తపః ఓం సత్యం

ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్

ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

సంకల్పం

మమ ఉపాత్త సమస్త దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యార్థం శుభాభ్యం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహవిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితియ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరత ఖండే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానెన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే ....................... సంవత్సరే..................... ఆయనే ................... ఋతౌ ................. మాసే .................... పక్షే .................... తిథౌ .................... వాసరే ..................  శుభ నక్షత్ర శుభ యోగ శుభకరణ ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమస్థైర్య దైర్ఘ్య వీర్య విజయ, అభయ ఆయుః, ఆయురారోగ్యైశ్వర్య అభివృద్ది సిద్ద్యర్థం, భక్తిజ్ఞాన వైరాగ్య సిద్ద్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ద్యర్థం, పుత్రపౌత్రాబి వృద్ద్యర్థం, సద్బుద్దీత్యాది, సర్వశుభఫలప్రాప్త్యర్థం శీఘ్రమేవ దంపతీనాం, అనుకూల దాంపత్య సిద్ద్యర్థం సంతానార్థినాం, శ్రీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం, సమస్తరోగ నివారణ సిద్యార్థం, లోక క్షేమర్థం యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార శ్రీ కృష్ణ పరబ్రహ్మ దేవతముద్దిస్య సమస్త మంగళావాప్యార్థం శ్రీ కృష్ణ పరబ్రహ్మ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ గృహే స్థిరలక్ష్మీ ప్రాప్త్యర్థం మనోవాంఛిత ఫలావాప్త్యర్థం బ్రహ్మజ్ఞాన సిద్ధ్యర్థం శ్రీ కృష్ణ పరబ్రహ్మ పూజాం కరిష్యే

తదంగ కలశారాధనం కరిషే

కలశపూజ

కలశం గంధపుష్పాక్షతైరభర్బ్య తదుపరి హస్తమ్ నిధాయ

కలశస్య ముఖేః విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్నగణాశ్రితా కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంతు సమాశ్రితా ఆయాంతు దేవ పూజార్థం మమదురి తక్షయకారకాః అత్ర గాయత్రీ సావిత్రీ శాంతిః పుష్టీకరీశ్వరీ

ఆపో వా ఇదగ్ం సర్వం విస్వా భూతాన్యాపః

ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపః

సమ్రాడాపో విరాడాపః స్వరాణాపశ్ఛందాగ్ స్యాపో

జ్యోతిగ్ ష్యాపో యజూగ్ ష్యాపః సత్యమాపః

సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప

ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు

కావేరి తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ

భాగీరధీ చ విఖ్యాతాః పంచ గంగాః ప్రకీర్తితః

కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవమాత్మానంచ సంప్రోక్ష, ఆత్మానంచ సంప్రోక్ష్య

గణపతి పూజ

అథ మహాగణపతి పూజాంకరిష్యే

అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి పూజయామి

ధ్యానం

హరిద్రాభం చతుర్భాహుం

హరిద్రావదనం ప్రభుమ్ |

పాశాంకుశధరం దేవం

మోదకం దంతమేవ చ |

భక్తాభయ ప్రదాతారం

వందే విఘ్నవినాశనమ్ |

ఓం శ్రీ మహాగణపతేయే నమః

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం

అనేక దంతం భక్తానం ఏకదంతముపాస్మహే

ఓం గణానాం త్వా గణపతిం హవామహే

కవిం కవీనాముపమశ్రవస్తమమ్

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత

ఆనః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్

ఓం శ్రీ మహాగణపతయే నమః

ధ్యాయామి | ధ్యానం సమర్పయామి |

ఓం శ్రీ మహాగణపతయే నమః

ఆవాహయామి | ఆవాహనం సమర్పయామి |

ఓం శ్రీ మహాగణపతయే నమః

నవరత్న ఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి  |

ఓం శ్రీ మహాగణపతయే నమః

పాదయోః పాద్యం సమర్పయామి |

ఓం శ్రీ మహాగణపతయే నమః

హస్త యోః అర్ఘ్యం సమర్పయామి |

ఓం శ్రీ మహాగణపతయే నమః

ముఖే ఆచమనీయం సమర్పయామి

ఓం శ్రీ మహాగణపతయే నమః

శుద్ధోదక స్నానం సమర్పయామి

స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |

ఓం శ్రీ మహాగణపతయే నమః

వస్త్రం సమర్పయామి

ఓం శ్రీ మహాగణపతయే నమః

యజ్ఞోపవీతం సమర్పయామి

ఓం శ్రీ మహాగణపతయే నమః

దివ్య శ్రీ గంథం సమర్పయామి

గంథస్యోపరి అలంకరణార్థం హరిద్రా కుంకుమ సమర్పయామి ||

ఓం శ్రీ మహాగణపతయే నమః

అక్షతాన్ సమర్పయామి

ఓం శ్రీ మహాగణపతయే నమః

పరిమళ పత్రపుష్యైః పూజయామి

పుష్పం

ఓం సుముఖాయ నమః

ఓం ఏకదంతాయ నమః

ఓం కపిలాయ నమః

ఓం గజకర్ణికాయ నమః

ఓం లంబోదరాయ నమః

ఓం వికాటాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం గణాధిపాయ నమః

ఓం ధూమకేతవే నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం ఫాలచంద్రాయ నమః

ఓం గజాననాయ నమః

ఓం వక్రతుండాయ నమః

ఓం శూర్పకర్ణాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం స్కందపూర్వజాయ నమః

ఓం సర్వసిద్దిప్రదాయ నమః

ఓం శ్రీ మహాగణపతయే నమః

ఇతి షోడశ నామావళి పూజం సమర్పయామి

ధూపం

వనస్సత్యుద్భవిర్దివ్యై నానా గంధైః సుసంయుతః

ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం

ఓం మహాగణపతయే నమః

ధూపం ఆఘ్రాపయామి

దీపం [ఏకార్తి]

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం |

గృహణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ ||

భక్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే |

త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే ||

ఓం శ్రీ మహాగణపతయే నమః

ప్రత్యక్ష దీపం సమర్పయామి

ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి

ఓం శ్రీ మహాగణపతయే నమః

నైవేద్యం సమర్పయామి

నీరాజనం

మంగళం సుముఖోదేవ మంగళం ఆఖువాహన మంగళం విఘ్నరాజాయ మంగళం స్కందపూర్వజః

ఓం శ్రీ మహాగణపతయే నమః

కర్పూర నీరాజనం సమర్పయామి

మంత్రపుష్పం

సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ||

ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః

వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కంద పూర్వజః ||

షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి

విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా

సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే

ఓం శ్రీ మహాగణపతయే నమః

సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి

ఓం శ్రీ మహాగణపతయే నమః

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

ఓం శ్రీ మహాగణపతయే నమః

ఛత్ర చామరాది సమస్త రాజోపచారాన్ సమర్పయామి ||

క్షమాప్రార్థన

“వక్రతుండ ! మహాకాయ ! సూర్య కోటి సమప్రభ !

నిర్వఘ్నం కురు మే దేవ ! సర్వ కార్యేషు సర్వదా “

అనయా ధ్యాన ఆవాహనాది షోడశో పచార పూజయా

భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు

ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు |

ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు || మమ ఇష్తకామ్యార్థ సిద్దిరస్తు

శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి ||

ఓం శ్రీ మహాగణపతయే నమః యథాస్థానం ప్రతిష్ఠాపయామి ||

శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ |

ఓం శాంతిః

అథ పీఠ పూజాంకరిష్యే

పీఠపూజ

ఓం ఆదారశక్త్యే నమః

ఓం మూల ప్రకృత్యై నమః

ఓం కూర్మాయ నమః

ఓం వరాహాయ నమః

ఓం ‍అనంతాయ నమః

ఓం ‍అష్టదిగ్గజేభ్యో నమః

ఓం తన్మధ్యేక్షీరార్ణవాయ నమః

ఓం క్షీరార్ణవ మధ్యేశ్వేత ద్వీపాయ నమః

శ్వేతద్వీప స్యాధః

కల్పవృక్షాయ నమః కల్పవృక్ష స్యాధః

సువర్ణమంటపాయ నమః

ఇతి పీఠపూజాం సమార్పయామి

అథ ద్వారపాలక పూజాంకరిష్యే

పూర్వద్వారే ద్వార శ్రియై నమః విజయాయ నమః

దక్షిణద్వారే ద్వారశ్రియై నమః

నందాయ నమః  సునందాయ నమః

పశ్చిమ ద్వారే శ్రియై నమః

బలాయ నమః ప్రబలాయ నమః

ఉత్తరద్వారే ద్వారశియై నమః కుముదాయనమః కుముదాక్షాయ నమః

ఇది ద్వారపాలక పూజాం సమర్పయామి

 

Sri Krishnastami Vratham – శ్రీ కృష్ణాష్టమి వ్రతం

ధ్యానం

కస్తూరీతిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం

నాసాగ్రే  వరమౌక్తికం కరతలే వేణుం కరే కంకణమ్

సర్వాంగే హరిచందనం కలయన్ కంఠే ముక్తివలిం

గోపస్త్రీపరివేష్టితో విజయతే గోపాలచూడామణిః

ధ్యాయామి బాలకం కృష్ణం మాత్రంకే స్తన్యపాయినమ్

శ్రీవత్సవక్షసం కాంతం నీలోత్పలదళచ్ఛవిమ్

ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ధ్యాయామి

ఆవాహనం

సహస్రశీర్షా పురుషః

సహస్రాక్షః సహస్రపాత్

భూమిం విశ్వతో వృత్వా

అత్యతిష్ఠద్దశాఙ్గులమ్

ఆవాహయామి దేవేశం శ్రీపతిం శ్రీధరం హరిమ్

బాలరూపధరం విష్ణుం సచ్చిదానంద విగ్రహమ్

ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఆవాహయామి

ఆసనం

పురుష ఏవేదగ్ సర్వమ్

యద్భూతం యచ్చ భవ్యమ్

ఉతామృతత్వస్యేశానః

యదన్నేనాతిరోహతి

దామోదర నమస్తే స్తు దేవకీగర్భసంభవ

రత్నసింహాసనం చారు గ్రుహ్యతాం గోకులప్రియా

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః నవరత్న

ఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి

పాద్యం

ఏతావానస్య మహిమా

అతో జ్యాయాగ్శ్చ పురుషః

పాదో స్య విశ్వా భూతాని

త్రిపాదస్యామృతం దివి

పుష్పాక్షత సమాయుక్తం పురుషోత్తమ పూర్వజ

పాద్యం గృహాణ దేవేశ పూర్ణరూప నమోస్తు తే

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

పాదయో పాద్యం సమర్పయామి

అర్ఘ్యం

త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః

పాదో స్యేహా భవాత్పునః

తతో విష్వఙ్వ్యక్రామత్

సాశనానశనే అభి

గంధపుష్పక్షతోపేతం ఫలేన సమన్వితమ్

అర్ఘ్యం గృహాణ భగవన్ వసుదేవ ప్రియాత్మజ

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

హస్తయోః అర్ఘ్యం సమర్పయామి

ఆచమనీయం

తస్మా ద్విరాడజాయత

విరాజో అధి పురుషః

జాతో అత్యరిచ్యత

పశ్చాద్భూమిమథో పురః

నానానదీ సమానీతం సువర్ణకలశస్థితమ్

గృహాణాచమనీయం విమలం జలమచ్యుత

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

ఆచమనీయం సమర్పయామి

మధుపర్కం

మధుదధ్యాజ్య సంయుక్తం మహనీయ గుణార్ణవ

మధుసూదన దేవేశ మధుపర్కం గృహాణ మే

 ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః మధుపర్కం సమర్పయామి

పంచామృత అభిషేకం

(గమనిక: స్వామి వారి ప్రతిమను ముందుగా పంచామృతాలతో అభీషేకము చేసి తరువాత పూజచేయవలెను)

క్షీరం [ పాలు ]

ఓం ఆప్యాయస్వ సమేతు తే

      విశ్వత స్సోమ వృష్టియమ్

      భవా వాజస్య సంగధే

శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః క్షీరేణ స్నపయామి

దధి [పెరుగు]

ఓం దధిక్రావ్ణో అకారిషం జిష్టోరశ్వస్య వాజినః

సురభినో ముఖా కరత్ప్రణ ఆయూగ్ంషి తారిషత్

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః దధ్నా స్నపయామి

అజ్యం [ నెయ్యి ]

 ఓం శుక్ర మసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్సునాతు

అచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభి

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ఆజ్యేన స్నపయామి

మధు [తేనె]

ఓం మధు వాతా బుతాయతే మధుక్షరన్తి సింధవః |

మాధ్వీ ర్న సన్త్వౌషధీ |

మధు నక్త ముతోషసి మధుమ త్పార్ధివగ్ం రజః|

మధు ద్యౌరస్తు నః పితా |

మధుమాన్నో వనస్పతి ర్మధుమాగ్ం అస్తు సూర్యః

మాధ్వీర్గావో భవంతు నః |

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః మధునా స్నపయామి

శర్కరా [ చక్కర ]

ఓం స్వాదుః పవస్వ దివ్యాయ జన్ననే |

స్వాదు రింద్రాయ సుహవేతు నామ్నే |

స్వాదు ర్మిత్రాయ వరుణాయ వాయవే |

బృహస్పతయే మధుమాం అధాభ్యః |

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః శర్కరేణ స్నపయామి ||

ఫలోదకం [ కొబ్బరినీళ్ళూ ]

యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుప్పిణీః

 బృహస్పతి ప్రసూతాస్తానో మున్చన్త్వగ్ం హసః

(ఇతి ఫలోదకం = పండ్లరసం, లేక కొబ్బరినీళ్ళు)

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ఫలోదకేన స్నపయామి ||

 

పంచామృతస్నానమిదం పయోదధి ఘృతం మధు

శర్కరామపి గోవింద శకటాసురభంజన

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః పంచామృతస్నానం సమర్పయామి

శుద్ధోదకం [నీళ్ళు]

యత్పురుషేణ హవిషా

దేవా యజ్ఞమతన్వత

వసన్తో అస్యాసిదాజ్యమ్

గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః

ఓం  అపో హిష్టా మయోభువస్తా ఊర్జే దధాతన |

మహేరణాయ చక్షసే |

యో వః శివతమో రసస్తస్య భాజయతే నః |

ఉశతీరివ మాతరః |

తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ |

 ఆపో జనయథా నః |

గంగా గోదావరీ కృష్ణా యమునాభ్యః సమాహృతమ్

సలిలం విమలం దేవ స్నానార్థం ప్రతిగృహ్యతామ్

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

శూద్ధోదకేన స్నపయామి ||

స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి

వస్త్రం:

సప్తాస్యాస న్పరిధయః త్రిః సప్త సమిధః కృతాః

దేవా యద్యజ్ఞం తన్వానాః అబధ్న స్పురుషం పశుమ్

పీతాంబరయుగం దేవ గృహాణ సుమనోహరమ్

దేహి మే సకలానర్థాన్ దేవకీ ప్రియనందన

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

యజ్ఞోపవీతం

తం యజ్ఞం బర్హిషి ప్రౌక్ష్న్ పురుషం జాతమగ్రతః

తేన దేవా అయజన్త సాధ్యా బుషయశ్చ యే

ఉపవీతం గృహాణేదం కాంచనం కమలాపతే

పవిత్రం కురు మాం దేవ నమః పరమపురుష

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః యజ్ఞోపవీతం సమర్పయామి.

గంధం:

తస్మా ద్యజ్ఞా త్సృర్వ హుతః సంభృతం పృషదాజ్యమ్

పశూగ్స్తాగ్‌‍శ్చక్రే వాయవ్యాన్ఆరణ్యాన్గ్రామాశ్చ యే

గంధం కుంకుమకస్తూరీ ఘనసారసమన్వితమ్

గృహాణ తే నమో దేవ కుబ్జానుగ్రహకారిణే

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః గంధం సమర్పయామి

ఆభరణములు:

తస్మా ద్యజ్ఞా త్సర్వహుతః బుచః సామాని జజ్ఞిరే

ఛన్దాగ్ం జజ్ఞిరే తస్మాత్యజుస్తస్మాదజాయత

హారనూపురకేయూర కింకిణీదామపూర్వకమ్

గృహాణాభరణం సర్వం శరణాగతవత్సల

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ఆభరణాని సమర్పయామి

అక్షతాన్

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ ముక్తాఫల సమప్రభాన్

వాసుదేవ గృహాణ త్వం నమస్తే భక్తవత్సల

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అక్షతాన్ సమర్పయామి

పుష్పాణి

తస్మాదశ్వా అజాయన్త

యే కే చోభయాదతః

గావో జజ్ఞిరే తస్మా త్

తస్మా జ్జాతా అజావయః

జాజీ చంపక పున్నాగ కేతకీ మల్లికాదిభిః

కరవీరైః పారిజాతైః పూజయామి రమాపతిమ్

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి

అథాంగ ఫూజా

ఓం అచ్యుతాయ నమః - పాదౌ పూజయామి

ఓం గోపాలాయ నమః - గుల్ఫౌ పూజయామి

ఓం జన్మహీనాయ నమః - జానునీ పూజయామి

ఓం పూతనావైరిణే నమః - ఊరూ పూజయామి

ఓం శకటాసురభంజనాయ నమః - కటిం పూజయామి

ఓం నవనీతప్రియాయ నమః - నాభిం పూజయామి

ఓం ఉత్తాలతాలభేత్రే నమః - ఉదరం పూజయామి

ఓం వనమాలినే నమః - వక్షః స్థలం పూజయామి

ఓం చతుర్భుజాయ నమః - హస్తాన్ పూజయామి

ఓం కంసారయే నమః - కంఠం పూజయామి

ఓం మథురానాథాయ నమః - ముఖం పూజయామి

ఓం కుచేలసంపత్ర్పదాయ నమః - కపోలౌ పూజయామి

ఓం కంజలోచనాయ నమః - నేత్రే పూజయామి

ఓం కరుణానిధయే నమః - కర్ణౌ పూజయామి

ఓం లలితాకృతయే నమః - లలాటం పూజయామి

ఓం శుకసంస్తుతాయ నమః - శిరః పూజయామి

ఓం సర్వేశ్వరాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి

Sri Krishna Ashtothram – శ్రీ కృష్ణ అష్టోత్తరం

ఓం శ్రీ కృష్ణాయ నమః

ఓం కమలానాథాయ నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం సనాతనాయ నమః

ఓం వసుదేవత్మాజాయ నమః

ఓం పుణ్యాయ నమః

ఓం లీలామానుష విగ్రహాయ నమః

ఓం శ్రీవత్స కౌస్తుభ ధరాయ నమః

ఓం యశోదావత్సలాయ నమః

ఓం హరిఃయే నమః || 10 ||

ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా నమః

ఓం శంఖాంబుజాయుధాయ నమః

ఓం దేవకీ నందనాయ- శ్రీ శాయ నమః

ఓం నందగోప ప్రియాత్మజాయ నమః

ఓం యమునావేగసంహారిణే నమః

ఓం బలభద్ర ప్రియానుజాయ నమః

ఓం పూతనాజీవితహరణాయ నమః

ఓం శకటాసురభంజనాయ నమః

ఓం నందవ్రజజానందినే నమః

ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః || 20 ||

ఓం నవనీతవిలిప్తాంగాయ నమః

ఓం నవనీతనటాయ నమః

ఓం అనఘాయ నమః

ఓం నవనీతనవహారాయ నమః

ఓం ముచుకుద ప్రసాధకాయ నమః

ఓం షోడశ స్త్రిసహస్రేశాయ నమః

ఓం త్రిభంగినే నమః

ఓం మధురాకృతయే నమః

ఓం శుకవాగమృతాబ్ధీందనే నమః

ఓం గోవిందాయ నమః || 30 ||

ఓం యోగినాంపతయే నమః

ఓం వత్సవాటచరాయ నమః

ఓం అనంతాయ నమః

ఓం ధేనుకాసుర భంజనాయ నమః

ఓం తృణీకృత తృణావర్తాయ నమః

ఓం యమళార్జున భంజనాయ నమః

ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః

ఓం తమా శ్యామలకృతయే నమః

ఓం గోపగోపీశ్వరాయ నమః

ఓం యోగినే నమః || 40 ||

ఓం కోటిసూర్య సమప్రభాయ నమః

ఓం ఇళాపతయే నమః

ఓం పరంజ్యోతిషే నమః

ఓం యాదవేంద్రాయ నమః

ఓం యధూద్వహాయ నమః

ఓం వనమాలినే నమః

ఓం పీతవాససే నమః

ఓం పారిజాతపహారకాయ నమః

ఓం గోవర్ధన చలోర్దర్త్రే నమః

ఓం గోపాలాయ నమః || 50 ||

ఓం సర్వపాలకాయ నమః

ఓం అజాయ- నిరంజనాయ నమః

ఓం కామజనకాయ నమః

ఓం కంజలోచనాయ నమః

ఓం మధుఘ్నే నమః

ఓం మధురానాథాయ నమః

ఓం ద్వారకానాయకాయ నమః

ఓం బలినే నమః

ఓం బృందావనాంతసంచారిణే నమః

ఓం తులసి దామ భూషణాయ నమః || 60 ||

ఓం శ్యామంతమణిహర్త్రే నమః

ఓం నరనారాయణాత్మకాయ నమః

ఓం కుబ్జాకృష్ణాంబర ధరాయ నమః

ఓం మాయినే నమః

ఓం పరమ పురుషాయ నమః

ఓం మిస్టి కాసు చాణూర నమః

ఓం మల్లయుద్ధ విశారదాయ నమః

ఓం సంసార వైరిణే నమః

ఓం కంసారినే నమః

ఓం మురారి నే నమః || 70 ||

ఓం నరకాంతకాయ నమః

ఓం అనాది బ్రహ్మచారిణే నమః

ఓం కృష్ణావ్యసనకర్శ కాయ నమః

ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః

ఓం దుర్యోధన కులాంత కృతే నమః

ఓం విదుర క్రూర వరదాయ నమః

ఓం విశ్వరూప ప్రదర్శ కాయ నమః

ఓం సత్య వాచయే నమః

ఓం సత్యసంకల్పాయ నమః

ఓం సత్యభామారతాయ నమః || 80 ||

ఓం జయినే నమః

ఓం సుభద్రా పూర్వజాయ నమః

ఓం విష్ణవే నమః

ఓం భీష్మ ముక్తి ప్రదాయ కాయ నమః

ఓం జగద్గురవే నమః

ఓం జగన్నాధాయ నమః

ఓం వేణునాద విశారదాయ నమః

ఓం వృషభాసుర విధ్వంసినీ నమః

ఓం బాణాసుర కరాంత కృతే నమః

ఓం యుధిష్టర ప్రతిష్ట త్రే నమః || 90 ||

ఓం బర్హిబర్హవతంసకాయ నమః

ఓం పార్ధసారధియే నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం గీతామృతమశ్రీహోదధయే నమః

ఓం కాళీయఫణిమాణిక్య రంజితశ్రీ పదాంబుజాయ నమః

ఓం దామోదరాయ నమః

ఓం యజ్ఞభోక్ష్యె నమః

ఓం దానవేంద్రవినాశకాయ నమః

ఓం నారాయణాయ నమః

ఓం పరబ్రహ్మణే నమః || 100 ||

ఓం పన్నాగాశనవాహయ నమః

ఓం జలక్రీడాసమాసక్త గోపి వస్త్రాపహారకాయ నమః

ఓం పుణ్యశ్లోకాయ నమః

ఓం తీర్ధకృతే శ్రీ వేధవేద్యాయ నమః

ఓం దయానిధాయే నమః

ఓం సరస్వతీర్దాత్మకాయ నమః

ఓం సర్వగ్రహరూపిణే నమః

శ్రీ పరాత్పరాయ నమః || 108 ||

ఇతి శ్రీ కృష్ణ అష్టోత్తరం సంపూర్ణం

Sri Krishna Sahasranamavali Telugu - శ్రీ కృష్ణ సహస్రనామావళిః

ధూపం:

త్పురుషం వ్యదధుః కతిధా వ్యకల్పయన్

ముఖం కిమస్య కౌ బాహూ కావూరూ పాదా వుచ్చ్యేతే.

వనస్పత్యుద్భవొ దివ్యో గంధాఢ్యో గంధ ఉత్తమ

బాలకృష్ణ మహీపాలో ధూపోయం ప్రతిగృహ్యతామ్

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ధూపం ఆఘ్రాపయామి

దీపం:

బ్రాహ్మణోస్య ముఖ మాసీత్బాహూ రాజన్యః కృతః

ఊరూ దస్య ద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం మయా

గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః దీపం సమర్పయామి

నైవేద్యం

చన్ద్రమా మనసో జాతః

చక్షోః సూర్యో అజాయత

ముఖాదిన్ద్రశ్చాగ్నిశ్చ

ప్రాణాద్వాయురజాయత

నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిం మే అచలాం కురు

ఈప్సితం మే వరం దేహి ఇహత్ర పరాం గతిమ్

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః  నైవేద్యం సమర్పయామి

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్యదీమహిః

ధియోయోనః ప్రచోదయాత్

సత్యం త్వా ఋతేన పరిషించామి

[సాయంత్రం - ఋతం త్వా సత్యేన పరిషించామి]

అమృతమస్తు అమృతోపస్తరణమసి

ఓం ప్రాణాయ స్వాహా

ఓం అపానాయ స్వాహా

ఓం వ్యానాయ స్వాహా

ఓం సమానాయ స్వాహా

మధ్యే పానీయం సమర్పయామి

ఉత్తరాపోశనం సమర్పయామి

హస్త ప్రక్షాళనం సమర్పయామి

ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి

తాంబూలం

నాభ్యా ఆసీదన్తరిక్షమ్

శీర్ష్ణో ద్యౌః సమవర్తత

పద్భ్యం భూమిర్ధిశః శ్రోత్రాత్

తథా లోకాగ్ం అకల్పయన్

పూగీఫలైః కర్పూరైః నాగవల్లీ దళైర్యుతం

ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః తాంబూలం సమర్పయామి

నీరాజనం:

ఓం వేదాహమేతం పురుషం మహాన్తమ్

ఆదిత్యవర్ణం తమసస్తు పారే

సర్వాణి రూపాణి విచిత్య ధీరః

నామాని కృత్వాభివదన్యదాస్తే 

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః కర్పూర నీరాజనం సమర్పయామి

నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి

మంత్రపుష్పం

ఓం ధాతా పురస్తాద్యముదాజహార

శక్రః ప్రవిద్వాన్ప్రదిశ శ్చృతస్రః 

తమేవం విద్యానమృత ఇహ భవతి

నాన్యః పంథా అయనాయ విద్యతే

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ

యానకాని పాపాని జన్మాంతర కృతాని

తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే |  

పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ|

త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలా |

అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ |

తస్మాత్కారుణ్య భావేన రక్ష జనార్దన

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

సాష్టాంగ నమస్కారం:

ఉరసా శిరసా దృష్ట్యా వచసా తథా |

పద్భ్యాం కరాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ||

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి

సర్వోపచారాః

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః  ఛత్రం ఆచ్ఛాదయామి |

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః చామరైర్వీజయామి |

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః నృత్యం దర్శయామి |

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః గీతం శ్రావయామి |

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ఆందోళికాన్నారోహయామి |

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అశ్వానారోహయామి |

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః గజానారోహయామి |

సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |

ప్రార్థనా

నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ

జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః

కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే

ప్రణతక్లేశనాసాయ గోవిందాయ నమో నమః

నమస్తుభ్యం జగన్నాథ దేవకీ తనయ ప్రభో

వసుదేవసుతా నంత యశోదానందవరన

గోవింద గోకులాధార గోపీకాంత గుణార్ణవ

పాహి మాం పద్మనయన పతితం భవసాగరే

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి

 

క్షమా ప్రార్థన

అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా

దాసోయమితి మాం మత్వా క్షమస్వ పురుషోత్తమ

ఆవాహనం జానామి జానామి విసర్జనమ్

పూజావిధిమ్ జానామి క్షమస్వ పురుషోత్తమ

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన I

యాత్పూజితం మాయా దేవ పరిపూర్ణం తదస్తుతే I

అనయా పురుషసూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవాన్సర్వాత్మకః

శ్రీ కృష్ణ పరమాత్మా సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు

తీర్థము

[క్రింది మంత్రముతో తీర్థము తీసుకొనవలెను]

అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం

సమస్త పాపక్షయకరం శ్రీ కృష్ణ పాదోదకం పావనం శుభం

ప్రసాదం శిరసా గృహ్ణామి

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

ప్రసాదము

[క్రింది మంత్రముతో పుష్ప ప్రసాదము తీసుకొనవలెన ]

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

పాదోత్పలం పుష్పం తత్సుష్పం శిరసావహమ్

కోటిజన్మ కృతం పాపం తత్ క్షణేన వినశ్యతి

ఉద్యాసనం

[పూవ్వులు అక్షంతలు దేవునిపై ఉంచుకొని క్రింది మంత్రముతో దేవుని కదిలిచ్చి వాటిని దేవుని ముందు ఉంచవలెను ]

ఓం యజ్ఞేన యజ్ఞమయ జన్తదేవాః

తాని ధర్మాణి ప్రథమాన్యాసన్

తే నాకం మహిమానస్యజంతే

యత్ర పూర్వే సాధ్యాః సన్తిదేవాః

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

యథాస్తానం ప్రతిష్టాపయామి

శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ

కృష్ణాష్టమి కథ – Sri Krishnastami Charitra

వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనమ్

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్

            శ్రీకృష్ణుడు(Sri Krishna) జగద్గురువు. గీతను బోధించి లోకానికి దారి చూపాడు. శ్రీకృష్ణుడు అల్లరి బాలుడు. తన చిలిపి చేష్టలతో జీవిత  పరమార్థాన్ని చెప్పాడు. వెన్న దొంగగా అందరి మనసులను దోచుకున్నాడు. గోప బాలకుడిగా, సోదరునిగా, అసురసంహారిగా, ధర్మసంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు. ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కల్యాణం కోసమే. అసలు కృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించగలమా? ఇంట్లో చిన్న పిల్లలుంటే వారిని చిన్ని కృష్ణుడుతో పోలుస్తారు.

            కృష్ణుడులాంటి సంతానాన్ని పొందాలనుకుంటారు. బాగా అల్లరి చేసే పిల్లలను చిన్ని కృష్ణుడు, అల్లరి కృష్ణుడు అని పిలుస్తారు. కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే. అందుకే కృష్ణాష్టమి వస్తోందంటే చాలు. వాడవాడలా సందడి నెలకొంటుంది. పండగ పిల్లలదే. సందడంతా వారిదే. పంచె కట్టుకొని, కొప్పులో నెమలి ఫించం, మెడలో ముత్యాల హారాలు వేసుకొని అచ్చంగా చిన్ని కృష్ణుడిలా తయారవుతారు.

శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి (Janmashtmi) జరుపుకుంటారు.

శ్రీ కృష్ణ ననం (Sri Krishna Birth Secret)

కంసుడు పరమ రాక్షసుడు. కానీ అతనికి చెల్లెలు దేవకి అంటే అమితమైన ప్రేమ. ఆమెకు వసుదేవుడినిచ్చి పెళ్లి చేసి ఆనందంగా అత్తారింటికి సాగనంపుతున్న సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో ఎనిమిదో సంతానంగా పుట్టే కుమారుడు కంసుని సంహరిస్తాడని చెబుతుంది. దీంతో కోపోద్రిక్తుడైన కంసుడు తన చెల్లెలు దేవకి, బావ వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే సంహరిస్తుంటాడు.

అలా ఏడుగురు బిడ్డలను కోల్పోయిన దేవకీ దేవి ఎనిమిదోసారి గర్భం దాలుస్తుంది. సారి జన్మించబోయే బిడ్డే తనను సంహరిస్తాడని కంసుడికి ముందే తెలుసు. కాబట్టి చెరసాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేస్తాడు కంసుడు. అంతేకాదు బిడ్డ పుట్టగానే చంపాలనుకొంటాడు. నెలలు నిండటంతో శ్రావణ మాస బహుళ అష్టమినాడు రోహిణీ నక్షత్రయుక్త లగ్నంలో అర్థరాత్రి పూట శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. దివ్య తేజస్సు వెదజల్లుతున్న చిన్నారిని ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకీవసుదేవులు.

పసిబాలుడు శంఖచక్రగధాదులతో విష్ణుమూర్తిగా మారి ఏం చేయాలో చెబుతాడు. వెంటనే వసుదేవుడి సంకెళ్లు తెంచుకుంటాయి. చెరసాల తలుపులు కూడా తెరుచుకుంటాయి. కాపలాకాస్తున్న భటులు సొమ్మసిల్లి పడిపోతారు. బాల కృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లెకు బయలుదేరతాడు. దారిలో కుండపోతగా వర్షం. వర్షం చిన్నికృష్ణుడిపై పడకుండా ఆదిశేషుడు పగడలా మారి గొడుగు పడతాడు.

తర్వాత వసుదేవుడు యమునా నదిని దాటుకుంటూ వెళ్లి రేపల్లె చేరుకుంటాడు. అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లను ప్రసవిస్తుంది. వసుదేవుడు శ్రీకృష్ణుడిని యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకొని అక్కడి నుంచి తిరిగి చెరసాలకు చేరుకుంటాడు. మళ్లీ చెరసాల తలుపులు మూసుకుపోతాయి. వసుదేవుడి చేతికి సంకెళ్లు వాటికవే పడతాయి.

భటులకు మెలకువ వస్తుంది. పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం చేరవేస్తారు. దేవకి ఆడపిల్లను కన్నదనే వార్తను తెలుసుకొన్న కంసుడు కాస్త ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఎనిమిదో సంతానం మగపిల్లాడు పుడతాడని ఆకాశవాణి చెప్పింది. అయినా   పాపను చంపాలని బయలుదేరతాడు. ఆడపిల్ల వల్ల తనకు అపాయం రాదని, వదిలేయమని దేవకి అన్నను బతిమాలుతుంది.

అయినా వినకుండా బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తాడు. పాప యోగ మాయగా మారి కంసునికి దొరక్కుండా పైకి ఎగసినిన్ను చంపేవాడు పుట్టాడు. రేపల్లెలో పెరుగుతున్నాడుఅని చెప్పి మాయమవుతుంది. నందుడి ఇంట మరో మగ బిడ్డ జన్మించడంతో రేపల్లెలో పెద్ద ఉత్సవం  జరిపిస్తాడు నందుడు. అదే గోకులాష్టమిగా (Gokulashtmi) ప్రసిద్ధికెక్కింది.

శ్రీకృష్ణ లీలామృతం (Sri Krishna Leelamrutham)

భూమి మీద అధర్మం, అరాచకత్వం పెరిగిపోయి ధర్మం కానరానప్పుడు విష్ణుమూర్తి మానవ అవతారంలో జన్మించి అసుర సంహారం జరిపించి తిరిగి ధర్మాన్ని నెలకొల్పుతాడని హిందూమతం విశ్వసిస్తుంది. ధర్మాన్ని నిలబెట్టడానికి, మానవాళిని సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. తన మామ కంసుడు చేస్తున్న ఆరచాకాల నుంచి జనులను రక్షించేందుకు, అసుర సంహారం, అధర్మ వినాశనం చేయడం ద్వారా భూలోకంలో తిరిగి ధర్మస్థాపన చేశాడు. ఈ అవతారంలో కంసాది దానవులను సంహరించాడు. ధర్మాన్ని పాటించిన పాండవులకు అండగా నిలిచి అధర్మాన్ని ఓడించాడు. గీతాకారునిగా యుద్ధరంగంలో అర్జునుడికి హితబోధ చేశాడు. పుట్టుకచావుల పరమార్థం తెలిపాడు. దాన్నే భగవద్గీతగా మనం చదువుతున్నాం.

జన్మించిన నాటి నుంచి శ్రీకృష్ణుడు దేవతామూర్తిగా పూజలందుకుంటూనే ఉన్నాడు. అల్లరి బాలకుడిగా, వెన్నదొంగగా, గోపీలోలుడిగా, గోవర్ధన గిరిధారిగా, కాళీయమర్ధనుడిగా, గీతాప్రబోధకుడిగా, అసుర సంహారిగా తాను చేసిన ప్రతి పని ద్వారా మానవాళికి అద్భుతమైన సందేశాన్నిస్తూనే ఉన్నాడు. వెన్నను దొంగిలించి గోపబాలురకు పంచిపెట్టడం ద్వారా మనకున్నది నలుగురికివ్వడం వల్ల కలిగే సంతోషం ఎలా ఉంటుందో చేసి చూపించాడు.

తనకు బదులుగా గోవర్ధన గిరిని పూజించారనే కోపంతో ఇంద్రుడు రేపల్లెపై ఏకధాటిగా వానను కురిపిస్తే ఆ దాడి నుంచి తనవారిని, పశుపక్ష్యాదులను రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై నిలిపాడు. ఆ విధంగా ఇంద్రుడి మదాన్ని అణిచివేశాడు. పుట్టగానే తల్లిదండ్రులకు, యుద్ధ భూమిలో అర్జునుడికి కర్తవ్యబోధ చేశాడు. అందుకే ఆయన్ను కృష్ణం వందే జగద్గురుమ్అని కీర్తిస్తారు.

కృష్ణతత్వం అనంతమైనది. దాన్ని అర్థం చేసుకుంటేనే అందులోని మర్మం అర్థమవుతుంది. కుచేలుని నుంచి అటుకులు గ్రహించి అంతులేని సిరిసంపదలు ప్రసాదించిన కృష్ణుడు ప్రేమతో, భక్తితో తనకు ఏది సమర్పించినా ఆనందంగా స్వీకరిస్తాడు. భోగభాగ్యాలు ప్రసాదిస్తాడు. అలాగే కర్మఫలాన్ని సైతం అనుభవించాల్సిందేనంటాడు. దీనికి కుచేలుడే ఉదాహరణ. సుధాముడు తన స్నేహితుడే అయినప్పటికీ, కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నప్పటికీ కర్మ ఫలితం తీరేదాకా అనుగ్రహించలేదు.

మహాభారత యుద్ధంలోనూ తన యుద్ధనీతిని ప్రదర్శించాడు. అధర్మాన్ని అంతమొందించడానికి మాయోపాయాలు పన్నాడు. అబద్ధమాడని ధర్మరాజు చేత అశ్వత్థామ హత: కుంజర:’ అని అబద్ధమాడించాడు. కర్ణుడిని నిస్సహాయుణ్ని చేయడానికి విదురుడ్ని, భీష్ముడిని నిలువరించడానికి శిఖండిని ఉపయోగించాడు. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత చెరువులో దాక్కున్న దుర్యోధనుడిని సంహరించడానికి సైతం మాయోపాయాన్నే పన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణలీలలు ఎన్నో. ఎన్నెన్నో.

శ్రీకృష్ణాష్టమి విశిష్టత (Krishna Janmashtami Significance)

హిందూమతస్థులు శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళగౌరి, శ్రావణగౌరి వ్రతాలు చేస్తారు. ఈ మాసంలో వచ్చే మరో విశిష్టమైన పండగ శ్రీకృష్ణాష్టమి. ఇది శ్రీకృష్ణుని జన్మదినం. దీన్నే జన్మాష్టమి (Janmashtmi), గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటారు. గీతాచార్యుని జన్మనదినానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజును తల్లులందరూ తమని తాము దేవకీ,యశోదలుగా భావించుకుంటూ తమ బిడ్డలనే శ్రీకృష్ణుడి ప్రతిరూపాలుగా భావిస్తారు.

తమ చిన్నారులను చిన్నారి కృష్ణుడుగా అలంకరిస్తారు. పంచె కట్టి, తలపై కొప్పు వేసి నెమలి ఫించంతో అలంకరిస్తారు. అంటే ఈ పండగకు ఎంత ప్రాధాన్యమిస్తారో అర్థం చేసుకోవచ్చు. తన లీల ద్వారా భక్తి, జ్ఞానం, యోగం, మోక్షాల గురించి ప్రపంచానికి తెలియజేశారు శ్రీకృష్ణపరమాత్మ. దుర్గుణాలను వదిలి ధర్మమార్గాన్ని అనుసరించి జీవితానికి సార్థకత ఏర్పరచుకోవాలని దివ్యోపదేశం చేశాడు శ్రీకృష్ణుడు.

చెప్పడం మాత్రమే కాదు అనుసరించి చూపించారు. అందుకే వాసుదేవుడి బోధనలకు విలువ ఎక్కువ. ఈ రోజు శ్రీకృష్ణుణ్నిపూజిస్తే సకల సౌభాగ్యాలు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాదు సంతానం లేనివారు గోపాలున్ని పూజిస్తే సంతానప్రాప్తి  లభిస్తుందని విశ్వసిస్తారు.

కృష్ణాష్టమి పూజా విధానం (Pooja process)

శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజు  న్మించాడు. ఆ రోజునే మనం కృష్ణాష్టమిగారుపుకుంటాం. మిగిలిన పూజన్నీ ఉద‌య‌మే ప్రారంభ‌మైతే ఈ రోజు మాత్రం మధ్యాహ్నం సయంలో ప్రారంభవుతాయి. కృష్ణుడు అర్థరాత్రి జన్మించాడు. అష్టమీ తిథి రోహిణీ నక్షత్రం అర్థరాత్రి  యంలో ఉన్నప్పుడు మాత్రమే వ్రతాన్ని చేస్తారు.కాబట్టి కృష్ణాష్టమి పూజను కూడా రాత్రి సయంలో చేసే ఆచారం కొన్నిచోట్ల ఉంది

ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి, కు పసుపు  రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. బాలకృష్ణుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా కృష్ణ పాద ముద్రలు వేయాలి.

జన్మాష్టమి రోజు మనం చిన్నికృష్ణుణ్ని ఆరాధిస్తాం. అంటే చిన్న పిల్లలకు ఒంటికి నూనె రాసి, నలుగు పెట్టి, స్నానం చేయించి, అలంకరించి ఎంత మురిపెంగా చూసుకుంటామో ఈ రోజు చిన్ని కృష్ణున్ని కూడా అలాగే ఆరాధించాలి. చిన్ని కృష్ణుడి విగ్రహానికి పంచామ పంచామృతాలతో ఆ తర్వాతనీటితో అభిషేకం చేయాలి. అనంతరం నూతన వస్త్రాలు కట్టి, ఆభరణాలు అలంకరించాలి.

కృష్ణుడికి తులసీ  ళాలంటే క్కువ. కాబట్టి తులసిమాలను మెడలో వేయాలి. పూజ కోసం పొన్న పూలను వినియోగించాలి. ప్రసాదాలను నైవేద్యంగా  సమర్పించాలి. ఆ తర్వాత ఊయలలో విగ్రహాన్ని ఉంచి లాలి పాట పాడుతూ ఊయను ఊపాలి. ముత్తయిదువను పిలిచి వాయినాలివ్వాలి. ఆ తర్వాత కాసేపు గీతాపఠనం చేయాలి.

శ్రీకృష్ణాష్టమి నైవేద్యాలు (Prasada Nivedana)

కృష్ణుడికి వెన్న అంటే బాగా ఇష్టం. కాబట్టి కృష్ణాష్టమి రోజు దాన్నే కృష్ణుడికి నైవేద్యంగా పెడతారు. అయితే శాస్త్రం ప్రకారం కృష్టాష్టమి నాడు 102 కాల పిండి వంటలు చేయాలి. ఆరు కాల పానీయాలు యారు చేసి నైవేద్యం పెట్టాలి. వెన్న, పాలు, పెరుగు, బెల్లం, అటుకులు, శెనగపప్పు వంటి వాటిని కూడా నివేదన చేస్తారు

కృష్ణాష్ట‌మి రోజు ఇంట్లో కృష్ణ పాదాలు ఎందుకు వేస్తారు? (Reason behind Painting Krishna Padalu on Floor on the Day of Krishna Astami)

కృష్ణాష్టమి పూజలో భాగంగా గుమ్మం దగ్గరి నుంచి పూజ మంటపం వరకు శ్రీ కృష్ణ పాదాలను వేస్తుంటారు.

అసలు ఇలా వేయడం వెనక ఉన్న అంతరార్థం ఏమిటి? నేలపై పాదముద్రలు వేసి వాటిని అలంకరించడం ద్వారా బాల కృష్ణుణ్ని ఇంట్లోకి ఆహ్వానిస్తుంటారు. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లోకి సుఖసంతోషాలు ప్రవేశిస్తాయని నమ్ముతారు. అలాగే పాదాలను బయట నుంచి లోపలికి వస్తున్నట్టుగా వేస్తారు.

ఉట్టి కొట్టడం (Significance of Utti(Dahi Handi))

కృష్ణాష్టమి యంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా సందడి కనిపిస్తుంది. ఆ రోజు ఉట్టి కొడతారు. దీన్నే ఉత్తర భారతంలో హీ హండిఅని పిలుస్తారు. ఇంటింటికీ వెళ్లి మట్టి కుండలో పెరుగు, పాలు, చిల్లబ్బులు సేకరించి దాన్ని ఉట్టిలో పెట్టి. ఆ తర్వాత పొడవైన తాడు కట్టి లాగుతూ ఉంటారు. సాధారణంగా ఉట్టిని ఒకరు పైకి కిందకు లాగుతుంటే.. మరొకరు కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఒకరి తర్వాత ఒకరు అలా ప్రయత్నిస్తూనే ఉంటారుఒక్కరిగా కొట్టడం విఫలమైతే సమష్టిగా దాన్ని కొట్టడానికి ప్రయత్నిస్తారు.

చేయీ చేయీ కలిపి ఒకరి భుజాలపై మరొకరు ఎక్కి  దాన్ని పగలగొడతారు. ఈ ప్రయత్నాన్ని చెడగొట్టడానికి ముఖాలపై వసంతం నీళ్లు పోస్తుంటారు. అయినా పట్టు వదలకుండా ఉట్టి కొడతారు. దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటంటే.. సమష్టిగా కృషి చేస్తే ఎంతటి అవరోధాన్నైనా అధిగమించచ్చు. కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడానికి ఉన్న మరో కారణం చిన్ననంలో గోపాల కృష్ణుడు ఉట్టిపై దాచిన వెన్న కుండను పగొట్టి దాన్ని గోప బాలకులకు పంచిపెట్టేవాడు. లుగురితో పంచుకోవడంలో ఉన్న ఆనందమేమిటో లోకానికి చాటి చెప్పాడు. దాన్ని స్మరించుకుంటూనే ఉట్టి కొడతారు.