Sri Vasavi Kanyaka Parameswari Devi  2

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము

Sri Vasavi Kanyaka Parameswari Devi 2 - శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము
Sri Vasavi Kanyaka Parameswari Devi - శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము

దైవాంశమున జన్మించిన ఈ బిడ్డలందరూ మహాభక్తి పారవశ్యముగా పెరగనారంభించిరి. అంత కొంతకాలము గడువ ఒకనాడు శుంభుశ్రేష్ఠి సోదరుల బావగారైన హరివల్కశ్రేష్టికి ఒక ఆలోచన కలిగెను. ’నా బావమరుదులకు 714 మంది బిడ్డలు అయెనిజులుగా దైవాంశముతో జన్మించిరి! కాని నాకు పుట్టబోవు కుమరుడు వీరందరినీ మించిన గొప్పవాడై ఉండాలి’ అని ఆలోచించి తన భార్యయైన ఆదిలక్ష్మీని వెంటపెట్టుకొని తనకు గల తపశ్శక్తితో కైలాసమునకేగెను. పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగ నమస్కరము చేసి తమకు సంతాన కావలన్ని చెప్పెను. బోళాశంకరుడైన పరమేశ్వరుడు ఈ దంపతుల భక్తికి మెచ్చి, అనందించి "ఓ ఆర్యవైశ్య దంపతులారా! నా అంశచే మీకు శక్తిసంపన్నుడైన కుమారుడు కలుగును! తథాస్తు!" యని దీవించెను.

పరమేశ్వరుని కరుణతో ఆదిలక్ష్మీ గర్భము పండి 10 మాసములు నిండిన తదుపరి ఒక కుమారుని ప్రసవించినది. దేదీప్యమానముగా కనుపించుచున్న ఆ శిశువు సాక్షాత్తు పరమేశ్వరుడా! యన్నట్లు తలపించెను. 11 వ రోజున "బాలసారె" కార్యాక్రమములో బాలుని గాంచిన మహషులు, తల్లితండ్రుల సమక్షమున "సుందరముగా ఉండుట వలన సుదంతేశ్వరుడు" యని నామకరణము చేసిరి. నామకరణ సందర్భముగా హరివల్క్యశ్రేష్ఠి-ఆదిలక్ష్మీ దంపతులు మరల కైలాసమునకేగి గౌరీదేవితో " అమ్మా!పరాశక్తీ! మీ వాక్కుతో మేము సంతానవంతులమైతిమి. ఈ రోజు మా బిడ్డకు నామకరణ మహోత్సవము జరిగింది. కనుక అమ్మలగన్నయమ్మవైన నీవు వేంచేసి శిశువును ఆశీర్వదించవలెను. మేము ముందుగా ప్రథమ వాయనమును నీకిచ్చి, మిగితా వాయనములను సువాసినులందరికీ నొసంగెదము. తొలివాయనము అందుకొనుటకు రావమ్మా!" అని ఆహ్వానించిరి. ఆహ్వానించిన ఆర్యవైశ్యదంపతుల అభ్యర్థనకు ఆనందపరవశురాలైన గౌరీదేవి, మహాగిరి పట్టణమునకు బయలుదెరెను.

          గౌరీదేవి రాకను గ్రహించిన ఈ దంపతులు, మునిశ్రేష్ఠులు, సుమంగళులు మెదలైన వారందరూ ఎదురువేళ్ళి సువర్ణరత్నమణిమయ సింహాసనముపై గౌరీదేవిని అధిరీహింపచేసి 18 మంది ఆర్యవైశ్య కన్యలతో పంచామృతాభిషేకములు జరిపించిరి. అమ్మకు పట్టుపుట్టమునొసంగి మహిళలందరూ దీవెనలందుకొనిరి. పసిబాలుడైన సుదంతేశ్వరునీ గౌరీ అమ్మవారికి అందించిరి. ధగద్దగాయమానముగా వెలుగులు విరజిమ్ముచున్న ఈ బిడ్డను "సకలవిద్యాప్రాప్తిరస్తు! శతమానం భవతి....!" అని దీవించి గౌరీదేవి తొలి వాయనమందుకొని ఆర్యవైశ్యులకు అభీష్టములు తీర్చీ కైలాస మార్గమునకు పయనమాయెను. వాయనము గౌరిదేవి స్వీకరించిదని ఆర్యవైశ్య దంపతులు మహదానందముతో నుండిరి. 714 గోత్ర మాన్యులు, ఆకాశమున పయనించు దేవిని కనుచూపమేర దర్శించి ధన్యులైరి.

          ఇంతలోకైలాసమున పరమేశ్వరుడు నందీశ్వరుని పిలచి "నందీ! ఆర్యవైశ్య గృహమునకు వాయనమందుకొనుటకై వెడలిన జగజ్జనని ఇంతవరకూ లేదు! అక్కడ ఏమి జరిగెనోకదా?" యని ప్రశ్నింప, నందీశ్వరుడు అమ్మకొరకు ఆర్యవైశ్య గృహమునకు బయలుదెరెను. వాయనముతో తిరిగి వస్తున్న గౌరమ్మను చూసి సంతసించిన నంది, తన పై అమ్మను ఎక్కించుకొని కైలాస స్థానమునకు తీసుకొని వచ్చుచుండెను. ఆ సమయమున భండాసురుడు అను రాక్షసుడు అత్యంత తపశ్శక్తితో దేవాధిదేవతలను ఓడించెను. అతను అష్టదిక్పాలకులను, సప్త మహర్షులను హింసించసాగెను. తనకు దేవతలిచ్చిన వర గర్వముచే సత్య లోకమునకేగి వాణీనాధుని ఓడించెను.

        వైకుంఠమున ప్రవేశించి ఆదిశేష పాన్పుపైనున్న శ్రీ మహావిష్ణువును పడద్రోచెను. భండాసురుని వరగర్వముచే దేవతలందరు శక్తినశించి రిక్తహస్తులలై దాసోహమైరి. తదుపరి కైలాసనాధుని పరాజితుని చేయుటకై  బయలుదేరగా! మార్గమధ్యమున నంది వాహనముపై గౌరిదేవి కనబడెను. అమ్మవారిని భండాసురుడు గాంచిన క్షణములో ఆమె "వామలోచన" యను అవతారము ధరించెను. వామలోచనను గాంచిన కామాంధుడైన అసురుడు ఈమెను చెరపట్టసాగెను. నందీశ్వరుడు ఈ విషయము శివునితో చెప్పుటకై వేగముగా కైలాసమునకెళ్ళెను. అంత వామలోచన మహాస్త్రములతో 18 రోజులు అహోరాత్రులు భండాసురుడితో యుద్దము చేసెను. ముక్కోటి దేవతలు "జయెస్తు! విజయెస్తు! దిగ్విజయెస్తు!" యనుచూ వామలోచనకు జయజయ ధ్వానములు పలుకుచుండిరి.

        భండాసురుడు దేవితో యుద్దము చేయలేక "ఓ వామలోచనా! సమస్త దేవతలనూ, పరాజితులను గాంచిన నాతో యుద్దమును చేయుచుంటివి కనుక ఏ ఆర్యవైశ్యులింట ఫలపుష్ప తాంబూలములను గైకొంటివో, అదే శ్రేష్ఠులింట నీవు జన్మించి స్థిరపడెదవు గాక!" యని శాపమిచ్చెను. అకారణముగా శాపమునకు గురైన వామలోచన మహాకోపోద్రీకురాలై "ఓరీ భండాసురా! నీవు మణిపురము అను రాజ్యములో గంధర్వ వంశమున చిత్ర కంఠుడుగా జన్మించెదవుగాక!" అని ప్రతి శాపమిచ్చెను. వెంటనే వామలోచనతో భండాసురుడు "ఓహో! అలాగున నేనే గంధర్వునిగా జన్మించినట్లయిన, నీవు ఆర్యవైశ్యకాంతగా జన్మించినప్పుడు నిన్ను చూసి తప్పక చెరపట్టెదను!" అని ప్రతిజ్ఞచేసెను. అప్పుడు వామలోచన పరాశక్తి స్వరూపము ధరించి త్రిశూలముతో భండాసురుని వధింపగా ఆ త్రిశూలాగ్నిధాటికి అతని శరీరము  భస్మీపటలమయ్యెను. అతని చితాభస్మము పాతాళలోకమున పడెను. వామలోచనాదేవికి దేవతలందరూ నారికేళ ఫలపుష్ప నీరాజనములు ఇచ్చి శాంతిపజేసిరి.

కీర్తికాంత

కీర్తికాంత

భండాసురుని శాప ప్రభావమున శంభుశ్రేష్ఠి సోదరుడైన సోమకాంతుడు, సుశీలాదేవికి కనిష్ట కుమార్తెగా పరాశక్తియగు వామలోచనాదేవి జన్మించెను. సోమకాంత దంపతులు ముల్లోకములకు "కీర్తీ" చేకూర్చుమాత యని గ్రహించి ఈమెకు "కీర్తికాంత" అని సార్థకనామకరణము గావించిరి, కీర్తికాంత మహాతేజో వంతమున వెలుగుచుండెను. పట్టణవాసులు కీర్తికాంతనుండి ప్రజ్వరిల్లుచున్న కాంతి ని దర్శించుచుండగా మూగివారికి మాటలు వచ్చుచుండెను. అంధులకు నేత్రములు కనిపించసాగెను. అపార కరుణామూర్తియగు గౌరి అమ్మవారు కీర్తికాంతగా అవతారము ధరించెనని భక్తాదులు వేంచేసి "ఆహా! ఆర్యవైశ్య దంపతులారా! మహాఋషీశ్వరుల తపశ్శక్తితో మీకు అయెనిజలుగా 714 మంది పురుష బిడ్డలున్నూ, పరాశక్తీ స్వరూపమున కీర్తికాంత నామధేయముతో వెలుగుచున్న స్త్రీ బిడ్డకు మీరు మాతాపితరులై జీవితమును ధన్యత గావించుకొనిరి. మీకు లభించిన అదృష్టము జగతిలో ఎవరికీ లభించలేదు" అని కొనియాడుచుండిరి. కొంత కాలము గడుచుచుండ 714 మంది సోదరులతో భక్తిమాధుర్యముగా అటపాటలతో కీర్తికాంత షోడశ కళలు నిండిన చంద్రునివలె పెరుగుచుండెను. ప్రతి నిత్యమూ కీర్తీకాంత పరమేశ్వరుని కడుభక్తితో పూజచేయుచుండెడిది. ధ్యాననిష్టలో నిమగ్నమయ్యెడిది. చిన్నప్పటినుంచి చిలుకలతోనూ, నెమ్మళ్ళతోనూ, గోవులతోనూ, కీర్తికాంత ఆడుకొనుచుండెను.

అయెనిజులైన సోదరులకు తల్లిదండ్రులు ఒక శుభ ముహూర్తమున అక్షరాభ్యాసము చేయించి విద్యాభ్యాసమునకై గురుకులమున చేర్చిరి. చతుర్వేదములు, చతుర్దశ విద్యలు, షట్ శాస్త్రములు, ఉపనిషత్తులు సశాస్త్రీయమ్య్గా ఈ బిడ్డలు అభ్యసించసాగిరి. కాలక్రమమున అష్టాదశ వర్షప్రాయమంకురించెను. కీర్తీకాంత అన్నలతో కలసి రాజోచితములైన అష్టాదశ వర్షప్రాయమంకురించెను. కీర్తికాంత అన్నలతో కలసి రాజోచితములైన ధనుర్విద్య, ఖడ్గ యుద్దములు మెదలగు యుద్ద కళలను పరిపూరణముగా నేర్చుకొని నవవ్యాకరణ పండితురాలాయెను. గురుతుల్యులు యుక్త వయస్కురాలైన ఈమెకు యుద్ద మెళుకువలను నేర్పి సోమకాంత-సుశీలాదేవి దంపతులకు ఒప్పజేప్పిరి.

చక్రవర్తులైన ఆర్యవైశ్య కన్యలకు ప్రతినిత్యము సాయంత సమయమున యువరాణులు చెలికత్తెలను వెంటపెట్టుకొని ఉద్యాన వనమునకు వెళ్లి అక్కడ వెలిసియున్న శివకేశవులకు పుష్పపూజ చేయుచుండిరి.  

చిత్రకంఠుని చరిత్ర

కైలాస ప్రాంతములోని "మణిపురం" అను నగరమునకు ఏకచత్రాధిపత్యముగా గంధర్వ రాజు చిత్రకంఠుడు పరిపాలను చేయుచుండేను. చిత్రకంఠుని తప్పశక్తితో దేవతలందరిని మెప్పించి అనైక మైన వరములు పొంది దేవతలను , మహర్షులను, సర్వజనులను  నానాహింసలకు గురిచేసేను. వరబలమున ఇతనిని ఎంతగొప్పవారైనను ఎదురించ లేకుండిరి. అతను చేయని చెడులార్యములు లేవు. కామాంధత్వమున స్త్రీల ఎందరినో చెరపట్టెను. మునికాంతలను వేధించెను.. ఇతని ఖడ్గమునకు ఎందరో మహర్షులు ప్రాణములు విడించిరి. ఓడినవారందరినీ బానిసలుగా చేసుకొను చుండేను. ఒకసారి దేవతలందరూ ఆలోచించి చిత్రకండుని సంహరించుటకు అష్టదిక్పాలకులను పంపిరి. అగ్ని,వాయు కుబేర, వరుణ, యమ మెదలగు వారిని చిత్రకంఠుడు పట్టుకొని అష్టకష్టములు పెట్టసాగేను. అశ్వవాహనుడై బయలు దేరి భీకారారణ్యమునకు వెళ్ళి సింహ, శార్దూల క్రూర మృగములను శరములతో సంధించి యధావిధిగా సాయంత్ర సమయమున కీర్తి కాంత తన చెలులతో పాటు పరమాత్ముని ధ్యానించుచున్న వన మధ్యము నుండి అశ్వరాజముపై వెళ్ళు చుండెను.

 

చిత్రకంఠుడి కీర్తికాంతను గాంచుట

అలా వెళ్ళుతున్న గంధర్వుడు కీర్తికాంతను చూచెను. మనస్సునఆహా! ఎవరీ సుందరాంగి? ఊర్వశి, మేనుక, మెహినీలకన్నా ధీటుగానున్న ఈమెను పరిణయమాడని పురుష జన్మ వ్యర్థము! చతుర్ముఖ బ్రహ్మ ఇంతరూప లావణ్యముగా సృష్టించెను. కన్యారత్నము చెంతకు వెళ్ళెను. అంత చెలులు ఎదురేగి " చిత్రకంఠా! ఇక్కడ ఆర్యవైశ్యశ్రేష్టురాలగు యువరాణి కీర్తికాంత ఏకాంతముగా పరమేశ్వరుని పూజించుచుండేను. స్థలమునకు స్త్రీలకు తప్ప పురుషలకు ప్రవేశము లేదు. కనుక తక్షణము నీవు వనము విడిచి వెళ్ళవలెను అని పలికిరి.

చిత్రకంఠుడు మహోకోపోద్రీకుడై పరిచారకులను ఇప్పుడే నా గదా దండముతో మిమ్ములను చిత్రవధ చేసేదను అని అందరిని భయభ్రాంతులను చేసి పంపించి వేసెను. వారందరూ ప్రాణ భయముతో చిత్తగించిరి. విషయము తెలియని కీర్తికాంత ఏకాంతముగా పరమేశ్వరుని ధ్యానించుచుండెను. సాయంత్ర సమయమ్య్ గడచి రాత్రి వేళ్శాయెను. కీర్తికాంత చెంతకు చిత్రకంఠుడు వచ్చి " ప్రియమైన కాంతా! మణిపురాన్ని పరిపాలిస్తున్న నన్ను చిత్రకంఠుడు అని పిలిచెదరు. నేను గంధర్వ వివాహము చేసేకొనెదము. నా మణిపురానికి నిన్ను మహారాణి చేసెదను. మణిపురము సర్వసుఖములు గా ఉండును. ధ్యాన సమాధి నుండి నిష్ఠను ఫూర్తిచేసిన కీర్తికాంత "ఓరీ చిత్రకంఠా! ఇంతా రాత్రివేళ ఒంటరిగా నున్న ఆర్యవైశ్యకాంతను కామభావనతో చూచుట నీవు మహాపాపమును ముట్టగట్టుచున్నావు. ఇప్పటికైన కామవాంఛను విడనాడి నీ మణిపురమునకేగి క్షేమముగ ఉండుము" అని ధర్మములు బోధించిన కీర్తికాంత పలుకులను పెడచెవిన పెట్టన కామాంధుడు " కీర్తికాంత! నీవు  నాతో మణిపురమునకు రమ్ము! లేదా నిన్నిక్కడి నుండి దౌర్జన్యముగా నా పట్టణమునకు తీసుకొనివెళ్ళి వివాహమడేదను అని హస్తము పట్టుకొనుటకై ప్రయత్నించెను.

శాప-ప్రతిశాపములు:

కీర్తికాంత మనస్సునఇంత రాత్రివేళ ఒంటరిగానున్న నన్ను కామాంధుడు ముట్టుకొనిన యెడల్ ఆర్యవైశ్య స్త్రీలందరికీ నేను కళంకము తెచ్చిన కన్యకను అయ్యదను కదా!

ఏది ఏమైనా కామాంధుని సంహరించి నా పాతివ్రత్య సిద్దాంతమును నిరూపించుకొనవలెనుఅనుకొని కీర్తికాంత  మహా కోపోద్రేకముతో "ఓరీ చిత్రకంఠా! అగుము, ఒక్క అడుగు ముందుకు వేసేవంటే ఉపేక్షించను. నీలాంటి కామాంధుని సంహార యించదను, అంటూ గర్జన చేయుచుండిన కీర్తికాంతను దగ్గరకు వచ్చిన చిత్రకంఠుడు తన ఉత్తరీయమును పట్టుకొనెను

వెంటనే కీర్తికాంత "ఓరీ దురాత్మా! మహా పవిత్రమైన కైలాసమున నీవంటి కాంధుడు ఉండకూడదు. కనుక పాప మిళితమైన భూలోకములో చంద్రవంశములో జన్మించెదవు గాక!" అని ఘోర శాపంబిచ్చెను. కీర్తికాంత పాదములకు సాష్టాంగ నమస్కారము చేయుచూ గంధర్వుడు " కీర్తి కాంతా క్షమించుము!

నాకు గర్వాంధకారము తొలగిపోయినది. నీవు శాపాలు ఇచ్చే శక్తి కలిగిఅన కన్యవని తెలుసుకోలేక పోయితిని. నా తప్పు నాకు తెలసి వచ్చినది. ఇక జీవితము నందు ఇటువంటి పాపకృత్యములను చేయను. దయ చేసి నా శాపాని ఉపశమింప చేయుము" యని ప్రార్థించెను.

కీర్తికాంత "కామాంధులకు శాప ఉపసంహరణ లేదు! వెళ్ళు! భూలోకములో నా శాపవశమున మానవజన్మ ధరించవలసిందే! నీ పాపానికి నిష్కృతి లేదు నా శపానికి తిరుగులేదు" అని చెప్పెను. చిత్రకంఠుడు కోపావేశముతో "ఓ కీర్తికాంతా! దేవతలందరనీ ఓడించిన నేను నీ పాదములకు ప్రణమిల్లినా నీకు కనికరము లేదా! దయాదాక్షిణ్యాలు చూపకుందువా! ఇంత కఠినశిక్షకు గురిచేయుట సమంజ సమేనా! ఒక స్త్రీకే శాపాలు ఇచ్చు శక్తి పరిపూర్ణముగ నున్నప్పుడు నేను ఉత్తము పురుషుడను. అంతయేగాక మహా శివపూజా ధురంధురడను ఓ పెట్టిన మహాశాపమునకు నేను ప్రతి శాపమిచ్చెదను" అని అర్ఘ్య పాత్రలోని మంత్రజలమును తీసుకొని "ఓ కీర్తికాంతా! నీ శాపవశాత్తున నేను భూలోకమున జన్మించినట్లయిన ఆ భూలోకమందే ఆర్యవైశ్య శ్రేష్ఠుల ఇంట జన్మించెదవుగాక! అని శాపమును ఇచ్చెను.

 నీ శాపము నాప్రతి శాపము సత్యము కాగలదు. ఈ కైలాసములో నాకు శాపమిచ్చి తప్పించుకున్నానని ఏమాత్రము నీవు భావింపవలదు. నీవు భూలోలోకములో జన్మించినప్పుడు నేను వచ్చి నిన్నుగాంచి, మెహించి కళ్యాణం చేసుకొనుటకు విశ్వ ప్రయత్నం చేసెదను" అని ప్రతి శాపమిచ్చెను. ’చూడు భూలోకమున నా శాప మహిమఅని ఇకక్కొరు చూడు భూలోకములో నా పాతివ్రత్యమహిమఅని మరొకరు ప్రతిశాపము లిచ్చుకొనిరి

            ఈ విధమైన వారు అంతకుముందు చేసిన తప్పస్సు అంతయూ శాపప్రకరణ వలన సంఫూర్ణమై పోవు చుండెను. "మెహించెదను" అని చెప్పిన చిత్రకంఠుని కీర్తికాంత కోపాద్రేకముతో "నేను భూలోకములో జన్మించి నిన్ను హరమార్చెదను" అని ప్రతిజ్ఞ కూడ చేసేను. చిత్రకంఠుడు వెంటనే ఉన్మాదముతో "నన్నే కనుక భూలోకములో నీవు హతమార్చినట్లయిన, నీతో పాటుగా నీ బంధు గణమైన 102 గోత్రవైశ్యులందరు అగ్నిప్రవేశం చేసి నశింతురు గాక!" అని శపించారు. తర్వాత వైశ్యఋషులు వెళ్ళి శివుని జరిగింది వివరించారు. వాళ్ళని ఓదార్చి ఈశ్వరుడు "ఆ శాపాలన్నీ లోక కళ్యాణం నిమిత్తమే’ అని చెప్పి పంపాడు.

 

ఈ విధంగా కీర్తికాంతా శాపముతో చిత్రకంఠుడు, చిత్రకంఠుని శాపముతో కీర్తికాంతా భూలోకములో జన్మించుటకు  కారణ భూతమైయున్నది. జరిగిన విషములను కీర్తికాంత తన తల్లితండ్రులకు తెలియపరచెను.

ఈ చరిత్ర ఇట్లుండగా కీర్తి కన్యక పెళ్ళి గురించి వైశ్యులు ఓ రోజు చర్చించు ఉండగా, బ్రహ్మర్షి కణ్వ మహర్షి అక్కడికి వచ్చాడు. ఆయనకి నమస్కరించి వైశ్యులు తమ సమస్యని ఆయనకి నివేదించారు.

కీర్తి కన్య సుదంతేశ్వరుడు

   

"చిత్రకంఠుని భయంతో మీరు అందోళన పడుతునారు. దానికి సోమకాంతుని బావమరది యగు యాజ్ఞవల్క్యుడు , ఆదిలక్ష్మి దంపతులు పరమేస్వరును అనుగ్రహం వలన జన్మించి, యవ్వనప్రాయుడైన తమ కుమారుడు సుదంతేశ్వరునితో  మీ కీర్తి కన్యతో వివాహం చేయండి అని చెప్పినారు. ఇది తెలిసిన చిత్రకంఠుడు ఓ మాయని సృష్టించి వదిలితే, అది ఆవహించిన సుదంతుడు క్రమంగా కృశించి బలహీనుడు అవసాగాడు. ఇది గ్రహించిన వైశ్య ఋషులు తమ కులాని రక్షించమని నందీశ్వరున్ని వేడుకున్నారు.

"భూతాధిపతి పరమేశ్వరుడు ఒకప్పుడు చిత్రకంఠుడికి మాయ అనే శక్తిని ప్రసాదించాడు. దాన్ని ఉపయెగించి సుదంతుడ్ని చంపి, కీర్తి కన్యకని పొందాలని వాడు ప్రయత్నిస్తున్నాడు. ఆ మాయ ఏడు రాత్రులు మాత్రమే పని చేసి ఆ తర్వార నశిస్తుంది. కీర్తి కన్యకని, సుదంతుడ్ని ఈశ్వరుడి ఉద్యావనంలో ఉంచండి. మీకు శుభం కలుగుతుంది. మీకు ఓ రహస్యం చెప్తాను. కీర్తి కన్యక, సుదంతులు సామాన్య మానవులు కారు. వారు సాక్షాత్తూ పార్వతీపరమేశ్వరుల అంశలు. మీరంతా ఇంక కొద్ది కాలమే కైలాసంలో ఉండి భూలోకానికి వెళ్తారు. ఈ గంధర్వుడు మీకు రాబోయే జన్మలలో కూడా శతృవు కాగలడు. తర్వాత ఆ జగన్మాత అంశ అయిన కీర్తి కన్యక మీ వంశంలో జన్మించి పెళ్ళి చేసుకోకుండానే మీ కులవేల్పు, ఇలవేల్పు అవుతుంది." నందీశ్వరుడు వాదిని ఓదార్చాడు.

సంప్రదింపుల అనంతరం ఆర్యవైశ్య శ్రేష్ఠులందరి సమక్షమున కళ్యాణము జరిపించిరి. చిత్రకంఠుడు వచ్చి వివహాన్ని విఘ్నం చేయుననే తలంపుతో కైలాసము నుండి నందీశ్వరుడు ప్రమధగణ సమేతుడై వచ్చి ఈ కళ్యాణము పరిసమాప్తమయ్యే వరకు రక్షణగా ఉండేను. కైలాసము మారుమూల ప్రాంతములోని అనేక నగరముల నుండి జనులందరూ వచ్చి నూతన దంపతులను తిలకించి ఆశీర్వదించి వెడలిరి. ఈ ప్రకారం సోమదత్తుడు, వైశ్య ఋషులు కీర్తి కన్యకకి, మాయ బారి నించి తప్పించుకున్న సుదంతుడికి వైభవంగా వివాహం జరిపించారు.

సాలంకాయన మహర్షి చెప్పే తమ కుల వృత్తాంతాన్ని మణిగుప్త మహర్షి, ఇతర వైశ్య ఋషులు అనందంగా వినసాగారు. ఆయన తను చెప్పెది ఇలా కొనసాగించాడు

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జీవిత చరిత్రము