Sri Siddhi Vinayaka Vratham - శ్రీ సిద్ది వినాయక వ్రతకల్పము
Sri Siddhi Vinayaka Vratham - శ్రీ సిద్ది వినాయక వ్రతకల్పము
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యో నమః
హరిః ఓం
శుచిః
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతో పి వా
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష
ప్రార్థన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నేపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే
దేవీం వాచమజనయన్త దేవాస్తాం విశ్వరూపాః పశవో వదన్తి
సా నో మన్ద్రేషమూర్జం దుహానా ధేనుర్వాగస్మానుప సుష్టుతైతు
యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వ మంగళ
తయెః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం
అయం ముహూర్తః సుముహూర్తోస్తు
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం
తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి
గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః
ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః
సర్వమంగళ మాంగళ్యే శివె సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమెస్తుతే
శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః
ఉమా మహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః
శచీ పురందరాభ్యాం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః
శ్రీ సీతారామాభ్యాం నమః
మాతా పితృభ్యో నమః
సర్వేభ్యో మహజనేభ్యో నమః
గాయత్రో ప్రార్థన
ఓం ముక్తా విద్రుమహేమనీల దవళచ్చాయై ర్ముఖైస్త్రీక్షణైః
యుక్తా మిందుకళానిబద్దరత్న ముకుతామ్ తత్త్వార్థవర్ణాత్మికామ్
గాయత్రీ వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలంగదాం
శంఖం చక్రమాధారవింద యుగళం హస్తైర్వహ న్తీంభజే
గాయత్రీ మంత్రము
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యదీమహిః ధియోయోనః ప్రచోదయాత్
దీపారాధన
దీపంజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం పూజాసమయే దీపం నమోస్తుతే
దీపస్త్వం బ్రహ్మ రూపొసి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్నామాంశ్చ దేహి మే
భో దీప దేవి రూపస్త్వం కర్మసాక్షీ హ్యవిఘ్నకృత్
యావత్పూజం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ
శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదమ్
శత్రుబుద్దివినాశం చ దీప జ్యోతిర్నమోస్తుతే
దీపారాధన ముహూర్తః సుముహూర్తోస్తు
అచమనము
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణువే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్థనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః
ఘంట పూజా
ఓం జయధ్వని మంత్రమాతః స్వాహా
ఘంతదేవతాభ్యో నమః
సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి
ఘంటనాదం
(క్రింది మంత్రము చెప్పుచు ఘంటా నాదము చేయవలెను)
ఆగమార్థంతు దేవానాం గమనార్థం తు రాక్షసాం
కురుఘంటారవం తత్రదేవతాహ్వాన లాంఛనమ్
ఇతి ఘంతానాదం కృత్వా
భూతోచ్ఛాటనం
(క్రింది మంత్రము చెప్పుచు నీళ్లు ప్రోక్షించవలెను)
ఓం ఉత్తిష్ఠంతు భూత పిశాచాః య ఏతే భూమి భారకాః
ఏతేషామవిరీధేన బ్రహ్మకర్మ సమారభే
అపసర్పన్తు తే భూతా యే భూతా భూమి సంస్థితాః
యే భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయా
ప్రాణాయామం
(క్రింది మంత్రము చెప్పుచు ప్రాణాయామము చేయవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః
ఓం జనః ఓం తపః ఓం సత్యం
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః
ప్రచోదయాత్
ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్
సంకల్పం
మమ ఉపాత్త సమస్త దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర
ప్రీత్యార్థం శుభాభ్యం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహవిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య
అద్య బ్రహ్మణః ద్వితియ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే
ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరత ఖండే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ
ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానెన ప్రభవాది
షష్టి సంవత్సరాణాం మధ్యే ....................... సంవత్సరే..................... ఆయనే ................... ఋతౌ
................. మాసే .................... పక్షే .................... తిథౌ
.................... వాసరే .................. శుభ నక్షత్ర శుభ యోగ శుభకరణ ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ
అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమస్థైర్య దైర్ఘ్య వీర్య విజయ, అభయ ఆయుః, ఆయురారోగ్యైశ్వర్య
అభివృద్ది సిద్ద్యర్థం, భక్తిజ్ఞాన వైరాగ్య సిద్ద్యర్థం,
ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ద్యర్థం, పుత్రపౌత్రాబి వృద్ద్యర్థం, సద్బుద్దీత్యాది,
సర్వశుభఫలప్రాత్రాబి వృద్ద్యర్థం, సద్బుద్దీత్యాది,
సర్వశుభఫలప్రాప్త్యర్థం శీఘ్రమేవ దంపతీనాం, అనుకూల
దాంపత్య సిద్ద్యర్థం సంతానార్థినాం, శ్రీఘ్రమేవ సత్సంతాన
ప్రాప్త్యర్థం, సమస్తరోగ నివారణ సిద్యార్థం, జాతకరీతయ్య, గోచారరీత్య సంపూర్ణ నవగ్రహ దోష
నివార్ణార్థం సర్వాబీష్ట సిద్ద్యర్థం లోక క్షేమర్థం యావచ్చక్తి ధ్యానావాహనాది
షోడశోపచార శ్రీ సిద్ది గణపతి స్వామి
దేవతముద్దిస్య సమస్త
మంగళావాప్యార్థం సమస్త దురితోప శాంత్యర్థం
సిద్ది వినాయక ప్రసాద సిద్ధ్యర్థం భాద్రపద శుక్ల చతుర్థీ
పూణ్యకాలే సిద్దివినాయక పూజం కరిష్యే
శ్రీ సిద్ది గణపతి స్వామి
ప్రీత్యార్థం కలశ పూజాం కరిషే
తదంగ కలశారాధనం కరిషే
కలశపూజ
కలశం గంధపుష్పాక్షతైరభర్బ్య తదుపరి హస్తమ్ నిధాయ
కలశస్య ముఖేః విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో
బ్రహ్మ మధ్యే మాత్నగణాశ్రితా కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ
యజుర్వేదో సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంతు సమాశ్రితా ఆయాంతు దేవ
పూజార్థం మమదురి తక్షయకారకాః అత్ర గాయత్రీ సావిత్రీ శాంతిః పుష్టీకరీశ్వరీ
ఆపో వా ఇదగ్ం సర్వం విస్వా భూతాన్యాపః
ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపః
సమ్రాడాపో విరాడాపః స్వరాణాపశ్ఛందాగ్ స్యాపో
జ్యోతిగ్ ష్యాపో యజూగ్ ష్యాపః సత్యమాపః
సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప
ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు
కావేరి తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ
భాగీరధీ చ విఖ్యాతాః పంచ గంగాః ప్రకీర్తితః
కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవమాత్మానంచ
సంప్రోక్ష, ఆత్మానంచ సంప్రోక్ష్య
గణపతి పూజ
అథ మహాగణపతి పూజాంకరిష్యే
అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి పూజయామి
ధ్యానం
హరిద్రాభం చతుర్భాహుం
హరిద్రావదనం ప్రభుమ్ |
పాశాంకుశధరం దేవం
మోదకం దంతమేవ చ |
భక్తాభయ ప్రదాతారం
వందే విఘ్నవినాశనమ్ |
ఓం హరిద్రా గణపతేయే నమః
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేక దంతం భక్తానం ఏకదంతముపాస్మహే
ఓం గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆనః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్
ఓం మహాగణపతయే నమః
ధ్యాయామి | ధ్యానం సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః
ఆవాహయామి | ఆవాహనం సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః
నవరత్న ఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి
|
ఓం మహాగణపతయే నమః
పాదయోః పాద్యం సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః
హస్త యోః అర్ఘ్యం సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః
ముఖే ఆచమనీయం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః
శుద్ధోదక స్నానం సమర్పయామి
స్నానానంతరం
ఆచమనీయం సమర్పయామి |
ఓం శ్రీ మహాగణపతయే నమః
వస్త్రం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః
యజ్ఞోపవీతం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః
దివ్య శ్రీ గంథం సమర్పయామి
గంథస్యోపరి అలంకరణార్థం హరిద్రా కుంకుమ సమర్పయామి ||
ఓం మహాగణపతయే నమః
అక్షతాన్ సమర్పయామి
ఓం మహాగణపతయే నమః
పరిమళ పత్రపుష్యైః పూజయామి
పుష్పం
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణికాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికాటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ధూమకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కందపూర్వజాయ నమః
ఓం సర్వసిద్దిప్రదాయ నమః
ఓం శ్రీ మహాగణపతయే నమః
ఇతి షోడశ నామావళి పూజం సమర్పయామి
ధూపం
వనస్సత్యుద్భవిర్దివ్యై నానా గంధైః సుసంయుతః
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం
ఓం మహాగణపతయే నమః
ధూపం ఆఘ్రాపయామి
దీపం [ఏకార్తి]
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం |
గృహణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ ||
భక్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే |
త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే ||
ఓం మహాగణపతయే నమః
ప్రత్యక్ష దీపం సమర్పయామి
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః
నైవేద్యం సమర్పయామి
నీరాజనం
మంగళం సుముఖోదేవ
మంగళం ఆఖువాహన మంగళం విఘ్నరాజాయ మంగళం స్కందపూర్వజః
ఓం శ్రీ
మహాగణపతయే నమః
కర్పూర నీరాజనం సమర్పయామి
మంత్రపుష్పం
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ||
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కంద పూర్వజః ||
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే
ఓం మహాగణపతయే నమః
సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
ఓం మహాగణపతయే నమః
ఛత్ర చామరాది సమస్త రాజోపచారాన్
సమర్పయామి ||
క్షమాప్రార్థన
“వక్రతుండ ! మహాకాయ ! సూర్య కోటి సమప్రభ !
నిర్వఘ్నం కురు మే దేవ ! సర్వ కార్యేషు సర్వదా “
అనయా ధ్యాన ఆవాహనాది షోడశో పచార పూజయా
భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు
ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు |
ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు || మమ ఇష్తకామ్యార్థ
సిద్దిరస్తు
శ్రీ మహాగణపతి ప్రసాదం
శిరసా గృహ్ణామి ||
ఓం శ్రీ మహాగణపతయే నమః
యథాస్థానం ప్రతిష్ఠాపయామి ||
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ
చ |
ఓం శాంతిః శాంతిః
అథ పీఠ పూజాంకరిష్యే
పీఠపూజ
ఓం ఆదారశక్త్యే నమః
ఓం మూల ప్రకృత్యై నమః
ఓం కూర్మాయ నమః
ఓం వరాహాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం అష్టదిగ్గజేభ్యో నమః
ఓం తన్మధ్యేక్షీరార్ణవాయ నమః
ఓం క్షీరార్ణవ మధ్యేశ్వేత ద్వీపాయ నమః
శ్వేతద్వీప స్యాధః
కల్పవృక్షాయ నమః కల్పవృక్ష స్యాధః
సువర్ణమంటపాయ నమః
ఇతి పీఠపూజాం సమార్పయామి
అథ ద్వారపాలక పూజాంకరిష్యే
పూర్వద్వారే ద్వార శ్రియై నమః విజయాయ నమః
దక్షిణద్వారే ద్వారశ్రియై నమః
నందాయ నమః సునందాయ
నమః
పశ్చిమ ద్వారే శ్రియై నమః
బలాయ నమః ప్రబలాయ నమః
ఉత్తరద్వారే ద్వారశియై నమః కుముదాయనమః కుముదాక్షాయ నమః
ఇది ద్వారపాలక పూజాం సమర్పయామి
శ్రీ సిద్ది వినాయక వ్రతకల్పము
ప్రాణప్రతిష్ట
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః
పునః ప్రాణమిహ నోధేహి భోహమ్
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరన్త
మనుమతే మృడయా నః స్వస్తి
అమృతం వై ప్రాణా అమృతమాపః
ప్రాణనేవ యథాస్థానముపహ్వయతే శ్రీ మహాగణపతయే నమః
ఆవాహితోభవ, స్థాపితోభవ, సన్నిహితోభవ సన్నిరుద్దోభవ
అవకుకుంఠితోభవ, వరదొభవ, శాంతోభవ, స్థిరో భవ
వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు
గణేష గాయత్రి
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుణ్ణాయ ధీమహి తన్నో దన్తీ ప్రచోదయాత్
ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుణ్ణాయ ధీమహి తన్నో దన్తీ ప్రచోదయాత్
ప్రార్థనా
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్దివినాయకం
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం
ధ్యానం
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః ధ్యాయామి |
ఆవాహనం
అత్రాగచ్ఛ జగద్వంద్వ సురరాజార్చి తేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః ఆవాహయామి |
ఆసనం
పురుష ఏ వేదగ్ం సర్వమ్ యద్బూతం యచాభవ్యయం
ఉతామృతత్వ స్యేశానః యదన్నేనాతి రోహతి
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః ఆసనం సమర్పయామి
పాద్యం
ఏతావానస్య మహిమా అతోజ్యాయాగ్ంశ్చ పురుషః
పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యా మృతందివి
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక |
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన ||
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి
అర్ఘ్యం
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః పాదోస్యేహ భవాత్పునః
|
తతో విశ్వజ్వక్రామత్ సాశనానశనే అభిహస్తయోః
||
గౌరిపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన |
గృహాణార్థం మయాదత్తం గంథపుష్పాక్షతైర్యుతమ్ ||
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి
ఆచమనం
తస్మాద్విరాడాజాయ విరాజో అధిపురుషః సజాతో
త్యరిచ్యత పశ్చాద్బూమి మథోపురః
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత
గృహానాచం దేవ తుభ్యం తద్దం దేవో ప్రభా
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః ఆచమనం సమర్పయామి
మధువర్కం
యత్పురుషేణ హవిషాదేవాయజ్ఞ మతన్వతో వనంతో
అస్యాసీ దాజ్యం గీష్మ ఇధ్మ శరద్దవిః
దద్ధిక్షీర సమాయుక్తం మధ్వజ్యేన సమన్వితమ్
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః మధువర్కం సమర్పయామి
పంచామృత స్నానం
మధ్యాజ్య శర్కరాయుక్తం దధి క్షీర సమన్వితం
పంచామృతం గృహాణేదం భక్తానామిష్టదాయకా
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి
శుద్ధోదక స్నానం
గంగాది పూణ్యపానీయై గంథ పుష్పాక్షతైర్యుతైః
స్నానం కురుష్య భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే
శ్రీ గణపత్యథర్వశీర్షోపనిషత్
చూ. ||
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి
వస్త్రం
రక్తవస్త్రద్వయం
చారు దేవయోగ్యం చ మంగళమ్ |
శుభప్రద
గృహాణ త్వం లంబోదర హరాత్మజ ||
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి
యజ్ఞోపవీతం
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం |
గృహాణ చారు సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ||
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి
గంథము
చందనాగరు
కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్ |
విలేపనం
సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతి గృహ్యతామ్ ||
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః శ్రీగంథం సమర్పయామి
అక్షతాన్
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ |
గృహాణ పరమానంద
శంభుపుత్ర నమోస్తుతే ||
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి
పుష్పాణి
సుగంధీని చ పుష్పాణి జాజికుంద ముఖాని చ |
ఏకవింశతి పత్రాణి సంగృహాణ
నమోస్తుతే ||
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః పుష్పాణి సమర్పయామి
అథః అంగపూజా
ఓం
పార్వతీనందనాయ నమః
పాదౌ పూజయామి
ఓం
గణేశాయ నమః
గుల్పౌ పూజయామి
ఓం
జగద్ధాత్రే నమః
జంఘే పూజయామి
ఓం
జగద్వల్గభాయ నమః
జానునీ పూజయామి
ఓం
ఉమాపుత్రాయ నమః
ఊరూ పూజయామి
ఓం
వికటాయ నమః
కటిం పూజయామి
ఓం
గుహాగ్రజాయ నమః
గుహ్యం పూజయామి
ఓం
మహోత్తమాయ నమః
మేడ్రం పూజయామి
ఓం
నాథాయ నమః
నాభిం పూజయామి
ఓం
ఉత్తమాయ నమః
ఉదరం పూజయామి
ఓం
వినాయకాయ నమః
వక్షస్థలం పూజయామి
ఓం
పాశచ్ఛిదే నమః
పార్శ్వే పూజయామి
ఓం
హేరంబాయ నమః
హృదయం పూజయామి
ఓం
కపిలాయ నమః
కంఠం పూజయామి
ఓం
స్కందాగ్రజాయ నమః
స్కందౌ పూజయామి
ఓం
హరసుతాయ నమః
హస్తాన్ పూజయామి
ఓం
బ్రహ్మచారిణే నమః
బాహున్ పూజయామి
ఓం
సుముఖాయ నమః
ముఖం పూజయామి
ఓం
ఏకదంతాయ నమః
దంతౌ పూజయామి
ఓం
విఘ్ననేత్రే నమః
నేత్రే పూజయామి
ఓం
శూర్పకర్ణాయ నమః
కర్ణే పూజయామి
ఓం
ఫాలచంద్రాయ నమః
లలాటం
పూజయామి
ఓం
నాగాభరణాయ నమః
నాశికాం పూజయామి
ఓం
చిరంతనాయ నమః
చుబుకం పూజయామి
ఓం
స్థూలోష్ఠాయ నమః
ఓష్ఠా పూజయామి
ఓం
గళన్మదాయ నమః
గండే పూజయామి
ఓం
కపిలాయ నమః
కచాన్ పూజయామి
ఓం
శివప్రియాయై నమః
శిరః పూజయామి
ఓం
సర్వమంగళానుతాయ నమః
సర్వాణ్యాంగాని పూజయామి
ఏకవింశతి పత్ర పూజ [ 21 రకాల ఆకులు ]
ఓం ఉమాపుత్రాయ నమః - మాచీపత్రం సమర్పయామి
[ దర్భ ]
ఓం హేరంబాయ నమః - బృహతీపత్రం సమర్పయామి
[ నేలములక ]
ఓం లంబోదరాయ నమః - బిల్వపత్రం సమర్పయామి
[ మారేడు ]
ఓం ద్విరదాననాయ నమః - దూర్వా పత్రం సమర్పయామి
[ గరిక ]
ఓం ధూమకేతవే నమః - ధత్తూర పత్రం సమర్పయామి
[ ఉమ్మెత్త ]
ఓం బృహతే నమః - బదరీ పత్రం సమర్పయామి
[ రేగు ]
ఓం అపవర్గదాయ నమః - అపామార్గ పత్రం సమర్పయామి
[ ఉత్తరేణి ]
ఓం ద్వైమాతురాయ నమః - తులసీ పత్రం సమర్పయామి
[ తులసి ]
ఓం చిరంతనాయ నమః - చూత పత్రం సమర్పయామి
[ మామిడి ఆకు ]
ఓం కపిలాయ నమః - కరవీర పత్రం సమర్పయామి
[ గన్నేరు ]
ఓం విష్ణుస్తుతాయ నమః - విష్ణుక్రాంత
పత్రం సమర్పయామి
[ నీలం పువ్వుల చెట్టు ఆకు ]
ఓం ఏకదంతాయ నమః - దాడిమీ పత్రం సమర్పయామి
[ దానిమ్మ ]
ఓం అమలాయ నమః - ఆమలకీ పత్రం సమర్పయామి
[ దేవదారు ]
ఓం మహతే నమః - మరువక పత్రం సమర్పయామి
[ మరువము ]
ఓం సింధూరాయ నమః - సింధూర పత్రం సమర్పయామి
[ వావిలి ]
ఓం గజాననాయ నమః - జాతీ పత్రం సమర్పయామి
[ జాజిపత్రి ]
ఓం గండగళన్మదాయ నమః - గండవీ పత్రం సమర్పయామి
[ తెల్లగరిక ]
ఓం శంకరప్రియాయ నమః - శమీ పత్రం సమర్పయామి
జమ్మి
ఓం భృంగరాకత్కటాయ నమః - అశ్వత్థ పత్రం సమర్పయామి
[ జమ్మి ]
ఓం అర్జునదంతాయ నమః - అర్జున పత్రం సమర్పయామి
[ మద్ది ]
ఓం అర్కప్రభాయ నమః - అర్క పత్రం సమర్పయామి
[ జిల్లేడు ]
ఏకవింశతి పుష్ప పూజా
పుష్పాలు [ 21 పుష్పాలు ]
ఓం
పంచాస్య గణపతయే
నమః - పున్నాగ పుష్పం సమర్పయామి
ఓం
మహా గణపతయే
నమః - మందార
పుష్పం సమర్పయామి
ఓం
ధీర గణపతయే
నమః - దాడిమీ
పుష్పం సమర్పయామి
ఓం
విశ్వక్సేన గణపతయే
నమః - వకుళ
పుష్పం సమర్పయామి
ఓం
ఆమోద
గణపతయే నమః
- అమృణాళ
[తామర] పుష్పం
సమర్పయామి
ఓం
ప్రమథ గణపతయే
నమః - పాటలీ
పుష్పం సమర్పయామి
ఓం
రుద్ర గణపతయే
నమః - ద్రోణ
పుష్పం సమర్పయామి
ఓం
విద్యా గణపతయే
నమః - ధత్తూర పుష్పం
సమర్పయామి
ఓం
విఘ్న గణపతయే
నమః - చంపక
పుష్పం సమర్పయామి
ఓం
దురిత గణపతయే
నమః - రసాల
పుష్పం సమర్పయామి
ఓం
కామితార్థప్రద గణపతయే
నమః - కేతకీ
పుష్పం సమర్పయామి
ఓం
సమ్మెహ
గణపతయే నమః
- మాధవీ పుష్పం
సమర్పయామి
ఓం
విష్ణు గణపతయే
నమః - శమ్యాక
పుష్పం సమర్పయామి
ఓం
ఈశ గణపతయే
నమః - అర్క
పుష్పం సమర్పయామి
ఓం
గజాస్య గణపతయే
నమః - కల్హార
పుష్పం సమర్పయామి
ఓం
సర్వసిద్ది గణపతయే
నమః - సేవంతికా పుష్పం సమర్పయామి
ఓం
వీర గణపతయే
నమః - బిల్వ
పుష్పం సమర్పయామి
ఓం
కందర్భ గణపతయే
నమః - కరవీర
పుష్పం సమర్పయామి
ఓం
ఉచ్చిష్ఠ గణపతయే
నమః - కుంద
పుష్పం సమర్పయామి
ఓం
బ్రహ్మ గణపతయే
నమః - పారిజాత పుష్పం సమర్పయామి
ఓం
జ్ఞాన గణపతయే
నమః - జాతీ
పుష్పం సమర్పయామి
ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా
[రెండు దళములు కలిసిన గరిక]
ఓం గణాధిపాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం పాశాంకుశధరాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఆఖువాహనాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం వినాయకాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఈశపుత్రాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం సర్వసిద్దిప్రదాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఏకదంతాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఇభవక్త్రాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం మూషికవాహనాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం కుమారగురువే నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం కపిలవర్ణాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం బ్రహ్మచారిణే నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం మోదకహస్తాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం సురశ్రేష్ఠాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం గజనాసికాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం కపిత్థఫలప్రియాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం గజముఖాత నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం సుప్రసన్నాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం సురాగ్రజాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఉమాపుత్రాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం స్కందప్రియాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః నానావిధ పత్ర పుష్పాణి సమర్పయామి |
అథ అష్టోత్తరశతనామ పూజా
శ్రీ వినాయకాష్టోత్తర శతనామావళిః
శ్రీ గణేశ
అష్టోత్తర శతనామావళిః
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైముఖాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ
నమః || 10 ||
ఓం సుఖనిధయే నమః
ఓం సురారిఘ్నే నమః
ఓం మహగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః || 20 ||
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః || 30 ||
ఓం శ్రీపతయే నమః
ఓం వాకృతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మాజాయ నమః || 40 ||
ఓం పురాణపురుషాయ నమః
ఓం పుష్ణే నమః
ఓం పుష్కరోక్షిప్త వారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వస్మై నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః || 50 ||
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిద్దిప్రదాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమారగురువే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః || 60 ||
ఓం మోదక ప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపీత్థఫల ప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విఘ్ణప్రియాయ నమః || 70 ||
ఓం భక్తజీవితాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాదీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్తనిథయే నమః || 80 ||
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సుఖప్రదాయ నమః
ఓం సరసాంబు నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః || 90 ||
ఓం సమస్త దేవతా మూర్తయే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాతకారిణే నమః
ఓం విశ్వదృశే నమః
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణగురువే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం అపరాజితాయ నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్య ప్రదాయ నమః || 100 ||
ఓం శుభ్రదంతాయ నమః
ఓం శుభదాయ నమః
ఓం శుభవిగ్రహాయ నమః
ఓం ఆక్రాంత చిదచిత్ర్పభవే నమః
ఓం విఘ్నేశ్వరాయ నమః
ఓం వరసిద్ది నమః
ఓం వినాయకస్వామినే నమః
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః
అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి
ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంథి సుమనోహరం |
ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదో భవ ||
ఓం శ్రీ
సిద్దివినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి
దీపం
సాజ్యం త్రివర్తి
సంయుక్తం వహ్నినా యోజితం మయా |
గృహాణ మంగళం
దీపం ఈశపుత్ర నమోస్తు తే ||
ఓం శ్రీ
సిద్దివినాయక స్వామినే నమః దీపం దర్శయామి
శ్రీ సిద్ది వినాయక వ్రతకల్పం
విఘ్నేశ్వరుని కథా ప్రారంభము
పూర్వము నైమిశారణ్యంబున సత్రయాగంబు చేయు శౌనకాది మహర్షులకు సకలకథా విశారదుడగు సూతమహాముని ఒక్కనాడు విఘ్నెశ్వతరోత్పత్తియు, చంద్ర దర్శన దోషకారణంబును, శాపమోక్ష ప్రకారంబును చెప్పుచుండెను.
గజాసుర వృతాంతం
పూర్వము గజరూపముతో నున్న రాక్షసేశ్వరుడు శివుని గూర్చి ఘోర తపం చేసెను, అతని తపమునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా, గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి "స్వామీ ! మీరు ఎల్లప్పుడూ నా యుదర మందే నివసించి కాపాడుచుండు " డని కోరగా భక్త సులభుండగు నా మహేశ్వరుడు అతని కోర్కిక దీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించి సుఖంబుగ నుండెను.
కైలాసమందు పార్వతికి భర్త జాడ తెలియక, అనేక విధాలుగా అన్వేషించి, చివరకు బ్రహ్మాది దేవతలను శరణువేడింది. విష్ణుమూర్తి, బ్రహ్మాది దేవతలు కైలాస నాథుడుని యథాస్థానమగు కైలాసమునకు తీసుకురావాలనీ సంకల్పముతో విష్ణుమూర్తి నందిని గంగిరెద్దుగాను, బ్రహ్మది దేవతలును బాజాభజంత్రీలుగాను, తాను ఆ మేళానికి నాయకుడుగా వేషాలు మార్చుకొని గజాసురుడి సభకు వెల్లారు. తమ ఆటలతో పాటలతో, గంగిరెద్దును ఆడిస్తూ, గజాసురుడిని ప్రసన్నము చేసుకొన్నారు.
ఆ సంతుష్టి సమయములో గజాసురుడు మీకు ఏమి కావాలో వరం కోరుకోమనెను. శ్రీ హరి అది విని "నీ ఉదరమందున్న సదా శివుడిని మాకు ఇమ్ము" అని అడిగాడు. ఈ కోరిక కోరింది సామాన్యులైన గంగిరెద్దు ఆటగాళ్లు గాదు, వీరు లోకాలను పాలించే దేవతలైన బ్రహ్మ, విష్ణులుగా గుర్తించాడు. గజాసురుడు వారితో మహానుభావులారా! శివుని మీకు అప్పగిస్తాను అన్నాడు. చివరిసారిగా శివుని తలచి "స్వామి! నా రెండు కోరికలు తీర్చిపెట్టు అన్నాడు. మోదటిది ఎల్లప్పుడు నీవు నా చర్మాన్ని ధరించాలి. రెండోది ఈ ఏనుగు ముఖము నిత్యం పూజనీయం కావాలి అని కోరాడు. శివుడు తదాస్తు అన్నాడు. ఆ క్షణమే రాక్షసుడు ఉదరము చీల్చుకొని బయటకు వచ్చాడు. ప్రమథ గణాన్ని గజాసురుడి ముఖాన్ని తీసుకురమ్మన్నాడు. చర్మాన్ని ఒంటికి కప్పుకొని కైలాసానికి ప్రయాణమయ్యాడు.
గణపతి పుట్టుక [
వినాయకోత్పత్తి ]
పరమశివుడు కైలాసమునకు వస్తున్నాడనే వార్తతో పార్వతి సంతోశించింది. ఆయనకు ఆహ్వానించెందుకు ముస్తాబవడం కోసం అభ్యంగన స్నానమునకు సిద్దపడింది. సమయమునకు ద్వారపాలకు లెవ్వరులేక, తాను వంటికి రాసుకోగా మిగిలిన నలుగు పిండి బాలుని చేసి, ప్రాణం పోసి గణాధిపతిగా చేసి ద్వారం వద్ద కాపులా వుండెను. పార్వతి స్నానానంతరము సర్వాభరణమునకు సిద్దమయ్యెను. ఈ లోగా సదాశివుడు యధా ప్రకారం లోనికి వెళ్లుతుండగా ద్వారపాలకుడైన బాలుడు అడ్డుకొన్నాడు. శివుడు ఆగ్రహంతో తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సు ఖండించేను. బైటకు వచ్చిన పార్వతి ఈ సంఘటన చూసి ఎంతగానో విలపించింది. సరళ హృదయుడైన సదాశివుడు ఆమె కొరకు తాను తీసుకువచ్చిన గజాముఖాన్ని అతికించి, ప్రాణప్రతిష్ట చేసాడు. ఆ విధముగా గణపతి, గజముఖ గణపతి అయ్యాడు. పుత్ర ప్రేమతో పార్వతి పరమేశ్వరులు ఆనందంగా కాలము గడిపారు. గజాననుడు కూడ భక్తిభావంతో తల్లిదండ్రులను సేవించెవాడు. గజాననునికి సులభంగా ఎక్కితిరుగుటకు అనింద్యుడను నొక మూషికమును వాహనంగా చేసుకొనెను.
కొంతకాలమునకు పార్వతి పరమేశ్వరులకు కుమరస్వామి పుట్టాడు. అతడు మహాబలశాలి, అతని వాహనం నెమలి. అతడు దేవతల సేనానాయకుండై ఉండేను.
విఘ్నెశ్వరాధిపత్యం
ఒకనాడు దేవతలు, మునులు, మానవులు కైలాసంబునకు వెళ్ళి పరమెశ్వరుని సేవించి, విఘ్నముల అధిపతి కావాలన్నారు. దానికి గణపతి, కుమారస్వాములిద్దరూ సిద్దమయ్యారు. దానికి సదాశివుడు మీలో ఎవ్వరైతే ముల్లోకాలలో గల పుణ్యక్షేత్రాలలో స్నానమాచరించి ముందుగా వస్తారో వారికి విఘ్నాదిపత్యం ఇస్తామన్నాడు. అందుకు కుమారస్వామి నేనే అగ్రజుడు కంటే ముందుగా రాగలను ఆయన గుజ్జురూపంతో ఎక్కడకు వెల్లగలడు అని అహంకారంతో వెళ్ళాడు
గణపతికి ఏమి తోచక తల్లిదంద్రులను శరణు వేడుకొన్నాడు "సకృన్నారాయణే త్యుక్త్యాపు, మాస్కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు, స్నాతోభవతి పుత్రిన్" కుమారా! ఒక్కసారి నారాయణ మంత్రాన్ని జపించిన వారికి మూడు వందల కల్పంబులు పుణ్యనదులలో స్నానమాచరించిన పుణ్యం కలుగుబు, అని మంత్రమును సదాశివుడు గజాననుదికి ఉపదేశించాడు. ఆ మంత్ర ప్రభావం వలన కుమారస్వామి కంటే గణపతియే ముందుగా అన్ని పుణ్యక్షేత్రాలలో స్నానమాచరించినట్లుగా కుమారస్వామికి కనపడింది. కుమారస్వామి తన అహంకారానికి పశ్చాత్తాపపడి గజానునకు విఘ్నాధీపత్యం యిమ్మని ప్రార్థించాడు. భాద్రపద శుద్ద చవితి తిథి రోజున విఘ్నాధిపత్యం ఇచ్చారు. ఆనాడు సర్వదేశీయులు విఘ్నేశ్వరునికి కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరతపండ్లతో యథాశక్తిగా పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను తిని మిగిలినది తన వాహనము మూషికకు ఇచ్చి మిగిలినవి చేతితో పట్టుకొని భూక్తాయాసంతో కైలాసానికి వెళ్ళాడు.
నీలాపనింద – ప్రభావం
కైలాసం చేరిన విఘ్నేశ్వరుడు
తన తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రణామములు చేయాలనే తలంపుతో బోర్లపడుటకు చాలా యాతనపడుచుండగా,
శివుని శరంబున ఉన్న చంద్రుడు చూసి వికటముగా నవ్వెను. అనంతరం
విఘ్నేశ్వరుని పొట్టపగిలి పోయెను. పార్వతిదేవి ఆగ్రహించి "పాపాత్ముడా! నీ దృష్టి
ప్రభావం వల్ల నా కుమారుడికి ఈ దుర్గతి కలిగింది. నిన్ను
జూచిన వారు పాపాత్ములై, నీలాపనిందలు పొందుదురుగాక!" అని శపించింది.
ఋషిపత్నులకు నిలాపనింద కలుగుట
సప్తమహర్షులు యజ్ఞంబుచేయుచు తమ భర్యలతో అగ్నికి ప్రదక్షిణము
చేయుచుండిరి. ఋషిపత్నులను
అగ్నిదేవుడు మెహించాడు. శాపభయం వలన ఆశక్తితో క్షీణించుచున్నాడు. అగ్ని భార్య స్వాహాదేవి
గ్రహించి, అరుంధతిదేవి రూపం తప్ప, మిగిలిన అన్ని రూపాలు తానే దాల్చి పతిని సంతుష్టిడ్ని
చేసింది మహర్షులు కూడ అగ్నిదేవునితో నున్న వారు తమ భార్యలే అని శంకించి, వారిని వదలిలేసారు.
ఈ ఫలతం పార్వతిదేవి ఇచ్చిన నీలాపనింద వల్ల జరిగిందని ఋషిపత్నులు తెలుసుకొన్నారు. పరమేష్టికం
తెలియజేయగా అగ్నిదేవుని భార్య స్వాహాదేవియే ఈ పనిచేసిందని గ్రహించాడు. బ్రహ్మ సప్తమహర్షులు, దేవతలు, కైలాసమునకు వెళ్లి ఉమామహేశ్వరులను వేడుకొనిరి, ఉమామహేశ్వరులు విఘ్నేశ్వరుని
బ్రతికించారు. అంత దేవతలు "ఓ
దేవీ! పార్వతీ! నీవు ఇచ్చిన శాపంబున లోకంబులు అన్ని కీడువాటిల్లెగాన దని ఉపసంహరింపు"
మని ప్రార్థించిరి. పార్వతి సంతుష్టురాలు అయి కుమారుని జేరదీసి ముద్దాడి "
ఏదినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినంబున చంద్రుని జూడరాదు"
అంటే భాద్రపద శుద్ద చవతి రోజున చంద్రుని చూచినచో నిలాపనిందలు
కలుగును అని చెప్పింది. నాటి నుండి ఎవ్వరూ చవతి చంద్రుని చూసేవారుగాదు.
శమంతకోపాఖ్యాం
ద్వాపరయుగంబున శ్రీ కృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి
ప్రియసంబాషణము జరుపుచు "స్వామీ! సాయం సమయమయ్యె ఈనాడు వినాయక చతుర్థి గాన
పార్వతీశాపంబున చంద్రుని జూడరాదుగనుక నిజగృహంబుకేగెద సెలవిండు" అని
పూర్వవృత్తాంతంబంతయు శ్రీ కృష్ణునికి దెల్పి నారదుడు స్వర్గలోకంబునకేగెను. అంత
శ్రీ కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవ్వరు చూడరాదని చాటింపు వేసేను. నాటిరాత్రి
శ్రీకృష్ణుడు గోష్ఠమునకు పోయి పాలుపితుకుచు పాలలో చంద్రుని చూచి "ఆహా! ఇక
నాకెట్తి అపనింద రానున్నదో" అని సంశయమున ఉండెను.
సత్రాజిత్తు రాజు దగ్గర రోజుకు ఇరవై బారువుల బంగారము
నిచ్చే మణిహారం ఉంది. అది సూర్యభగవానుని వల్ల లభించింది. ఒక రోజు శమంతకమణిని తీసుకొని ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ
దర్శనార్థమై వెళ్ళగా, అప్పుడు
శ్రీ కృష్ణుల వారు ఆ మణిని తనకు ఇవ్వమని కోరెను. సత్రాజిత్తు ఆ మణిని ఇవ్వను అనెను.
ఒకనాడు ఈ హారాన్ని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనేడు మెడలో
వేసుకొని వేటకు అడవికి వెళ్లాడు. అడవిలో సింహం అతనిని చంపి శమంతక మణిని తీసుకుపోతుండగా,
జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిహారాన్ని తీసుకుపోయాడు. నిజా నిజాలు తెలియక గతంలో
అడిగిన శ్రీకృష్ణుడే తన తమ్ముడు ప్రసేనుని చంపి హారం అపహరించాడు అని నిందవేసాడు. ఆ
విషయం తెలుసుకొన్న శ్రీకృష్ణులవారు వినాయక చవతిరోజున పాలు పితుకుతుండగా క్షీరములో చంద్రుని
చూచుట వలన కలిగిందని భావించాడు. తదానంతరం సత్రాజిత్తు నిలాపనింద నివారణ కోసం ప్రసేనుడి
వెళ్లిన మార్గం గుండా వెళ్లాడు. ఒకచోట గుహలో ఊయలలో శమంతకమణి కనిపించింది. ఆ మణి తీసుకొనే
ప్రయత్నంలో జాంబవంతుడు అడ్డుకొన్నాడు. ఇరువది ఎనిమిది రోజులు రాత్రి, పగలు లేకుండా
యుద్దం చేసారు. తేత్రాయుగమున శ్రీరామచంద్రునిగా భావించి, తన కుమార్తెతో బాటు శమంతకమణి
శ్రీ కృష్ణ భగవానుడు ఇచ్చాడు. శ్రీ కృష్ణ భగవానుడు సత్రాజిత్తుకే శమంతకమణి ఇచ్చాను.
శమంతకమణిని నొసంగిన సత్రాజిత్తు "అయ్యె! పరమాత్యుడగు
శ్రీకృష్ణునిప్పై లేనిపోని నింద మెపి దోషంబునకు పాల్పడితి" నని చాల విచారించి
మణి సహితముగా తన కూతరు సత్యభామను భార్యగా శ్రీకృష్ణునకు సమర్పించి తప్పు క్షమించమని వేడుకొనెను.
సూర్యవరప్రసాదితగు నీ శమంతకంఇని నీ దగ్గర యుంచుకొనుము. మాకు వద్దు " అనుచు
మణిని సత్రాజిత్తునకొసంగెను. శ్రీకృష్ణడు శుభముహూర్తమున జాంబవతి, సత్యభామలను వివాహము చేసుకొనేను.
దేవాదులు, మునులు శ్రీకృష్ణునితో మీరు సమర్థులు. ఈ నీలాపనింద పడకుండా ప్రయత్నం చేసారు. మాలాంటి
వారికి ఎలా సాధ్యమవుతుంది? అని అడగగా శ్రీకృష్ణలవారు చవతి రోజున యథావిధిగా గణపతిని
పూజించి, శమంతకమణి కథ విని అక్షతలు శిరసుపై వేసుకొన్న వారికి నిలాపనిందలు పొందలేరని
చెప్పాడు. ఆ ప్రకారం వినాయకవచితి రోజున యథావిధిగా వినాయక వ్రతాన్ని ఆచరిస్తారో వారు
కష్టాలను వీడి సౌఖ్యాన్ని అనుభవిస్తారు అని సుతుడు చెప్పగా విని పాండవులు ఈ వ్రతాన్ని
ఆచరించి, విఘ్నేశ్వరుని దయవలన రాజ్య సంపదను పొందినారు.
ఇంద్రుడు పూజించి వృతాసురుని
చంపాడు. సీతాదేవిని వెతుకునప్పుడు శ్రీరాముడును, గంగను భూమికి తెచ్చినపుడు భగీరథుడు,
అమృతోత్పాదనము చేయునపుడు దేవాసురులు కుష్తువ్యాధి నివారణకు సాంబుడు. ఈ వ్రతము ఆచరించి
ఫలితములను పొందినారు.
అన్ని కార్యములు సిద్దింపజేయుట
వలన వినాయకుడికి సిద్ది వినాయకుడని ప్రసిద్ది. విద్యారంభకాలమున పూజించినచో విద్యాలాభము,
పుత్రార్థులకు పుత్రుడును, విదవలకు మరో జన్మమందు వైధవ్యమురాదు, జయార్థులకు జయాన్ని,
ధనార్థులకి ధనాన్నీ కావున ఎల్లరూ వినాయక వ్రతాన్ని ఆచరించి శ్రీ గణపతి దేవుని అనుగ్రహించే
సకలైశ్వర్యములు బొంది సుఖముగా నుందురుగాక
గమనిక: చంద్రదోష పరిహారార్థము ఈ శ్లోకము చెప్పుకొని అక్షతలు
వేసుకొనవలెను
సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః |
సుకుమారకమారోదీః తపహ్యేష శమంతకః ||
హరిః ఓం తత్సత్
శ్రీ వినాయక వ్రతకథ సంపూర్ణం
నైవేద్యం
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యదీమహిః ధియోయోనః ప్రచోదయాత్
సత్యం త్వా ఋతేన పరిషించామి
[సాయంత్రం
- ఋతం త్వా సత్యేన పరిషించామి]
అమృతమస్తు అమృతాపస్తరణమసి
శాల్యన్నం శడ్రసొపేతం
ఫల లడ్డుక మోదకాన్
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం
స్వీకురు శాంకరే
[ నైవేద్యాల పేర్లు చూ . ]
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః
నైవేద్యం సమర్పయామి
ఓం ప్రాణాయ స్వాహా
ఓం అపానాయ స్వాహా
ఓం వ్యానాయ స్వాహా
ఓం సమానాయ స్వాహా
మధ్యే పానీయం సమర్పయామి
అమృతాపిధానమసి
ఉత్తరాపోశనం సమర్పయామి
పానీయం పావనం శ్రేష్ఠం
గంగాది సలిలాహృతం
హస్త ప్రక్షాళనార్థం
త్వం గృహాణ గణనాయక
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః
హస్త ప్రక్షాళనం
సమర్పయామి
తాంబూలం
పూగీఫలసమాయుక్తం
నాగవల్లీ దళైర్యుతం |
కర్పూర చూర్ణ
సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః
తాంబూలం సమర్పయామి |
తాంబూల చర్వణానంతరం ఆచమనీయం
సమర్పయామి |
మంత్రపుష్పం
జాజీచంపక పున్నాగ మల్లికా
వకుళాదిభిః
పుష్పాంజలిం ప్రదాస్యామి
గృహణ ద్విరదాననా
ఓం శ్రీ
సిద్ది వినాయక స్వామినే నమః
మంత్ర
పుష్పం సమర్పయామి
నీరాజనం
నీరాజనం
నీరజస్కన్ కర్పూరేణ కృతం మయా
గృహాణ కరుణారాసే
గజానన నమోస్తుతే
ఓం శ్రీ
సిద్ది వినాయక స్వామినే నమః
నీరాజనం
సమర్పయామి
నీరాజనానంతరం
ఆచమనీయం సమర్పయామి
ప్రదక్షిణం
యనికాని
చ పాపాని జన్మాంతర కృతాని చ |
తాని ప్రణశ్యంతి
ప్రదక్షిణ పదే ||
ప్రదక్షిణం
కరిష్యామి సతతం మోదకప్రియా |
మద్విఘ్నం
హరయే శీఘ్రం భక్తానామిష్టదాయకా ||
ఆఖువాహన
దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక |
ప్రదక్షిణం
కరోమి త్వాం ప్రసీద వరదో భవ |\
ఓం శ్రీ
సిద్ది వినాయక స్వామినే నమః ప్రదక్షిణం సమర్పయామి
నమస్కారం
నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే |
నిర్విఘ్నం
కురు మే కామం నమామి త్వాం గజాననా
అగజానన పద్మార్కం
గజానన మహర్నిశం |
అనేకదంతం
భక్తానాం ఏకదంతముపాస్మహే ||
నమస్తే భిన్నదంతాయ
నమస్తే హరసూనవే |
మమాభీష్ట
ప్రదోభూయో వినాయక నమోస్తుతే
ఓం శ్రీ
సిద్ది వినాయక స్వామినే నమః
సాష్టాంగ
నమస్కారం సమర్పయామి
ప్రార్థన
ప్రసీద దేవదేవేశ ప్రసీద
గణనాయక
ఈప్సితం మే వరం దేహి
పరత్ర చ పరాంగతిం
వినాయక వరం దేహి మహాత్మన్
మోదకప్రియ
అవిఘ్నం
కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః
ప్రార్థన నమస్కారం సమర్పయామి
రాజోపచార పూజా [ పునః పూజ ]
ఛత్రం
శ్రీ సిద్ది వినాయక స్వామినే
నమః - ఛత్రం సమర్పయామి
శ్రీ సిద్ది వినాయక స్వామినే
నమః - చమరైర్వీజయామి
శ్రీ సిద్ది వినాయక స్వామినే
నమః - గీతం శ్రావయామి
శ్రీ సిద్ది వినాయక స్వామినే
నమః – నృత్యం దర్శయామి
శ్రీ సిద్ది వినాయక స్వామినే
నమః - వాద్యం ఘోషయామి
శ్రీ సిద్ది వినాయక స్వామినే
నమః - ఆందొళికాన్ ఆరోహయామి
శ్రీ సిద్ది వినాయక స్వామినే
నమః - అశ్వాన్ ఆరోహయామి
శ్రీ సిద్ది వినాయక స్వామినే
నమః - గజాన్ ఆరోహయామి
ఓం శ్రీ సిద్ది వినాయక స్వామినే నమః - సమస్త రాజోపచారాన్,
దేవోపచారాన్ సమర్పయామి
పునరర్ఘ్యం
అర్ఘ్యం గృహాణ హేరంబ
వరప్రద వినాయక |
గంథం పుష్పాక్షతైర్యుక్తం
భక్త్యా దత్తం మయా ప్రభో ||
ఓం శ్రీ
సిద్ది వినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం
యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |
నమస్తుభ్యం
గణేశాయ నమస్తే విఘ్ననాయక |
పునరర్ఘ్యం
ప్రదాస్యామి గృహణ గణనాయక ||
ఓం శ్రీ
సిద్ది వినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం
యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |
నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే |
యిదమర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ||
ఓం శ్రీ
సిద్ది వినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం
యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |
గౌర్యంగమలసంభూత స్వామి జ్యేష్ఠ వినాయక |
గణేశ్వర గృహాణార్ఘ్యం గజానన నమోస్తుతే ||
ఓం శ్రీ
సిద్ది వినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం
యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |
సమర్పణం
యస్య స్మృత్యా
చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం
యాతి సద్యో వందే గజాననం ||
మంత్రహీనం
క్రియాహీనం భక్తిహీనం గణెశ్వర |
యత్పూజితం
మయా దేవ పరిపూర్ణం తథస్తు తే ||
మమ ఇష్టకామ్యార్థ సిద్దిరస్తుః
(క్రింది
మంత్రము చెప్పుచు జలాక్షింతలు విడువవలెను)
అనయా ధ్యానావహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః
శ్రీ
సిద్ది వినాయక స్వామి
సుప్రీతో
సుప్రసన్నో వరదో భవంతు |
యదక్షరం పదభ్రష్టమ్ మాత్రాహీనమ్ చయదృవేత్
తత్సర్వం దేవనారాయణ నమోస్తుతే
ఘంటపూజ
సనకాది దేవతా
భ్యోనమః తీర్థస్నానం సమర్పయామి
నిర్మాల్యం
గంథాన్ దారయామి
నిర్మాల్యం
అక్షతాం సమర్పయామి
నిర్మాల్యం
పుష్పాణీం పూజయామి
బలి నివేదయామి
తీర్థము
[
క్రింది మంత్రముతో తీర్థము తీసుకొనవలెను ]
అకాల మృత్యు
హరణం సర్వవ్యాధి నివారణం
సమస్త పాపక్షయకరం
శ్రీ మహాగణపతి పాదోదకం పావనం శుభం
శ్రీ మహాగణపతి
ప్రసాదం శిరసా గృహ్ణామి
ప్రసాదము
[
క్రింది మంత్రముతో పుష్ప ప్రసాదము తీసుకొనవలెను ]
వినాయక పాదోత్పలం పుష్పం తత్సుష్పం శిరసావహమ్ కోటిజన్మ కృతం పాపం తత్ క్షణేన
వినశ్యతి
ఉద్యాసనం
[ పూవ్వులు అక్షంతలు దేవునిపై ఉంచుకొని క్రింది మంత్రముతో
దేవుని కదిలిచ్చి వాటిని దేవుని ముందు ఉంచవలెను ]
ఓం యజ్ఞేన యజ్ఞమయ జన్తదేవాః
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
తే హ నాకం మహిమానస్యజంతే
యత్ర పూర్వే సాధ్యాః సన్తిదేవాః
శ్రీ మహాగణపతి నమః యథాస్తానం ప్రతిష్టాపయామి
శోభనార్థే
క్షేమాయ పునరాగమనాయ చ
ఓం శాంతిః శాంతిః శాంతిః
Vinayaka
Dandakam in Telugu – శ్రీ వినాయక దండకం
శ్రీ పార్వతీపుత్ర లోకత్రయస్తోత్ర,
సత్పణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీ నాధ సంజాతస్వామి శివా సిద్ధి విఘ్నేశ,
నీ పాద పద్మంబులన్, నీదు
కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులున్ నీ కరళంబు నీ పెద్ద వక్త్రంబు
దంతంబు నీ పాద హస్తంబు లంబో దరంబున్ సదమూషకాశ్వంబు నీ మంద హాసంబు
నీ చిన్న తొండంబు నీ గుజ్జ రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ
యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ కుంకుమంబక్షతల్ జూజులున్ చంపకంబుల్ తగన్ మల్లెలున్ మెల్లలున్ మంచి
చేమంతులున్ తేల్లగాన్నేరులున్ మంకెనలన్ పోన్నలన్ పువ్వులు న్మంచి దూర్వంబులన్
దెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంచేసి విఘ్నేశ్వరా
నీకు టెంకాయ పోన్నంటి పండ్లున్ మరిన్మంచివౌ నిక్షుఖండంబులన్ రేగుపండ్లప్పడాల్ వడల్
నేయిబూరెల్ మరిన్ గోదుమప్పంబులున్ పునుగులున్ బూరెలున్
గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయున్ జున్ను
బాలాజ్యమున్ నాను బియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్ బంగురు బళ్ళెమందుంచి
నైవేద్యమున్ బంచ నీరాజనంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా!
నిన్ను పూజింపకే యన్యదైవంబులన్ ప్రార్ధనల్ సేయుటల్ కాంచనం బోల్లకే
యిన్ముదా గోరుచందంబు గాదే మహాదేవ ! యో భక్తమందార ! యో సుందరాకారా ! యో భాగ్య గంభీర ! యోదేవ చూడామణీ లోక రక్షా మణీ ! బంధు
చింతామణీ ! స్వామీ నిన్నెంచ, నేనంత నీ దాసదాసాది దాసుండ శ్రీ దొంతరాజాన్వ
వాయుండ రామాబిధానుండ నన్నిపుడు చేపట్టి సుశ్రేయునించేసి శ్రీమంతుగా
జూచి హృత్పద్మ సింహాసనారూడతన్ నిల్పి కాపాడుటే గాదు
నిన్గొల్చి ప్రార్ధించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్
విద్యయున్ పాడియున్ పుత్రపౌత్రాభివృద్ధిన్ దగన గల్గగా జేసి పోషించు మంటిన్
గృహన్ గావుమంటిన్ మహాత్మా యివే వందనంబుల్ శ్రీ గణేశా
! నమస్తే నమస్తే నమస్తే నమః ||
|| ఇతి
శ్రీ వినాయక దండకం ||
మంగళ హారతులు
Vinayaka
Mangala Harathi in Telugu – శ్రీ
వినాయక మంగళ హారతి
శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు- వాసిగల దేవతావంద్యునకును
ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి – భూసురోత్తమ లోకపూజ్యునకును |
|| జయ మంగళం నిత్య
శుభ మంగళం ||
నేరేడు మారేడు నెలవంక మామిడి – దూర్వార చెంగల్వ ఉత్తరేణు
వేరువేరుగ దెచ్చి వేడ్కతో పూజింతు – పర్వమున దేవగణపతికి
నిపుడు
|| జయ మంగళం నిత్య
శుభ మంగళం ||
సుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు – పొసగ సజ్జనులచే
పూజకొల్తు
శశిజూడరాదన్న జేకొంటి నొక వ్రతము – పర్వమున దేవగణపతికి
నిపుడు
|| జయ మంగళం నిత్య
శుభ మంగళం ||
పానకము వడపప్పు పనస మామిడిపండ్లు – దానిమ్మ ఖర్జూర
ద్రాక్షపండ్లు
తేనెతో మాగిన తియ్య మామిడిపండ్లు – మాకు బుద్ధినిచ్చు
గణపతికి నిపుడు
|| జయ మంగళం నిత్య
శుభ మంగళం ||
ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య – ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మని నెయ్యియు కడుముద్దపప్పును – బొజ్జవిరుగగ దినుచు
పొరలుకొనుచు
|| జయ మంగళం నిత్య
శుభ మంగళం ||
వెండిపళ్ళెరములో వెయివేల ముత్యాలు – కొండలుగ నీలములు
కలియబోసి
మెండుగను హారములు మెడనిండ వేసికొని – దండిగా నీకిత్తు
ధవళారతి
|| జయ మంగళం నిత్య
శుభ మంగళం ||
పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు – గంధాల
నినుగొల్తు కస్తూరినీ
ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తంబున – పర్వమున దేవగణపతికి
నిపుడు
|| జయ మంగళం నిత్య
శుభ మంగళం ||
ఏకదంతంబును ఎల్లగజవదనంబు – బాగయిన తొండంబు వలపు కడుపు
జోకయున మూషికము సొరిదినెక్కాడుచును – భవ్యుడగు దేవగణపతికి
నిపుడు
|| జయ మంగళం నిత్య
శుభ మంగళం ||
మంగళము మంగళము మార్తాండతేజునకు – మంగళము సర్వజనవందితునకు
మంగళము ముల్లోక మహితసంచారునకు – మంగళము దేవగణపతికి నిపుడు
|| జయ మంగళం నిత్య
శుభ మంగళం ||
సిద్ధివిఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు – ఒనరంగ నిరువదియొక్క
పత్రి
దానిమ్మ మరువము దర్భ విష్ణుక్రాంత – యుమ్మెత్త దూర్వార
యుత్తరేణి
కలువలు మారేడు గన్నేరు జిల్లేడు – దేవకాంచన రేగు దేవదారు
జాజి బలురక్కసి జమ్మిదాచెనపువ్వు – గరిక మాచిపత్రి మంచిమొలక
|| జయ మంగళం నిత్య
శుభ మంగళం ||
అగరు గంధాక్షతల్ ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును
భాద్రపద శుద్ధచవితిని పగటివేళ కుడుములు నానుబాలు ఉండ్రాళ్ళు
పప్పు
పాయసము జున్ను దేనెను పంక్తిమీర కోరిపూజింతు నిన్నెపుడు
కోర్కెలలర
|| జయ మంగళం నిత్య శుభ
మంగళం ||
బంగారుచెంబుతో గంగోదకముదెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి
మల్లెపువ్వులు దెచ్చి మురహరుని పూజింతు రంగైన నా
ప్రాణాలింగమునకు
|| జయ మంగళం నిత్య శుభ
మంగళం ||
పట్టుచీరలు మంచి పాడిపంటలుగల్గి గట్టిగా కనకములు కరులు
హరులు
ఇష్టసంపదలిచ్చి యేలినస్వామికి పట్టభద్రుని దేవ గణపతికి
నిపుడు
|| జయ మంగళం నిత్య శుభ
మంగళం ||
ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి
నిక్కముగ మనమును నీయందె నే నిల్పి ఎక్కువగు పూజలాలింపజేతు
|| జయ మంగళం నిత్య శుభ
మంగళం ||
మల్లెలా మొల్లలా మంచిసంపెంగలా చల్లనైనా గంధసారములను
ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నే జేతు కోరి విఘ్నేశ
|| జయ మంగళం నిత్య శుభ
మంగళం ||
దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును
దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడగు దేవగణపతికి
నిపుడు
|| జయ మంగళం నిత్య శుభ
మంగళం ||
చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను
పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనెపుడు బహుబుద్ధి గణపతికి
బాగుగాను
|| జయ మంగళం నిత్య శుభ
మంగళం ||
మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు
నేరేడు నెలవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోను
|| జయ మంగళం నిత్య శుభ
మంగళం ||
ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలుమీ కరుణతోను
మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందుము కోర్కెదీర
|| జయ మంగళం నిత్య శుభ
మంగళం ||
0 Comments