Sri Vasavi Kanyaka Parameshwari Dandakam 2 

వాసవీ కన్యకా పరమేశ్వరీ దండకము

Sri Vasavi Kanyaka Parameshwari Dandakam -వాసవీ కన్యకా పరమేశ్వరీ దండకము

Sri Vasavi Kanyaka Parameshwari Dandakam 2 వాసవీ కన్యకా పరమేశ్వరీ దండకము

శ్రీ మన్మహాదేవదేవేశ్వరీ - యెగమాయా - పరాశక్తి - చిద్రూపిణీ నీదుకారణ్య దీప్తి ప్రసారమ్మునన్ లోకమున్గన నాంధ్ర ప్రదేశమ్మునన్, జ్యేష్టశైలమ్మునన్, వైశ్య వంశమ్మునన్, దివ్యలీలావతారమ్ము వేదాల్చి | వైశ్య ప్రజానాధుడైనట్టి కౌసుంభ శ్రేష్ట్యాత్మజా మూర్తివై | జ్ఞాన సంధాత్రివై | జ్ఞేయచారిత్రివై || సుప్రజానేత్రివై | శాంత్యహింసాస్త్ర విద్యా ప్రదానమ్ము గావించుచున్ | దౌష్ట్య విధ్వంసకోదగ్ర సత్యాగ్రహాభిఖ్య కోద్యన్మహా యజ్ఞ గాయత్రివై | దుర్భరంబైన రాజన్య దర్పోద్దతిన్, ఘోరహింసా పరత్వమ్మునున్నాశమెందింపగా | ద్యుర్భరంబైన రాజన్య దర్పోద్దతిన్, ఘోరహింసా పరత్వమ్మునున్నాశమెందింపగా | ద్యుత్తరంబౌ శతానీక గోత్రస్తులౌ వృద్ద దంపత్సమేతంబుగా నగ్ని కుండమ్ములన్దూకి || ఆత్మాహుతింజేసి | నిస్సీమమౌత్యాగ భావమ్ముతో, దుష్టరాజేంద్రు నిర్జించి || క్రూరత్వమున గూల్చి | దౌర్జన్య పూర్ణ స్వభావమ్ము లోకానమాయించి, విశ్వాద్భుతాదర్శ ధర్మ ప్రతిష్ఠాత్రివై | సర్వ దేవ్యద్యధిష్ఠాత్రివై వెల్గి | శ్రీ వాసవీ కన్యకాదేవి నామమ్మునన్ విశ్వ విక్యాతవై | లోక కళ్యాణము న్గూర్చినావే, మహాదేవి ! నీవే మహాలక్ష్మీ ! నీవే మహావాణి ! నీవే మహాకాళిగానే పరాశక్తీ | శ్రీ దుర్గ, మాయా కుముచ్చారదా, చండికా, వైష్ణవీ, కాళికా, కృష్ణ, ఈశానికన్యాది దేవ్యా కృతుల్ దాల్చి! శక్తి త్రయమ్బష్టదుర్గాచయంబున్, మహామాతృకా సప్తకమ్మంగ దేవ్యాళిరూపమ్మునన్నిల్వ గొల్వుండు చిచ్చక్తివీవేగదా, ఆదిదేవీ, పరంజ్యోతి, వేదమ్ములున్నీవ, వాదములున్నీవ సర్వాశ్రయెంకార నాదమ్మునున్నీవ | సత్యమ్మునున్నీవ, శ్రీ సచ్చిదానంద బ్రహ్మమ్మునున్నీవెగా, మన్మనో దర్పణమ్మందు వెల్గొందు నీ విశ్వరూపమ్ము నే మంచు వర్ణింతు ! శీర్షమ్ములందున కిరీటమ్మలున్, హస్త పద్మమ్ములన్ వేద పాశాంకుశాబ్జాక్షమాలాద్యనేకమ్ములౌఇవ్వది శస్త్రా శ్రేణుల్విరాజిల్ల | సప్తాశ్వశుభ్రాంశులే నేత్ర యుగ్మమ్ముగా యెప్ప| దీప్తాన లార్కద్యుతిన్సర్వ తోదీప్తి మంతమ్మునై | సర్వతోవ్యావృతంబై, సుశోభిల్లు నీ విశ్వరూపమ్ము దర్శించి ధన్యుండనైతిన్ | అసంఖ్యాకమౌ | వక్త్ర బాహూదరోరు ప్రవృద్ధోగ్ర నానావిధోదీర్ణ వర్ణోజ్జ్వలతేజ శుంభద్భన్మూర్తి వీక్షించి, లోక త్రయంబున్భ యెద్విగ్నమై, నంభ్రమాశ్చర్య వారాశులన్ మున్గిదేలంగ, మౌనీంద్రు లున్సద్ధులున స్వస్తి స్వస్త్యించు వాకృచ్చుచున్ పెక్కుస్తోత్రమ్ములస్సల్పుచున్నార లోయంబ కాలానల్లాభోజ్వలాభీలమౌ నీకరాళంబునందుండియే, సర్వబ్రహ్మాండ భాండమ్ములన్, దేవరక్షో గణంబుల్, సమస్తంబులౌ జీవరాశుల్, సదా పుట్టుచున గిట్టుచున్, గ్రమ్మరన్ నీదు వక్త్రంబులన్జేరుచున్నారుగా | విశ్వ సృష్టి స్థితిధ్వంసకర్రీ జగన్మూల శక్తీ, మహామాయ | నీ స్వస్వరూపంబు, నీ దివ్యతత్త్వంబు, లీలామహత్త్వంబు వర్ణింప నేనెంత వాడన్ పరశక్తి దాసాను దాసుండ | నే పాండురంగా భిథానుండ | స్భదక్తినిన్గొల్చు వాడన సదా పద్మాల నిత్యార్చనాసేవ సంసార ఘోరాంబుధిన్దాటంగా నావ | నీ సన్నిధానంబు మా పెన్నిధానంబు నీ నామగానమ్మదేసామగానమ్ము | ఓం హ్రీం, సుధీశక్తి | ఐం క్లీం క్రియాశక్తి | సౌఃవం, శుభేచ్చా, స్వరూపేద్యశక్తీ | మహాభక్తి, నీదండక ధ్యాన గానమ్ముల న్సల్పినన్ | సర్వ దుఃఖమ్ములన్ పోయి, దీర్ఘరయురారోగ్య సౌభాగ్యముల్లగా | సర్వబీజాత్మికే | సర్వమంత్రాత్మికే | సర్వతంత్రాత్మికే | సర్వ యంత్రాత్మికే దేవి | హే వాసవాంబా ! నమె కన్యకాంబా ! నమస్తే పరాంబా | నమస్తే నమస్తే నమస్తే నమె నమః |

 ఓం హ్ర్రీం శ్రీ మాత్రే నమః