Sri Vasavi Matha Shreshta Ashtakam - శ్రీ వాసవి మాత శ్రేష్ట అష్టకం
Sri Vasavi Matha Shreshta Ashtakam - శ్రీ వాసవి మాత శ్రేష్ట అష్టకం |
1. కుసుమ శ్రేష్టి కుసుమాంబ పుత్రి వాసవి జగదంబికా..
నగరి
పెనుగొండ వాసిని జగదంబిక జయ కన్యకా..
వైశ్యకుల
సంరక్షిణి శ్రీ వాసవి విశ్వపావనీ...
పెనుగొండ వాసిని శ్రీ కన్యకా పరమేశ్వరీ... ||
2. కుసుమ కోమలి కీర్తి వర్తిని మీనాక్షి వాసవీ...
విరూపాక్ష
సహోదరీ శ్రీ విజయదుర్గ పాహిమాం
బ్రహ్మ
భాస్కరచార్యులకు ప్రియ శిష్యురాలైన వాసవీ....
మణిద్వీప
వాసిని శ్రీ కన్యకా పరమేశ్వరీ... ||
3. పులస్త్యముని తపస్సు చేయగా ఒకే నాళమునందునా...
ప్రత్యక్షమైనారు
బ్రహ్మవిష్ణు మహేశ్వరులు
అవతరించెను
బ్రహ్మ దేవుడు సద్గురు భాస్కరచార్యులై...
పెనుగొండ వాసిని శ్రీ కన్యకా పరమేశ్వరీ... ||
4. పార్వతీ పరమేశ్వరులు శ్రీ గౌరి నగరేశ్వరులుగా..
లక్ష్మి
నారాయణలు శ్రీ కోనకమల జనార్థనులై
కలియుగంబున
అవతరించిరి నగరి పెనుగొండాపురీ
మణిద్వీప వాసిని శ్రీ కన్యకా పరమేశ్వరీ... ||
5. కీర్తి వర్థిని త్యాగరూపిణి కన్యకా పరమేశ్వరీ
దివ్యరూపుణి
సుందరాంగిణి కరుణామయి వాసవీ...
విష్ణువర్ధన
మహారాజుని సంహరించిన వాసవీ...
పెనుగొండ వాసిని శ్రీ కన్యకా పరమేశ్వరీ... ||
6. అవని యందున పూజలందిన ఆదిశక్తి స్వరూపిణి...
ఆత్మార్పణ
గావించిన మానాభిమాలినీ....
లలితాంగి
లక్ష్మీదేవి శ్రీ వాణివి నీవమ్మా...
మణిద్వీప వాసిని శ్రీ కన్యకా పరమేశ్వరీ... ||
7. వైశ్యకుల సంరక్షిణి శ్రీ వాసవి విశ్వ పావనీ....
ధన్యమైనది
చరితమైనది వైశ్యకులము వాసవీ...
శ్రద్దగా
నిను కొలిచినంతనే వరములిచ్చే వైష్ణవీ...
పెనుగొండ వాసిని శ్రీ కన్యకా పరమేశ్వరీ... ||
8. భారతావని ఆంధ్ర భూమిని మరలు పెనుగొండ పురములో...
అవతరించెను వాసవాంబిక
విశ్వమును
రక్షింపగా, కలియుగంబున భక్తవరులకు కన్న తల్లివి నీవేగా....
మణిద్వీప
వాసిని శ్రీ కన్యకా పరమేశ్వరీ... ||
0 Comments