Vaishaka Masa sankashtahara Chaturthi Vrata Katha - వైశాఖ మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ

Vaishaka Masa sankashtahara Chaturthi Vrata Katha - వైశాఖ మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ
Vaishaka Masa sankashtahara Chaturthi Vrata Katha - వైశాఖ మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ

    మానవులు వ్రతము, శుభకార్యము ప్రారంభించినను మెదటగా గణపతిని పూజించడం మన హైదవ సంప్రదాయము. గణములకు అది పతి అవుట వలన గణపతి అయ్యెను. అట్టి గణపతి దేవతలకే పూజుడు తలచిన కార్యములను సిద్దింప చేయుటకై సిద్ది గణపతి అనియు శ్రీఘ గణపతి అని కష్టములు నివారించుటచే కష్టహరుడు అనియు కీర్తించేదరు తల్లి పార్వతి మాత పరమ శివుని భర్తగా పొందుటకు, సీత మాతను వేతుటకు ముందు అంజినేయుడు, గంగను భూమిపైకి తేచ్చుటకు భగీరధుడు వ్రతము చేసి వారి వారి కార్యములు చేసి కృతజ్ఞుతులు అయిరి. కలియుగమున మానవులు శ్రద్ద భక్తితో ఆచరించడం వలన తమ కష్టములు తొలగి సుఖములు పొందుటలలో సమసయము లేదు.

వైశాఖ మాస కథ

పార్వతిదేవి గణపతిని గణపతి వైశాఖ మాసమున సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించు విధానమును ఫలములను వివరింపు అని కోరగా గణపతి ఇట్లు తెలిపేను.

అమ్మా! శైలజా! వైశాఖ మాసమున నన్ను వక్రతుండుడు అను పేరుతో పూజించుదురు. ఇందుకు కలిగిన కథను తెలిపెదను వినుము.

పూర్వము రంతీదేవుడు అను రాజు గలడు. అతని రాజ్యమున ధర్మకేతు అను బ్రహ్మనుడు ఉండేను. అతనికి సుశీల’ చంచల, అను ఇరువురు భార్యలు గలరు. సుశీల పేరుకు తగిన గుణములు కలదియై, నిత్యము పూజలు వ్రతములు గావించు వంటింది. చంచల కేవలం శారీరక  భోగములనే వించుచు, వ్రత పూజాదులు ఆచరింపకదయ్యెను. పైగా వ్రత నిష్టలచే శుష్కించిన దేహము గల సుశీలను జూచి, పరిహాసము చేయుచుండేను.

ఇట్లుండగా సుశీలకు కూతురు. చంచలకు కొడుకు పుట్టిరి. చంచలా కొడుకును కన్నందుకు గర్వించి, సుశీలను జూచి, "నీవు అనేక వ్రతమును పూజలు చేసినను కూతురు కలిగేను. నేను ఏమియు చేయకున్నను కొడుకు కలిగేను. దేనికైనను అదృష్టం ఉండవలేను గాని, ఊరిక పూజల వలన ఫలము ఏమి? అని ఎత్తిపొడిచెను. సహన శీలయగు సుశీల మాటలు విని, తనలో మిక్కిలి వగచి, సకల బాధలను తొలగించు నట్టి సంకష్టహర గణపతి వ్రతమునభక్తి శ్రద్దలతో ఆచరించేను. సుశీల భక్తి నిష్టకు మెచ్చి, గణపతి సాక్షాత్కరించి, " సుశీలా! నీకు వేద శాస్త్ర పారాంగతుడైన కుమారుడు జన్మించును." అని చెప్పి, అదృశ్యుడయ్యెను, గణపతి కృపవలన కొంతకాలమునకు సుశీలకు ఒక మగ శిశువు కలిగేను.

పిదప కొన్నాళ్ళకు భర్త దివంగతుడు అయ్యేను. దీనితో కోపించిన చంచాల ఇల్లు వదిలి, వేరొక్క చోట నివసింపసాగేను. అయినను అసూయావతి అగు చంచల, సుశీల కుమారుని బుద్ది కుశలతను, విద్యశక్తిని చూచి, ఓర్వక అతనిని బావిలో పడవేసేను.       

గణపతి కృప వలన బాలుడు చెక్కు చదరక క్షేమముగా ఇంటికి వచ్చెను. ఇది తెలిసి చంచల భగవత్ కృప గలవారిని ఎవ్వరును ఏమియు చేయజాలరని తలంచెను. సుశీల కుమారుని చూచి  ఆనందించి, మాకు సర్వమునకు గణపతియే దిక్కు అని స్వామికి పంచాంగ నమస్కారములు గావించేను. అంతట చంచల చాలా ఆశ్చర్యపడి, తన తప్పిదమును గుర్తించి, మనసు మార్చుకొని, అక్క ఇంటికి వచ్చి, ఆమె పాదములపై పడి, క్షమాభిక్ష ఆర్తించేను. సహృదయవతి యగు సుశీల చెల్లలిని ఆదరించి, "అమ్మ! సజ్జనలకు సాధువులకు అపకారము చేయువారు తామే కష్టము పొందుదురు అని హితము చేప్పెను. నాటి నుండి చంచలయు అక్కయగు సుశీలతోగూడి, “ సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించెను. ఇరువురు సుఖసంతోషములతో ఉండిరి.

ఇట్లు సంకష్టహర గణపతి వ్రతమును పూజను గావించువారు శత్రు బాధలు లేక సుఖింతురు, కనుక ధర్మరాజా! నీవును వ్రతమును ఆచరించి, శత్రు విజయము పొంది భార్యపుత్రులతో మహాభోగములు అనుభవించుచు ధర్మయుగమున రాజ్యపాలనము చేయుముఅని ప్రభోదించెను.

ఇట్లు శ్రీ కృష్ట యుధిష్టర సంవాదాత్మకమగు సంకష్టకర చతుర్థీ వ్రతమున వైశాఖమాసమున సమాప్తము

"క్షేమం కరాయా దేవాయ, సర్వమంగళ మూర్తియే

నమో విఘ్నవినాశాయ, జ్ఞాన విజ్ఞాన దాయినే"

శ్రీ మహా గణపతి ప్రసాద సిద్ది రస్తు

ఓం శాంతిః శాంతిః శాంతిః

అధిక మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ