Shodasa Gowri Vratham - షోడశ గౌరి వ్రతము
Shodasa Gowri Vratham - షోడశ గౌరి వ్రతము
Sri Swarna Gowri Vratham - శ్రీ స్వర్ణ గౌరి వ్రతం |
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యో నమః
హరిః ఓం
శుచిః
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతో పి వా
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష
ప్రార్థన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నేపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే
దేవీం వాచమజనయన్త దేవాస్తాం విశ్వరూపాః పశవో వదన్తి
సా నో మన్ద్రేషమూర్జం దుహానా ధేనుర్వాగస్మానుప సుష్టుతైతు
యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వ మంగళ
తయెః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం
అయం ముహూర్తః సుముహూర్తోస్తు
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం
తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి
గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః
ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః
సర్వమంగళ మాంగళ్యే శివె సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమెస్తుతే
శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః
ఉమా మహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః
శచీ పురందరాభ్యాం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః
శ్రీ సీతారామాభ్యాం నమః
మాతా పితృభ్యో నమః
సర్వేభ్యో మహజనేభ్యో నమః
గాయత్రో ప్రార్థన
ఓం ముక్తా విద్రుమహేమనీల దవళచ్చాయై ర్ముఖైస్త్రీక్షణైః
యుక్తా మిందుకళానిబద్దరత్న ముకుతామ్ తత్త్వార్థవర్ణాత్మికామ్
గాయత్రీ వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలంగదాం
శంఖం చక్రమాధారవింద యుగళం హస్తైర్వహ న్తీంభజే
గాయత్రీ మంత్రము
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యదీమహిః ధియోయోనః ప్రచోదయాత్
దీపారాధన
దీపంజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం పూజాసమయే దీపం నమోస్తుతే
దీపస్త్వం బ్రహ్మ రూపొసి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్నామాంశ్చ దేహి మే
భో దీప దేవి రూపస్త్వం కర్మసాక్షీ హ్యవిఘ్నకృత్
యావత్పూజం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ
శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదమ్
శత్రుబుద్దివినాశం చ దీప జ్యోతిర్నమోస్తుతే
దీపారాధన ముహూర్తః సుముహూర్తోస్తు
అచమనము
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణువే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్దాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్థనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః
ఘంట పూజా
ఓం జయధ్వని మంత్రమాతః స్వాహా
ఘంతదేవతాభ్యో నమః
సకలోపచార
పూజార్థే అక్షతాన్ సమర్పయామి
ఘంటనాదం
(క్రింది మంత్రము చెప్పుచు ఘంటా నాదము చేయవలెను)
ఆగమార్థంతు దేవానాం గమనార్థం తు రాక్షసాం
కురుఘంటారవం తత్రదేవతాహ్వాన లాంఛనమ్
ఇతి ఘంతానాదం కృత్వా
భూతోచ్ఛాటనం
(క్రింది మంత్రము చెప్పుచు నీళ్లు ప్రోక్షించవలెను)
ఓం ఉత్తిష్ఠంతు భూత పిశాచాః య ఏతే భూమి భారకాః
ఏతేషామవిరీధేన బ్రహ్మకర్మ సమారభే
అపసర్పన్తు తే భూతా యే భూతా భూమి సంస్థితాః
యే భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయా
ప్రాణాయామం
(క్రింది మంత్రము చెప్పుచు ప్రాణాయామము చేయవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః
ఓం జనః ఓం తపః ఓం సత్యం
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః
ప్రచోదయాత్
ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్
సంకల్పం
మమ ఉపాత్త సమస్త దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యార్థం
శుభాభ్యం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహవిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః
ద్వితియ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే
భారతవర్షే భరత ఖండే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు
చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానెన ప్రభవాది షష్టి సంవత్సరాణాం
మధ్యే ....................... సంవత్సరే.....................
ఆయనే ................... ఋతౌ .................
మాసే .................... పక్షే ....................
తిథౌ .................... వాసరే ..................
శుభ నక్షత్ర శుభ యోగ శుభకరణ ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ
అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమస్థైర్య దైర్ఘ్య వీర్య విజయ, అభయ ఆయుః, ఆయురారోగ్యైశ్వర్య
అభివృద్ది సిద్ద్యర్థం, భక్తిజ్ఞాన వైరాగ్య సిద్ద్యర్థం,
ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ద్యర్థం, పుత్రపౌత్రాబి వృద్ద్యర్థం, సద్బుద్దీత్యాది,
సర్వశుభఫలప్రాప్త్యర్థం శీఘ్రమేవ దంపతీనాం, అనుకూల
దాంపత్య సిద్ద్యర్థం సంతానార్థినాం, శ్రీఘ్రమేవ సత్సంతాన
ప్రాప్త్యర్థం, సమస్తరోగ నివారణ సిద్యార్థం, లోక క్షేమర్థం యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార షోడశ గౌరి దేవతముద్దిస్య సమస్త మంగళావాప్యార్థం షోడశ గౌరి అనుగ్రహ సిద్ధ్యర్థం మమ
షోడశ గౌరి ప్రాప్త్యర్థం మనోవాంఛిత ఫలావాప్త్యర్థం బ్రహ్మజ్ఞాన సిద్ధ్యర్థం షోడశ గౌరి పూజాం
కరిష్యే
తదంగ కలశారాధనం కరిషే
కలశపూజ
కలశం గంధపుష్పాక్షతైరభర్బ్య తదుపరి హస్తమ్ నిధాయ
కలశస్య ముఖేః విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో
బ్రహ్మ మధ్యే మాత్నగణాశ్రితా కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ
యజుర్వేదో సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంతు సమాశ్రితా ఆయాంతు దేవ
పూజార్థం మమదురి తక్షయకారకాః అత్ర గాయత్రీ సావిత్రీ శాంతిః పుష్టీకరీశ్వరీ
ఆపో వా ఇదగ్ం సర్వం విస్వా భూతాన్యాపః
ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపః
సమ్రాడాపో విరాడాపః స్వరాణాపశ్ఛందాగ్ స్యాపో
జ్యోతిగ్ ష్యాపో యజూగ్ ష్యాపః సత్యమాపః
సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప
ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు
కావేరి తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ
భాగీరధీ చ విఖ్యాతాః పంచ గంగాః ప్రకీర్తితః
కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవమాత్మానంచ
సంప్రోక్ష, ఆత్మానంచ సంప్రోక్ష్య
గణపతి పూజ
అథ మహాగణపతి
పూజాంకరిష్యే
అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి పూజయామి
ధ్యానం
హరిద్రాభం చతుర్భాహుం
హరిద్రావదనం ప్రభుమ్ |
పాశాంకుశధరం దేవం
మోదకం దంతమేవ చ |
భక్తాభయ ప్రదాతారం
వందే విఘ్నవినాశనమ్ |
ఓం శ్రీ మహాగణపతేయే నమః
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేక దంతం భక్తానం ఏకదంతముపాస్మహే
ఓం గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆనః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్
ఓం శ్రీ మహాగణపతయే నమః
ధ్యాయామి | ధ్యానం సమర్పయామి |
ఓం శ్రీ మహాగణపతయే నమః
ఆవాహయామి | ఆవాహనం సమర్పయామి |
ఓం శ్రీ మహాగణపతయే నమః
నవరత్న ఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి
|
ఓం శ్రీ మహాగణపతయే నమః
పాదయోః పాద్యం సమర్పయామి |
ఓం శ్రీ మహాగణపతయే నమః
హస్త యోః అర్ఘ్యం సమర్పయామి |
ఓం శ్రీ మహాగణపతయే నమః
ముఖే ఆచమనీయం సమర్పయామి
ఓం శ్రీ మహాగణపతయే నమః
శుద్ధోదక స్నానం సమర్పయామి
స్నానానంతరం ఆచమనీయం
సమర్పయామి
|
ఓం శ్రీ మహాగణపతయే నమః
వస్త్రం సమర్పయామి
ఓం శ్రీ మహాగణపతయే నమః
యజ్ఞోపవీతం సమర్పయామి
ఓం శ్రీ మహాగణపతయే నమః
దివ్య శ్రీ గంథం సమర్పయామి
గంథస్యోపరి అలంకరణార్థం హరిద్రా కుంకుమ సమర్పయామి ||
ఓం శ్రీ మహాగణపతయే నమః
అక్షతాన్ సమర్పయామి
ఓం శ్రీ మహాగణపతయే నమః
పరిమళ పత్రపుష్యైః పూజయామి
పుష్పం
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణికాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికాటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ధూమకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కందపూర్వజాయ నమః
ఓం సర్వసిద్దిప్రదాయ నమః
ఓం శ్రీ మహాగణపతయే నమః
ఇతి షోడశ నామావళి పూజం సమర్పయామి
ధూపం
వనస్సత్యుద్భవిర్దివ్యై నానా గంధైః సుసంయుతః
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం
ఓం మహాగణపతయే నమః
ధూపం ఆఘ్రాపయామి
దీపం [ఏకార్తి]
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం |
గృహణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ ||
భక్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే |
త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే ||
ఓం శ్రీ మహాగణపతయే నమః
ఏకార్తి దీపం సమర్పయామి
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి
ఓం శ్రీ మహాగణపతయే నమః
నైవేద్యం సమర్పయామి
నీరాజనం
మంగళం సుముఖోదేవ మంగళం ఆఖువాహన మంగళం విఘ్నరాజాయ మంగళం స్కందపూర్వజః
ఓం శ్రీ మహాగణపతయే నమః
కర్పూర నీరాజనం సమర్పయామి
మంత్రపుష్పం
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ||
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కంద పూర్వజః ||
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే
ఓం శ్రీ మహాగణపతయే నమః
సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి
ఓం శ్రీ మహాగణపతయే నమః
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
ఓం శ్రీ మహాగణపతయే నమః
ఛత్ర
చామరాది సమస్త
రాజోపచారాన్ సమర్పయామి
||
క్షమాప్రార్థన
“వక్రతుండ ! మహాకాయ ! సూర్య కోటి సమప్రభ !
నిర్వఘ్నం కురు మే దేవ ! సర్వ కార్యేషు సర్వదా “
ఓం శ్రీ మహాగణపతయే నమః నమస్కారాన్ సమర్పయామి
అనయా ధ్యాన ఆవాహనాది షోడశో పచార పూజయా
భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు
ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు |
ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు || మమ ఇష్తకామ్యార్థ
సిద్దిరస్తు
శ్రీ
మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి
||
ఓం
శ్రీ మహాగణపతయే నమః యథాస్థానం ప్రతిష్ఠాపయామి ||
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |
ఓం
శాంతిః
షోడశ గౌరి వ్రతము
షోడశోపచార పూజా ప్రారంభః
షోడశ గౌరి (స్వర్ణగౌరి) ముదిశ్య షోడశ గౌరి ప్రీత్యార్థం
అథ మండపం పూజాం కరిష్యె
ఓం సువర్ణ మండపాయ నమః
ఓం హిమ ప్రాకారాయ నమః
ఓం చిత్ర మండపాయ నమః
ఓం విచిత్ర మండపాయ నమః
షోడశ
గౌరి దేవతాయై నమః
ఇతి
మండపం పూజం సమర్పయామి
అథ ద్వారపాలక పూజాంకరిష్యే
పూర్వద్వారే ద్వార శ్రియై నమః
జయాయై నమః విజయాయ నమః
దక్షిణద్వారే ద్వారశ్రియై నమః
నందాయ నమః సునందాయ
నమః
పశ్చిమ ద్వారే శ్రియై నమః
బలాయ నమః ప్రబలాయ నమః
ఉత్తరద్వారే ద్వారశియై నమః
కుముదాయనమః కుముదాక్షాయ నమః
గాంగాయే నమః యమునాయే నమః
షోడశ
గౌరి దేవతాయై నమః
ఇది
ద్వారపాలక పూజాం సమర్పయామి
అథ పీఠ పూజాంకరిష్యే
పీఠపూజ
ఓం ఆదారశక్త్యే నమః
ఓం మూల ప్రకృత్యై నమః
ఓం కూర్మాయ నమః
ఓం వరాహాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం అష్టదిగ్గజేభ్యో నమః
ఓం తన్మధ్యేక్షీరార్ణవాయ నమః
ఓం క్షీరార్ణవ మధ్యే శ్వేత ద్వీపాయ నమః
ఓం శ్వేతద్వీప స్యాధః
ఓం కల్పవృక్షాయ నమః కల్పవృక్ష స్యాధః
ఓం సువర్ణమంటపాయ నమః
షోడశ
గౌరి దేవతాయై నమః
ఇతి
పీఠపూజాం సమార్పయామి
నవశక్తి పూజ
అథ నవశక్తి పూజాం కరిష్యే
ఓం వామాయ నమః
ఓం జ్యేష్ఠాయ నమః
ఓం రౌద్రే నమః
ఓం కాళియే నమః
ఓం కలవికళినే నమః
ఓం బల వికళినే నమః
ఓం బల ప్రమదినే నమః
ఓం సర్వభూత ప్రదిన్యె నమః
ఓం మనోమన్సినే నమః
షోడశ
గౌరి దేవతాయై నమః
ఇతి
నవశక్తి పూజాం సమర్పయామి
ధ్యానం:
కురుపర్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
భక్తభీష్ఠప్రదేదేవి సుప్రీతా భవసర్వదా
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి
(అని
షోడశగౌరీదెవిని మనస్సున ధ్యానించి నమస్కరించ వలెను)
ప్రాణ ప్రతిష్ఠాపనం
ఓం అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ
మిహనీదేహి భోగమ్ జ్యోకృశ్యేమ సూర్యముచ్చరంత
మనుమతే మృడయాన స్వస్తి, అత్ర
ఆవాహితోభవ,
సం స్థాపితోభవ, అవకుంఠితోభవ, వ్యాప్తోభవ
కృపాహితభవ, సుస్థిరభవ మమ సుప్రసన్నో భవ
స్వామి జగనాథ వ్యవహ పూజాదికం తావత్ పరిపాలకేన
బింబెస్మీన్, గౌరేస్మీన్,ప్రధమేస్మీన్,
కలసెస్మీన్, ద్యాన్‍స్మీన్ సనిదికురు
గౌరీర్మిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ |
అష్టపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ ||
ఓం భుః శ్రీ
షోడశగౌరీదేవి దేవతామావహయామి
ఓం భువః శ్రీ
షోడశగౌరీదేవి దేవతామావహయామి
ఓం సువః శ్రీ
షోడశగౌరీదేవి దేవతామావహయామి
ఓం భూర్బువస్సువః శ్రీ షోడశగౌరీదేవి దేవతామావహయామి
స్థాపయామి
పూజయామి
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః
దేవతాయై నమః
ప్రాణప్రతిష్ఠా సుముహూర్తోస్తు
ఆవాహనం
గచ్ఛాగచ్ఛదేవిత్వం సర్వమంగళదాయిని
శ్రద్ధాభక్తిసమాయుక్త ధ్యాయామి పరమేశ్వరి
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః ఆవహయామి
ఆవాహనార్థం
అక్షతాన్ సమర్పయామి
(అనగా
మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లో ఆహ్వానించడం)
ఆసనం
విచిత్ర స్వర్ణ సంయుక్తం చిత్రవవర్ణసుశోభితం
గౌరిసింహాసనందేవి దాస్యామి శుభలోచిన
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః
నవరత్న
ఖచిత సింహాసనం సమర్పయామి
సింహాసనార్థం అక్షతాం సమర్పయామి
(దేవుడు కూర్చుందుటకై
మంచి బంగరారుపీట వేసినట్లు అనుకుంటూ అక్శతలు వేయవలెను)
అర్ఘ్యం
గగాజల సమాయుక్తం సుగంధం గంధసంయుతం
గృహాణర్ఘ్యం మయాదత్తం మంగళం కురుమేశివే
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః అర్ఘ్యం సమర్పయామి
పాద్యం
పుణ్యతీర్థం సమానీతం పవిత్రంద్రవ్య సంయుతం
పాద్యంచ పరిగృహ్ణాతు గౌరీదేవి నమోస్తుతే
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః పాద్యం సమర్పయామి
ఆచమనీయం
సర్వతీర్థ సముద్భూతం పవిత్రం విమలం జలం
గృహాణాచమనం దేవి శంకరార్థ శరీరిణి
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః ఆచమనీయం సమర్పయామి
మధుపర్కం
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః మధుపర్కం సమర్పయామి
శుద్ధోదక స్నానం
గంగేచ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరి
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః శూద్ధోదకేన స్నపయామి ||
పంచామృత అభిషేకం
క్షీరం [ పాలు ]
ఓం ఆప్యాయస్వ సమేతు తే
విశ్వత స్సోమ
వృష్టియమ్
భవా వాజస్య
సంగధే
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః క్షీరేణ స్నపయామి
దధి [పెరుగు]
ఓం దధిక్రావ్ణో అకారిషం జిష్టోరశ్వస్య వాజినః
సురభినో ముఖా
కరత్ప్రణ ఆయూగ్ంషి తారిషత్
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః దధ్నా స్నపయామి
అజ్యం [ నెయ్యి ]
ఓం శుక్ర మసి
జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్సునాతు
అచ్ఛిద్రేణ
పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభి
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః ఆజ్యేన స్నపయామి
మధు [తేనె]
ఓం మధు వాతా బుతాయతే మధుక్షరన్తి సింధవః |
మాధ్వీ ర్న సన్త్వౌషధీ |
మధు నక్త ముతోషసి మధుమ త్పార్ధివగ్ం రజః|
మధు ద్యౌరస్తు నః పితా |
మధుమాన్నో వనస్పతి ర్మధుమాగ్ం అస్తు సూర్యః
మాధ్వీర్గావో భవంతు నః |
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః మధునా స్నపయామి ||
శర్కరా [ చక్కర ]
ఓం స్వాదుః పవస్వ దివ్యాయ జన్ననే |
స్వాదు రింద్రాయ సుహవేతు నామ్నే |
స్వాదు ర్మిత్రాయ వరుణాయ వాయవే |
బృహస్పతయే మధుమాం అధాభ్యః |
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః శర్కరేణ స్నపయామి ||
ఫలోదకం [ కొబ్బరినీళ్ళూ ]
యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుప్పిణీః
బృహస్పతి
ప్రసూతాస్తానో మున్చన్త్వగ్ం హసః
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః ఫలోదకేన స్నపయామి ||
(ఇతి ఫలోదకం = పండ్లరసం,
లేక కొబ్బరినీళ్ళు)
పంచామృత స్నానం
శర్కరామధుసంయుక్తందధిక్షీర ఘృతంతధా
పంచామ్రుతం గృహాణత్వం గౌరీదేవి నమోస్తుతే
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః పంచామృత స్నానం
సమర్పయామి
శుద్ధోదక స్నానం
గంగాజల సమానీతం సర్వతిర్థసముద్భవమ్
స్నానార్థంచ గృహాణత్వం సర్వకామఫలప్రదే
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః శుద్ధోదకేన స్నపయామి ||
స్నానానంతరం
ఆచమనీయం సమర్పయామి
అభిషేకప్రోక్షణ
ఓం అశ్వగ్రాతేన తత్గ్రాతేన విష్ణుగ్రాతేన వసుందర
శిరశదరిశ్యామి రక్ష స్వమప పదేపదే
వస్త్రయుగ్మం
దివ్యాంబరం సమానీతం విచిత్రంచోత్తరీయకం
గృహాణత్వం మయాదెవి సర్వమంగళదాయిని
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః కంచుక సహిత కౌసుంభ వస్త్ర యుగ్మం సమర్పయామి
యజ్ఞోపవీతం
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః స్వర్ణ యజ్ఞోపవీతం (ఉపవీతం)
సమర్పయామి
ఆభరణం
అంగుళ్యముక్తాభరణాదియుక్తం హస్తానలంకృత్యకరైశ్చబంధం
మాణిక్యముక్తాఫ్హలవిద్రమేశ్చగోమేధివైడూర్య కృతాంశ్చహారా
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః నవరత్నమయ ఆభరణాని సమర్పయామి
మాంగళ్యం
తప్తహేమకృతం దేవీ మాంగళ్యం మంగళప్రదం
మయా సమర్పితం దేవీ గృహాణ త్వం శుభప్రదే
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః మాంగళ్యం సమర్పయామి
గంధం
శ్రీఖండం చందనంచైవ కర్పూరాగరు సంయుతం
విలేపరసుర శ్రేష్ఠేప్రీత్‍ర్థం ప్రతిగృహ్యతాం
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః దివ్య శ్రీ గంధం సమర్పయామి
ఓం సిందూరం రక్త వర్ణం చ సిందూర తిలకప్రియే
భక్త్యా దత్తం మయా దేవి సిందూరం ప్రతిగృహ్యతామ్
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమఃసిందూరం సమర్పయామి
ఓం తైలాని చ సుగంధీని ద్రవ్యాణి వివిధాని చ
మయా దత్తాని లేపార్థం గృహాణ పరమేశ్వరి
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః సుగంధి తైలం సమర్పయామి
హరిద్ర కుంకుమ
కాంత సూత్రంథాలపత్రం హరిద్ర కుంకుమ -అంజనం,
సింధూరాధి ప్రధ ప్రధాస్యామి సౌభాగ్యం దేహి మే-అవ్యయే,
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః సౌభాగ్య హరిద్ర కుంకుమం సమర్పయామి.
అక్షతలు
అక్షతాన్ ధవళాన్ రమ్యాహరిద్రాశంయుతా శుభా
అవిగృహ్ణాతుమే దేవి వాంఛితార్థ ఫలప్రదే
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః అక్షతాన్ సమర్పయామి
పుష్పమాలికా
కల్హారోత్సలమల్లికామరువకైః సౌవర్ణ పంకేరుహైః
జాతీచంపకమాలతీవకులకైః మందారకుందాదిభిః
కేతక్యా కరవీరాకైర్బహువిధైః క్లుప్తాః స్రజీ మాలికాః
సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే గృహ్యతామ్
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః పుష్పామాలికా సమర్పయామి
శతపత్రైర్జాతిసుమైః మల్లికాదిమనోహరై
కేతకీ కరవీరైశ్చ అర్చయామి హరప్రియే
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః నానావిధ పరిమళ పత్రైః పుష్పైశ్చ పూజయామి
షోడశగౌరీదేవి అంగపూజ
ఓం మహాదేవ్యే నమః - పాదౌ పూజయామి
ఓం కమలోద్భవాయై నమః - గుల్భౌ పూజయామి
ఓం సర్వలోకజనన్యై నమః - జానునే పూజయామి
ఓం పుణ్యమూర్యై నమః - జంఘే పూజయామి
ఓం విశ్వమూర్త్యై నమః - ఊరూ పూజయామి
ఓం గౌర్యై నమః - కటిం పూజయామి
ఓం అథోక్షజాయై నమః - హృదయం పూజయామి
ఓం కంబుకంఠ్యై నమః - కంఠం పూజయామి
ఓం పరమాత్మనే నమః - స్కంధౌ పూజయామి
ఓం అంభోజహస్తాయై నమః - హస్తౌ పూజయామి
ఓం రమ్యముభాయై నమః - ముఖం పూజయామి
ఓం ధర్మకృతాయై నమః - కర్ణౌ పూజయామి
ఓం శర్వాణ్యై నమః - లలాటం పూజయామి
ఓం విష్ణుమూర్త్యై నమః -శరః పూజయామి
ఓం శ్రీ
షోడశగౌరీదేవి నమః సర్వాణ్యంగాని పూజయామి
పుష్పాల
పూజా
ఓం జగన్మాత్రే
నమః - జాజి పుష్పం పూజయామి
ఓం అన్యాయినే
నమః - మల్లిక పుష్పం పూజయామి
ఓం గిరిసుతాయై నమః – గిరి కర్ణికా పుష్పం
పూజయామి
ఓం కాత్యాయినే నమః - కేతకి పుష్పం
పూజయామి
ఓం కమలాక్షే నమః - కమల పుష్పం
పూజయామి
ఓం చాముండాయై నమః - చంపక పుష్పం
పూజయామి
ఓం గంధర్వ సేవితాయై నమః - శేవతిక పుష్పంపూజయామి
ఓం పార్వత్యే నమః - పారిజాత పుష్పం
పూజయామి
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః - పుష్ప పూజాం
సమర్పయామి
పత్రం
పూజ
ఓం ఆయయే నమః - అజి పత్రం సమర్పయామి
ఓం సర్వజనరక్షిణ్యే నమః
- సమంతక పత్రం సమర్పయామి
ఓం శివ ప్రియయా నమః
- బిల్వ పత్రం సమర్పయామి
ఓం హైమవతే - తులసి పత్రం సమర్పయామి
ఓం కాత్యాయినే - కస్తూరిక పత్రం సమర్పయామి
ఓం అలియజన వాసిన్యే – మర్గ పత్రం సమర్పయామి
ఓం మహగౌర్యే
నమః పత్ర పూజాం సమర్పయామి
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః నావిధ పత్ర పూజాం
సమర్పయామి
నామ పూజాం
ఓం స్వర్ణగౌర్యే
నమః
ఓం గిరిజాయే
నమః
ఓం కాంత్యాయినే
నమః
ఓం ఉమాయై
నమః
ఓం భద్రాయై
నమః
ఓం హైమవంతే
నమః
ఓం ఈశ్వరయై
నమః
ఓం భావానినై
నమః
ఓం సర్వపాపహరాయై
నమః
ఓం మృడానినై
నమః
ఓం చండికాయై
నమః
ఓం దాక్షియినై
నమః
ఓం వరదరాజ
పత్నినే నమః
ఓం చంద్రశేకర
పత్నినే నమః
ఓం గిరిజాయై
నమః
ఓం మేనకాత్మజాయై
నమః
ఓం బ్రాహ్మ్యే
నమః
ఓం మహేశ్వర్యే
నమః
ఓం కోమార్యే
నమః
ఓం వైష్ణవ్యే
నమః
ఓం వారాహే
నమః
ఓం ఇంద్రాయిన్యే
నమః
ఓం చాముండాయై
నమః
ఓం చండికాయై
నమః
ఓం సర్వభద్ర
నాసిన్యే నమః
ఓం శ్రీ
షోడశగౌరీదేవి నమః
ఇతి నామ పూజాం సమర్పయామి
అథ తోరగ్రంధి పూజా
ఓం దేవ్యై నమః - ప్రథమ గ్రంథిం పూజయామి
ఓం కమలోద్భవాయై నమః - ద్వితీయ గ్రంథిం పూజయామి
ఓం ఇందుచూడామణ్యై నమః - తృతీయ గ్రంథిం పూజయామి
ఓం సర్వలోక జనన్యై నమః - చతుర్థ గ్రంథిం పూజయామి
ఓం పుణ్యమూర్యై నమః - పంచమ గ్రంథిం పూజయామి
ఓం పరమాత్మనే నమః - షష్టమ గ్రంథిం పూజయామి
ఓం ధర్మకృతాయై నమః - సప్తమ గ్రంథిం పూజయామి
ఓం సరస్వత్యై నమః - అష్టమ గ్రంథిం పూజయామి
ఓం మహాగౌర్యై నమః - నవమ గ్రంథిం పూజయామి
ఓం మన్మధవాసిన్యై నమః -దశమ గ్రంధిం పూజయామి
ఓం పుణ్యమూర్త్యై నమః - ఏకాదశ గ్రంధిం పూజయామి
ఓం శుభ్రవర్ణా యై నమః - ద్వాదశ గ్రంధిం పూజయామి
ఓం సరస్వత్యై నమః
- త్రయోదశ గ్రంధిం పూజయామి
ఓం ధర్మకృతాయై నమః - చతుర్థశ గ్రంధిం పూజయామి
ఓం కనకాభరణాయై నమః - పంచదశ
గ్రంధిం పూజయామి
ఓం సర్వలోకజనన్యై
నమః - షోడశ
గ్రంధిం పూజయామి
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః తోరగ్రంధి పూజా సమర్పయామి
Sri Gowri Ashtothram – శ్రీ గౌరీ అష్టోత్తరశతనామావళిః
ఓం
గౌర్యై నమః
ఓం
గణేశజనన్యై నమః
ఓం
గిరిరాజతనూద్భవాయై నమః
ఓం
గుహాంబికాయై నమః
ఓం
జగన్మాత్రే నమః
ఓం
గంగాధరకుటుంబిన్యై నమః
ఓం
వీరభద్రప్రసువే నమః
ఓం
విశ్వవ్యాపిన్యై నమః
ఓం
విశ్వరూపిణ్యై నమః
ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః || 10 ||
ఓం
కష్టదారిద్య్రశమన్యై నమః
ఓం
శివాయై నమః
ఓం
శాంభవ్యై నమః
ఓం
శాంకర్యై నమః
ఓం
బాలాయై నమః
ఓం
భవాన్యై నమః
ఓం
భద్రదాయిన్యై నమః
ఓం
మాంగళ్యదాయిన్యై నమః
ఓం
సర్వమంగళాయై నమః
ఓం మంజుభాషిణ్యై నమః || 20 ||
ఓం
మహేశ్వర్యై నమః
ఓం
మహామాయాయై నమః
ఓం
మంత్రారాధ్యాయై నమః
ఓం
మహాబలాయై నమః
ఓం
హేమాద్రిజాయై నమః
ఓం
హేమవత్యై నమః
ఓం
పార్వత్యై నమః
ఓం
పాపనాశిన్యై నమః
ఓం
నారాయణాంశజాయై నమః
ఓం నిత్యాయై నమః || 30 ||
ఓం
నిరీశాయై నమః
ఓం
నిర్మలాయై నమః
ఓం
అంబికాయై నమః
ఓం
మృడాన్యై నమః
ఓం
మునిసంసేవ్యాయై నమః
ఓం
మానిన్యై నమః
ఓం
మేనకాత్మజాయై నమః
ఓం
కుమార్యై నమః
ఓం
కన్యకాయై నమః
ఓం దుర్గాయై నమః || 40
||
ఓం
కలిదోషనిషూదిన్యై నమః
ఓం
కాత్యాయిన్యై నమః
ఓం
కృపాపూర్ణాయై నమః
ఓం
కళ్యాణ్యై నమః
ఓం
కమలార్చితాయై నమః
ఓం
సత్యై నమః
ఓం
సర్వమయ్యై నమః
ఓం
సౌభాగ్యదాయై నమః
ఓం
సరస్వత్యై నమః
ఓం అమలాయై నమః || 50
||
ఓం
అమరసంసేవ్యాయై నమః
ఓం
అన్నపూర్ణాయై నమః
ఓం
అమృతేశ్వర్యై నమః
ఓం
అఖిలాగమసంస్తుత్యాయై నమః
ఓం
సుఖసచ్చిత్సుధారసాయై నమః
ఓం
బాల్యారాధితభూతేశాయై నమః
ఓం
భానుకోటిసమద్యుతయే నమః
ఓం
హిరణ్మయ్యై నమః
ఓం
పరాయై నమః
ఓం సూక్ష్మాయై నమః || 60 ||
ఓం
శీతాంశుకృతశేఖరాయై నమః
ఓం
హరిద్రాకుంకుమారాధ్యాయై నమః
ఓం
సర్వకాలసుమంగళ్యై నమః
ఓం
సర్వభోగప్రదాయై నమః
ఓం
సామశిఖాయై నమః
ఓం
వేదాంతలక్షణాయై నమః
ఓం
కర్మబ్రహ్మమయ్యై నమః
ఓం
కామకలనాయై నమః
ఓం
కాంక్షితార్థదాయై నమః
ఓం చంద్రార్కాయితతాటంకాయై నమః || 70 ||
ఓం
చిదంబరశరీరిణ్యై నమః
ఓం
శ్రీచక్రవాసిన్యై నమః
ఓం
దేవ్యై నమః
ఓం
కామేశ్వరపత్న్యై నమః
ఓం
కమలాయై నమః
ఓం
మారారాతిప్రియార్ధాంగ్యై నమః
ఓం
మార్కండేయవరప్రదాయై నమః
ఓం
పుత్రపౌత్రవరప్రదాయై నమః
ఓం
పుణ్యాయై నమః
ఓం పురుషార్థప్రదాయిన్యై నమః || 80 ||
ఓం
సత్యధర్మరతాయై నమః
ఓం
సర్వసాక్షిణ్యై నమః
ఓం
శశాంకరూపిణ్యై నమః
ఓం
శ్యామలాయై నమః
ఓం
బగళాయై నమః
ఓం
చండాయై నమః
ఓం
మాతృకాయై నమః
ఓం
భగమాలిన్యై నమః
ఓం
శూలిన్యై నమః
ఓం విరజాయై నమః || 90
||
ఓం
స్వాహాయై నమః
ఓం
స్వధాయై నమః
ఓం
ప్రత్యంగిరాంబికాయై నమః
ఓం
ఆర్యాయై నమః
ఓం
దాక్షాయిణ్యై నమః
ఓం
దీక్షాయై నమః
ఓం
సర్వవస్తూత్తమోత్తమాయై నమః
ఓం
శివాభిధానాయై నమః
ఓం
శ్రీవిద్యాయై నమః
ఓం ప్రణవార్థస్వరూపిణ్యై నమః || 100 ||
ఓం
హ్రీంకార్యై నమః
ఓం
నాదరూపిణ్యై నమః
ఓం
త్రిపురాయై నమః
ఓం
త్రిగుణాయై నమః
ఓం
ఈశ్వర్యై నమః
ఓం
సుందర్యై నమః
ఓం
స్వర్ణగౌర్యై నమః
ఓం షోడశాక్షరదేవతాయై నమః || 108 ||
ఇతి
శ్రీ గౌరీ అష్టోత్తరశతనామావళిః సంపూర్ణం
Sri
Lalitha Sahasranamavali - శ్రీ లలితా సహస్రనామావళిః
ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం
ధూపం దాస్యామి తే దేవీ గృహాణ కమలప్రియే
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః ధూపమాఘ్రపయామి
దీపం
సాజ్యం
త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా
గ్రుహాణమంగళం
దీపంత్ర్యైలోక్యతిమిరాపహే
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః ప్రత్యక్ష దీపం దర్శయామి
దూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి
షోడశ గౌరి వ్రత కథ (స్వర్ణ
గౌరి వ్రత కథ)
ఓం శ్రీ గురుభ్యోన్నమః
వ్రతకథా
ప్రారంభము
కైలాస పర్వతం పైన ఒకనాడు స్కందుడు (అనగా
’కుమారస్వామి’ పుత్రులు (కొడుకులు) పౌత్రులు అనగా (మనుమలు)) కలుగు వ్రతమేదైనా ఉన్నచో తెలుపుము అనగా పరమశివుదు "కుమారా! మంచి ప్రస్న అడిగితివి. అన్ని సంపదలను ఇచ్చునట్టి స్వర్ణ
గౌరి (అనగా షోడశగౌరీ వ్రతం) ఒకటి కలదు. ఈ వ్రతము యెక్క కథను వినుమని ఇలా చెప్పుచుండెను
పూర్వకాలమున సూతమహముని
శౌనకాది మహమునులను చూచి వారితో " ఓ మహమునులారా! సర్వ పాపనాశనకారియును, శుభకరమును, స్త్రీలు సమస్త సంపత్కరమును, పుత్రపౌత్ర దాయకమును అయిన ఒక వ్రతము యున్నది. దానిని మీకు సవిస్తరముగా చెప్పెదను
శ్రద్దగా ఆలకొపుడు " అని ఈ విధముగా చెప్పుటకు
ప్రారంభించెను.
పూర్వము
త్రేతాయుగమున గంగా నదీ తీరము నందు గల ఒక పట్టణము నందు సకల ధర్మశాస్త్రవేత్త అయిన ధర్మవర్తి అను ఒక బ్రాహ్మణోత్తముడు నివశించు చుండెను. అతనికి అతిలోక సుందరీమణులు అయిన చల్లమ్మ, మల్లమ్మ, అను
ఇరువురు కుమార్తెలు కలరు. వారు కాలక్రమమున యౌవన వతులు అయిరి.
ఇట్లుండగా కొంతకాలమునకు మగధదేశపు రాజు కన్యాణ్వేషణ చేయుచూ ఆ పట్టణమునకు
వచ్చి ఆ కన్యలను గూర్చి విని వారిని చూచి చాల సంతోషమును పొందిన వాడాయెను. ఆ కన్యలను వివాహమాడదలంచి, తన కొరికను ఆ బ్రాహ్మణునకు
తెలిపెను. అపుడు ధర్మవర్తి
మిగుల సంతోషించి ధర్మార్థముగా ఆ కన్యలను మహరాజునకు ఒసంగి, శాస్త్రొక్త ప్రకారముగా వివాహమును
గావించెను.
ఈ విధముగా
వివాహితుడై తన భార్యలతో కూడి రాజదాని నగరమునకేతెంచి మహరాజు సర్వ సౌఖ్యములను అనుభవించు చుండెను. ఇట్లుండ కొంతకాలమునకు షోడశ గౌరి వ్రత దినము సంప్రాప్తింవగా పెద్ద రాణి అయిన చల్లమ్మ వ్రతమును
సంతుష్టురాలై గావించెను. కానీ
చిన్నరాణి అయిన మల్లమ్మ ధన గర్వముచే షోడశగౌరి వ్రతమును పరిత్వాగము చేయుటచే మల్లమ్మ
దరిద్రురాలయ్యెను. ఈ కారణముచే పెద్ద పులులు
పశువులను భక్షించినవి ధనమంతయూ భూగతమాయెను. దాన్యము, వస్త్రములు, గృహములు మెదలగునవి సర్వము దగ్దమయ్యను.
జ్ఞాతులు శత్రువులుయ్యిరి. బందువులు
ద్వేషవంతులుయిరి. ఈ విధముగా సర్వ సంపదలనూ కోల్పోయిన మలమ్మ
వస్త్రాన్నములు లేనిది అయి తన సోదరి అయిన చల్లమ్మ వద్దకు వెళ్ళి ఆమె సర్వసంపదలను గాంచి సిగ్గుచెంది
చపలచిత్తురాలై తన అక్క వద్ద యుండుటకు ఇష్టపడగా, దేశమును వీడి మెల్లగా ఒక అరణ్యము నందు
ప్రవేశించి, అందులో పయనించుచూ దారిలో ఒక రాతిని గాంచి దానిని
" ఓ పాషాణమా! నీవు
గౌరిదేవిని ఏమైనా చూచుతివా?" అని ప్రశ్నించెను. అంతట ఆ పాషాణము మల్లమ్మతో " నేను పాపాత్మురాలను కనుక గౌరిదేవిని
గాంచు భాగ్యము నాకు లేదు అని సమాధానమిచ్చెను.
ఈ
విధముగా మల్లమ్మ ఆ అరణ్యము నందు వరుసగా కుటజవృక్షమును, తప్తపాత్రమును, పక్షిశూన్యము అయిన సరస్సును,
పుష్పవిహనమైన మాదవీ వృక్షమును, పాలు లేని
గేదెను, కన్యకను,
స్థాణువును, వ్యాధుని, మేకను, గాడిదను, ఏనుగును,
జనశూన్యమైన గ్రామమును, తృణమును, ధాన్యమును, క్షీరబాండము మెదలగునవి వానిని చూచి,
గౌరి దేవిని గూర్చి ప్రశ్నంచగా అవి అన్నియు తాము తమ దురదృష్టవశమున గౌరిదేవిని
గాంచలేదని చెప్పినవి.
అటు
తరువాత మల్లమ్మ జన జల శూన్యము అయిన అరణ్యము నందు చిన్నరాలై ఒక చెట్టు
క్రింద కూర్చొని యుండి, ఆహరము,
పానీయములు లేనందున కొద్ది సేపటికి మూర్చనొందెను.
ఇంతలో
దయవతి అయిన పార్వతిదేవి, మల్లమ్మ యెక్క పరితప్త హృదయమునకు సంతసించి ఆమె యెక్క దుఃఖమును చూచి, ఆమె దుఃఖమును నివారింప దలంచి ఆమె సమిపము
నందు ప్రత్యక్షమయినది.
అంతట మల్లమ్మ
త్వరితముగా దేవి కృపవలన మూర్చనుండి మేల్కాంచి, గౌరిదేవిని గాంచి, ఆనందముతో దేవి సమిపమునకు వెళ్ళి సాష్టాంగ నమస్కారములు చేసి "ఓ దయావతీ,
పార్వతి మాత! గౌరిదేవి
లోకమాతా నన్ను మన్నింపుము. నేను
ఐశ్వర్యమదముతో ఎన్నియె పాపములాచరించితిని. నా యందు దయ యుంచి
నా తప్పులను క్షమింపుము, సాధువులు సహించు స్వభావము కలవారు
కదా" అని ప్రస్తుతించి, పార్వతి
దేవి పాదము పైబడెను.
అంతట పార్వతిదేవియు సంతసించి, ఆదరముతో మల్లమ్మను కౌగలించుకొని, " ఓ అమ్మాయి!
మల్లమాంబా దుఃఖించకుము నీకేమియూ భయము లేదు. నీవు సుఖముగా ఇంటికి వెళ్ళి పదహారు
సంవత్సరములు నాయెక్క వ్రతమును ఆచరింపుము. నీ కష్టములన్నియూ తొలిగిపోయి పుత్రపౌత్రాదులను కలిగి, అష్ట ఐశ్వర్యములను అనుభవించి దేహాంతరము నందు నీ భర్తతో గూడి, నా లోకమును చేరెదవు" అని పలుకగా, మల్లమాంబ సంతసించి, గౌరి దేవితో "ఓ లోకమాతా నేను మార్గ మధ్యమందు కొన్ని వింతలను గాంచితిని వాటి
విషయమును నాకు సవిస్తరముగా తెలియ జేయవలసినదిగా ప్రార్థించుచున్నాను" అని కోరెను.
దానికి గౌరి దేవి ఈ
విధముగా పలికెను " ఓ మల్లమాంబా! నీవు
గాంచిన వింతలను విశదముగా వివరించెదను శ్రద్దగా వినుము. తన భర్త వచ్చినప్పుడు గౌరవ మర్యాదలతో లేచి
నిలువబడనటు వంటి స్తీ శిల అయినది. ధన ధాన్యములతో కూడియూ
బలిదానములు చేయనవాడు వృక్షము అయెను. అన్న వస్త్రాదులతో నిండి
యున్న గృహంబు నందు అత్తగారై యుండి తన కోడళ్ళకు ద్వేషము వలన అన్న వస్త్రాదులు
ఇవ్వని స్త్రీ తప్త పాత్రమయ్యెను. నిర్జల దేశము నందు నీటిని
జంతువులకు యెగ్యముగాకుండా చేసిన బ్రాహ్మణుడు కోనేరు అయెను. ఈ
జంతువులు ఇక్కడ నీటి త్రాగవు. సంపూర్ణ పుష్పములతో కూడిన వసంత
ఋతువునందు, మనుష్యులకు కుసుదికములు ఇవ్వనందున గురువు ఒక
వృక్షమాయెను.
మహరాజు పెద్ద
భార్యయైన, పట్టపురాణి ధన మధముచే వ్రతములనుగాని, ఉపవాసములను గానీ చెయనందున అరణ్యము నందు ఆమె ఎనుబోతు అయ్యెను. కన్య తన తండ్రి ఇంట నుండి పెళ్ళి చూపులకై
తనను చూడ వచ్చిన పురుషలనెల్ల పనికి రారని నిందించినందున ఆమె కన్యగానే అరణ్యము నందు
తిరుగాడుచూ యుండెను. బ్రాహ్మణుడైన కుంజమెత్తముడు మంచి మాటలను
గాని, కర్మలను గాని ఆచరించనందున అరణ్యమునందు
స్థాణువైపడియున్నాడు. మహరాజుగా నుండి అధర్మముగా మృగములను
సంహరించినందున అరణ్యమున కిరాతుడయ్యెను.
రాజ్యమును
పరిపాలించు వాడైన మహరాజు నిరంతరము కఠినపు పలుకులు పలుకుచుండుటచే గాడిద అయ్యను. మగద దేశము నందు జన్మించిన బ్రాహ్మణుడు తన
పెద్దలు చేసిన ధర్మమును విక్రయించినందున ఏనుగు అయ్యెను.
చక్రవర్తికి
ఇల్లాలై మహరాణిగా యుండి కూడా బ్రాహ్మణులకు చవటినేలను దానము చేయుటచే ఆమె శూన్య
గ్రామము అయ్యెను. ఎండిన గడ్డిని తీయకుండా వాకిట
చేరిన పశువులను చెదరగొట్టినందున ఒక పశువుల కాపరి గడ్డివామి అయ్యెను. ఒక భూస్వామి తన భూమిలో పండిన ధాన్యమును బంధుమిత్రులకు గాని యాచకులకు గాని,
ఇతరులకుగాని, దేవతలకుగాని ఇవ్వనందున ఆయన ఒక
దాన్యపురాశిగా మారెను.
స్త్రీ తన
వక్షమునందు పాలను కలిగి యుండియూ శిశువులకు పాలను ఇచ్చిన తన అందము వక్షస్థలము తరగి
పోవునని శిశువులకు పాలను ఇవ్వనందున ఆమె క్షీరబాండము అయ్యెను.
వేదవర్తియను
బ్రాహ్మణుడు సకల శాస్త్ర పారంగతుడైననూ, తన విద్యను ఇతరులకు నేర్పనందున అతడు సూకరజన్మనెతేను [పంది జన్మ]. సకల అనుష్ఠానపరుడైన దేవశర్మ అను
బ్రాహ్మణుడు గురుకుల వాసమున స్వార్థబుద్దితో నడుపుతూ తన శిష్యులకు విద్యను
నేర్పనందులకు అతడు ఎవరికి పనికిరాని ముండ్లకంప చెట్టుగా మారెను.
ఈ విధముగా
వారివారి దుశ్చర్యలకు వారు శిక్షణ అనుభవించుచున్నారు. కనుక ఓ మల్లమాంబా! నీవు ఇక నీ ఇంటికి పోమ్ము
బాద్రపద శుక్ల తదియ నందు నా వ్రతమును ఆరంభించి పదహారు
సంవత్సరములు వ్రతమును చేసి పదహరు
పద్మములను, పదహరు నమస్కారములను, పదహరు ప్రదక్షిణలను చేసి పదహరు
పోగులతో తోరమును చేసి దానికి పదహారు
ముడులను వేసి తోరగ్రంథి పూజ చేసి, తోరమును కుడిహస్తమున గట్టుకొని, పదహరు రకముల పిండివంటలను నాకు నివేదన చేసి, పదహరు
మంది ముతైదువులకు వాయనము నిచ్చి, నాయెక్క వ్రత
కథను వినవలయును అని వివరించెను.
ఈ ప్రకారము పదహరు సంవత్సరములు వ్రతమును ఆచరించి ఉద్యాపనమును
చేయవలెను. అప్పుడు గౌరిదేవిని "ఓ లోకమాతా నీవు ఇసుక వల్ల అయ్యి ఇసుక
వలన వృద్ది చెందితివి అటులనే ఇసుక యందుండుము మాకు సర్వవేళల సిద్దిని కలుగచేయుము" అని ప్రార్థించి ఇసుకమీద యుంచి ఉద్యాపనము
చేయవలెను.
దానికి ముపై రెండు అతిరసమును , ముపై రెండు తమలపాకులను, ముపై
రెండు వక్కలను, ముపై రెండు ఆభరణములను,
ముపై రెండు రత్నములను తెచ్చి పూర్వము వలెనే గౌరిదేవిని పూజించి, పదహరు మంది ముతైదువులకు కాళ్ళు కడిగి వారికి గంధపుష్పాక్షతలను తాంబులాదులను ఇచ్చి
ఒక్కొక్కారికి ఒక జత చోపున చాట్లవాయనమును ఇవ్వవలెను.
"ఓ మంగళకరులారా!
నీవు ఈ ప్రకారము ఆచరింపుము ఇంటికి వెళ్ళుము" అని ఈ ప్రకారముగా గౌరిదేవి మల్లమ్మకు సవిస్తరముగా విశదపరచి తాను అంతర్థానమునొందెను తరువాత మల్లమాంబ
సంతోషముతో తిరిగి తన రాజ్యమునకు వెళ్ళి గౌరిదేవి చెప్పిన ప్రకారము షోడశగౌరి వ్రతమును భక్తి వినయములకు మెచ్చిన గౌరిదేవి
మల్లమాంబకు తిరిగి అష్ట ఐశ్వర్యములను ఆయురారోగ్యములను ఒసంగెను. ఈ విధముగా మల్లమాంబ
పదహారు సంవత్సరములు షోడశ గౌరి వ్రతమును భాద్రపద శుక్ల తదియనాడు బందుమిత్రులతో సంతోషముతో గావించి, దేహంతము నందు తన భర్తతో కోటిగౌరి
లోకమున స్థానమును పొందెను.
కనుక ఎవరైతే ఈ వ్రతమును ఆచరింతురో ఎవరు ఈ
కథను భక్తితో,
ఆలకింతురో వారు పాతక విముక్తులై ఉత్తమగతిని పొందుదురు.
సూతమహముని శౌనకాది మహమునులకు షోడశగౌరి వ్రతమహత్యమును గూర్చి సవిస్తరముగా
తెలియజెసెను.
ఇది శ్రీ స్కాంద
పురాణే గౌరి ఖండే, శ్రీ షోడశగౌరి వ్రతకల్పం
సంపూర్ణం.
ప్రార్థన
యస్స్యస్మృత్యాచ వరదా భవతు
(పుష్పములను, అక్షతలను చేతియందు ఉంచుకొని వ్రతకథ చదివి వాటిని దేవిపై వేయవలెను)
ఏకార్తి
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం |
గృహణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ ||
భక్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే |
త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే ||
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః ఏకార్తి దీపం దర్శయామి
ఏకార్తి దీపానంతరం ఆచమనీయం సమర్పయామి
త్రియార్తి
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ |
ప్రాదుర్భుతో స్మిన్ రాష్ట్రే స్మిన్
కీర్తిమృద్ధిం దదాతుమే
అపః సృజంతు స్నిగ్థాని చిక్లీత వస మే గృహే
నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మేకులే
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః త్రియార్తి దీపం దర్శయామి
త్రియార్తి దీపానంతరం ఆచమనీయం సమర్పయామి
నైవేద్యం
ఆపూపాన్వివిథా స్వాదూశాలిగోధుమపాచితా
షిడశేకాగుయుక్తాగృహాణ పరమేశ్వరి
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః నైవేద్యం సమర్పయామి
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్యదీమహిః
ధియోయోనః ప్రచోదయాత్
సత్యం త్వా ఋతేన పరిషించామి
[సాయంత్రం - ఋతం త్వా
సత్యేన పరిషించామి]
అమృతమస్తు అమృతాపస్తరణమసి
ఓం ప్రాణాయ స్వాహా
ఓం అపానాయ స్వాహా
ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా
ఓం సమానాయ స్వాహా
పానీయం
ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం
పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరం
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః
మధ్యే
మధ్యే పానీయం సమర్పయామి
అమృతాపి ధానమసి
ఉత్తరాపోశనం సమర్పయామి
హస్త ప్రక్షాళయామి
పాదౌ ప్రక్షాళయామి
ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః మహా నైవేద్యం సమర్పయామి
తాంబూలం
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః తాంబూలం సమర్పయామి
ఓం ఫలేన ఫలితం సర్వం త్రైలోక్యం సచరా చరమ్
తస్మాత్పల ప్రదానేన పూర్ణాస్సన్తు మనోరథాః
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః ఫలం సమర్పయామి
ఓం హిరణ్యగర్భస్థం హేమబీజం విభావసోః
అనంతపుణ్య ఫలదం అతః శన్తి ప్రయచ్ఛమే
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః దక్షిణాం సమర్పయామి
పంచార్తి
అశ్వపూర్వాం రథ మధ్యాం హస్తినాద
ప్రబోధీనీమ్ |
శ్రియం దేవీ ముపాహ్వయే శ్రీర్మా దేవిర్ణుష తామ్
కాం సోస్మితాం హిరణ్యప్రాకారమార్దాం జ్జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్ |
పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపాహ్వయే శ్రియమ్
చంద్రాం ప్రభాసాం యశసాజ్జ్వలంతీం శ్రియం లోకే దేవ జుష్టాముదారామ్ |
తాం పద్మినీం శరణ మహం ప్రపద్యే-లక్ష్మీ ర్మేనశ్యతాం త్వాం వృణే
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః పంచార్తి దీపం దర్శయామి
పంచార్తి దీపానంతరం ఆచమనీయం సమర్పయామి
మంత్రపుష్పం
వరాంకుశౌ పాశమభీతిముద్రాం
కరైర్వహన్తీం కమలాసనస్థామ్
బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం
భజేహమంబాం జగదీశ్వరీం తామ్
సర్వమంగళ మాంగళ్యే సివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణీ నమెస్తుతే
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః మంత్రపుష్పం సమర్పయామి
నీరాజనం
చిత్రం నీరాజనందేవి గృహాణహరివల్లభే
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః
ఆనంద
కర్పూర నీరాజనం సమర్పయామి
నీరజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
ప్రార్థన మంత్రం
నృత్యైశ్చగీతవాద్యైశ్చపురాణశ్రవణాదిభిః
రాజోపచారైర్బహుభిఃస్సంతుష్టా బహు సర్వదా
దేహిగౌరి సదారోగ్యంపుత్రపౌత్ర ప్రవర్థనం
త్వత్పాదపద్మయుగలం పుత్రపౌత్ర ప్రవర్థనం
త్వత్పాదపద్మయుగళమ్ పూజయామి హరప్రియే
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి
తోరబంధన మంత్రం
బధ్నామిదక్షిణేహస్తే నవసూత్రం శుభ ప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే
(ఈ మంత్రం పఠిస్తూ తోరము కట్టుకోవలెను)
వాయనమంత్రం
ఏవంసంపూజ్య భక్త్యాచగౌరీదేవీం స్వశక్తితః
గంధాధిభినలంకృత్యబ్రాహ్మణాయప్రదీయతాం
వాయనమంత్రః
శ్రీగౌరీప్రతిగృహ్ణాంతు శ్రీగౌరివై దదాతిచ
శ్రీగౌరీ తారకోబాభ్యాం మహాగౌర్యై నమోస్తుతే
ప్రదక్షిణ
యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే |
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ|
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలా |
అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్‌కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దని
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః ప్రదక్షిణం సమర్పయామి
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః ఛత్రం
ఆచ్ఛాదయామి |
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః నృత్యం
దర్శయామి |
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః గీతం
శ్రావయామి |
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః ఆందోళికాన్నారోహయామి |
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః గజానారోహయామి |
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః సమస్త రాజోపచారాన్
దేవోపచారాన్ సమర్పయామి
క్షమా ప్రార్థన
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్ |
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన I
యాత్పూజితం మాయా దేవ పరిపూర్ణం తదస్తుతే I
అనయా పురుషసూక్త విధానేన ధ్యాన ఆవాహనాది
షోడశోపచార పూజనేన భగవాన్‌సర్వాత్మకః
ఓం శ్రీ షోడశగౌరీదేవి నమః సుప్రీతా సుప్రసన్నో వరదో భవంతు
యదక్షరం పదభ్రష్టమ్ మాత్రాహీనమ్ చ యదృవేత్
నిర్మాల్యం గంథాన ధారాయమి
నిర్మాల్యం అక్షతాం సమర్పయామి
నిర్మాల్యం పుష్పాణీం పూజయామి బలి నివేదయామి
ఫూర్ణ ఫలం
ఓం యిదం ఫలం య దేవ దత్తం
పుత్రం పౌత్రం వృదియే
దేవి పూర్ణ ఫలం దేహి
కృపా కురిషివే మహి
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః ఇతి పూర్ణ ఫలం సమర్పయామి
తీర్థము
[క్రింది మంత్రముతో తీర్థము తీసుకొనవలెను]
అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం
సమస్త పాపక్షయకరం శ్రీ వరలక్ష్మీపాదోదకం పావనం శుభం
ఓం
శ్రీ షోడశగౌరీదేవి నమః ప్రసాదం శిరసా గృహ్ణామి
ప్రసాదము
[క్రింది మంత్రముతో పుష్ప ప్రసాదము
తీసుకొనవలెన]
ఓం శ్రీ షోడశగౌరీదేవి పాదోత్పలం పుష్పం
తత్సుష్పం శిరసావహమ్
కోటిజన్మ కృతం పాపం తత్ క్షణేన వినశ్యతి
ఉద్యాసనం
[పూవ్వులు అక్షంతలు దేవునిపై ఉంచుకొని క్రింది మంత్రముతో దేవుని కదిలిచ్చి
వాటిని దేవుని ముందు ఉంచవలెను]
ఓం యజ్ఞేన యజ్ఞమయ జన్తదేవాః
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
తే హ నాకం మహిమానస్యజంతే
యత్ర పూర్వే సాధ్యాః సన్తిదేవాః
ఓం
శ్రీ షోడశగౌరీదేవి యథాస్తానం ప్రతిష్టాపయామి
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ
ఓం శాంతిః శాంతిః శాంతిః
స్వర్ణగౌరి గౌరి పాట
గౌరి గజగౌరి
మంగళతారి స్వర్ణగౌరి
గౌరి గజగౌరి
మంగళతారి స్వర్ణగౌరి
చక్రనివాసిని
గజగౌరి దర్భ వినాసిని షోడశగౌరి
చక్రనివాసిని
గజగౌరి దర్భ వినాసిని షోడశగౌరి
జ్ఞాన భూషిణి
జయగౌరి జ్ఞానభూషిణి జయ గౌరి
క్షేమకారిణి
స్వర్ణగౌరి క్షేమకారిణి షోడశగౌరి
గౌరి గజగౌరి
మంగళతారి స్వర్ణగౌరి
పరశివరాణి
గజగౌరి పరమేశ్వరి షోడశగౌరి
పరశివరాణి
గజగౌరి పరమేశ్వరి శ్రీ స్వర్ణగౌరి
పార్వతి
దేవి జయ గౌరి పార్వతి దేవి జయ గౌరి
పతితపావని
హిమ గౌరి పతితపావని హిమ గౌరి
గౌరి గజగౌరి
మంగళతారి స్వర్ణగౌరి
హరసిన ప్రీతే
గజగౌరి కుంకుమ లేపితే స్వర్ణగౌరి
హరసిన
ప్రీతే గజగౌరి కుంకుమ లేపితే స్వర్ణగౌరి
కామితఫలదే
జయగౌరి కామితఫలదే జయగౌరి
శారదె సన్నుతే
శివగౌరి శారదె సన్నుతే శివగౌరి
గౌరి గజగౌరి
మంగళతారి స్వర్ణగౌరి
గౌరి గజగౌరి
మంగళతారి స్వర్ణగౌరి
పాట
అమ్మవారు కూర్చుంటే కుందనపు బొమ్మలాగే వుంటుంది
ఆ బొమ్మ చూస్తుంటే బంగారు బొమ్మలాగే వుంటుంది
అందాలు చిగురించు మందహసము
ఆమెము అగుపించు చంద్రబింబము
చంద్రుని దిక్కరించు నొసట తిలకము
ఆ తిలకమే కనులకు ఇహపరసుఖము
అమ్మవారు కూర్చుంటే కుందనపు బొమ్మలాగే వుంటుంది
ఆ బొమ్మ చూస్తుంటే బంగారు బొమ్మలాగే వుంటుంది
ఇంటింట వెలసింది మన చిట్టితల్లి
మన కంటి పాపాయి మన కల్పవల్లి
మన వెంట వస్తుంది మాధవుని చెల్లి
అడిగింది ఇస్తుంది మన చిట్టితల్లి
అమ్మవారు కూర్చుంటే కుందనపు బొమ్మలాగే వుంటుంది
ఆ బొమ్మ చూస్తుంటే బంగారు బొమ్మలాగే వుంటుంది
ఏటేటా పండుగలు ఉత్సవాలు
దండిగాను ధూప దీప నైవేద్యాలు
పండుగకు చేస్తారు గొప్ప విందులు
విందారగిస్తుంది మన చిట్టి తల్లి
అమ్మవారు కూర్చుంటే కుందనపు బొమ్మలాగే వుంటుంది
ఆ బొమ్మ చూస్తుంటే బంగారు బొమ్మలాగే వుంటుంది
0 Comments